breaking news
vaishno devi
-
20 అడుగుల కాలువలోకి వైష్ణోదేవి బస్సు.. ఒకరు మృతి
సాంబా (జమ్ముకశ్మీర్): జమ్ముకశ్మీర్‌లోని సాంబా జిల్లాలోని జాత్వాల్ ప్రాంతంలో ఈరోజు(గురువారం )ఉదయం మాతా వైష్ణోదేవి క్షేత్రానికి యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు 20 అడుగుల లోతైన కాలువలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 40 మంది గాయపడ్డారు.ఉత్తరప్రదేశ్ నుండి కాట్రాలోని మాతా వైష్ణో దేవి క్షేత్రానికి వెళుతున్న ఈ బస్సులో నుండి 70 మంది ప్రయాణికులున్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 40 మంది గాయపడ్డారని అధికారులు నిర్ధారించారు. కాలువలోని బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికులను రక్షించేందుకు అత్యవసర సేవల విభాగం సంఘటనా స్థలానికి చేరుకుంది. ప్రమాదంలో గాయపడిన వారిని సాంబా జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని విజయ్‌పూర్ ఎయిమ్స్‌కు తరలించారు. ఈ ప్రమాదం దరిమిలా ఈ మార్గంలోని ట్రాఫిక్ తాత్కాలికంగా నిలిచిపోయింది. -
వైష్ణోదేవి దర్శనం..హిమాలయాల వీక్షణం..!
వైష్ణోదేవి దర్శనం భారతీయుల కల అని చెప్పవచ్చు. హిందువులు భక్తిశ్రద్ధలతో పూజించే దైవం వైష్ణోదేవి. కశ్మీర్ వాసులు శ్రీ మాతా వైష్ణోదేవి అని పిలుచుకుంటారు. ఈ ఆలయం జమ్ము నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఐదు వేల అడుగులకు పైగా ఎత్తులో ఉన్న ఈ శక్తిపీఠాన్ని చేరడం కష్టం అని చెప్పకూడదు, బహు కష్టం అని చెప్పడమే కరెక్ట్. ఈ అమ్మవారు కొలువైన పర్వతం పేరు త్రికూట పర్వతం. ఏడాదికి దాదాపు కోటి మంది సందర్శించుకునే ఈ ఆలయానికి జీవితంలో ఒకసారైనా వెళ్లాలని ఉంటుంది. ఐఆర్సీటీసీ ఆ కోరికను తీరుస్తోంది. 1వ రోజున్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్లో రాత్రి 8.40కి ట్రైన్ నంబరు 12425 రాజధాని ఎక్స్‌ప్రెస్ బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం.2వ రోజుతెల్లవారు జామున ఐదు గంటలకు రైలు జమ్ము రైల్వేస్టేషన్‌కు చేరుతుంది. టూర్ నిర్వహకులు రైల్వే స్టేషన్లో రిసీవ్ చేసుకుంటారు. అక్కడి నుంచి కాట్రాకు రోడ్డు మార్గాన వెళ్లాలి. నాన్ ఏసీ వెహికల్లో ప్రయాణం. మార్గమధ్యంలో సరస్వతి ధామ్ చూసుకుని కాట్రాకు చేరి అక్కడ హోటల్ గదిలో చెక్ ఇన్ కావాలి. వైష్ణోదేవి దర్శనం తర్వాత తిరిగి హోటల్‌కు వెళ్లి భోజనం, విశ్రాంతి. రాత్రి బస అక్కడే.వైష్ణోదేవి యాత్రలో తొలిమెట్టు కాట్రా వైష్ణోదేవి దర్శనం అనుభూతి కాట్రా పట్టణం నుంచే మొదలవుతుంది. జమ్ములో రైలు దిగిన తరవాత నలభై కిలోమీటర్లు రోడ్డు మార్గాన ప్రయాణించాలి. ఈ పట్టణం సముద్రమట్టానికి 2,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. బాణగంగానది ఈ పట్టణం నుంచే ప్రవహిస్తుంటుంది. ఇక్కడి ప్రజల భాష డోంగ్రీ. హిందీ, పంజాబీ, అస్సామీ, కశ్మీరీ భాషలు మాట్లాడే వాళ్లు కూడా ఉంటారు. హిందీ వచ్చిన పర్యాటకులు కూడా స్థానికులు మాట్లాడే హిందీ యాసను అందుకోవడం కష్టం. టూర్ నిర్వహకులు, గైడ్లు ఇంగ్లిష్ మాట్లాడతారు, వైష్ణోదేవి దర్శనానికి వచ్చిన పర్యాటకులు కాట్రాలోని గెస్ట్‌హౌస్‌లు, హోటళ్లలో బస చేస్తారు. కాట్రా పట్టణం కేవలం వైష్ణోదేవి పర్యాటకుల ఆధారంగానే అభివృద్ధి చెందింది. ఇక్కడ ఒక వీథి మొత్తం సావనీర్ షాపులే. డ్రై ఫ్రూట్స్ దుకాణాలు, ఉన్ని దుస్తులు, లెదర్ జాకెట్ల షాప్‌లకు లెక్కే ఉండదు. ఇక్కడి నుంచి వైష్ణోదేవి ఆలయానికి ట్రెకింగ్ మొదలవుతుంది.ఇన్సూరెన్స్ తప్పనిసరి!వైష్ణోదేవి దర్శన యాత్ర ప్రమాదంతో కూడిన పర్యటన కావడంతో పర్యాటకులకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. నడవ లేని వాళ్ల కోసం ఎలక్ట్రిక్ వాహనాలు, హెలికాప్టర్ సర్వీస్ కూడా ఉంటుంది. కాట్రా నుంచి వైష్ణోదేవి మందిరానికి హెలికాప్టర్లో వచ్చేవాళ్ల సంఖ్య బాగా పెరుగుతోంది. దాంతో కాట్రా చుట్టుపక్కల ఎటు చూసినా హెలీపాడ్లు దర్శనమిస్తాయి. ఇటీవల రోప్‌వే సౌకర్యం కూడా మొదలైంది. ఇది కాట్రాకు వైష్ణోదేవి ఆలయానికి మధ్యలోనున్న భైరోనాథ్ ఆలయం నుంచి మొదలవుతుంది. వైష్ణోదేవిని దర్శించుకోవడానికి విమానంలో వచ్చే వాళ్లు జమ్ములో దిగాలి. కొన్ని రైల్ సర్వీసులు కాట్రా స్టేషన్‌కు వస్తాయి. కొన్ని రైళ్లు జమ్ము మీదుగా వెళ్తాయి. ఆ రైళ్లలో వచ్చిన వాళ్లు జమ్ము నుంచి రోడ్డు మార్గాన కాట్రాకు చేరాలి. ఈ పర్యటనలో పర్యాటకుల ప్రధాన ఉద్దేశం వైష్ణోదేవిని దర్శించుకోవడంగానే ఉంటుంది. కానీ కాట్రాలో ఉన్న ‘శ్రీ మాతా వైష్ణోదేవి యూనివర్సిటీ’ని విజిట్ చేసి తీరాలి, కనీసం బయలు నుంచి అయినా చూడాలి. ఇక్కడ ఇంజనీరింగ్ కోర్సులు, ఎకనమిక్స్ వంటి సబ్జెక్టులతో΄ాటు బయోటెక్నాలజీ కోర్సులు కూడా ఉన్నాయి. బాణగంగ కథనంకాట్రా నుంచి వైష్ణోదేవి మందిరానికి చేరే దారిలో బాణగంగానది ఉందని చెప్పుకున్నాం. ఈ హిమాలయాల్లోని శివాలిక్ శ్రేణుల్లో పుట్టింది. ఈ ప్రవాహం చీనాబ్ నదిలో కలుస్తుంది. వైష్ణోదేవి తలస్నానం చేయడానికి సృష్టించిన నీటి వనరు అని చెబుతారు. పురాణ కథల ప్రకారం వైష్ణోదేవి... శ్రీరాముని భక్తురాలు. శ్రీరాముని దర్శనం కోసం ఆమె హనుమంతునితోపాటు త్రికూట పర్వతం మీదకు వెళ్తోంది. ఆ సమయంలో హనుమంతుడికి దాహమైంది. అతడి దాహం తీర్చడం కోసం వైష్ణోదేవి ఈ ప్రదేశంలో బాణం వేసిందని, ఆ బాణం తాకిడితో నీటి చెలమ ఏర్పడిందని, హనుమంతుడు దాహం తీర్చుకున్న తర్వాత వైష్ణోదేవి ఇక్కడే తలస్నానమాచరించిందని, అందుకే బాణ్గంగ అనే పేరు వచ్చిందని చెబుతారు. స్థానికులు బాల్గంగ అని కూడా పిలుస్తారు. దీనికి అర్థం వైష్ణోదేవి తలస్నానం చేసిన నది అని.పర్యాటకులకు వైద్య సేవజమ్ము నుంచి కాట్రా వెళ్లే దారిలో సరస్వతి ధామ్ ఉంది. వైష్ణోదేవి దర్శనం కోసం వచ్చే యాత్రికుల సౌకర్యార్థం పని చేస్తోంది. బస, ఆహార సౌకర్యాలు మాత్రమే కాదు, ఈ పర్యటనలో గాయపడిన వారి చికిత్స ప్రధాన ఉద్దేశంగా వైష్ణోదేవి ఆలయ బోర్డు దీనిని ఏర్పాటు చేసింది. 