breaking news
Vaishno Devi pilgrims
-
తిరిగి ప్రారంభమైన వైష్ణోదేవి యాత్ర.. 22 రోజుల విరామానికి తెర
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని త్రికూట కొండలపై కొలువైన మాతా వైష్ణో దేవి మందిరానికి తీర్థయాత్ర బుధవారం ఉదయం తిరిగి ప్రారంభమైంది. ఆగస్టు 26న కొండచరియల విరిగిపడి, 34 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు 20 మంది గాయపడిన దరిమిలా యాత్రను 22ను రోజుల పాటు నిలిపివేశారు. VIDEO | Katra, Jammu and Kashmir: Devotees chant 'Jai Mata Di' as Vaishno Devi pilgrimage resumes after a suspension of 22 days due to a devastating landslide that claimed 34 lives and injured 20. (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/Dn55AFl6jW— Press Trust of India (@PTI_News) September 17, 2025శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర బోర్డు యాత్రను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇది బేస్ క్యాంప్‌లో వేచి ఉన్న భక్తులకు ఉపశమనాన్ని కలిగించింది. బుధవారం తెల్లవారుజామున వందలాది మంది భక్తులు యాత్రకు ఉపక్రమించారు. కొండపైనున్న పుణ్యక్షేత్రానికి దారితీసే రెండు మార్గాల నుండి ఉదయం 6 గంటలకు యాత్ర ప్రారంభమైందని పుణ్యక్షేత్ర బోర్డు అధికారులు తెలిపారు. యాత్రికులు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును తీసుకెళ్లాలని, ఆన్-గ్రౌండ్ సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరుతున్నారు.‘యాత్ర పునఃప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉన్నాం. మేము రెండు రోజుల క్రితం పూణే నుండి బేస్ క్యాంప్‌కు చేరుకున్నాం. మాతా వైష్ణోదేవి దర్శనం కోసం నిరీక్షిస్తున్నామని మహారాష్ట్రకు చెందిన ఒక బృందంలోని ఒక మహిళా యాత్రికురాలు అన్నారు. ఈ ఆలయాన్ని సందర్శించడం ఒక వరం. దీనిని సాధ్యం చేసినందుకు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ ఒకటి వరకూ జరిగే నవరాత్రి వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారని అధికారులు భావిస్తున్నారు. -
ధర్నాకు దిగిన వైష్ణోదేవి భక్తులు
కత్రా/జమ్మూ: త్రికూల పర్వతాల్లో కొలువైన మాతా వైష్ణోదేవిని దర్శించుకునే భాగ్యం తమకు కల్పించాలని భక్తులు ధర్నాకు దిగారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగి పడుతున్న ఘటనలతో ముందుజాగ్రత్తగా జమ్మూకశీ్మర్ పాలనాయంత్రాంగం వైష్ణోదేవి యాత్రను గత 20 రోజులుగా నిలివేసిన నేపథ్యంలో విసుగుచెందిన యాత్రికులు, భక్తులు ధర్మాగ్రహం వెలిబుచ్చారు. దేవీదర్శనం కోసం సుదూరాల నుంచి వచ్చాక తీరా త్రికూల పర్వతాల వద్ద హఠాత్తుగా ఆపేసి, యాత్రకు అర్థంతరంగా రద్దుచేయడంపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఆదివారం రేసీ జిల్లాలోని కత్రా బేస్‌క్యాంప్ వద్ద పెద్దసంఖ్యలో యాత్రికులు నిరసన చేపట్టారు. ఆలయం దిశగా ర్యాలీగా వెళ్తేందుకు భక్తులు ప్రయతి్నంచగా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఆలయబోర్డ్ ఆదేశాలను ఉల్లంఘించడానికి వీల్లేదని పోలీసులు తెగేసి చెప్పారు. ఆలయానికి దారితీసే ప్రధాన ఘాట్‌రోడ్డు, దానికి అనుసంధానమైన రహదారుల వెంట భారీ వర్షాలు, పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిన పడటంతో మొత్తం ఘటనల్లో 34 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 20 మంది గాయపడ్డారు. దీంతో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వైష్ణోదేవి ఆలయ బోర్డ్ ఆగస్ట్ 26వ తేదీన యాత్రను నిలిపేసింది. అప్పటి నుంచి యాత్ర ఆగిపోయి ఆదివారానికి వరసగా 20 రోజులు పూర్తయింది. సెపె్టంబర్ 14వ తేదీన యాత్రను పునరుద్ధరిస్తామని గతంలోప్రకటించినా ఆదివారం(సెప్టెంబర్ 14న) అది మొదలుకాలేదు. దీంతో రోజులతరబడి వేచి ఉండే ఓపికలేక భక్తుల్లో అసహనం, ఆగ్రహం పెల్లుబికింది. ‘‘రెండు నెలలపాటు పాదరక్షల్లేకుండా కాలినడకన కత్రా బేస్‌క్యాంప్‌దాకా వచ్చా. వీలైనంత త్వరగా దర్శనభాగ్యం దక్కుతుందని ఆశపడుతున్నా. పెద్దగుంపులుగా జనానఇన పంపిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తే చిన్న గుంపులుగా అయినా యాత్రను మొదలెడతే బాగుంటుంది’’అని మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన రాజీవ్ లోధీ అనే భక్తుడు అన్నారు. ‘‘19 రోజలతర్వాత 14వ తేదీన యాత్ర మొదలుకానుందని తెల్సి తమిళనాడు నుంచి కుటుంబంతో వచ్చా. తీరాచూస్తే యాత్ర పునరుద్ధరణ వాయిదాపడింది. మా క్షేమం కోరి యాత్రను ఆపేశారని తెలుసు. కానీ ఇంకెన్ని రోజులు వేచి ఉండాలో తెలీట్లేదు’’అని చెన్నైవాసి వినోద్‌కుమార్ అన్నారు. ‘‘ఏదేమైనా యాత్ర పూర్తిచేస్తాం. సస్పెండ్‌చేసే ఉద్దేశమే ఉంటే ఆన్లైన్ రిజి్రõÙ్టషన్ ఎందుకు మొదలెట్టారు?’అని ముంబై నుంచి వచి్చన రేఖ ఆగ్రహం వ్యక్తంచేశారు. దర్శనం చేసుకున్నాక వెనుతిరుగుతామని బిహార్ వాసి రాజ్‌కుమార్ స్పష్టంచేశారు. -
ఆరో రోజూ వైష్ణో దేవి యాత్ర నిలిపివేత.. పర్యాటకుల అడ్వాన్సులు వాపను
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని వైష్ణో దేవి యాత్రా మార్గంలో ఎడతెరిపిలేకుండా వర్షం కురవడానికితోడు, అసురక్షిత పరిస్థితులు ఏర్పడిన కారణంగా వైష్ణో దేవి యాత్రను ఆరవరోజు (ఆదివారం) కూడా నిలిపివేశారు. ఈ పరిస్థితుల దృష్ట్యా మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర బోర్డు (ఎస్ఎంబీడీఎస్బీ)భక్తులు ఈ సమయంలో చేసిన అన్ని బుకింగ్‌లను రద్దు చేస్తూ, వారి సొమ్మును తిరిగి చెల్లించనున్నట్లు ప్రకటించింది.వైష్ణోదేవి యాత్రా మార్గంలో కొండచరియలు విరిగిపడిన అనంతరం.. కాట్రా నుండి భవన్‌కు హెలికాప్టర్ సేవలు, భవన్ నుండి భైరోన్ ఘాటికి రోప్‌వే రైడ్లు, హోటల్ వసతి , ఇతర యాత్రా సంబంధిత బుకింగ్‌లన్నీ రద్దయ్యాయి. యాత్రికులు తమ వివరాలను refund@maavaishnodevi.net కు ఈ మెయిల్ చేయడం ద్వారా డబ్బుల వాపసుకు అభ్యర్థించవచ్చని పుణ్యక్షేత్ర బోర్డు‘ఎక్స్’లో తెలిపింది. వీటిని 15 రోజుల్లోపు ప్రాసెస్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.శుక్రవారం నుంచి కూడా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. త్రికూట కొండలపై పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి. యాత్ర పునఃప్రారంభంపై అధికారులు ఇంకా వెల్లడించలేదు. విపత్తు ఘటనపై దర్యాప్తునకు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ముగ్గురు ఉన్నత స్థాయి సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్‌కు జల్ శక్తి శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి షలీన్ కబ్రా నేతృత్వం వహిస్తారు. కొండచరియలు విరిగిపడటానికి గల కారణాలను గుర్తించడం, ముందు జాగ్రత్త చర్యలలో ఏవైనా లోపాలు ఉన్నాయో పరిశీలించడంలాంటివి తెలుసుకోవడం ఈ కమిటీకి బాధ్యత. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలను నివారించడానికి ఈ తరహా డేటా సేకరణ ఉపయుక్తం కానుంది. కమిటీ తమ నివేదికను రెండు వారాల్లోపు లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హాకు సమర్పించాల్సి ఉంటుంది. All bookings cancelled with 100% refund till yatra is suspended. Send cancellation requests with details to refund@maavaishnodevi.netEarlier self-cancellations will get pending refund within 15 days. For queries, contact SMVDSB Call Centre @ 18001807212/ +91 9906019494.— Shri Mata Vaishno Devi Shrine Board (@OfficialSMVDSB) August 31, 2025 -
వైష్ణో దేవి యాత్ర మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు.. ఒకరు మృతి
జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే యాత్ర మార్గంలో సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఓ యాత్రికుడు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.పంచి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ బండరాళ్లు ఒక్కసారిగా కిందపడటంతో ఓవర్ హెడ్ ఐరన్ స్ట్రక్చర్ దెబ్బతింది. సమాచారం అందుకున్న వైష్ణోదేవి ఆలయ బోర్డుకు చెందిన డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది.ప్రమాదంలో గాయపడిన యాత్రికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన నేపథ్యంలో వైష్ణో దేవి మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్ర సమయంలో యాత్రికులు జాగ్రత్తగా ఉండాలని, పరిస్థితులను అంచనా వేస్తూ ముందుకు సాగాలని సూచించారు. -
యాత్రికులతో వెళ్తున్న బస్సులో అగ్ని ప్రమాదం... నలుగురు మృతి
న్యూఢిల్లీ: వైష్టోదేవి యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు సజీవ దహనమవ్వగా..సుమారు 22 మంది గాయపడ్డారు. ఈ బస్సు కత్రా నుంచి జమ్మూకి వెళ్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. కత్రా నుంచి 1.5 కి.మీ దూరంలోని ఖర్మల్ సమీపంలో బస్సులో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. బస్సు ఇంజిన్ ప్రాంతం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు మొత్తం చుట్టుముట్టాయని వెల్లడించారు. ఇద్దరు మాత్రం అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో గాయపడిన 22 మందిని చికిత్స నిమిత్తం కత్రాకు తరలించామని, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని జమ్మూ ఏడీజీపీ తెలిపారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలికి వచ్చి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: లిఫ్ట్ పేరుతో టీచర్‌పై లైంగిక దాడి.. వీడియోలు తీసి ఆ తర్వాత.) -
వైష్ణోదేవి భక్తులకు శుభవార్త..!
జమ్ముః వైష్ణోదేవి యాత్రికులకు శుభవార్త! భక్తులకు యాత్ర మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా కత్రానుంచి అర్థకువారి వరకు నవరాత్రి నాటికి మరో కొత్త ప్రయాణ మార్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వైష్ణోదేవి ష్రైన్ బోర్డు వెల్లడించింది. నవరాత్రి నాటికి వైష్ణోదేవి యాత్రకు సుమారు 7 కిలోమీటర్ల పొడవున మరో కొత్త మార్గాన్ని ప్రారంభించనున్నట్లు ఆలయ బోర్డు తెలిపింది. త్వరలో పనులు, షెడ్స్ నిర్మాణం పూర్తిచేసి మార్గాన్ని తెరిచేందుకు ముందు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే కొత్త మార్గానికి వ్యతిరేకంగా పల్లకీలు, గుర్రాల యజమానులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ కొత్త మార్గం కేవలం నడచి వెళ్ళే భక్తులకోసం మాత్రమేనని, ఏ ఇతర ప్రయాణ సౌకర్యాలకు ఈ మార్గంలో అనుమతి లేదని దేవాలయ బోర్డు సీఈవో స్సష్టం చేశారు. ఈ నూతన మార్గం 500 మీటర్లే ఉన్నప్పటికీ విస్తృతంగా ఉంటుందని, అత్యవసర సమయాల్లో అంబులెన్స్ సులభంగా అక్కడకు చేరుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. అర్థకువారీ హతీమాతా ప్రాంతంలో ఈ రూటులో నిటారుగా అధిరోహించాల్సి ఉంటుందని, ఈ ప్రదేశంలో జారకుండా ఉండేట్లుగా టైల్స్ ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వచ్చే యేడాది నాటికి వైష్ణోదేవి భక్తులకోసం రోప్ వే సేవలను కూడా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు ష్రైన్ బోర్డ్ వెల్లడించింది. అత్యవసర సమయాల్లో భక్తులకు హెచ్చరికలు జారీచేసేందుకు ఆడియో సిస్టమ్ తో పాటు, మొత్తం మార్గమంతా చిన్న చిన్న రాళ్ళతో కూడిన పై కప్పును నిర్మిస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. మరోవైపు వైష్ణోదేవి ఆలయానికి చేరుకునేందుకు అటు భక్తులు, ఇటు బోయీలకు సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా ఐఐటీ ముంబై కొత్త చెక్క పల్లకీలను కూడా డిజైన్ చేసింది.