తమ అభిమాన నటీనటులకు ఆలయాలు కట్టి పూజలు చేయడం కొత్తేమీ కాదు. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన నటీనటులకు తమిళ సినీ అభిమానులు గుడి కట్టించడమే విశేషం. అలా ఇంతకుముందు ఉత్తరాదికి చెందిన తమిళనాడులో ఆమె వీరాభిమాని గుడి కట్టించి ఆరాధించిన విషయం తెలిసిందే.
తాజాగా కన్నడ నటుడు సుదీప్‌కు తమిళనాడులో ఒక వీరాభిమాని గుడి కట్టించి పూజలు చేస్తున్నాడు. కన్నడం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో కథానాయకుడిగా 50 కి పైగా చిత్రాల్లో నటించిన నటుడు సుదీప్. తెలుగులో ఈయన నటించిన “ఈ “చిత్రం “ నాన్ ఈ “గా తమిళంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది.
అదేవిధంగా విజయ్ హీరోగా నటించిన పులి చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. మరికొన్ని చిత్రాల్లో నటించిన సుదీప్‌కు తమిళనాడు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అలా ఈరోడ్ జిల్లా, తొట్టాగాజనూర్ ప్రాంతానికి చెందిన సుందరరాజ్ నటుడు సుదీప్‌కు వీరాభిమాని. ఇతను ద్విచక్రవాహంలో ఐస్ వ్యాపారం చేస్తుంటాడు. కాగా తన అభిమాన నటుడు సుదీప్ కోసం తన ఇంటి ముందు గుడిని కట్టించి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ఆ గుడిలో సుదీప్ చిత్ర పటంతో పాటు మహర్షి వాల్మీకి, వీర మాతంగరి ఫొటోలు పొందుపరిచి పూజలు చేస్తున్నారు.