3వ రోజుఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత లంచ్ ప్యాక్ చేసి ఇస్తారు. హోటల్ గది చెక్ అవుట్ చేసి కాట్రా నుంచి నుంచి చినాబ్ వంతెనకు బయలుదేరాలి. చినాబ్ వంతెన, పరిసరాల వీక్షణం తర్వాత జమ్ముకు ప్రయాణం. దారిలో రఘునాథ్ టెంపుల్ దర్శనం. రాత్రి ఎనిమిది గంటలకు జమ్ము రైల్వేస్టేషన్లో దించుతారు. జమ్ములో 12426 జమ్ము రాజధాని ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. ఆ రైలు రాత్రి 9.25గంటలకు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం.వంతెన ప్రయాణం ఆకాశ విహారంచినాబ్ నది మీద వంతెన పూర్తయింది. నాలుగు దశాబ్దాల కిందట 1983లో శంకుస్థాపన చేసుకున్న ఈ వంతెన నిర్మాణం పూర్తి చేసుకుని గత నెలలో ప్రయాణానికి సిద్ధమైంది. చినాబ్ వంతెనను ఇంజనీరింగ్ మిరకిల్ అని చెప్పాలి. సుడిగాలులు, భూకంపాలను తట్టుకునే టెక్నాలజీతో నిర్మించారు. ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జి. దీని ఎత్తు 1,178 అడుగులు. ఈ బ్రిడ్జి ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన నిర్మాణం. ఈఫిల్ టవర్ ఎత్తు 1,083 అడుగులు మాత్రమే. ఇక చినాబ్ వంతెన పొడవు 4,314 అడుగుల పొడవు, అంటే 1315 మీటర్లన్నమాట. చినాబ్ నది రెండు కొండల మధ్య ప్రవహిస్తోంది. ఆ కొండలను కలుపుతూ నిర్మించిన వంతెన ఇది. జమ్ము– బారాముల్లా లైన్లో కౌరి– బక్కాల్ రైల్వే స్టేషన్ల మధ్య వస్తుంది. ప్రస్తుతం ఇది గొప్ప పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందనుంది.ఇది ప్రయాణం కాదు విహారం!ఏటా చలికాలంలో రోడ్డు మార్గం మంచుతో కప్పబడి΄ోతుంది. దాంతో జమ్ము– కశ్మీర్‌కి మిగిలిన దేశంతో సంబంధాలు తెగి΄ోతాయి. ఈ రైల్ బ్రిడ్జితో ఏడాది పొడవునా సామాన్యులు కశ్మీర్‌కు ప్రయాణం చేయగలుగుతారు. చినాబ్ నది మీద నిర్మించిన ఈ వంతెనను కేవలం రవాణా సౌకర్యంగా భావించలేం. ఇది ప్రపంచంలో మనదేశానికి ఒక రికార్డును అందించింది. మన ఇంజనీరింగ్ టెక్నాలజీని ప్రపంచానికి చాటుకోవడానికి గొప్ప ప్రతీకగా నిలుస్తోంది. అంతకంటే ఎక్కువగా పర్యాటకులు హిమాలయాలను కళ్ల నిండుగా చూసుకోవడానికి ఈ వంతెన గొప్ప అవకాశం. తల వంచి చూస్తే మౌనంగా ప్రవహిస్తున్న చినాబ్ నది, తల తిప్పి చూస్తే 360 డిగ్రీలలో ఎటు చూసినా హిమాలయ శ్రేణులతో ప్రకృతి రమణీయత కనువిందు చేస్తుంది.ఫొటోలు తీసుకోవాలి!ఈ టూర్లో ఫొటోలు తీసుకోవడానికి చక్కటి ప్రదేశం చినాబ్ వంతెన, ఆ పరిసరాలు. పర్యాటకుల్లో చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే... క్లోజప్ ఫొటోలు తీసుకుంటారు. ఆ ఫొటోలో మనుషులు ప్రముఖంగా కనిపిస్తుంటారు, నేపథ్యం సరిగ్గా కవర్ కాదు. కొన్ని లాంగ్ షాట్లు తీసుకోవాలి. పనోరమిక్ షాట్లు తీసుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత వాటిని కంప్యూటర్లో చూసుకున్నప్పుడు మరోసారి ఆ ప్రదేశాల్లో మనో పర్యటన చేయవచ్చు. ఈ రైల్లో కొన్ని కోచ్‌లు పర్యాటకుల కోసం డిజైన్ చేసింది ఇండియన్ రైల్వే శాఖ. అందులో నుంచి హిమాలయాలను వీక్షిస్తూ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. అలాగే చక్కటి వ్యూ పాయింట్లను గుర్తించి అక్కడ రైలు కొద్దిసేపు ఆగుతుంది. మామూలు స్టిల్ ఫొటోగ్రఫీ కెమెరాలు, వీడియో కెమెరాలు, స్మార్ట్ ఫోన్లతో ఫొటోలు తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరమూ ఉండదు. కానీ డ్రోన్ కెమెరాలో చిత్రీకరించాలంటే పర్యాటకులు సంబంధిత అధికారులకు తమ వివరాలు సమర్పించి అనుమతి తీసుకోవాలి.సాహసాల ముఖద్వారంచినాబ్ రైలు వంతెన టూరిస్టులకు ఆటవిడుపు వంటిది. హిమాలయాల్లో పీర్‌పంజాల్ శ్రేణుల్లో ట్రెకింగ్, నదుల్లో రివర్ రాఫ్టింగ్, పారాగ్లైడింగ్, క్యాంపింగ్ వంటి అడ్వెంచరస్ స్పోర్ట్స్‌కి ఈ ప్రదేశం ఎంట్రీ పాయింట్. వైష్ణోదేవి దర్శనంతోపాటు భీమ్‌ఘర్ ఫోర్ట్, శివ్ ఖోరీ గుహాలయం, పాట్నీటాప్ హిల్ స్టేషన్, సనాసర్ సరస్సు, అడ్వెంచర్ పార్కులకు వెళ్లడానికి ఇది జంక్షన్ పాయింట్.ఎప్పుడు వెళ్లాలి?ఈ టూర్‌కి వెళ్లడానికి మార్చి నుంచి అక్టోబర్ మధ్య కాలం అనువుగా ఉంటుంది. ఈ సమయంలో ఆకాశం మబ్బుల్లేకుండా నిర్మలంగా ఉంటుంది. హిమాలయాలు చక్కగా కనిపిస్తాయి. నవంబర్ నుంచి మంచు కురవడం మొదలవుతుంది. ఈ సమయంలో రైల్లో ప్రయాణిస్తూ అద్దాల్లోంచి చూడడానికి బాగుంటుంది. కానీ పర్యటన సజావుగా సాగదు.బంగారు మందిరంజమ్ము నగరంలో రఘునాథ్ టెంపుల్ది ప్రత్యేకస్థానం. ఉత్తరాది రాష్ట్రాల్లోని పెద్ద ఆలయాల్లో ఇదొకటి. ఈ ఆలయం ఉన్న వీథి పేరు రఘునాథ్ బజార్. డోగ్రా పాలకులు కట్టించిన ఆలయం ఇది. మొదటి డోగ్రా ΄ాలకుడు గులాబ్ సింగ్ 1835లో నిర్మాణాన్ని ప్రారంభించాడు. మహారాజా రణ్‌బీర్ సింగ్ 1857లో విగ్రహప్రతిష్ఠ చేశాడు. మిగిలిన భారతదేశంలో బ్రిటిష్ పాలన పట్ల అసహనం పెట్టుబుకుతూ సిపాయిల తిరుగుబాటు జరిగిన సంవత్సరం అది. ప్రతిష్ఠాపన తర్వాత మరో మూడేళ్ల పాటు చిన్న చిన్న నిర్మాణపనులు కొనసాగాయి. అంతకంటే ముందు 18వ శతాబ్దంలోనే కులు రాజు రాజా జగత్సింగ్ ఆలయ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశాడని ఆ తర్వాత ఎదురైన రాజకీయ అనిశ్చితి కారణంగా నిర్మాణం ముందుకు సాగలేదని, కుల్లు రాజుకు సామంతులుగా ఉన్న డోగ్రా రాజులు స్వతంత్రత సాధించిన తర్వాత జమ్ము–కశ్మీర్ రాజ్య తొలి మహారాజు గులాబ్ సింగ్ నిర్మాణం మొదలు పెట్టాడని స్థానికులు చెబుతారు. ఈ ఆలయంలో రఘునాథుని పేరుతో పూజలందుకుంటున్న దేవుడు శ్రీరాముడు. ఆలయం లోపలి గోడలకు బంగారు తాపడం చేశారు. ఆలయంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడివి ప్రధాన విగ్రహాలు. వీటితోపాటు అనేకమంది దేవుళ్లు దేవతల సాలగ్రామ రూపాలుంటాయి. ఆలయంలో సంస్కృత గ్రంథాల లైబ్రరీ ఉంది. అందులో ప్రాచీన చేతిరాత ప్రతులు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ చూడడం ఆహ్లాదకరం మాత్రమే కాదు, అవగాహనకరం కూడా. 4వ రోజురైలు తెల్లవారు జామున 5.55 గంటలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చేరడంతో టూర్ పూర్తవుతుంది.‘మాత వైష్ణోదేవి విత్ చినాబ్ బ్రిడ్జి’ టూర్ ప్యాకేజ్‌లో ప్రయాణం నాలుగు రోజులుంటుంది. ఇది ఢిల్లీ నుంచి మొదలయ్యే టూర్. ఇందులో వైష్ణోదేవి దర్శనంతో΄టు చినాబ్ వంతెన వీక్షణం ఉంటుంది. టూర్ కోడ్: MATA VAISHNODEVI WITH CHENAB BRIDGE EX DELHI (WEEKDAY) (NDR01C)ప్యాకేజ్ ఇలా: థర్డ్ ఏసీలో ప్రయాణం. కాట్రాలో ఏసీ హోటల్ బస. సింగిల్ ఆక్యుపెన్సీ 14,200 రూపాయలు. డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 11,555 రూపాయలు. ఢిల్లీకి వెళ్లే టికెట్లు, ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చే టికెట్లు ఈ ప్యాకేజ్‌లో వర్తించవు. -
ఆదాయంలో షిర్డీ, వైష్ణోదేవిలను దాటిన అయోధ్య
అయోధ్య: యూపీలోని అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరిగినది మొదలు భక్తులు తండోపతండాలుగా అయోధ్యకు తరలివస్తున్నారు. ఇప్పుడు యూపీలో జరుగుతున్న కుంభమేళాకు వచ్చిన భక్తులు అయోధ్యకు వచ్చి, బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు.ఇక్కడకు వచ్చిన రామభక్తులంతా ఆలయానికి భారీగా విరాళాలు ఇవ్వడంతో పాటు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించుకుంటున్నారు. కానుకల విషయంలో అయోధ్య అటు షిర్డీ, ఇటు వైష్ణోదేవి అలయాలను దాటేసింది. అయోధ్య రామాలయంలో బాల రాముని ప్రాణప్రతిష్ఠ 2024, జనవరి 22న జరిగింది. అప్పటి నుంచి నేటివరకూ 13 కోట్ల మంది బాలరాముణ్ణి దర్శించుకున్నారు.అయోధ్య ఆలయానికి అందుతున్న కానుకల విషయానికొస్తే స్వర్ణదేవాలయం, వైష్ణోదేవి, షిర్డీ ఆలయాలకు మించిన రీతిలో కానుకలు అందుతున్నాయి. గడచిన ఏడాదిలో ఆలయానికి కానుకలు, విరాళాల రూపంలో మొత్తం రూ. 700 కోట్లు అందింది. మహాకుంభ్ ప్రారంభమయ్యాక రూ. 15 కోట్ల ఆదాయం సమకూరింది. దేశంలో అత్యధికంగా ఆదాయం అందుతున్న 10 ఆలయాలలో అయోధ్య మూడవ స్థానానికి చేరింది. ఒక నివేదికను అనుసరించి చూస్తే షిర్డీ ఆలయానికి ఏటా రూ. 450 కోట్ల వరకూ ఆదాయం సమకూరుతుండగా, వైష్ణోదేవికి ప్రతీయేటా రూ. 400 కోట్ల వరకూ ఆదాయం అందుతోంది.ఇది కూడా చదవండి: బిడ్డకు ఊపిరిపోసి, ప్రాణాలొదిలిన బ్రెయిన్ డెడ్ తల్లి.. -
వైష్ణో దేవి యాత్ర మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు.. ఒకరు మృతి
జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే యాత్ర మార్గంలో సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఓ యాత్రికుడు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.పంచి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ బండరాళ్లు ఒక్కసారిగా కిందపడటంతో ఓవర్ హెడ్ ఐరన్ స్ట్రక్చర్ దెబ్బతింది. సమాచారం అందుకున్న వైష్ణోదేవి ఆలయ బోర్డుకు చెందిన డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది.ప్రమాదంలో గాయపడిన యాత్రికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన నేపథ్యంలో వైష్ణో దేవి మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్ర సమయంలో యాత్రికులు జాగ్రత్తగా ఉండాలని, పరిస్థితులను అంచనా వేస్తూ ముందుకు సాగాలని సూచించారు. -
వైష్ణోదేవి దర్శనానికి వందేభారత్... ఖర్చెంత?
వైష్ణో దేవి భక్తులకు ఐఆర్సీటీసీ శుభవార్త చెప్పింది. ఇకపై అమ్మవారి దర్శనాన్ని వందేభారత్ రైలు ద్వారా చేసుకోవచ్చని తెలిపింది. ఇది లగ్జరీ రైలు కావడంతో ప్రయాణికులకు పలు సౌకర్యాలు అందనున్నాయి. దీనిలో ప్రయాణించడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవడమే కాకుండా, ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు.వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢిల్లీ నుండి ఉదయం ఆరు గంటలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం రెండు గంటలకు కట్రాకు చేరుతుంది. అదే ఇతర రైలు అయితే ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి కట్రాకు సాయంత్రం ఆరు గంటలకు చేరుతుంది. అయితే ఈ మార్గంలో ప్రయాణించే వందే భారత్ ఛార్జీలు మిగిలిన రైళ్ల ఛార్జీల కంటే కొంచెం అధికం.ఢిల్లీ నుండి మాతా వైష్ణో దేవి కట్రా స్టేషన్‌కు ఇతర రైళ్ల టిక్కెట్ రూ. 990 వరకూ ఉంటుంది. అయితే వందే భారత్ చైర్ కార్లో రూ. 1610 టిక్కెట్‌తో కట్రాకు చేరుకోవచ్చు. ఎకనామిక్ చైర్ క్లాస్‌లో వెళితే ఒక్కో ప్రయాణికునికి రూ. 3005 చెల్లించాల్సి ఉంటుంది. వందే భారత్ రైలులో టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు సమీపంలోని రైల్వే స్టేషన్‌లోని కౌంటర్‌కు వెళ్లి సంప్రదించవచ్చు. లేదా ఆన్లైన్, ఆఫ్లైన్లలోనూ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. -
వైష్ణోదేవికి కట్టుదిట్టమైన భద్రత
జమ్మూ డివిజన్లో ఇటీవల నాలుగు ఉగ్రదాడులు జరిగినప్పటికీ వైష్ణో దేవిని సందర్శించే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. ఉగ్రదాడులను ఖండిస్తూ భక్తులు వైష్ణోదేవి యాత్రలో పాల్గొంటున్నారు. అమ్మవారి దర్శనం కోసం దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు ప్రతిరోజూ బేస్ క్యాంప్ కాట్రాకు తరలివస్తున్నారు.మరోవైపు యాత్ర రిజిస్ట్రేషన్ కోసం భక్తులు కాట్రాలో చాలా సేపు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా వైష్ణో దేవి దర్శనం కోసం కిలోమీటరు పొడవున భక్తులు బారులు తీరుతున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయానికి 33,900 మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకుని వైష్ణో దేవి ఆలయం దిశగా ముందుకు కదిలారు.ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న ఉగ్రదాడుల నేపధ్యంలో వైష్ణో దేవి ఆలయంతో పాటు అక్కడికి సమీపంలో అన్నిప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. తాజాగా వైష్ణో దేవి ఆలయ భద్రతకు సంబంధించి పోలీసు డైరెక్టర్ జనరల్ ఆర్ఆర్ స్వైన్ పోలీసు, భద్రతా బలగాల అధికారులతో సమావేశం నిర్వహించారు.అనంతరం మాతా వైష్ణో దేవి భవన్ ప్రాంగణంలో అదనపు సంఖ్యలో పోలీసులు, భద్రతా దళాల సిబ్బందిని మోహరించారు. ప్రసుతం వైష్ణో దేవి పవిత్ర గుహల చుట్టూ భారీ సంఖ్యలో సీఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు సాధారణ దుస్తులలో కమాండోలు పహారా కాస్తున్నారు. గురువారం 38 వేల మంది భక్తులు వైష్ణోదేవిని దర్శించుకున్నారు. -
