పసికందును మోసుకుంటూ గడ్డ కట్టే చలిలో.. | Lithuanian Couple Sparks Outrage After Climbing Mount Rysy with Baby | Sakshi
Sakshi News home page

వీడియో: పసికందును మోసుకుంటూ గడ్డ కట్టే చలిలో..

Oct 22 2025 10:53 AM | Updated on Oct 22 2025 11:25 AM

Couple Tries To Climb Mount Rysy With Baby Later Happend This Viral

పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లిదండ్రుల్లో కొందరు.. నిర్లక్ష్యంతో, ఏమరుపాటుతో వాళ్ల ప్రాణాలు పోవడానికి కారణమైన ఘటనలెన్నో చూశాం. అయితే ఇక్కడో జంట ప్రమాదం అని తెలిసి కూడా తమ నెలల పసికందుతో సాహసానికి సిద్ధపడింది. పోనీ అందుకు ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా? అనుకుంటే.. పప్పులో కాలేసినట్లే!.. 

లిథువేనియాకు చెందిన ఓ జంట.. పోలాండ్‌లోని మంచుతో కప్పబడిన మౌంట్ రైసీ పర్వతాన్ని అధిరోహించేందుకు సిద్ధపడింది. అయితే తమ 9 నెలల బిడ్డతో కలిసి ఎలాంటి సురక్షిత పరికరాలు లేకుండానే ముందుకు వెళ్లింది. తల్లిని ముందు భాగంలో క్యారీ చేస్తూ ఆ తల్లి పైకి ఎక్కడం ప్రారంభించింది. ఇది గమనించిన కొందరు అలా చేయొద్దని వారించినా వినలేదు. అయినా వినకుండా ఆ పేరెంట్స్‌ మొండిగా ముందుకు వెళ్లారు. అయితే.. 

కాస్త దూరం వెళ్లాక ఆ బిడ్డ తండ్రి ప్రమాదాన్ని అంచనా వేశాడు. ఆ సమయంలో క్రాంపాన్‌(మంచులో జారకుండా షూలకు బిగించే పరికరాలు) కోసం ఓ మౌంట్‌ గైడ్‌ను సంప్రదించాడు. బిడ్డకు ప్రమాదం అని భావించిన ఆ మౌంట్‌గైడ్‌.. వాళ్లు సర్దిచెప్పి కిందకు తీసుకొచ్చారు. ఆ బిడ్డ పరిస్థితి ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వీడియో వైరల్‌ కావడంతో.. చిన్నారిని ప్రమాదంలోకి నెట్టినందుకు ప్రయత్నించిన ఆ పేరెంట్స్‌పై సోషల్ మీడియా తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తోంది. 

మౌంట్ రైసీ (Mount Rysy) అనేది పోలాండ్‌లోని అత్యంత ఎత్తైన పర్వతం. దీని ఎత్తు సుమారు 2,501 మీటర్లు (8,205 అడుగులు). పోలాండ్- స్లోవేకియా సరిహద్దులో ఉన్న హై టాట్రాస్ పర్వత శ్రేణిలో విస్తరించి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement