Vaishno Devi Landslide: 30కి చేరిన మృతులు.. జమ్ముకశ్మీర్‌ అతలాకుతలం | Vaishno Devi Landslide: 30 Dead in Jammu & Kashmir as Heavy Rains Trigger Floods | Sakshi
Sakshi News home page

Vaishno Devi Landslide: 30కి చేరిన మృతులు.. జమ్ముకశ్మీర్‌ అతలాకుతలం

Aug 27 2025 10:16 AM | Updated on Aug 27 2025 10:52 AM

Vaishno Devi Yatra Route Landslide 30 Dead

శ్రీనగర్‌:  జమ్ముకశ్మీర్ అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. కాట్రాలోని  వైష్ణో దేవి ఆలయ సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 30కి చేరింది. కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.
 

ఆకస్మిక వరదలతో అతలాకుతలం
ఆగస్టు 14న కిష్త్వార్ జిల్లాలోని చిసోటిలో ఆకస్మిక వరదలు సంభవించడంతో 65 మంది మృతిచెందారు. వీరిలో  యాత్రికుల సంఖ్యే అధికంగా ఉంది. మంగళవారం దోడా జిల్లాలో భారీ వర్షాలకు నలుగురు మృతి చెందారు. కాట్రాలోని వైష్ణో దేవి మందిరం సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ నేపధ్యంలో వైష్ణో దేవి యాత్ర నిలిపివేశారు. ఆగస్టు 27 వరకు వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.


 

టెలికాం వ్యవస్థ బ్లాక్‌అవుట్
తుఫాను తీవ్రతకు రాష్ట్రంలో కీలకమైన మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. మొబైల్ టవర్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాలలో టెలికాం వ్యవస్థ పూర్తిగా బ్లాక్‌అవుట్ అయ్యింది. రవాణా నిలిచిపోయింది. జమ్ముశ్రీనగర్,  కిష్త్వార్-దోడ జాతీయ రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోయింది. తరచూ కొండచరియలు విరిగిపడుతుండటంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

రైలు సర్వీసులు రద్దు
భారీ వర్షాల కారణంగా జమ్మూకు బయలుదేరే పలు రైలు సర్వీసులను రద్దు చేశారు. తావి, చీనాబ్, ఉజ్,  తరానా నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రావి నదిపై ఉన్న మోధోపూర్ బ్యారేజీ నుండి లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేసిన దరిమిలా కథువా జిల్లాలో వరదలు సంభవించాయి. జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వరద పరిస్థితి తీవ్రంగా ఉన్నదని పేర్కొన్నారు. అత్యవసర సమావేశం నిర్వహించారు. బాధిత కుటుంబాలకు ఆహారం, నీరు మందులు, నిత్యావసరాలను సకాలంలో అందించాలని అధికారులను ఆదేశించారు.


 

ప్రభుత్వ,  ప్రైవేట్ పాఠశాలలు మూసివేత 
ఆగస్టు 27 వరకు కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో, అధికారులు ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేశారు. ముందుజాగ్రత్త చర్యగా జమ్ము డివిజన్‌లోని అన్ని ప్రభుత్వ,  ప్రైవేట్ పాఠశాలలను మూసివేశారు.బోర్డు పరీక్షలు నిలిపివేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement