
సాంబా (జమ్ముకశ్మీర్): జమ్ముకశ్మీర్‌లోని సాంబా జిల్లాలోని జాత్వాల్ ప్రాంతంలో ఈరోజు(గురువారం )ఉదయం మాతా వైష్ణోదేవి క్షేత్రానికి యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు 20 అడుగుల లోతైన కాలువలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 40 మంది గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్ నుండి కాట్రాలోని మాతా వైష్ణో దేవి క్షేత్రానికి వెళుతున్న ఈ బస్సులో నుండి 70 మంది ప్రయాణికులున్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 40 మంది గాయపడ్డారని అధికారులు నిర్ధారించారు. కాలువలోని బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికులను రక్షించేందుకు అత్యవసర సేవల విభాగం సంఘటనా స్థలానికి చేరుకుంది. ప్రమాదంలో గాయపడిన వారిని సాంబా జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని విజయ్‌పూర్ ఎయిమ్స్‌కు తరలించారు. ఈ ప్రమాదం దరిమిలా ఈ మార్గంలోని ట్రాఫిక్ తాత్కాలికంగా నిలిచిపోయింది.