కూతురి ప్రేమ వివాహం.. మనవడిని కుక్కర్‌తో కొట్టి చంపిన తాత! | 10 Months Boy Died In Daughter Love Marriage Incident In Tamil Nadu, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

కూతురి ప్రేమ వివాహం.. మనవడిని కుక్కర్‌తో కొట్టి చంపిన తాత!

May 29 2026 9:56 AM | Updated on May 29 2026 12:12 PM

10 months Boy Died In  Daughter Love Marriage Incident

10 నెలల మనవడిని కుక్కర్‌తో కొట్టి చంపిన తాత  

తమిళనాడు: నామక్కల్‌ జిల్లాలోని పల్లిపాలయానికి చెందిన వెంకటాచలం. ఇతని భార్య  అముధ. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వెంకటాచలం మద్యపానానికి బానిసయ్యాడు. ఇతను ఇంట్లోని పాత్రలను అమ్ముతాడు. ఆ డబ్బుతో మద్యం తాగుతూ తిరుగుతాడు. ఈ క్రమంలో, అతని పెద్ద కుమార్తె మోనిషా, భవానికి చెందిన మయిలానందన్‌తో ప్రేమలో పడింది. తల్లిదండ్రుల వ్యతిరేకత ఉన్నప్పటికీ వీరికి వివాహం జరిగింది. 

ఈ పరిస్థితుల్లో, మోనిషా 10 రోజుల క్రితం తన 10 నెలల బాబు జోష్విక్‌తో కలిసి తల్లి ఇంటికి వచ్చింది. దీనికి వెంకటాచలం అభ్యంతరం తెలిపి, ‘ఎందుకు ఇంటికి వచ్చావు? అని అడిగి కూతురిని కొట్టి, హింసించాడు. కుక్కర్‌ మూత తీసుకుని మోనిషాపై విసిరాడు. అది  ఆ పిల్లాడి తలపై పడడంతో, ఆ పిల్లాడు గాయపడి మరణించాడు. మోనిషా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వెంకటాచలాన్ని అరెస్టు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement