డాక్టర్ బిడ్డ డాక్టర్ కావాలని, యాక్టర్ బిడ్డ యాక్టర్, వ్యాపారి బిడ్డ వ్యాపరే అవుతుందని సాధారణంగా భావిస్తుంటాం. తల్లిదండ్రుల వారసత్వాన్ని నిలబెట్టుకుని కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టనవారు కూడా చాలామందే ఉన్నారు. అయితే టీమీండియా స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానిగా ఆయన కుమార్తె క్రికెటర్‌గా రాణించాలనుకుంటున్నారా? మెరుపువేగంతో సెంచరీలు చేస్తూ, క్రికెట్ గ్రౌండ్‌లో తనదైన వ్యూహాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాలనుకుంటున్నారా? అయితే మీకో ఇంట్రస్టింగ్ న్యూస్. ధోని ముద్దుల తనయ పెరిగి పెద్దయ్యాక ఏం కావాలనుకుంటోందో తెలుసా?
ఎంఎస్ ధోనీ, సాక్షిల ఏకైక కుమార్తె జీవా. ఈ జంటకు 2010లో వివాహం జరగ్గా.. 2015లో జీవా జన్మించింది. భవిష్యత్తులో ఏం చేస్తావు అంటే పిల్లలు సాధారణంగా, డాక్టర్, యాక్టర్, టీచర్, పైలట్ ఇలాంటి సమాధానాలే చెబుతారు. కానీ ప్రకృతిని ప్రేమించి, ప్రకృతి శాస్త్రవేత్తను అవుతాను ధోనీ కుమార్తె చెప్పడం విశేషంగా నిలిచింది.
(రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్)
శుక్రవారం నాడు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చెందిన ఒక రాజకీయ నాయకుడితో జరిగిన సంభాషణలో, తాను పెద్దయ్యాక ప్రకృతి శాస్త్రవేత్త కావాలని కోరుకుంటున్నానని ఎంఎస్ ధోని కుమార్తె జీవా వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ధోని భార్య సాక్షీ, జీవా కాశీ పర్యటనలో ఉన్నట్టు తెలుస్తోంది. హర్ కి పౌరి ప్రాంతం సమీపంలోని మరొక వీడియోలో, సాక్షి మరియు ఇతరులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య స్థానికులకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు చూపించారు. వారి సందర్శనల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గంగా సభ కార్యదర్శి తన్మయ్ వశిష్ఠ ఈ వీడియోను అప్‌లోడ్ చేశారు. 10 ఏళ్ల చిన్నారికి ఇలాంటి కోరిక ఉండటం చాలా ఆనందం అంటూ ప్రశంసించారు.భవిష్యతుల్లో మంచి మనిషిగా రాణిస్తుంది అంటూ దీవించారు నెటిజన్లు.
I want to become Naturalist : Ziva Dhoni #MSDhoni pic.twitter.com/r0gqRiLrEu
— Chakri (@ChakriDhonii) October 25, 2025


