అరుణాచల్ ప్రదేశ్‌లో పండగ వేళ విషాదం చోటు చేసుకుంది. తవాంగ్ జిల్లాలోని సేలా గడ్డకట్టిన సరస్సులోజారిపడి కేరళకు చెందిన ఇద్దరు పర్యాటకులు మునిగిపోయారు. గౌహతి మీదుగా తవాంగ్‌కు వచ్చిన ఏడుగురు మిత్ర బృందంలో మహాదేవ్ సరస్సులో దిగి ఇద్దరు ప్రాణాలుకోల్పోవడంతో అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు.
పోలీసుల సమాచారం ప్రకారం, శుక్రవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాలో గడ్డకట్టిన సెలా సరస్సులో కేరళకు చెందిన ఇద్దరు పర్యాటకులు జారిపడిమరణించారు. ఒకరి మృతదేహం లభించింది, మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది.
గడ్డకట్టిన సరస్సులో మహాదేవ్ (24) జారిపడి మునిగిపోతూ ఉండటాన్ని గమనించిన స్నేహితుడు దీను, మరొకరు మహాదేవ్ సరస్సులోకి దిగాడు. మూడో పర్యాటకుడు సురక్షితంగా బయటకు రాగలిగినప్పటికీ, మిగిలిన ఇద్దరూ కొట్టుకుపోయారు. బాధితుడు దీను (26)గా ఆచూకీ ఇంకా లభించలేదని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి.డబ్ల్యూ.థోంగాన్ తెలిపారు. రెండో పర్యాటకుడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోందన్నారు.
Heartbreaking tragedy 💔
Frozen lakes can be highly deceptive and extremely dangerous.
Two Kerala tourists drowned after slipping into frozen Sela Lake in Arunachal Pradesh’s Tawang district. One body recovered, search continues.
pic.twitter.com/N16EeuFCYw— Manas Muduli (@manas_muduli) January 17, 2026
ఈ సంఘటనతో పర్యాటకులు గడ్డకట్టిన సరస్సులపై జాగ్రత్త వహించాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. గడ్డకట్టిన సరస్సులపై నడవవద్దని సందర్శకులకు స్పష్టంగా సూచిస్తూ సేలా సరస్సు, ఇతర పర్యాటక ప్రదేశాలలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. గడ్డకట్టిన సరస్సులు, లేక్‌లు సురక్షితం కాదని, మంచు అస్థిరంగా ఉండవచ్చని , మానవ బరువును మోయలేకపోవచ్చని పర్యాటకులను హెచ్చరిస్తూ జిల్లా యంత్రాంగం డిసెంబర్‌లో ఒక సలహా జారీ చేసిందని ఆయన తెలిపారు.

సేలా సరస్సు ప్రాముఖ్యత
సముద్ర మట్టానికి 13,700 అడుగుల ఎత్తులో ఉండే సేలా ఒక అందమైన, పవిత్రమైన సరస్సు ఇది శీతాకాలంలో మంచుతో గడ్డకట్టుకుపోయి అద్భుతమైన దృశ్యాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కటి ప్రకృతి అందాలను వీక్షించేందుకు ఈ సీజన్‌లో పర్యాటకులు అక్కడికి క్యూకడతారు. కానీ తీవ్రమైన చలి , మంచు పొర కారణంగా శీతాకాలంలో ఇది తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుంది. 1962 లో భారత చైనా యుద్ధం సందర్భంలో, అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన నూరనాంగ్ యుద్ధంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికుడు, 72 గంటలు ఆకలిదప్పులతో ఉండి,300 మంది చైనీయులను మట్టుబెట్టి వీర మరణం పొందిన జస్వంత్ సింగ్ రావత్‌కు సహాయం చేస్తూ మరణించిన ‘‘సెలా" అనే మహిళ పేరును దీనికి పెట్టినట్టు చెబుతారు.


