నేటి నుంచి ‘గుట్ట’ బ్రహ్మోత్సవాలు | yadagirigutta celebrations is starting from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘గుట్ట’ బ్రహ్మోత్సవాలు

Feb 20 2015 2:28 AM | Updated on Sep 2 2017 9:35 PM

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

 యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 11 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అందం గా ముస్తాబు చేశారు. వాహన సేవలను ఆలయ అర్చకులు తిరుమంజనం చేశారు. ఎదుర్కోలు మహోత్సవం, కల్యాణం, దివ్య విమాన రథోత్సవం జరిగే రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement