సాక్షి,రాజమండ్రి: కూటమి ప్రభుత్వం అక్రమ కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.
నా ఇంటిపై దాడి చేశారు. నన్ను హింసించారు. నా భార్య,పిల్లల్ని తరిమారు. నా కార్లను ధ్వంసం చేశారు. నా ఇల్లు తగలబెట్టేందుకు యత్నించారు. ఐ డోంట్ కేర్. బాధితుణ్ని లోపల పెట్టారు. నిందితుణ్ని వదిలారు. పార్టీలకు అతీతకంగా దాడిని ఖండించిన వారికి నా కృతజ్ఞతలు. దేవుడున్నాడు.. ధర్మమే గెలుస్తోంది’ అని వ్యాఖ్యానించారు.
మరోవైపు అంబటి రాంబాబు విడుదలపై వైఎస్సార్‌సీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు.
తప్పు చేయలేదు కాబట్టి అంబటి రాంబాబుకు ఆత్మవిశ్వాసం ఉంది. వైఎస్సార్‌సీపీ నేతలు అక్రమ కేసులను, దాడులను లెక్క చేయరు. వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రజలకు అండగా ఉంటాం -జక్కంపూడి రాజా
ప్రశ్నించినందుకు అంబటి ఇంటిపై దాడి చేసి అయనను జైల్లో పెట్టారు. కక్ష సాధించుకోవటానికే తనకు అధికారమిచ్చారని చంద్రబాబు అనుకుంటున్నారు. అంబటి రాంబాబు మనోధైర్యాన్ని దెబ్బతీయలేకపోయారు. నా వైపు న్యాయం ఉంది వెనక్కి తగ్గేది లేదని అంబటి చెప్పారు. ఆయన కుటుంబాన్ని కూడా హింసించారు -వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి..
వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధించే తప్ప ప్రజలకు ప్రభుత్వం మంచి చేయడం లేదు. అంబటి క్షమాపణ చెప్పినా ఇంటిని ముట్టడి చేసి దారుణంగా ధ్వంసం చేశారు. మహిళలను తీవ్ర భయాందోళనకు గురి చేశారు అటువంటి వారిపై ఎటువంటి చర్యలు లేవు..అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టి కొత్త రాజ్యాంగం ఏర్పాటు చేస్తున్నారు. అధికారం, అహంకారంతో ఏదైనా చెల్లుతుంది అని అనుకుంటున్నారు. ప్రజల్లో అంతా గమనిస్తున్నారు
అధికార పార్టీ తగిన మూల్యం చెల్లించే రోజు దగ్గర పడింది. - తానేటి వనిత ,మాజీ హోంమంత్రి





