
ఇక ప్రతి గుడి బడ్జెట్‌కు ప్రభుత్వ పర్యవేక్షణలో ఆమోదం
‘సాక్షి’ కథనానికి స్పందన
సాక్షి, హైదరాబాద్: దేవాదాయ శాఖ అ«దీనంలోని దేవాలయాల వార్షిక బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసే విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆలయాల బడ్జెట్ ప్రతిపాదనలన్నీ కచి్చతంగా ప్రభుత్వ పరిశీలనకు పంపాల్సిందేనని తాజాగా ఆదేశించింది. ఇక దేవాలయాల్లో రూ.10 లక్షలకు మించి ఖర్చు చేయాల్సిన ప్రతి పనికి ప్రభు త్వ ఆమోదం కూడా తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇంతకాలం డిప్యూటీ కమిషనర్లు, రీజినల్ జాయింట్ కమిషనర్లు, కమిషనర్ స్థాయిలో బడ్జెట్‌లను ఆమోదిస్తున్నా రు.
అయితే, కొందరు అధికారులు బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయాలంటే ఆలయ కార్యనిర్వహణాధికారులను కమీషన్ల కోసం వేధిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వారికి డబ్బులివ్వకుంటే బడ్జెట్ ప్రతిపాదనలను పెండింగులో ఉంచుతున్నారని కొన్ని ప్రధాన దేవాలయాల కార్యనిర్వహణాధికారులు ఆరోపిస్తున్నారు. వీటిపై ఫిర్యాదులు చేస్తే వేధిస్తారన్న భయంతో ఎక్కడా లిఖితపూర్వక ఫిర్యాదులు చేయట్లేదు. దీన్ని ఆసరా చేసుకుని అలాంటి అధికారులు మరింత చెలరేగిపోతున్నారు. అవినీతి అధికారుల వల్ల దేవాదాయశాఖకు చెడ్డపేరు వస్తోంది.
ఈ తీరుపై ఇటీవల ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ వివరాలు ఆరాతీసి చర్యలకు ఉపక్రమించారు. శాఖను అప్రదిష్టపాలు చేస్తున్న ఆరోపణలను ఆమె తీవ్రంగా పరిగణించారు. వెంటనే తీరు మారాలని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్‌ను ఆదేశించారు. ప్రభుత్వం దృష్టికి రాకుండా ఆలయాల బడ్జెట్‌లను అధికారులే మంజూరు చేయటం కూడా సరికాదని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈమేరకు తాజాగా దేవాదాయ శాఖ ప్రత్యేక సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం ఆమోదిస్తేనే నిధులు..
ప్రస్తుతం దేవాదాయ శాఖలో 6ఏ, 6బీ, 6 సీలుగా దేవాలయాలను వాటి ఆదాయం ప్రకారం విభజించారు. ఇందులో తక్కువ ఆదాయం ఉన్నవాటిని 6సీలో ఉంచారు. ఆదాయం ఎక్కువ ఉండే దేవాలయాల్లో 6బీ కేటగిరీలోని దేవాలయాల బడ్జెట్‌లను డిప్యూటీ కమిషనర్లు ఆమోదిస్తున్నారు. 6ఏ కేట గిరీ దేవాలయాల్లో రూ.25 లక్షల వరకు ఉండే బడ్జెట్‌లను రీజినల్ జాయింట్ కమిషనర్ ఆమోదిస్తున్నారు. అంతకంటే ఎక్కువుండే జాయింట్ కమిషనర్ స్థాయి దేవాలయాల బడ్జెట్‌లను కమిషనర్ ఆమోదిస్తున్నారు.
ఇకపై అన్ని దేవాలయా ల బడ్జెట్‌లను తొలుత నేరుగా ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రభుత్వం ఆమోదిస్తేనే అధికారులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసే అంశాలను తిరిగి మార్చాల్సి ఉంటుంది. దీంతో అధికారుల ఇష్టారాజ్యానికి కళ్లెం వేయొచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. అలాగే రూ.10 లక్షలను మించి ఖర్చయ్యే ప్రతి పనికి ఇక ప్రభుత్వం ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది.