కరీంనగర్‌లో దారుణం.. తండ్రి ఎంత పనిచేశాడంటే? | Father Attempts On Son and Daughter Incident In Karimnagar's Vavilalapally | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో దారుణం.. తండ్రి ఎంత పనిచేశాడంటే?

Nov 16 2025 11:20 AM | Updated on Nov 16 2025 11:39 AM

Father Attempts On Son and Daughter Incident In Karimnagar's Vavilalapally

సాక్షి, కరీంనగర్‌ జిల్లా: కరీంనగర్ వావిలాలపల్లిలో దారుణం జరిగింది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకు(17), కూతురు(15)ను గొంతు నులిమి చంపేందుకు తండ్రి యత్నించాడు. చికిత్స పొందుతూ కూతురు అర్చన మృతి చెందగా..  కుమారుడు ఆశ్రిత్ పరిస్థితి విషమంగా ఉంది. తండ్రి మల్లేశం పరారయ్యాడు.

పని మీద బయటకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి అపస్మారక స్థితిలో ఉన్న పిల్లలిద్దరినీ గమనించిన తల్లి పోచమ్మ ఆసుపత్రిలో చేర్పించింది. వీళ్ళిద్దరికీ మానసిక అంగవైకల్యంతో ఉండడం వల్లే తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి స్వస్థలం మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం వెంకటరావుపేట కాగా.. గత ఏడేళ్ల నుంచి కరీంనగర్ వావిలాలపల్లిలో మల్లేశం కుటుంబం కిరాయికి ఉంటుంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement