యాదాద్రిలో భక్తుల కిటకిట | devotees in yadadri | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో భక్తుల కిటకిట

Jun 22 2015 4:03 AM | Updated on Sep 3 2017 4:08 AM

యాదాద్రిలో భక్తుల కిటకిట

యాదాద్రిలో భక్తుల కిటకిట

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిట లాడింది.

యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిట లాడింది. ఎక్కడ చూసినా భక్తుల కోలాహలమే కనిపించింది. గర్భాలయం, సంగీత భవనం, ఆలయ పరిసరాలు, కొండపైన బస్టాండు తదితర పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. దైవ దర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. సుమారు 50 వేల మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement