breaking news
rajamudry
-
మాజీ మంత్రి అంబటి రాంబాబు విడుదల
సాక్షి,రాజమండ్రి: కూటమి ప్రభుత్వం అక్రమ కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. నా ఇంటిపై దాడి చేశారు. నన్ను హింసించారు. నా భార్య,పిల్లల్ని తరిమారు. నా కార్లను ధ్వంసం చేశారు. నా ఇల్లు తగలబెట్టేందుకు యత్నించారు. ఐ డోంట్ కేర్. బాధితుణ్ని లోపల పెట్టారు. నిందితుణ్ని వదిలారు. పార్టీలకు అతీతకంగా దాడిని ఖండించిన వారికి నా కృతజ్ఞతలు. దేవుడున్నాడు.. ధర్మమే గెలుస్తోంది’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు అంబటి రాంబాబు విడుదలపై వైఎస్సార్సీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. తప్పు చేయలేదు కాబట్టి అంబటి రాంబాబుకు ఆత్మవిశ్వాసం ఉంది. వైఎస్సార్సీపీ నేతలు అక్రమ కేసులను, దాడులను లెక్క చేయరు. వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రజలకు అండగా ఉంటాం -జక్కంపూడి రాజాప్రశ్నించినందుకు అంబటి ఇంటిపై దాడి చేసి అయనను జైల్లో పెట్టారు. కక్ష సాధించుకోవటానికే తనకు అధికారమిచ్చారని చంద్రబాబు అనుకుంటున్నారు. అంబటి రాంబాబు మనోధైర్యాన్ని దెబ్బతీయలేకపోయారు. నా వైపు న్యాయం ఉంది వెనక్కి తగ్గేది లేదని అంబటి చెప్పారు. ఆయన కుటుంబాన్ని కూడా హింసించారు -వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి.. వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధించే తప్ప ప్రజలకు ప్రభుత్వం మంచి చేయడం లేదు. అంబటి క్షమాపణ చెప్పినా ఇంటిని ముట్టడి చేసి దారుణంగా ధ్వంసం చేశారు. మహిళలను తీవ్ర భయాందోళనకు గురి చేశారు అటువంటి వారిపై ఎటువంటి చర్యలు లేవు..అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టి కొత్త రాజ్యాంగం ఏర్పాటు చేస్తున్నారు. అధికారం, అహంకారంతో ఏదైనా చెల్లుతుంది అని అనుకుంటున్నారు. ప్రజల్లో అంతా గమనిస్తున్నారుఅధికార పార్టీ తగిన మూల్యం చెల్లించే రోజు దగ్గర పడింది. - తానేటి వనిత ,మాజీ హోంమంత్రి -
కూటమి ఎమ్మెల్యే.. అక్రమ డబ్బు లెక్కలకు మిషన్లు కొన్నారట: మార్గాని భరత్
సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్రంలో అత్యంత అవినీతి ఎమ్మెల్యే ఎవరు అనే పోటీ పెడితే ఆదిరెడ్డి వాసునే మొదటి స్థానంలో ఉంటాడని ఆరోపించారు వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. డంపింగ్ యార్డ్ కాంట్రాక్టర్ వద్ద స్థానిక ఎమ్మెల్యే రెండు కోట్లు డిమాండ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. అలాగే, ఇసుక నుంచి వచ్చే డబ్బులు లెక్క పెట్టలేక ఆదిరెడ్డి మూడు కరెన్సీ లెక్కించే మిషన్లు కొనుగోలు చేశారట అని వ్యాఖ్యలు చేశారు.రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘దళిత యువకుడిపై కూటమి ప్రభుత్వం జాత్యహంకార ధోరణి చూపించింది. రాజమండ్రిలో దళిత యువకుడుపై జరిగిన ఘటనపై ఢిల్లీలో ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. జనవరి మూడో వారంలో కమిషన్ ఏపీకి రానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేశారు.సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన బీసీ మంత్రులు మూడుసార్లు క్షమాపణ చెప్పాల్సి రావడం దారుణం. సామాజిక కార్యక్రమాలకు అన్ని పార్టీల నాయకులు హాజరుకావడం పరిపాటి. బీసీ నాయకులపై జాతి దురహంకారం చూపిస్తున్నారా?. కమ్మ గ్లోబల్ సమిట్‌లో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. అప్పుడు ఎందుకు అడ్డు చెప్పలేదు?. బీసీల పట్ల కూటమి ప్రభుత్వం అణుగదొక్కే వైఖరి అవలంబిస్తోంది.కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల కాలంలో ఈవీఎం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దందాల లిస్ట్ లెక్కలేనంత ఉంది. కోటిలింగాల ఘాట్ నుండి ఫోర్త్ బ్రిడ్జి వరకు ఉన్న 15 ర్యాంపుల్లో డ్రెడ్జింగ్ చేసి 800 లారీలు ప్రతిరోజు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే మామూలు వసూలు అవుతోంది. లారీకి రూ.8500 తీసుకుంటున్నారు. స్థానిక ఈవీఎం ఎమ్మెల్యేకు రోజుకు ఈ ర్యాంపుల ద్వారా 24 లక్షలు రూపాయలు ఆదాయం వస్తోంది. ఆనంద నగర్ క్వారీ ప్రాంతాల్లో పేకాట క్లబ్బుల కూడా స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతోనే నిర్వహిస్తున్నారు. ఇటువంటి ఎమ్మెల్యే అసెంబ్లీలో భూకబ్జాలు గురించి మాట్లాడటం హాస్యాస్పదం. ఎమ్మెల్యే వెనకాలే తిరిగే వ్యక్తులు అనేక చోట్ల భూకబ్జాలకు పాల్పడ్డారు.ఇసుక నుంచి వచ్చే డబ్బులు లెక్క పెట్టలేక స్థానిక ఎమ్మెల్యే మూడు కరెన్సీ లెక్కించే మిషన్లు కొనుగోలు చేశారట. సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే అతిపెద్ద స్లాటర్ హౌస్ ఉంది. రోజుకు రెండు మూడు వందల గోవులు అక్కడ హతమైపోతున్నాయి. వాటి నిర్వాహకుడు రాజమండ్రి ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడే. దమ్ముంటే ఇప్పుడున్న పదవులకు రాజీనామా చేసి పేపర్ బ్యాలెట్‌తో పోటీకి రండి. నేను సవాల్ విసురుతున్నాను. డంపింగ్ యార్డ్ కాంట్రాక్టర్ వద్ద కూడా ఎమ్మెల్యే రెండు కోట్లు డిమాండ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి అని కామెంట్స్ చేశారు. -
మినీ తిరుమలగా రాజమండ్రి
రాజమండ్రి : గోదావరి పుష్కరాలకు కేంద్రస్థానమైన రాజమండ్రి పుష్కరాల సమయంలో మినీ తిరుమలగా భాసిల్లనుంది. పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు దేశం నలమూలల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం రాజమండ్రిలో నమూనా ఆలయాన్ని నిర్మించనుంది. 1979 నుంచి టీటీడీ ప్రతి పుష్కరానికీ ఇలా నమూనా ఆలయాన్ని నిర్మిస్తోంది. స్థానిక తాడితోట సమీపంలోని స్టేడియంలో నమూనా ఆలయాన్ని నిర్మించాలని టీటీడీ, జిల్లా యంత్రాంగం నిర్ణయించారు.


