ప్రశాంత ఉదయం ఓ మృగాడి వాంఛాగ్నితో భయానకంగా మారింది. ఆదరించి అన్నం పెట్టిన కుటుంబానికి తీరని ద్రోహం చేశాడో దుర్మార్గుడు. కామంతో కళ్లు మూసుకుపోయి వాళ్ల బిడ్డను బలిగొన్నాడు. ఐఆర్‌ఎస్ అధికారి కుమార్తె హత్యాచార ఘటనతో దేశ రాజధాని ఉలిక్కి పడింది. అయితే నిందితుడు రాహుల్ మీనా చెప్పింది విని పోలీసులు సైతం విస్తుపోయారు.
సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారి కుమార్తె(22) కేసులో షాకింగ్ విషయం ఒకటి వెలుగు చూసింది. యువతి దారుణ హత్యాచారం కంటే ముందు తన సొంతూరులో మరో మహిళపైనా రాహుల్ అత్యాచారానికి తెగబడ్డాడు. ఆపై విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆమెను బెదిరించాడు. అంటే.. 24 గంటలు గడవక ముందే రెండు రాష్ట్రాల్లో రెండు ఘాతుకాలకు పాల్పడ్డాడన్నమాట.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ ఆల్వార్ జిల్లా రాజ్‌గఢ్‌కు చెందిన రాహుల్ మీనా(23) తెలిసినవాళ్ల ద్వారా రికమండేషన్‌తో ఐఆర్‌ఎస్ అధికారి ఇంట్లో పనివాడిగా చేరాడు. సర్వెంట్ క్వార్టర్స్‌లో అతనికి ఆశ్రయం ఇచ్చారు. ఆ సమయంలో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న అధికారి కూతురిపై కన్నేశాడు రాహుల్. అలా ఎనిమిది నెలల పాటు అదను కోసం ఎదురు చూశాడు. అయితే ఇంటి సరుకుల కోసం ఇచ్చిన డబ్బు గోల్‌మాల్ చేశాడని.. బయట అధికారి పేరు చెప్పి అప్పులు చేశాడని.. తేలడంతో రాహుల్‌ను పనిలోంచి తీసేశారు. దీంతో అతను సొంతూరికి వెళ్లిపోయాడు. అయితే అతని తప్పుడు ఆలోచనలు ఆగలేదు. దీంతో మళ్లీ ఢిల్లీకి పయనం అయ్యాడు.

ఏప్రిల్ 21న.. పొరుగింట్లో మహిళ ఒంటరిగా ఉండడం గమనించి ఆపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆమె ఒంటి నిండా పంటి గాట్లు పెట్టి చిత్రహింసలు పెట్టాడు. ఆపై విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి బయల్దేరాడు. భార్య ఒంటిపై గాయాలు గమనించిన ఆ భర్త.. ఈ ఘటనపై ఫిర్యాదు కూడా చేశాడు.
ఏప్రిల్ 22న ఉదయం.. ఢిల్లీ చేరుకున్న రాహుల్.. నేరుగా ఆగ్నేయ ఢిల్లీలోని కైలాశ్ హిల్స్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. ఇంతకు ముందు పని చేసిన వాడే కావడంతో సెక్యూరిటీ ఇబ్బందులేవీ అతనికి ఎదురు కాలేదు. ఆ టైంలో ఐఆర్‌ఎస్ అధికారి, ఆయన భార్య జిమ్‌కు వెళ్లారు. పని మనిషి కోసం తాళం చెవి బయట ఉంచుతారనే విషయమూ రాహుల్‌కు తెలుసు.
తాళం తీసి లోపలికి వెళ్లిన రాహుల్ నేరుగా పైన గదిలో చదువుకుంటున్న ఐఆర్‌ఎస్ అధికారి కూతురి(22) దగ్గరకు వెళ్లాడు. తన కోరిక తీర్చాలని ఆమెను బతిమాలాడాడు. ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి బెడ్ ల్యాంప్, చేతికి దొరికిన వస్తువులతో తల మీద కొట్టాడు. రక్త స్రావంతో స్పృహ కోల్పోయిన ఆమెను మెట్ల మీద నుంచి కిందకు ఈడ్చుకొచ్చాడు. అక్కడ ఆమెపై అత్యాచారం జరిపాడు. ఆపై..
ఆమె వేలి ముద్రలతో లాకర్ తెరవడానికి ప్రయత్నించాడు. అయితే.. వేళ్లకు రక్తం ఉండడంతో అది ఓపెన్ కాలేదు. దీంతో స్క్రూ డైవర్ సాయంతో లాకర్ తెరిచి.. అందులో ఉన్నదంతా తనతో తెచ్చుకున్న బ్యాగులో నింపేసుకున్నాడు. మొబైల్ చార్జర్ కేబుల్‌తో యువతికి ఉరి వేసి ఊపిరి తీశాడు. యువతితో జరిగిన పెనుగులాటలో ప్యాంట్‌కు, షూస్‌కు రక్తపు మరకలు అంటడంతో.. వాటిని అక్కడే పడేసి ఐఆర్‌ఎస్ అధికారి కొడుకు దుస్తులు, చెప్పులు ధరించి పారిపోయాడు.

రక్తపు మడుగులో దుస్తులు లేకుండా విగతజీవిగా పడి ఉన్న బిడ్డను చూసి ఆ అధికారి దంపతులు నిర్ఘాంతపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌లో ఉదయం 6.28 గంటలకు నిందితుడు అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి.. సుమారు గంట తర్వాత వేరే దుస్తులు, బ్యాగుతో బయటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం 15 బృందాలు రంగంలోకి దిగాయి. అయితే..
ఓ ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ద్వారకలో గాలింపు చేపట్టారు. చివరకు బుధవారం సాయంత్రం ఓ లాడ్జిలో దాక్కున్న రాహుల్‌ను అరెస్ట్ చేశారు. రాహుల్ మీనా ఫోన్‌లో పోర్న్ కంటెంట్ అడ్డగోలుగా ఉంది. రోడ్లపై వెళ్లే యువతులను అసభ్యంగా ఫొటోలు తీసినట్లు పోలీసులు గుర్తించారు. తనకు పోర్న్ వీడియోలు చూసే అలవాటు ఎక్కువగా ఉందని.. అందుకే ఈ నేరాలకు పాల్పడినట్లు రాహుల్ ఒప్పుకున్నాడు. రాహుల్‌కు బెట్టింగ్ యాప్‌లతో పాటు డ్రగ్స్ అలవాటు కూడా ఉందని నిర్ధారించారు. అతని నేర చరిత్ర చిట్టాను మరింత లోతుగా పరిశీలించాలని పోలీసులు భావిస్తున్నారు.


