
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని త్రికూట కొండలపై కొలువైన మాతా వైష్ణో దేవి మందిరానికి తీర్థయాత్ర బుధవారం ఉదయం తిరిగి ప్రారంభమైంది. ఆగస్టు 26న కొండచరియల విరిగిపడి, 34 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు 20 మంది గాయపడిన దరిమిలా యాత్రను 22ను రోజుల పాటు నిలిపివేశారు.
VIDEO | Katra, Jammu and Kashmir: Devotees chant 'Jai Mata Di' as Vaishno Devi pilgrimage resumes after a suspension of 22 days due to a devastating landslide that claimed 34 lives and injured 20.
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/Dn55AFl6jW— Press Trust of India (@PTI_News) September 17, 2025
శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర బోర్డు యాత్రను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇది బేస్ క్యాంప్‌లో వేచి ఉన్న భక్తులకు ఉపశమనాన్ని కలిగించింది. బుధవారం తెల్లవారుజామున వందలాది మంది భక్తులు యాత్రకు ఉపక్రమించారు. కొండపైనున్న పుణ్యక్షేత్రానికి దారితీసే రెండు మార్గాల నుండి ఉదయం 6 గంటలకు యాత్ర ప్రారంభమైందని పుణ్యక్షేత్ర బోర్డు అధికారులు తెలిపారు. యాత్రికులు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును తీసుకెళ్లాలని, ఆన్-గ్రౌండ్ సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
‘యాత్ర పునఃప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉన్నాం. మేము రెండు రోజుల క్రితం పూణే నుండి బేస్ క్యాంప్‌కు చేరుకున్నాం. మాతా వైష్ణోదేవి దర్శనం కోసం నిరీక్షిస్తున్నామని మహారాష్ట్రకు చెందిన ఒక బృందంలోని ఒక మహిళా యాత్రికురాలు అన్నారు. ఈ ఆలయాన్ని సందర్శించడం ఒక వరం. దీనిని సాధ్యం చేసినందుకు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ ఒకటి వరకూ జరిగే నవరాత్రి వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారని అధికారులు భావిస్తున్నారు.