Half Saree
-
'ఎంత ఎత్తుకు ఎదిగినా నాకు చిట్టి తల్లివే'.. మంచు లక్ష్మీ ఎమోషనల్
టాలీవుడ్ నిర్మాత, నటి మంచు లక్ష్మీ ఇటీవలే తన కూతురి హాఫ్ శారీ వేడుక గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో మంచు మనోజ్ దంపతులు పాల్గొని సందడి చేశారు. తన మేన కోడలిని విద్యా నిర్వాణను చూసి మనోజ్ మురిసిపోయారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను ఎల్లప్పుడు నీ వెంటే ఉంటానంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.తాజాగా మంచు లక్ష్మీ తన కూతురిని తలచుకుంటూ మరో పోస్ట్ చేసింది. నువ్వు ఇంత అందమైన అమ్మాయిగా ఎదగడం చూసి నా హృదయం ఆనందంతో నిండిపోయిందని ట్వీట్లో రాసుకొచ్చింది. నీ దయ, సౌమ్యత, ఆప్యాయత, చిరునవ్వు, విశ్వసనీయత.. నిన్ను 'నువ్వు'గా నిలబెట్టే ఆ సహజమైన చలాకీతనం వీటన్నింటికీ నువ్వే ఒక ప్రత్యక్ష రూపం అంటూ కుమార్తె విద్యా నిర్వాణపై తల్లిగా తన ప్రేమను చాటుకుంది.మంచు లక్ష్మీ తన పోస్ట్‌లో రాస్తూ..'యాపిల్.. నిన్ను ఇంత అందమైన అమ్మాయిగా చూడటం నా హృదయాన్ని వర్ణించలేని ఆనందం. ఆ ఆప్యాయత, చిరునవ్వు, విశ్వసనీయత... నిన్ను నువ్వుగా నిలబెట్టే ఆ సహజమైన చలాకీతనం.. వీటన్నింటికీ నువ్వే ఒక ప్రత్యక్ష రూపం. నువ్వు ఎదుగుతుండగా గడిపిన ప్రతి క్షణం నా జీవితంలో లభించిన గొప్ప వరాలలో ఒకటి. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత దూరాలకు వెళ్లినా సరే... నా హృదయంలో మాత్రం నువ్వు ఎప్పటికీ నా చిట్టి తల్లివే... సదా ఎల్లప్పుడూ నా కంటి పాపవే' అంటూ భావోద్వేగానికి గురైంది. Apple...Watching you blossom into such a beautiful young girl fills my heart with a joy I can’t even put into words. You are the very embodiment of kindness, gentleness, warmth, laughter, loyalty, and that effortless spark of sass that makes you you.Every moment of watching… pic.twitter.com/smHR7J6HZ8— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 24, 2026 -
'మామయ్య ఎల్లప్పుడు నీ వెంటే ఉంటారు'.. మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్
మంచువారి ఇంట ఇటీవలే శుభకార్యం జరిగింది. టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ ప్రసన్న కూతురు విద్యా నిర్వాణ హాఫ్ శారీ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో హీరో మంచు మనోజ్ దంపతులు కూడా పాల్గొన్నారు. తన కోడలి ఓణీ వేడుకలో పాల్గొని సందడి చేశారు. తాజాగా ఈ ఫంక్షన్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. దేవుడు నాకేమిచ్చాడని అడిగితే.. అందులో మా సిస్టర్ కూడా ఒకరని భావోద్వేగ పోస్ట్ చేశారు. ఆమె నాకు ఎల్లప్పుడు ప్రేమను, ఆప్యాయతను, బలాన్ని ఇస్తుందని రాసుకొచ్చాడు.మంచు మనోజ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..' దేవుడు నాకిచ్చిన వాళ్లలో మా సిస్టర్ కూడా ఒకరు. ఆమె నాకు నిరంతరం ప్రేమ, ఆప్యాయత, బలాన్ని ఇచ్చింది. తనకు కూడా అదే ప్రేమను తిరిగి ఇవ్వాలన్న కోరిక నాలో ఎప్పుడూ ఉండేది. చిన్నారి విద్యా నిర్వాణ మా జీవితాల్లోకి అడుగుపెట్టినప్పుడు అద్భుతమైన అవకాశం వచ్చింది. తనకు మామగా నా ప్రయాణం మొదలైంది. విద్యా నిర్వాణకు మామగా ఉండటం కేవలం ఒక బిరుదు కాదు.. అది మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి. తన రక్షకుడిగా, స్నేహితుడిగా, మార్గదర్శిగా, ఊహించనంత ప్రేమను ఇవ్వాలని కోరుకునే వ్యక్తిగా మను మామ, అత్త, ధైరవ్, దేవసేన ఎల్లప్పుడూ నీకు అండగా ఉంటారు. నేను నీకు కనిపించనప్పుడు కూడా సున్నితమైన హృదయంతో ఈ ప్రపంచాన్ని జయించు. నీకు బలంగా, నీకు అండగా, నిశ్శబ్దంగా నీ వెనుక నిలబడతా.. లవ్ యూ నా బంగారు తల్లి ' అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
లేటెస్ట్ లంగా ఓణి..! బుట్టబొమ్మల్లా అమ్మాయిలు..
