దీప్‌వీర్‌ కుమార్తె దువా తొలి లైవ్ మ్యూజికల్ షో వైరల్‌ | Dua first live Cocomelon show Ranveer Deepika lovely experience at NMACC | Sakshi
Sakshi News home page

దీప్‌వీర్‌ కుమార్తె దువా తొలి లైవ్ మ్యూజికల్ షో వైరల్‌

Apr 27 2026 6:52 PM | Updated on Apr 27 2026 7:28 PM

Dua  first live Cocomelon show Ranveer Deepika lovely experience at NMACC

బాలీవుడ్‌ నటుడు, రణవీర్‌, దీపికా పడుకోన్‌ దంపతుల కమార్తె దువా ఇంత చిన్న వయసులోనే లైవ్‌ షో ఇచ్చి అదరగొట్టింది. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌ (NMACC)లో తన పెర్‌ఫామెన్స్‌తో దీప్‌వీర్ అభిమానులను ఆకట్టుకుంది. ధురందర్‌ సినిమా భారీ హిట్‌ కావడంతో సంతోషంలో మునిగితేలుతున్న రణవీర్‌కు  దువా తన టాలెంట్‌తో మరింత ఆనందాన్ని ఇచ్చింది అంటున్నారు ఫ్యాన్స్‌. 

'ధురందర్' స్టార్ రణ్‌వీర్ సింగ్, తన కుమార్తె దువా మొదటి కోకో మిలన్ (చిన్న పిల్లల కార్టూన్‌ షో) లైవ్ మ్యూజికల్ షో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రణవీర్ సింగ్ , దీపికా పడుకోన్ తమ బిడ్డ దువా మొదటి లైవ్ షోను ఎంజాయ్‌ చేశారు. షో అనంతరం, రణవీర్ తన  ఆనందాన్ని వ్యక్తం చేశారు. "ఇది మా దువా పాపకి తొలిప్రదర్శన కాబట్టి మాకు చాలా ప్రత్యేకమైనది. జీవితాంతం నిలిచిపోయే జ్ఞాపకాలను మిగుల్చుకునే అవకాశవ కల్పించిన NMACC బృందానికి చాలా కృతజ్ఞుడను’’, అంటూ NMACC బృందానికి ధన్యవాదాలు తెలిపారు.తాను, దీపిక, ఇంకా తాతయ్య, నానమ్మలతో కలిసి ఈ మ్యూజికల్‌కు హాజరైందని రణ్‌వీర్ వెల్లడించారు. ఎంతో సరదా, సంతోషం, అదొక రంగులమయం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం అని తెగ సంతోష పడిపోయాడు.

 

కాగా  దీపికా, రణవీర్‌లు 2018 నవంబర్ 14న పెళ్లి చేసుకోగా, 2024లో వారికి కుమార్తె జన్మించింది. మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నామంటూ ఇటీవల వీరు ప్రకటించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement