
లెజెండరీ నటుడు కృష్ణంరాజు సతీమణి, ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీలోని కాకినాడ జిల్లా తునిలో తలుపులమ్మ ఆలయంలో ఆమె అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న శ్యామలాదేవి.. ప్రభాస్ పేరిట విశేష కుంకుమార్చన పూజ చేయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ది రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.