యాత్రికులతో వెళ్తున్న బస్సులో అగ్ని ప్రమాదం... నలుగురు మృతి

Bus Caught Fire In Katra To Jammu And Kashmir Several Injured - Sakshi

న్యూఢిల్లీ:  వైష్టోదేవి యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు సజీవ దహనమవ్వగా..సుమారు 22 మంది గాయపడ్డారు. ఈ బస్సు కత్రా నుంచి జమ్మూకి వెళ్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. కత్రా నుంచి 1.5 కి.మీ దూరంలోని ఖర్మల్‌ సమీపంలో బస్సులో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు.

బస్సు ఇంజిన్‌ ప్రాంతం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు మొత్తం చుట్టుముట్టాయని వెల్లడించారు. ఇద్దరు మాత్రం అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో గాయపడిన 22 మందిని చికిత్స నిమిత్తం కత్రాకు తరలించామని, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని జమ్మూ ఏడీజీపీ తెలిపారు. ఫోరెన్సిక్‌ బృందం ఘటనా స్థలికి వచ్చి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

(చదవండి: లిఫ్ట్‌ పేరుతో టీచర్‌పై లైంగిక దాడి.. వీడియోలు తీసి ఆ తర్వాత.)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top