ఫ్యాషన్‌లో ఎన్నో డిజైన్స్ మనల్ని పలకరిస్తుంటాయి. అంతే వేగంగా ఆ డిజైన్స్ కనుమరుగవుతుంటాయి. కానీ, మనదైన సంప్రదాయ దుస్తుల్లో అమ్మాయిల అలంకరణలో భాగమైన హాఫ్ శారీ అబ్బాయిల అలంకరణలో ధోతీ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచే ఉంటాయి. హాఫీ శారీ వేడుక టీనేజ్‌ను దాటేస్తూ ముందుకు వెళ్లి అమ్మాయి జ్ఞాపకాలలో నిలిచే అందమైన రోజవుతుంది. హైదరాబాద్ డిజైనర్ భార్గవి కూనమ్ హాఫ్ శారీస్ డిజైన్స్‌లో వస్తున్న గ్రాండ్‌లుక్‌ని ఇటీవల మరింత ఆకర్షణీయంగా ఆవిష్కరించారు. ‘‘తెలుగింటి సంప్రదాయంలో పెళ్లి ముఖ్యమైన వేడుక. అంతే వేడుకగా ఒకమ్మాయి జీవితంలో కుటుంబసభ్యులందరూ కలిసి పండగలా జరుపుకునేది హాఫ్ శారీ ఫంక్షన్. ఇటీవల పెళ్లికి చేసిన విధంగానే హాఫ్‌శారీ ఫంక్షన్‌ను హల్దీ, మెహందీ .. అంటూ నాలుగు రోజుల పాటు సెలబ్రేషన్స్ చేస్తున్నారు. పన్నెండేళ్ల లోపు అమ్మాయిలకు చేసే ఈ వేడుకలో బుట్టబొమ్మలా కనిపించే అమ్మాయిలపైనే అందరి దృష్టి ఉంటుంది. తల్లిదండ్రులకు కూడా తమ కూతుళ్లను ఆ విధంగా చూసుకోవడానికి చాలా సంతోషిస్తుంటారు. మన చేనేతలుబెనారస్, కంచి, పైథాని పట్టు, చికంకారి జరీ కోటా .. తో చేసిన హాఫ్ శారీ, ధోతీ డిజైన్స్ ఇవి. లైట్ కలర్స్‌కి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ పట్టు, కోటా ఫ్యాబ్రిక్ ఉపయోగించాం. జరీ వర్క్‌తో చేసిన హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేనేతలకు మరింత గ్రాండ్ లుక్ వచ్చింది. అంటే చేనేతలు – ఎంబ్రాయిడరీ– ఆభరణాలతో కలిపి చేసిన క్రియేటివ్ జర్నీ ఇది. ఆభరణాల మార్క్హాఫ్ శారీస్‌కు ఆభరణాల కాంబినేషన్ కూడా అత్యంత ముఖ్యమైనది. ఆకర్షణీయమైన లుక్ క్రియేట్ చేయడానికి పట్టు– జ్యువెలరీతో కలిసి చేసిన కాంబినేషన్ వర్క్ ఇది. లంగాఓణీ కాంబినేషన్ డ్రెస్ మనదైన సంప్రదాయ డ్రెస్ కాబట్టి, దీనికి మన సౌత్ ఇండియన్ టెంపుల్ జ్యువెలరీ బాగా నప్పుతుంది. ఎంబ్రాయిడరీని మ్యాచ్ చేస్తూ పెద్ద పెద్ద హారాలు, డైమండ్ జ్యువెలరీతో మరిన్ని హంగులను తీసుకువచ్చాం’’ అని వివరించారు భార్గవి కూనమ్. (చదవండి: బనారసీ పట్టు చీరలో నీతా అంబానీ..! 50 ఏళ్ల నాటి..) -
హాఫ్ శారీకే అందం తెచ్చిన ‘బుజ్జితల్లి’ (ఫొటోలు)
-
క్యూట్‌గా మెరిసిపోతున్న 'బిగ్ బాస్' ఫేమ్ అమర్ దీప్ సతీమణి తేజశ్విని (ఫోటోలు)
-
యాంకర్ సుమ గ్లామర్ సీక్రెట్ ఏంటో? రోజురోజుకీ మరింత అందంగా! (ఫొటోలు)
-
Tejaswini Gowda: సీతామహాలక్ష్మిలా మురిపిస్తోన్న బుల్లితెర నటి (ఫోటోలు)
-
ఎవర్ గ్రీన్ సుమ.. లంగా ఓణీలో మరింత క్యూట్ (ఫొటోలు)
-
కలర్‌ఫుల్ లంగావోణీలో యాంకర్ సుమ లుక్స్.. ఫోటోలు
-
లంగా ఓణీలో అదిరిపోయిన రాశి సింగ్ (ఫోటోలు)
-
‘బుట్టబొమ్మ’ వేసుకున్న లంగావోణీ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
బుట్టబొమ్మ’ గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనిఖా సురేంద్రన్.. మలయాళంలో కుట్టి నయన్‌గా చాలా ఫేమస్. ప్రేక్షకులు ఇప్పుడు ఆ పేరును మరచిపోయేలా తనకంటూ ఓ యూనిక్ స్టయిల్‌ను క్రియేట్ చేసుకుంది. అదే ఫ్యాషన్‌లోనూ చూపిస్తోంది.. ఇలా.. స్టయిల్ అనేది ఒక పర్సనల్ చాయిస్. ఎవరి స్టయిల్ వారికి ఉంటుంది. ఎక్కువ స్కిన్ షో చేయకుండా.. కంఫర్ట్ దుస్తులతో కనిపించడం నా స్టయిల్ అని అంటోంది అనికా సురేంద్రన్ ఏఆర్ సిగ్నేచర్ బై అనూష రెజి.. ఆధునిక మహిళ అభిరుచి, అవసరాలను గమనించి వాటికనుగుణమైన డిజైనర్ వేర్‌ను రూపొందించేందుకు ఏర్పడిన బ్రాండే ‘ఏఆర్ సిగ్నేచర్’. బెంగళూరుకు చెందిన అనూష రెజి ప్రారంభించిన ఈ బ్రాండ్.. స్టయిల్ అండ్ సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తూ దక్షిణాది రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం సెలబ్రిటీలకు వారి డిజైన్స్ అందిచడమే కాకుండా, దేశం నలుమూలల నుంచి ఆర్డర్లు అందుకుంటోంది. ధరలు మోస్తారు రేంజ్లో ఉంటాయి. కేవలం ఆన్లైన్లో ఆర్టర్ ఇచ్చి మాత్రమే కొనుగోలు చేయొచ్చు. ఇక్కడ అనిఖా సురేంద్రన్ ధరించిన ఏఆర్ సిగ్నేచర్ బై అనూష రెజి ధర రూ. 1,56,000 జోయ్ అలుక్కాస్.. కేరళలో.. 1956లో అలుక్కా జోసెఫ్ వర్గీస్.. చిన్న దుకాణంతో ఆభరణాల వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. నేడు అది కోట్ల సామ్రాజ్యంగా ఎదిగింది. బంగారు ఆభరణాల వ్యాపారంలో ఈ సంస్థది 67 సంవత్సరాల అనుభవం. ఇప్పుడు ఈ వ్యాపారాన్ని వారి మూడోతర ం, నాలుగోతరం వారసులు నడిపిస్తున్నారు. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఈ సంస్థకు హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ వంటి ప్రముఖ నగరాలతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా పదకొండు దేశాల్లో సుమారు 150 బ్రాంచీలు ఉన్నాయి. ఐతే జోయ్ అలుక్కాస్ బ్రాండ్ ధర మాత్రం ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. -
సకల శుభాల శోభ
ఉగాది రావడంతోనే వేసవి మనకు పరిచయం అవుతుంది. షడ్రుచులతో కొత్త చిగురుల సందడి మొదలవుతుంది.సకల శుభాలను మోసుకువచ్చే ఉగాదికి సకల హంగులూ అద్దేవి మన చేనేతలే. పండగ రోజులే కాకుండా వేసవి మొత్తం కాటన్ డ్రెస్సులతోనే కలర్ఫుల్గా కనిపించడం ఎలాగా అని ఆలోచించేవారికి సరైన ఎంపికతోనే సిద్ధంగా ఉన్నాయి. అచ్చతెలుగు అమ్మాయిలా లంగాఓణీలో కనిపించాలనుకున్నా, లెహంగాలో గ్రాండ్ లుక్‌తో మెరిసి΄ోవాలన్నా, చుడీదార్‌తో ఆధునికం అనిపించాలన్నా, చీర అంచుతోనే అందాన్ని చుట్టేయాలన్నా మన చేనేతలు ఎప్పుడూ అగ్రభాగాన ఉంటాయి. పట్టుకున్నప్రా ముఖ్యత కాటన్స్కు లేదు అనుకునేవారికి సరైన ఎంపిక అవుతున్నాయి. వాటిలో ఖాదీ, మంగళగిరి, ఇక్కత్, నారాయణపేట్, గద్వాల్, వెంకటగిరి... వంటి కాటన్ హంగులు తీరైన నిండుదనాన్ని తీసుకువస్తున్నాయి. ప్రతిరోజూ పండగే అనిపించే శోభను మోసుకువస్తున్నాయి. ఈ వేసవిని శోభకృతుతో ఇంపైన కళగా మార్చేద్దాం. -
చీరకట్టులో మెస్మరైజ్ చేస్తున్న అందాల స్నేహ (ఫొటోలు)
-
Half Saree: వేడుక వేళ సంప్రదాయ కళ
మహమ్మారి కారణంగా ఇన్నాళ్లూ కొంచెం వెనకంజ వేసినా.. పండగలు, వ్రతాలు, పెళ్లిళ్లు అంటూ ఇప్పుడిప్పుడే సందడి మొదలయ్యింది. వేడుకల వేళ వైవిధ్యంగా వెలిగిపోవాలంటే లంగా ఓణీ జోడీ కట్టాల్సిందే. ఆధునికపు హంగులు కోరుకునే నవతరమైనా సంప్రదాయ కట్టుతో మెరిసిపోవాల్సిందే! వేడుకల్లో మనదైన మార్క్ కనిపించాలంటే కొంచెం వినూత్నంగా ఆలోచించవచ్చు. ప్లెయిన్ లెహంగా మీద లైట్‌వెయిట్ పట్టు శారీని ఓణీలా కట్టుకోవచ్చు. ముదురు ఎరుపు, పసుపు, పచ్చ, నీలం వంటి రంగుల ఎంపిక, టెంపుల్ జ్యువెలరీతో చక్కని సంప్రదాయ కళ తీసుకురావచ్చు. కంచిబార్డర్ను హాఫ్‌వైట్ గోల్డ్ టిష్యూ ఫ్యాబ్రిక్ జత చేసిన లెహంగా, అంచులు ఎంబ్రాయిడరీ చేసిన ఓణీ, మగ్గం వర్క్ బ్లౌజ్.. ఈ పర్పుల్ కాంబినేషన్ వేడుకకు వన్నెతెస్తుంది. కలంకారీ సిల్క్ ఫ్యాబ్రిక్‌కి కంచిబార్డర్ జత చేసి, అదే రంగు మగ్గం వర్క్ బ్లౌజ్, కాంట్రాస్ట్ దుపట్టా వేయడంతో మంచి కళ వచ్చేసింది. వేడుకలకు ఈ కాంబినేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్లెయిన్ హాఫ్‌వైట్ రాసిల్క్ మెటీరియల్పైన ఎంబ్రాయిడరీ వర్క్ చేసి డిజైన్ చేసిన లెహంగా. మగ్గం వర్క్ చేసిన రెడ్ కలర్ ట్యునిక్, నెటెడ్ దుపట్టాతో సంప్రదాయ కట్టుతోనే ఆధునికపు హంగులు తీసుకురావచ్చు. సంప్రదాయ డ్రెస్సులోనే ఆధునికంగా కనిపించాలనుకుంటే ఫిష్‌కట్ లెహంగాలు సెట్అవుతాయి. ఫ్లోరల్ ప్రింట్ ఉన్న రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన లెహంగా, జర్దోసీ వర్క్ చేసిన షార్ట్ స్లీవ్స్ బ్లౌజ్, నెటెడ్ ఓణీ ముచ్చటైన కాంబినేషన్‌గా ఆకట్టుకుంటుంది. - రజితారాజ్ రావుల డిజైనర్, హైదరాబాద్ -
‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు
-
త్రీ ఫోర్త్ శారీ
హాఫ్ శారీ కాదు...ఫుల్ శారీ కాదు... ఇది త్రీ ఫోర్త్ శారీ! లంగా ఓణీ కాంబినేషన్‌ని హాఫ్ శారీ అని ముచ్చటగా పిలుస్తాం. చీర కట్టును ఫుల్ శారీ అని హుందాగా చెబుతాం. ఈ రెండింటి నడుమ ఇప్పుడు మరో స్టైల్ వచ్చింది. అదే త్రీ ఫోర్త్ శారీ! పొడవాటి లెహంగా లేదా పొట్టి స్కర్ట్ ధరించి దాని మీద అదే కాంబినేషన్ లేదా కాంట్రాస్ట్ చీరను మోకాలు కింది వరకు లెహెంగా కనిపించేలా కట్టాలి. ఇది కాటన్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో హైలైట్ అయిన స్టైల్. ఇతరత్రా అలంకరణలు అవసరం లేదు. కావాలనుకుంటే ఫంకీ ఫ్యాషన్ జువెల్రీని అలంకరించుకోవచ్చు. – నిఖిత, డిజైనర్,ఇన్స్టిట్యూటో డిజైన్ ఇన్నోవేషన్ -
హాఫ్ శారీ.. ఫుల్స్టైల్...
బామ్మల నాటి స్టైల్ మళ్లీ నేడు మన అమ్మాయిల మతులు పోగొట్టడానికి రెడీ అయ్యింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనిిపిస్తూనే నయా స్టైల్ మార్కులు కొట్టేస్తోంది. అదే హాఫ్ శారీ. పెళ్లికెళ్లాలన్నా, కాలేజీ పార్టీలకు కలర్‌ఫుల్ లుక్ తేవాలన్నా ఫుల్స్టైల్ డ్రెస్ హాఫ్ శారీనే! ఎండాకాలం లంగాఓణీలా..! అని భయపడేవారికి సరికొత్తగా మరింత సౌకర్యవంతంగా ఆకట్టుకుంటున్నాయి ఈ లంగాఓణీలు. ఫ్యాషన్ దుస్తులలో కొంతకాలంగా నెటెడ్ ఫ్యాబ్రిక్ సృష్టించిన హంగామా చూశాం. వెల్వెట్ మెరుపులూ తెలుసుకున్నాం. ఇప్పుడు వాటి స్థానాన్ని పట్టు హంగులు కొట్టేశాయి. బెనారస్ మెరుపులు హల్ చల్ చేస్తున్నాయి. మగువలు తమ సింగారాన్ని మెత్తనైన పట్టుతో సంప్రదాయపు, ఆధునికపు వేడుకలకు ఇలా అందంగా అమరే క్లాసిక్లుక్తో మార్చేయవచ్చు. ఇంతకాలం కాంట్రాస్ట్ కలర్స్ ఇంపుగా అనిపించేవి. దీంతో ఇవే మన దక్షిణ భారతీయ ఫ్యాషన్లలో హల్చల్ చేశాయి. ఇప్పుడిక చాలా క్లోజ్డ్ కలర్స్(దగ్గరగా ఉండేవి) అంటే ఉదాహరణకు ఎరుపులో మరికొన్ని షేడ్స్‌ను తీసుకోవచ్చు. ఎరుపు, నారింజ, ముదురు ఎరుపు.. ఇలా తీసుకుంటూ వాటికి బంగారు జరీ పెద్ద అంచులను జత చేర్చి దుస్తులను డిజైన్ చేయడం వల్ల ఒక క్లాసిక్ లుక్ వస్తుంది. పెద్ద పెద్ద మోటిఫ్స్ సెల్ఫ్ ఎంబ్రాయిడరీ ఈ తరహా లుక్‌కి బాగా నప్పుతాయి. ఏ రంగు ఫాబ్రిక్ తీసుకున్నా దానికి పెద్ద పెద్ద జరీ అంచులను జతగా చేస్తే రిచ్ లుక్ వస్తుంది. అన్నీ డిజైనర్ లుక్‌తో ఆకట్టుకోవాలనే అత్యాశకు పోతే గాఢీ లుక్‌తో ఎబ్బెట్టుగా కనిపిస్తారు. అందుకని, చిన్న చిన్న మోటివ్స్ ఉన్న ప్లెయిన్ నెటెడ్, చందేరీ, షిఫాన్ ఓణీలు ఈ తరహా లుక్‌కి బాగా నప్పుతాయి. లంగాఓణీలో ఎంత సింపుల్‌గా కనిపిస్తే అంత బాగుంటుంది. అదే సమయంలో క్లాసిక్లుక్తో, రిచ్‌గానూ ఆకట్టుకోవాలనుకునేవారికి ఈ తరహా వేషధారణ బాగా నప్పుతుంది. గ్రామీణ నేపథ్యంతో పాటూ బామ్మల కాలం నాటి ఒరిజినాలిటీని, రంగులను డిజైనింగ్‌లో చూపిస్తే ఇలాంటి అందమైన వేషధారణ మరింత ఆకర్షణీయంగా రూపుకడుతుంది. - భార్గవి కూనమ్, ఫ్యాషన్ డిజైనర్ -
జస్ట్... బ్లౌజ్...
అంత సింపుల్ కాదు... శారీకి తగ్గ రేంజ్లో బ్లౌజ్‌ను ‘నప్పించడం’, మెప్పించడం. అందుకే ఇప్పుడు సిటీలో ఎక్స్‌క్లూజివ్ బ్లౌజ్ షోరూమ్‌లు ఏర్పాటవుతున్నాయి. ‘మా దగ్గర కనీసం 400 వెరైటీలకు పైగా డిజైనర్ బ్లౌజ్‌లు ఉన్నాయి. వెడ్డింగ్ బ్లౌజ్‌లు మా స్పెషాలిటీ’ అని చెప్పారు మర్షామహేంద్ర. నగరానికి చెందిన ఈ ఫ్యాషన్ డిజైనర్ ఎక్స్‌క్లూజివ్ బోటిక్‌ల ఏర్పాటుకు పేరొందారు. గతంలో హాఫ్ శారీ పేరుతో లంగా వోణి వస్త్రధారణలో వెరైటీలెన్నో అందిస్తూ బోటిక్ ఏర్పాటు చేసిన వర్ష... ఇప్పుడు జస్ట్ బ్లౌజ్ పేరుతో బంజారాహిల్స్ రోడ్ నం.10లో మరో వినూత్న తరహా కాన్సెప్ట్ స్టోర్‌ను నెలకొల్పారు. ఈ స్టోర్‌ను బుధవారం ప్రారంభించిన సందర్భంగా వర్ష మాట్లాడుతూ... చేనేతలను విరివిగా వినియోగిస్తూ తాము రూపొందించిన దుస్తులు న్యూయార్క్ ఫ్యాషన్ షోలో సైతం మన్ననలు పొందాయన్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ల నేపథ్యంలో పార్టీ మూడ్‌కు అనువుగా ప్రత్యేక వెరైటీలు అందుబాటులో ఉంచామన్నారు.