వైష్ణోదేవి దర్శనానికి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ!
వేసవి సెలవుల్లో మాతా వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించాలనుకునేవారికి ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ మూడు రాత్రులతో పాటు మొత్తం నాలుగు రోజులు ఉండనుంది. ఈ ప్యాకేజీ న్యూఢిల్లీ నుండి ప్రారంభంకానుంది. ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీలో మాతా వైష్ణో దేవి ఆలయంతో పాటు, కంద్ కండోలి ఆలయం, రఘునాథ్ ఆలయం, బేగ్ బహు గార్డెన్లను సందర్శించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఐఆర్సీటీసీ అన్ని సదుపాయాలను కల్పిస్తుంది. ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీ పేరు ‘మాతారాణి- రాజధాని’ ఈ యాత్రలో ప్రయాణికులు థర్డ్ ఏసీలో ప్రయాణించే అవకాశం లభిస్తుంది. ప్రయాణికులకు ప్రయాణ సమయంలో ఆహారపానీయాలను ఐఆర్సీటీసీ అందిస్తుంది. ఈ ప్యాకేజీ కింద రెండు బ్రేక్‌ఫాస్ట్‌లు, ఒక లంచ్, ఒక డిన్నర్ అందజేస్తారు. అలాగే బస ఏర్పాట్లను కూడా ఐఆర్సీటీసీ కల్పిస్తుంది. ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవాలనుకునేవారు రూ.6,390 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో వివిధ టారిఫ్ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాకేజీలో ప్రయాణానికి గరిష్ట ఛార్జీ రూ.8,300. మరిన్ని వివరాల కోసం irctctourism.comని సందర్శించవచ్చని ఐఆర్సీటీసీ తెలిపింది. -
వైష్ణోదేవి ఎదుట భక్తులు బారులు
దేశంలోని చాలామంది తీర్థయాత్రలతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తుంటారు. తమకు మంచి జరగాలని కోరుకుంటూ దేవాలయాలకు వెళ్లి, దేవుని దర్శనం చేసుకుంటారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వైష్ణోదేవి ఆలయ సందర్శనకు వస్తున్న భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు యాత్రను కొద్దిసేపు నిలిపివేసింది. కొద్దిసేపటి తరువాత భక్తుల రద్దీని నియంత్రించి, దర్శనాలకు అనుమతినిచ్చింది. మాతా వైష్ణో దేవి ఆలయం జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో త్రికూట పర్వతంపై ఉంది. నూతన సంవత్సరం సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇది కూడా చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు! #WATCH | Reasi, J&K: Devotees throng the Holy Cave Shrine of Shri Mata Vaishno Devi temple in Katra pic.twitter.com/Z0R1fYy3Zj — ANI (@ANI) January 1, 2024 -
వైష్ణోదేవి సమక్షంలో నూతన సంవత్సరం సందడి
