
టెంపుల్ సిటీ భూములన్నీ మ్యాపింగ్
ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఆదేశం
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆస్తులన్నీ టెంపుల్ సిటీలోనే ఉండాలని ప్రభుత్వం నిర్ణ యించింది. టెంపుల్‌సిటీ పరిధి నిర్ణయం కోసం.. ఇటీవల యాదగిరిగుట్ట దేవస్థానం అతిథిగృహంలో ఉన్నత స్థాయి అధికారుల సమావేశం జరిగింది. అసెంబ్లీలో చట్టం చేసిన యాదగిరిగుట్ట టెంపుల్ సిటీ జియోగ్రాఫికల్ ఏరియా హద్దుల నిర్ణయంపై చర్చించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు, దేవస్థానం ఈవో వెంకట్‌రావు, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావుతోపాటు వివిధ శాఖల అధికారులతో టెంపుల్ సిటీ పరిధిపై చర్చించారు.
కేవలం యాదగిరిగుట్ట చుట్టూ ఉన్న భూముల్నే టెంపుల్ సిటీ ఆస్తులుగా గుర్తించిన తీరును ప్రిన్సిపల్ సెక్రటరీ తిరస్కరించారు. దేవస్థానానికి ఉన్న భూముల వివరాలతో నివేదికను సిద్ధం చేయాలని మరికొంత సమయం ఇచ్చారు. ప్రభుత్వం యాదగిరిగుట్ట టెంపుల్ సిటీ ఏర్పాటుకు గత అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేసింది. దీని ప్రకారం యాదగిరిగుట్ట టెంపుల్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. తిరుమల మాదిరిగా ఆలయ పవిత్రత, సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేవిధంగా టెంపుల్ సిటీ పరిధిని నిర్ణయిస్తున్నారు.
ఇందుకోసం యాదగిరిగుట్టలో గతంలో వైటీడీఏ (యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ) సేకరించిన భూములను సర్వే నంబర్ల వారీగా డీజీపీ ఎస్ సర్వే చేయించారు. అయితే కేవలం యాదగిరిగుట్ట చుట్టూ ఉన్న భూములు సర్వే నంబర్ల వారీగా టెంపుల్ సిటీ పరిధిని నిర్ణయించి మ్యాప్‌లను సిద్ధం చేశారు. అయితే దేవస్థానం పరిధిలో ఇతర గ్రామాల్లో కూడా ఉన్న వైటీడీఏ భూముల ను ఇందులో చేర్చలేదు. అయితే భవిష్యత్ లో భూముల విషయంలో వివాదం తలెత్తకుండా వైటీడీఏ గ్రామాల్లో సేకరించిన అన్ని భూములు, వాటిని ఏయే శాఖల కు కేటాయించారో సమగ్ర వివ రాలను పొందపరచనున్నారు.
దీంతోపాటు శ్రీస్వా మివారికి హైదరాబాద్ బంజారాహిల్స్, భువనగిరిగంజ్‌లో, జనగామ జిల్లా బచ్చ న్నపేట మండలం దబగుంటపల్లి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న వందల ఎక రాల భూములు, భవనాలు గుర్తించి వాటికి డీజీపీఎస్ సర్వే చేస్తున్నారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న దేవాలయాల భూము లను డీజీపీఎస్ సర్వే చేయించి హద్దులు నిర్ణయిస్తున్నారు. ప్రధానంగా దేవుని భూ ములు పలుచోట్ల అన్యాక్రాంతం అయ్యా యి. దేవుని పేరున్న గ్రామాల్లో.. అదే పేరున్న వ్యక్తుల పేరున పట్టాలు అయ్యా యి. పట్టాదారు పాస్‌పుస్తకాలు వచ్చాయి. మరికొన్నిచోట్ల క్రయవిక్రయాలు జరిగాయి. ఇలా అన్యాక్రాంతమైన వేలాది ఎకరాల భూముల లెక్కలు తీసే పనిలో దేవాదాయ, రెవెన్యూ అధికారులున్నారు.