మోసం చేశారు.. వేధిస్తున్నారు! | Victims Lodge Complaints During PGRS at Nandyal SP Office | Sakshi
Sakshi News home page

మోసం చేశారు.. వేధిస్తున్నారు!

Dec 31 2025 1:50 PM | Updated on Dec 31 2025 2:38 PM

Victims Lodge Complaints During PGRS at Nandyal SP Office

నంద్యాల: తమను మోసం చేశారని, అంతేకాకుండా డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నారని ఎస్పీ సునీల్‌ షెరాన్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. నంద్యాలలోని ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం నిర్వహించారు. తన భర్త బాలుగ్రం అనే వ్యక్తి వేరే అమ్మాయిలతో తిరుగుతూ మోసం చేస్తున్నాడని, ఈఎంఐ చెల్లించాని వేధిస్తున్నాడని ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న ఒక మహిళ ఫిర్యాదు చేశారు.

 తాను నంద్యాలలోని ఒక ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో పనిచేయగా జీతం ఇవ్వకుండా మోసం చేశారని మల్లికార్జునయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన స్థలాన్ని ఆక్రమించుకుని బెదిరిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని బండిఆత్మకూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు వినతి పత్రం అందజేశారు. మొత్తం 75 ఫిర్యాదులు రాగా వాటికి చట్ట పరిధిలో పరిష్కారం చూపాలని పోలీస్‌ అధికారులను ఎస్పీ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement