
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో వైష్ణో దేవి ఆలయం సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ శతాబ్దంలో అత్యధికంగా కురిసిన భారీ వర్షపాతం కారణంగా రాష్ట్రం అతలాకుతమయ్యింది. బీభత్సమైన వరదల కారణంగా ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించారు. కమ్యూనికేషన్ నెట్‌వర్క్ పూర్తిగా దెబ్బతింది.
ఆగస్టు 14 వైష్ణో దేవి మందిరానికి సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో శిథిలాల కింద పలువరు చిక్కుకున్నారు. తాజాగా ఈ ప్రాంతంనుంచి 28 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీసుకువచ్చారు. మరోవైపు రియాసి, దోడలో కొండచరియలు విరిగిపడటానికి తోడు, ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 38కి చేరింది. కొండచరియల ప్రమాదంలో అయినవారు మరణించిన బాధిత కుటుంబాలకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రూ.9 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
#WATCH | Katra, J&K: On Vaishno Devi Yatra temporarily suspended due to landslide, a devotee, Raja Kumar, says, "The yatra has been stopped for now. We are staying at a hotel for two days. Now we will return only after visiting the Vaishno Devi Temple from here... There is a red… pic.twitter.com/MpTa2b9P2h
— ANI (@ANI) August 28, 2025
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. రియాసి కొండచరియల ప్రమాదం కారణంగా మృతిచెందిన తమ రాష్ట్రానికి చెందిన 11 మంది మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున మంజూరు చేశారు. కాగా ప్రతికూల వాతావరణంలో వైష్ణో దేవి మార్గంలో యాత్రికులు వెళ్లకుండా జిల్లా అధికారులు నియంత్రించపోవడంపై సీఎం ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్జీ సిన్హా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాకు రాష్ట్రంలోని వరద పరిస్థితి, సహాయ చర్యలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.
గడచిన 24 గంటల్లో జమ్మూలో 380 మి.మీ వర్షపాతం నమోదైందని, ఇప్పటివరకూ ఇదే అత్యధిక వర్షపాతమని వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టులో జమ్మూ నెలవారీ సగటు 403.1 మి.మీ వర్షపాతం కురిసిందని పేర్కొంది. శ్రీనగర్-జమ్మూ హైవేలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో ఆ రహదారిని మూసివేశారు. జమ్మూలోని లోతట్టు ప్రాంతాలు, వరదల ముప్పు ప్రాంతాల నుండి ఐదువేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు జమ్ము కశ్మీర్ అంతటా టెలికాం సేవలు నిలిచిపోయాయి. వైష్ణోదేవి ఆలయం చెంత కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇంతకుమందు 32 మంది మృతిచెందినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ సంఖ్య మరింత పెరుగుతున్నదని అధికారులు తెలిపారు.