
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని వైష్ణో దేవి యాత్రా మార్గంలో ఎడతెరిపిలేకుండా వర్షం కురవడానికితోడు, అసురక్షిత పరిస్థితులు ఏర్పడిన కారణంగా వైష్ణో దేవి యాత్రను ఆరవరోజు (ఆదివారం) కూడా నిలిపివేశారు. ఈ పరిస్థితుల దృష్ట్యా మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర బోర్డు (ఎస్‌ఎంబీడీఎస్‌బీ)భక్తులు ఈ సమయంలో చేసిన అన్ని బుకింగ్‌లను రద్దు చేస్తూ, వారి సొమ్మును తిరిగి చెల్లించనున్నట్లు ప్రకటించింది.
వైష్ణోదేవి యాత్రా మార్గంలో కొండచరియలు విరిగిపడిన అనంతరం.. కాట్రా నుండి భవన్‌కు హెలికాప్టర్ సేవలు, భవన్ నుండి భైరోన్ ఘాటికి రోప్‌వే రైడ్‌లు, హోటల్ వసతి , ఇతర యాత్రా సంబంధిత బుకింగ్‌లన్నీ రద్దయ్యాయి. యాత్రికులు తమ వివరాలను refund@maavaishnodevi.net కు ఈ మెయిల్ చేయడం ద్వారా డబ్బుల వాపసుకు అభ్యర్థించవచ్చని పుణ్యక్షేత్ర బోర్డు‘ఎక్స్’లో తెలిపింది. వీటిని 15 రోజుల్లోపు ప్రాసెస్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
శుక్రవారం నుంచి కూడా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. త్రికూట కొండలపై పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి. యాత్ర పునఃప్రారంభంపై అధికారులు ఇంకా వెల్లడించలేదు. విపత్తు ఘటనపై దర్యాప్తునకు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ముగ్గురు ఉన్నత స్థాయి సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్‌కు జల్ శక్తి శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి షలీన్ కబ్రా నేతృత్వం వహిస్తారు. కొండచరియలు విరిగిపడటానికి గల కారణాలను గుర్తించడం, ముందు జాగ్రత్త చర్యలలో ఏవైనా లోపాలు ఉన్నాయో పరిశీలించడంలాంటివి తెలుసుకోవడం ఈ కమిటీకి బాధ్యత. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలను నివారించడానికి ఈ తరహా డేటా సేకరణ ఉపయుక్తం కానుంది. కమిటీ తమ నివేదికను రెండు వారాల్లోపు లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హాకు సమర్పించాల్సి ఉంటుంది.
All bookings cancelled with 100% refund till yatra is suspended. Send cancellation requests with details to refund@maavaishnodevi.net
Earlier self-cancellations will get pending refund within 15 days.
For queries, contact SMVDSB Call Centre @ 18001807212/ +91 9906019494.— Shri Mata Vaishno Devi Shrine Board (@OfficialSMVDSB) August 31, 2025