భర్తను కోల్పోయిన స్త్రీలు..ఒక్కసారిగా తమ జీవితంలోకి తొగ్గి చూసిన శూన్యం మాదిరిగా నిస్తారంగా తమ లైఫ్‌ని లీడ్ చేస్తుంటారు. అది వారి వేషధారణలో సైతం ప్రస్పుటంగా కనిపిస్తుంది. కొందరూ ఆత్మవిశ్వాసంతో లేచి పుంజుకుంటారు. కొందరు సమాజం, కట్టుబాట్లకు తలొగ్గి తమ ఆశలను, కలల్ని చంపుకుని నిర్లిప్తంగా గడుపుతుంటారు. అలానే అన్నింటిని వదిలేసి..బతుకుతున్న ఆమె జీవితంలోకి మళ్లీ కాంతులు వచ్చేలా రంగులతో నింపింది కూతురు. సంతోషంగా ఇదివరకటి స్త్రీలా త్రుళ్లిపడుతూ ఉన్న ఆ దృశ్యం.. దూరమైన ఆమె భర్త సైతం ముచ్చటపడేలా అందంగా ఉంది.
ప్రగతి అనే సోషల్ మీడియా వినియోగదారు నెట్టింట ఒక వీడియో షేర్ చేసింది. అందులో ఆమె తాను వ్యక్తిగత విషయాలను పోస్ట్‌చేసే వ్యక్తిని కానని, ఈ రీల్ తన తల్లి కోసం అని పేర్కొంది. తన తల్లి నాన్న మరణంతో ఎరుపు రంగుకి పూర్తిగా దూరమైందని, ఎరుపు రంగు చీర గానీ డ్రెస్‌లుగానీ ధరించటమే మానేసిందని చెప్పుకొచ్చింది.
అయితే తాను ఈసారి తన తల్లి కోసం ఎరుపు రంగు చీరను కొని, కట్టుకోమని ఫోర్స్ చేసినట్లు వెల్లడించి. అయితే ప్రగతి ఎంతో బతిమాలాడగా ఆమె ఒప్పుకుంది. అందువల్లే ఈ రీల్‌ని పోస్ట్‌చేశానని వివరణ ఇచ్చింది. ఎందుకంటే చాల ఏళ్ల తర్వాత ఎరుపు రంగు చీరలో తాను ఎలా ఉన్నానే అనేది గుర్తుండిపోవాలి, ఆ బాధకరమైన రోజులు కళ్లముందు కానరాకూడదని ఇలా చేశానని భావోద్వేగంగా చెప్పుకొచ్చింది.
ఆమె తాను కొన్న ఎరుపు రంగులో అద్భుతంగా కనిపించడమే కాదు..ఆమె చేసిన ర్యాంపు వాక్ కూడా అదుర్స్ అని సంబరపడింది. విచిత్రం ఏంటంటే ఆ వీడియోలో పక్కనే ఓ ఫోటోఫ్రేమలో ఉన్న ప్రగతి తండ్రి కూడా ఈ దృశ్యాన్ని సంతోషిస్తున్నాడేమా అన్నట్లుగా ఉంద .
అంతేగాదు ఆ వీడియోలో చివరగా..అయినా స్వేచ్ఛను అనుమతి కింద పరిగణించకండి, ముఖ్యంగా మహిళలో విషయం అంటూ ప్రగతి విజ్ఞిప్తి చేయడం అందరీ హృదయాలను తాకింది. ఆ వీడియోని చూసిన చాలామంది నెటిజన్లు..మళ్లీ ఆమె తనకిష్టమైన ఎరుపు రంగుని స్వీకరించాక ఎంత అందంగానో కనిపిస్తోంది అని మెచ్చుకుంటూ..పోస్టులు పెట్టారు.
(చదవండి: బొద్దింక కాఫీ ..! ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదట..)


