జనసేన ఇంచార్జ్ రామారావుకు షాక్‌.. మత్స్యకారుల ఝలక్‌ | Kovvuru Fisherman Argue With Janasena Incharge TV Ramarao | Sakshi
Sakshi News home page

జనసేన ఇంచార్జ్ రామారావుకు షాక్‌.. మత్స్యకారుల ఝలక్‌

Feb 18 2026 3:54 PM | Updated on Feb 18 2026 4:09 PM

Kovvuru Fisherman Argue With Janasena Incharge TV Ramarao

సాక్షి, తూర్పుగోదావరి: కొవ్వూరు జనసేన ఇంచార్జ్ టీవీ రామారావుకు చేదు అనుభవం ఎదురైంది. కొవ్వూరులో మత్స్యకారులు ఆయనపై తిరుగబడ్డారు. దీంతో, మత్స్యకారులు, ఆయన మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం, చేసేదేమీ లేక అక్కడి నుంచి రామారావు వెళ్లిపోయారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొవ్వూరు శ్రీనివాస ఘాట్ వద్ద అనుమతులు లేకుండా టారిజం బోట్ పేరుతో టీవీ రామారావు కట్టడాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అనుమతులు లేని టూరిస్ట్ బోటు కట్టడాలను ఆపాలని తమ బతుకు తెరువు పోగొట్టుదంటూ మత్య్సకారులు ఆందోళనకు దిగారు. దీంతో, మత్స్యకారులకు, టీవీ రామారావు మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మత్స్య కారులు.. పనులు అడ్డుకోవడంతో చేసేది ఏమీ లేక పర్మిషన్ తీసుకునే వస్తానంటూ పనులను ఆపేసి రామరావు అక్కడి నుంచి జారుకున్నారు.

ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ.. తమ జీవనోపాధి దెబ్బతిసేలా తమ పడవలు పెట్టుకునే ప్రాంతంలో టూరిజం బోట్ ఏర్పాటు చేస్తామని తమపై రామారావు దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక ర్యాంపుల మధ్య టూరిస్ట్ బోటు కట్టడాలను కట్టి 100 కుటుంబాలకు జీవనోపాధి పోగొడుతున్నారని అన్నారు. అక్రమ కట్టడాలు కడుతున్నా అధికారులు అటువైపు కూడా కన్నెత్తి చూడకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement