ఆలయంలో అబ్బురపరుస్తున్న బామ్మ | 80 years old woman ringing temple bell in Hyderabad | Sakshi
Sakshi News home page

ముదిమి వయసులో.. ‘రాజీ’పడని బామ్మ..

Jul 7 2025 7:33 PM | Updated on Jul 7 2025 7:33 PM

80 years old woman ringing temple bell in Hyderabad

15 నిమిషాల పాటు 250 కిలోల గంట మోగిస్తూ..

చిత్రంలో కనిపిస్తున్న బామ్మ పేరు రాజి.. వయసు సుమారు 80 సంవత్సరాలపైనే ఉంటాయి. పాతికేళ్ల క్రితం హైద‌రాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చారు. అప్పటినుంచి అదే తన ఇల్లు.. అక్కడే ఉంటోంది.. గుడిలో ప్రసాదం తింటూ అక్కడే గడిపేస్తుంది.. సరిగ్గా నిటారుగా నుంచునే ఓపిక కూడా లేదు.. వయసు పైబడడంతో బామ్మ నడుము ఒంగిపోయింది. 

కానీ స్వామివారి ఆరగింపు సమయం వచ్చిందంటే చాలు వెంటనే గుడిలో ఏర్పాటు చేసిన 250 కిలోల భారీ గంట వద్దకు వడివడిగా వెళ్లిపోతుంది. 15 నిమిషాల పాటు జరిగే ఆరగింపు తంతు పూర్తయ్యే వరకూ గంట కొడుతూనే ఉంటుంది.. ఒక్క క్షణం కూడా ఆగదు.. ఇలా ప్రతిరోజూ మూడు సార్లు ఆరగింపు సమయాల్లో బామ్మ గంట కొట్టాల్సిందే.

గుడికి వచ్చిపోయే వాళ్లంతా బామ్మను చూస్తూ ఈ వయసులో ఈవిడకి ఇంత శక్తి ఎలా వస్తుందని ఆశ్చర్యపోతుంటారు.. తాను ఎవ్వరితోనూ మాట్లాడదు.. ఎలా గంట కొడుతున్నావ్‌ బామ్మా అని అడిగితే మాత్రం ఆ దేవుడే నాతో ఇలా కొట్టిస్తున్నాడని చెబుతుంది. ఆలయ ప్రధాన అర్చకుడు మురళీధర శర్మ బామ్మ గురించి చెబుతూ ఈ వయసులో కూడా ఆ బామ్మ అలా గంట కొడుతుండటం చూస్తే స్వామివారే ఆమెకు శక్తినిచ్చినట్లు అనిపిస్తుందని, తాను కూడా ఎంతో ఆశ్చర్యానికి లోనవుతుంటానని, ఇదంతా స్వామివారి దయని అన్నారు.             
– బంజారాహిల్స్‌  

చ‌ద‌వండి: ఆషాఢ శుక్ల ఏకాద‌శి బంగారుస్వామి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement