జస్ట్... బ్లౌజ్... | Just ... blouse ... | Sakshi
Sakshi News home page

జస్ట్... బ్లౌజ్...

Dec 11 2014 12:22 AM | Updated on Apr 3 2019 4:38 PM

జస్ట్... బ్లౌజ్... - Sakshi

జస్ట్... బ్లౌజ్...

అంత సింపుల్ కాదు... శారీకి తగ్గ రేంజ్‌లో బ్లౌజ్‌ను ‘నప్పించడం’, మెప్పించడం.

అంత సింపుల్ కాదు... శారీకి తగ్గ రేంజ్‌లో బ్లౌజ్‌ను ‘నప్పించడం’, మెప్పించడం. అందుకే ఇప్పుడు సిటీలో ఎక్స్‌క్లూజివ్ బ్లౌజ్ షోరూమ్‌లు ఏర్పాటవుతున్నాయి. ‘మా దగ్గర కనీసం 400 వెరైటీలకు పైగా డిజైనర్ బ్లౌజ్‌లు ఉన్నాయి. వెడ్డింగ్ బ్లౌజ్‌లు మా స్పెషాలిటీ’ అని చెప్పారు మర్షామహేంద్ర. నగరానికి చెందిన ఈ ఫ్యాషన్ డిజైనర్ ఎక్స్‌క్లూజివ్ బోటిక్‌ల ఏర్పాటుకు పేరొందారు.

గతంలో హాఫ్ శారీ పేరుతో లంగా వోణి వస్త్రధారణలో వెరైటీలెన్నో అందిస్తూ బోటిక్ ఏర్పాటు చేసిన వర్ష... ఇప్పుడు జస్ట్ బ్లౌజ్ పేరుతో బంజారాహిల్స్ రోడ్ నం.10లో మరో వినూత్న తరహా కాన్సెప్ట్ స్టోర్‌ను నెలకొల్పారు. ఈ స్టోర్‌ను బుధవారం ప్రారంభించిన సందర్భంగా వర్ష మాట్లాడుతూ... చేనేతలను విరివిగా వినియోగిస్తూ తాము రూపొందించిన దుస్తులు న్యూయార్క్ ఫ్యాషన్ షోలో సైతం మన్ననలు పొందాయన్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్‌ల నేపథ్యంలో పార్టీ మూడ్‌కు అనువుగా ప్రత్యేక వెరైటీలు అందుబాటులో ఉంచామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement