'ఎంత ఎత్తుకు ఎదిగినా నాకు చిట్టి తల్లివే'.. మంచు లక్ష్మీ ఎమోషనల్ | Tollywood actress Manchu Lakshmi Emotional Post about Her Daughter | Sakshi
Sakshi News home page

Manchu Lakshmi: 'నా జీవితంలో లభించిన గొప్ప వరం నువ్వే..'మంచు లక్ష్మీ ఎమోషనల్

Mar 24 2026 6:40 PM | Updated on Mar 24 2026 7:12 PM

Tollywood actress Manchu Lakshmi Emotional Post about Her Daughter

టాలీవుడ్ నిర్మాత, నటి మంచు లక్ష్మీ ఇటీవలే తన కూతురి హాఫ్ శారీ వేడుక గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో మంచు మనోజ్ దంపతులు పాల్గొని సందడి చేశారు. తన మేన కోడలిని విద్యా నిర్వాణను చూసి మనోజ్ మురిసిపోయారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను ఎల్లప్పుడు నీ వెంటే ఉంటానంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

తాజాగా మంచు లక్ష్మీ తన కూతురిని తలచుకుంటూ మరో పోస్ట్ చేసింది. నువ్వు ఇంత అందమైన అమ్మాయిగా ఎదగడం చూసి నా హృదయం ఆనందంతో నిండిపోయిందని ట్వీట్‌లో రాసుకొచ్చింది. నీ దయ, సౌమ్యత, ఆప్యాయత, చిరునవ్వు, విశ్వసనీయత.. నిన్ను 'నువ్వు'గా నిలబెట్టే ఆ సహజమైన చలాకీతనం వీటన్నింటికీ నువ్వే ఒక ప్రత్యక్ష రూపం అంటూ కుమార్తె విద్యా నిర్వాణపై తల్లిగా తన ప్రేమను చాటుకుంది.

మంచు లక్ష్మీ తన పోస్ట్‌లో రాస్తూ..'యాపిల్.. నిన్ను ఇంత అందమైన అమ్మాయిగా చూడటం నా హృదయాన్ని వర్ణించలేని ఆనందం. ఆ ఆప్యాయత, చిరునవ్వు, విశ్వసనీయత... నిన్ను నువ్వుగా నిలబెట్టే ఆ సహజమైన చలాకీతనం.. వీటన్నింటికీ నువ్వే ఒక ప్రత్యక్ష రూపం. నువ్వు ఎదుగుతుండగా గడిపిన ప్రతి క్షణం నా జీవితంలో లభించిన గొప్ప వరాలలో ఒకటి. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత దూరాలకు వెళ్లినా సరే... నా హృదయంలో మాత్రం నువ్వు ఎప్పటికీ నా చిట్టి తల్లివే... సదా ఎల్లప్పుడూ నా కంటి పాపవే' అంటూ భావోద్వేగానికి గురైంది. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement