
శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం, ఈ ఆలయం కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం, మోపిదేవి గ్రామంలో ఉంది.

ఇది తెలుగురాష్ట్రాలలో ప్రసిద్ధ సుబ్రహ్మణ్వేశ్వర స్వామి దేవాలయం.

కృష్ణానదీ తీరంలో వెలసిన మోపిదేవి పుణ్యక్షేత్రం ఒక్కసారి దర్శిస్తే వివాహం ఆలస్యం అయ్యేవారికి వారికి వివాహం జరిగి తీరుతుంది. అలాగే సంతానం లేని దంపతులు ఈ ఆలయంలో ఒక రాత్రి నిద్రిస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని విశ్వాసం.

మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పండగలు సుబ్రహ్మణ్య షష్టి మరియు రథోత్సవం మరియు ఉత్సవాలు ఆలయంలో ఘనంగా జరుగుతాయి.

నవగ్రహాలు మరియు నాగదేవతలు పురాణ గల వేపచెట్టు దర్శనం ఇస్తాయి. ఆ ప్రాంగణంలో గుడి గర్భాల్లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుడి వైపున దేవసేన అమ్మవారు. ఎడమ వైపున శ్రీ వల్లి అమ్మవారు దర్శనం ఇస్తారు.

విజయవాడ నుండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి, 64 కిలోమీటర్లు

గుంటూరు నుండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి , 82 కిలోమీటర్లు

రైలు మార్గం, విజయవాడ రైల్వే స్టేషన్ నుండి బస్సు లేదా టాక్సీ ద్వారా మోపిదేవి చేరుకోవచ్చు.











