
సూర్యాపేట జిల్లా: మద్యం మత్తులో 12 నెలల చిన్నారి భవిజ్ఞని తండ్రి (వెంకటేష్) నేలకేసి కొట్టిన సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రియాంక కాలనీలో ఓ కసాయి తండ్రి 12 నెలల చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన సంఘటన కలకలం రేపుతుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
మద్యం సేవించి వచ్చిన భర్తను భార్య మందలిస్తున్న క్రమంలో చిన్నారి ఏడుస్తుండగా ఆగ్రహానికి గురైన తండ్రి వెంకటేష్ చిన్నారి భవిజ్ఞను రెండు కాళ్లు పట్టి నేలకేసి కొట్టడంతో తలలో తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అపస్మారక చితికి చేరుకుంది. ఇక కొన ఊపిరిలో ఉన్న పాపను తల్లి, ఆమె బంధువులు ఆసుపత్రికి తీసుకపోగా చికిత్స పొందుతున్న చిన్నారి ఆసుపత్రిలో మృతి చెందింది. హత్య చేసి పరారైన కసాయి తండ్రిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు. మద్యం మత్తులో 12 నెలల చిన్నారి (భవిజ్ఞ) మృతి చెందడంతో బంధువులు విలపిస్తున్న తీరు నలుగురిని కలిచివేసింది.
