బర్త్‌డే అంటే వయసుతో నిమిత్తం లేకుండా అందరమూ చిన్నపిల్లలైపోతాం. చిన్న వయసులో బర్త్‌డే అంటే ఎదుగుతున్నామన్న సంతోషం అటు తల్లిదండ్రుల్లోనూ, ఇటు పిల్లల్లోనూ ఉండటం సహజం. ఒక సంవత్సరం వయసు పెరుగుతోందన్న బెంగ లేకుండా పెద్దలు కూడా ఈ పుట్టిన రోజును జరుపుకోవడం విశేషం. అంత స్పెషల్ పుట్టిన రోజు. ఈ వేడుకల్లో ఇష్టమైన బట్టలు, ప్రదేశాలు, కోరికలు ఇలా చిట్టా చాలానే ఉంటాయి. కానీ మనకిష్టమైన వాళ్లు, మనకిష్టమైన వంటకాలను అదీ ఇంట్లో వండితే బాగా గుర్తుండిపోతాయి. దీన్నేకంటెంట్ క్రియేటర్ బర్త్‌డేని ఆమె తల్లి ఫుడీగా నిర్వహించింది. అదేంటో చూద్దాం.
కంటెంట్ క్రియేటర్ సారా సరోష్ 27వ పుట్టినరోజును ఆమె కుటుంబంగా వినూత్నంగా జరుపుకుంది. ఆమె 27 ఏళ్లను గుర్తు చేసుకుంటూ ఆమె తల్లి ఒకటీ రెండు కాదు, ఏకంగా 27 రకాల వంటకాలను తయారు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఈ క్లిప్ పుట్టినరోజు అమ్మాయి తన ఇంట్లోకి ప్రవేశించడంతో ప్రారంభమవుతుంది, ఈ రూమ్ అంతా అద్భుతమైన అలంకరణలతోపాటు, టేబుల్‌పై అమర్చిన పదార్థాలు చూసి ఆశ్చర్యపోవడం బర్త్‌డే గార్ల్ వంతైంది.
అలాగే కుటుంబ సభ్యులందరూ రకరకాల ఆహార పదార్థాలు టేబుల్‌పై అమర్చడానికి ముందు వాటిని తయారు చేయడం, చివరి నిమిషంలో కొన్ని వంటకాలను, తల్లి తయారు చేస్తున్న దృశ్యాలను వీడియోలో చూడొచ్చు. వావ్.. 27 ఏళ్లకు 27 వంటకాలు, నా బర్త్‌డేకి బెస్ట్ గిఫ్ట్ థ్యాంక్యూ అమ్మా...ఎప్పటికీ నువ్వే మా అమ్మ అంటూ సారా తన సంతోషాన్ని వెలిబుచ్చింది.
ఈ విందులో వివిధ రకాల ఫ్రైడ్ చికెన్ ముక్కలు, వింగ్స్, చిన్న సమోసాలు, పినా కోలాడా,రస్నా గ్లాసులు ఉన్నాయి. సలాడ్‌లు, పాస్తాలు, ఇతర డిషెస్ ఉన్నాయి. టేబుల్ మధ్యలో ఫ్రాస్టింగ్‌తో కూడిన గుండ్రని చాక్లెట్ కేక్ ఉంది, దాని పక్కనే ప్రాన్ సుషీ, ప్రాన్ ఫ్రై, దహీ కే కబాబ్, స్టఫ్డ్ పొటాటోస్, తందూరి ప్రాన్స్ , చికెన్ షెజ్వాన్ వంటి వంటకాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: 26..26 : ప్రేమకు కొత్త అర్థం చెప్పిన ప్రియుడు, వైరల్ వీడియో
దీనిపై నెటిజన్లు కూడా తమ ఆనందాన్ని ప్రకటించారు. ఇంత అద్భుతమైన తల్లిదండ్రులున్నందుకు నువ్వు చాలా అదృష్టవంతు రాలివి అంటూ సారాను దీవించారు. తల్లి ప్రేమ అంటే ఇలానే ఉంటుంది. ఈ వంటకాల గురించి తెలుసుకోవాలని ఉంది అని ఒకరు, ఇది ఏఐ పిక్‌లా ఉంది అని మరొకరు చమత్కరించారు.
ఇదీ చదవండి: గడ్డకట్టిన సరస్సులో : గుండెలు పగిలే విషాదం వీడియో వైరల్


