గ్రాండ్‌గా డైరెక్టర్ మెహర్ రమేశ్ కూతురి పెళ్లి.. మెగాస్టార్, వెంకీమామ సందడి | Tollywood Director Meher Ramesh daughter Grand wedding reception | Sakshi
Sakshi News home page

Meher Ramesh: మెహర్ రమేశ్ కూతురి గ్రాండ్ వెడ్డింగ్.. టాలీవుడ్ తారల సందడి

Jul 1 2026 10:14 PM | Updated on Jul 2 2026 3:39 PM

Tollywood Director Meher Ramesh daughter Grand wedding reception

టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేశ్ కూతురు కృష్ణమోహన - అనిరుధ్ పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ సందడి చేశారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

కాగా.. చిరంజీవికి దగ్గర బంధువైన మెహర్ రమేశ్.. పూరీ జగన్నాథ్ దగ్గర తొలుత దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఆ టైంలోనే అంటే 2002లో రిలీజైన 'బాబీ' సినిమాలో నటించారు. ఎన్టీఆర్ 'ఆంధ్రావాలా'ని కన్నడలో పునీత్ రాజ్‌కుమార్‌తో 'వీర కన్నడిగ' అని తీసి దర్శకుడిగా పరిచమయ్యారు. మహేశ్ 'ఒక్కడు'ని 'అజయ్' పేరుతో కన్నడలో రీమేక్ చేసి మరో సూపర్ హిట్ కొట్టారు. అయితే ఎన్టీఆర్ 'కంత్రి'తో తెలుగులోకి మెహర్ రమేశ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. తర్వాత చేసిన శక్తి, షాడో, భోళా శంకర్ కూడా ఒకదానికి మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. ప్రభాస్‌తో తీసిన 'బిల్లా' మాత్రం ఆయనకు పేరు తీసుకొచ్చింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement