breaking news
Ringing Bell
-
ఆలయంలో అబ్బురపరుస్తున్న బామ్మ
చిత్రంలో కనిపిస్తున్న బామ్మ పేరు రాజి.. వయసు సుమారు 80 సంవత్సరాలపైనే ఉంటాయి. పాతికేళ్ల క్రితం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చారు. అప్పటినుంచి అదే తన ఇల్లు.. అక్కడే ఉంటోంది.. గుడిలో ప్రసాదం తింటూ అక్కడే గడిపేస్తుంది.. సరిగ్గా నిటారుగా నుంచునే ఓపిక కూడా లేదు.. వయసు పైబడడంతో బామ్మ నడుము ఒంగిపోయింది. కానీ స్వామివారి ఆరగింపు సమయం వచ్చిందంటే చాలు వెంటనే గుడిలో ఏర్పాటు చేసిన 250 కిలోల భారీ గంట వద్దకు వడివడిగా వెళ్లిపోతుంది. 15 నిమిషాల పాటు జరిగే ఆరగింపు తంతు పూర్తయ్యే వరకూ గంట కొడుతూనే ఉంటుంది.. ఒక్క క్షణం కూడా ఆగదు.. ఇలా ప్రతిరోజూ మూడు సార్లు ఆరగింపు సమయాల్లో బామ్మ గంట కొట్టాల్సిందే.గుడికి వచ్చిపోయే వాళ్లంతా బామ్మను చూస్తూ ఈ వయసులో ఈవిడకి ఇంత శక్తి ఎలా వస్తుందని ఆశ్చర్యపోతుంటారు.. తాను ఎవ్వరితోనూ మాట్లాడదు.. ఎలా గంట కొడుతున్నావ్ బామ్మా అని అడిగితే మాత్రం ఆ దేవుడే నాతో ఇలా కొట్టిస్తున్నాడని చెబుతుంది. ఆలయ ప్రధాన అర్చకుడు మురళీధర శర్మ బామ్మ గురించి చెబుతూ ఈ వయసులో కూడా ఆ బామ్మ అలా గంట కొడుతుండటం చూస్తే స్వామివారే ఆమెకు శక్తినిచ్చినట్లు అనిపిస్తుందని, తాను కూడా ఎంతో ఆశ్చర్యానికి లోనవుతుంటానని, ఇదంతా స్వామివారి దయని అన్నారు. – బంజారాహిల్స్ చదవండి: ఆషాఢ శుక్ల ఏకాదశి బంగారుస్వామి -
వేరొకరి ఇంటి డోర్‌బెల్ మోగించాడని నిర్ధాక్షిణ్యంగా చంపబోయాడు..కానీ..
ఓ టీనేజర్ పొరపాటున మరొకరి ఇంటి బెల్ మోగించాడు. అంతే ఓ వ్యక్తి ఏ మాత్రం కనికరం లేకుండా తుపాకితో కాల్పులు జరిపాడు. ఆ టీనేజర్ తలలోకి రెండు తూటాలు దూసుకుపోయాయి. దీంతో బాధితుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ భయానక ఘటన అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..16 ఏళ్ల అఫ్రికన్ అమెరికన్ రాల్ఫ్ పాల్ యార్ల అనే వ్యక్తి తన కవల సోదరులను స్నేహితుడి ఇంటి నుంచి పికప్ చేసుకునేందుకు వెళ్లాడు. అప్పుడే అతను పొరబడి వేరొకరి ఇంటి డోర్‌బెల్‌ను నాక్ చేశాడు. అంతే ఆ ఇంటి యజమాని ఆండ్రూ లెస్టర్ నిర్ధాక్షిణ్యంగా అతనిపై కాల్పులు జరిపాడు. దీంతో రెండు తుటాలు సరాసరి టీనేజర్ తలలోకి దూసుకుపోవడంతో అతను కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఐతే అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు ఆండ్రూ లెస్టర్ని అదుపులోకి తీసుకున్నారు. ఐతే గంటల కస్టడీ తర్వాత ఎలాంటి ఆరోపణలు మోపకుండానే అతను విడుదలయ్యాడు. దీంతో నల్లజాతీ యువకుడిపై కాల్పులు జరిపితే అలా ఎలా వదిలేస్తారని ప్రజాగ్రహం కట్టలు తెంచుకుని నిరసనలు వెల్లవెత్తాయి. ఇది జాత్యాహంకారంతో జరిగినే హత్య అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు సదరు టీనేజర్ అత్త ఫెయిత్ స్ఫూన్‌మూర్ మాట్లాడుతూ.. తన మేనల్లుడు కెమికల్ ఇంజనీరింగ్ చదవాలనుకున్నాడని, మంచి ప్రతిభావంతుడైన విద్యార్థి అని చెప్పుకొచ్చారు. అమెరికా సుదీర్ఘ చరిత్రలో నల్లజాతీయులపై హింస జరుగతూనే ఉంది దీనికి జవాబుదారితనం వహించాల్సిందే అంటూ ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ మేరకు మిస్సోరీ పోలీస్ చీఫ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఇది జాతిపరంగా జరిగిన హత్యగా ఆయన పేర్కొనలేదు. తాను వారి ఆవేదనను అర్థం చేసుకుంటానని చెప్పారు. అలాగే జాతి పరంగా జరిగిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేయడమే గాక నిందితుడిని అదీనంలోకి తీసుకుని కఠిన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. చివరికి నిందితుడు ఆండ్రూ లెస్టర్(85) వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఇక కోర్టు కూడా సదరు నిందితుడు సాయుధ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించి దోషిగా తేల్చింది. అంతేగాదు అతనికి కోటి రూపాయాల పూచీకత్తుతో కూడిన బెయిల్‌ని మంజూరు చేసింది. అదృష్టవశాత్తు టీనేజర్ కూడా కొద్దిలో ప్రాణాపాయంతో బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సదరు బాధితుడితో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఫోన్లో సంభాషించి..క్షేమ సమాచారాలను అడిగినట్లు వైట్‌హౌస్ పేర్కొనడం గమనార్హం. (చదవండి: అంతర్గత పోరుతో అట్టుడుకుతున్న సూడాన్.. 200 మంది మృతి) -
మహిళా దినోత్సవానికి ఎక్స్ఛేంజీల ప్రత్యేక ‘రింగింగ్’
న్యూఢిల్లీ: మహిళా దినోత్సవం(8న) సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఈ వారం గంట మోగించే (రింగింగ్ బెల్) కార్యక్రమాన్ని లింగ సమానత్వానికి అంకితం చేయనున్నాయి. దీంట్లో భాగంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ)నేడు (సోమవారం) ప్రత్యేకమైన క్లోజింగ్ బెల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. ఇక బీఎస్ఈ ఈ నెల 8న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇంకా వివక్ష..: లింగ అసమానత్వ తేడాను తగ్గించడానికి వ్యాపారాలు, స్టాక్ ఎక్స్ఛేంజ్లు నిర్వహించగల, నిర్వహించాల్సిన కీలకమైన పాత్రపై అందరి దృష్టిని ఆకర్షించడం లక్ష్యంగా స్టాక్ ఎక్స్ఛేంజ్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. భారత్‌లోని ప్రైవేట్ రంగ వ్యాపార సంస్థలు లింగసమానత్వ ప్రయోజనాలను గుర్తించడం పెరుగుతోందని ఎన్ఎస్ఈ సీఈఓ ఇన్చార్జ్ జే.రవిచంద్రన్ తెలిపారు. అయితే ప్రపంచవ్యాప్తంగా వేతనాలు, విద్య, ఉన్నత స్థాయి నాయకత్వ స్థానాల విషయమై మహిళలు ఇంకా అసమానత్వాన్ని ఎదుర్కొంటూనే ఉన్నారని అన్నారు. ఈ నెల 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పలు ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఈ నిర్ణయం తీసుకున్నాయి. హాంగ్‌కాంగ్ ఎక్సే్ఛం జేస్, నాస్డాక్, ఎన్వైఎస్ఈ, డాషే, యూరోనెక్స్ట్ ప్యారిస్, లండన్ స్టాక్ ఎక్సే్ఛంజ్, టొరంటొ స్టాక్ ఎక్సే్ఛంజ్, ఐరిష్ స్టాక్ ఎక్సే్ఛంజ్తోసహా మొత్తం 43 స్టాక్ ఎక్సే్ఛంజ్‌లు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నాయి.