నూతన సంవత్సరం సందర్భంగా జమ్ముకశ్మీర్‌లోని వైష్ణో దేవి క్షేత్రంతో సహా హిమాచల్‌లోని పలు శక్తిపీఠాలను నందర్శించేందుకు పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరుతున్నారు. వైష్ణోదేవి ఆలయానికి ఇప్పటికే 50 వేల మందికి పైగా భక్తులు తరలివచ్చారని అధికారుల అంచనా. నూతన సంవత్సరం సందర్భంగా హిమాచల్‌లోని అన్ని శక్తిపీఠాలను పూలతో అందంగా అలంకరించారు. జ్వాలాజీ, బజరేశ్వరి, చాముండ, నయన దేవి, చింతపూర్ణి క్షేత్రాలలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నయన దేవి క్షేత్రంలో నూతన సంవత్సర మేళా ప్రారంభమైంది. ఆలయ తలుపులు 22 గంటల పాటు తెరిచి ఉంచనున్నారు. కాంగ్రాలోని చాముండ దేవాలయం తలుపులు తెల్లవారుజామున 4:00 గంటలకే తెరిచారు. హిమాచల్‌లోని పలు హోటళ్లు ఇప్పటికే భక్తులతో నిండిపోయాయి. అదే సమయంలో మనాలికి 60 నుంచి 70 వేల మంది పర్యాటకులు తరలివచ్చారు. డిసెంబర్ 31 (ఈరోజు) సాయంత్రం నాటికి ఈ సంఖ్య లక్ష దాటుతుందని అంచనా. మరోవైపు సిమ్లా ఇప్పటికే టూరిస్టులతో నిండిపోయింది. రోహ్తంగ్ పరిధిలో విపరీతంగా మంచు కురుస్తోంది. సిమ్లాలో ఆకాశం మేఘావృతమైంది. కాగా జమ్మూ కాశ్మీర్‌లోని పట్నిటాప్, నత్తతోప్, పహల్గాం, గుల్మార్గ్, సోన్మార్గ్ తదితర పర్యాటక ప్రదేశాలలో పర్యాటకుల రద్దీ పెరిగింది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు హిమాచల్ సిద్ధమైంది. కసౌలి, చైల్, డల్హౌలీలు పర్యాటకులతో నిండిపోయాయి. ఖజ్జియార్లోని హోటళ్లలో 85 శాతం వరకు ఆక్యుపెన్సీ ఉంది. శనివారం సాయంత్రం నాటికే వందలాది మంది పర్యాటకులు డల్హౌసీ, ఖజ్జియార్‌కు చేరుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా దాదాపు ఐదు లక్షల మంది పర్యాటకులు హిమాచల్ చేరుకున్నారు. సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్, మనాలి మాల్ రోడ్లలో నూతన సంవత్సరానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పర్యాటకుల సౌకర్యార్థం రెస్టారెంట్లు, హోటళ్లను 24 గంటలూ తెరిచే ఉంచనున్నారు. ప్రభుత్వం అదనపు పోలీసు బలగాలను మోహరించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఇది కూడా చదవండి: అర్జెంటీనాను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? -
కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి
జమ్మూకశ్మీర్: కొండచరియలు విరిగి పడిన ఘటనలో నలుగురు వ్యక్తులు మృతిచెందిన ఘటన జమ్మూలోని కాత్రా జిల్లాలో చోటుచేసుకుంది. శనివారం ఉదయం మాతా వైష్ణోదేశి ఆలయానికి వెళ్తున్న భక్తులపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు భక్తులతో పాటు వారిని తీసుకెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. వీరంతా పాత మార్గం గుండా వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని కత్రా జిల్లా పోలీస్ అధికారి వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడిన మరో 10 మందిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.