
యాత్రను పునరుద్ధరించాలని డిమాండ్
కత్రా/జమ్మూ: త్రికూల పర్వతాల్లో కొలువైన మాతా వైష్ణోదేవిని దర్శించుకునే భాగ్యం తమకు కల్పించాలని భక్తులు ధర్నాకు దిగారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగి పడుతున్న ఘటనలతో ముందుజాగ్రత్తగా జమ్మూకశీ్మర్ పాలనాయంత్రాంగం వైష్ణోదేవి యాత్రను గత 20 రోజులుగా నిలివేసిన నేపథ్యంలో విసుగుచెందిన యాత్రికులు, భక్తులు ధర్మాగ్రహం వెలిబుచ్చారు.
దేవీదర్శనం కోసం సుదూరాల నుంచి వచ్చాక తీరా త్రికూల పర్వతాల వద్ద హఠాత్తుగా ఆపేసి, యాత్రకు అర్థంతరంగా రద్దుచేయడంపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఆదివారం రేసీ జిల్లాలోని కత్రా బేస్‌క్యాంప్ వద్ద పెద్దసంఖ్యలో యాత్రికులు నిరసన చేపట్టారు. ఆలయం దిశగా ర్యాలీగా వెళ్తేందుకు భక్తులు ప్రయతి్నంచగా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఆలయబోర్డ్ ఆదేశాలను ఉల్లంఘించడానికి వీల్లేదని పోలీసులు తెగేసి చెప్పారు.
ఆలయానికి దారితీసే ప్రధాన ఘాట్‌రోడ్డు, దానికి అనుసంధానమైన రహదారుల వెంట భారీ వర్షాలు, పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిన పడటంతో మొత్తం ఘటనల్లో 34 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 20 మంది గాయపడ్డారు. దీంతో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వైష్ణోదేవి ఆలయ బోర్డ్ ఆగస్ట్ 26వ తేదీన యాత్రను నిలిపేసింది. అప్పటి నుంచి యాత్ర ఆగిపోయి ఆదివారానికి వరసగా 20 రోజులు పూర్తయింది.
సెపె్టంబర్ 14వ తేదీన యాత్రను పునరుద్ధరిస్తామని గతంలోప్రకటించినా ఆదివారం(సెప్టెంబర్ 14న) అది మొదలుకాలేదు. దీంతో రోజులతరబడి వేచి ఉండే ఓపికలేక భక్తుల్లో అసహనం, ఆగ్రహం పెల్లుబికింది. ‘‘రెండు నెలలపాటు పాదరక్షల్లేకుండా కాలినడకన కత్రా బేస్‌క్యాంప్‌దాకా వచ్చా. వీలైనంత త్వరగా దర్శనభాగ్యం దక్కుతుందని ఆశపడుతున్నా. పెద్దగుంపులుగా జనానఇన పంపిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తే చిన్న గుంపులుగా అయినా యాత్రను మొదలెడతే బాగుంటుంది’’అని మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన రాజీవ్ లోధీ అనే భక్తుడు అన్నారు.
‘‘19 రోజలతర్వాత 14వ తేదీన యాత్ర మొదలుకానుందని తెల్సి తమిళనాడు నుంచి కుటుంబంతో వచ్చా. తీరాచూస్తే యాత్ర పునరుద్ధరణ వాయిదాపడింది. మా క్షేమం కోరి యాత్రను ఆపేశారని తెలుసు. కానీ ఇంకెన్ని రోజులు వేచి ఉండాలో తెలీట్లేదు’’అని చెన్నైవాసి వినోద్‌కుమార్ అన్నారు. ‘‘ఏదేమైనా యాత్ర పూర్తిచేస్తాం. సస్పెండ్‌చేసే ఉద్దేశమే ఉంటే ఆన్‌లైన్ రిజి్రõÙ్టషన్ ఎందుకు మొదలెట్టారు?’అని ముంబై నుంచి వచి్చన రేఖ ఆగ్రహం వ్యక్తంచేశారు. దర్శనం చేసుకున్నాక వెనుతిరుగుతామని బిహార్ వాసి రాజ్‌కుమార్ స్పష్టంచేశారు.