కోర్ట్ రీమేక్.. స్టార్ నటి వారసురాలి ఎంట్రీ..! | Actress Devayani daughter Entry into kollywood with Court Movie remake | Sakshi
Sakshi News home page

Devayani: కోర్ట్ రీమేక్.. హీరోయిన్‌గా దేవయాని కూతురు..!

Apr 6 2026 8:01 PM | Updated on Apr 6 2026 8:14 PM

Actress Devayani daughter Entry into kollywood with Court Movie remake

తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన మూవీ కోర్ట్. రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ కీలక పాత్రలో మెప్పించారు. ఇక్కడ సూపర్ హిట్‌ అయిన మూవీని కోలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. త్యాగరాజన్‌ డైరెక్షన్‌లో రంజన్ పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ మూవీతో సీనియర్ హీరోయిన్, నటి దేవయాని వారసురాలు ఎంట్రీ ఇస్తోంది. దేవయాని కుమార్తె ప్రియాంక ఈ సినిమాతో కోలీవుడ్‌లో అరంగేట్రం చేస్తోంది. ఈ సందర్భంగా మూవీ లాంఛ్‌కు హాజరైన దేవయాన్ని ఈ విషయాన్ని ప్రకటించింది. తన కూతురికి ‍అవకాశమిచ్చిన త్యాగరాజన్‌కు ధన్యవాదాలు తెలిపింది. తన కూతురు సినీ ఇండస్ట్రీలో రాణిస్తుందని దేవయాని ధీమా వ్యక్తం చేసింది.

కాగా.. నటి దేవయాని గురించి పరిచయం అవసరం లేదు. తమిళంలోనే కాకుండా తెలుగు తదితర భాషల్లోనూ హీరోయిన్‌గా నటించారు.  ఆ తర్వాత దర్శకుడు రాజకుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు పేరు ఇనియ, చిన్న కూతురు పేరు ప్రియాంక. ప్రస్తుతం తన చిన్న కుమార్తెను ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది. కాగా.. గతేడాది విడుదలైన 3 బీహెచ్‌కే సినిమాలో సిద్ధార్థ్ తల్లిగా దేవయాని కనిపించిన విషయం తెలిసిందే.
 

 

Advertisement
 
Advertisement
Advertisement