breaking news
Nagarkurnool District Latest News
-
కాంగ్రెస్‌లో ఢీసీసీ..!
కుంపటి రాజేసిన జిల్లా అధ్యక్షుల ఎంపిక ● వనపర్తిలో శివసేనారెడ్డికి ఇవ్వడంపై మేఘారెడ్డి, చిన్నారెడ్డి నారాజ్ ● తన ఇంటి వద్ద ఉన్న పార్టీ కార్యాలయం బోర్డు ఎత్తేసిన చిన్నన్న ● అందుబాటులోకి రాకపోవడంతో ఆయన అనుచరుల్లో అయోమయం ● ఇటు మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాల్లో ఆశావహ నేతల్లో అసంతృప్తి ● పంచాయతీ ఎన్నికల వేళ పరిణామాలపై ‘హస్తం’ శ్రేణుల్లో గుబులు -
ఎన్నికల పరిశీలకుల నియామకం
నాగర్‌కర్నూల్: గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లాకు ఇద్దరు పరిశీలకులను నియమించిందని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. ఇందులో భాగంగా సాధారణ పరిశీలకులుగా హైదరాబాద్ హెచ్ఎండీఏ జాయింట్ కలెక్టర్ రాజ్యలక్ష్మి, వ్యయ పరిశీలకులుగా గద్వాల జిల్లా ఆడిట్ అధికారి భీమ్లానాయక్‌ను నియమించారు. ఈ మేరకు గురువారం వారు కలెక్టర్ బదావత్ సంతోష్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకుండా ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, డీపీఓ శ్రీరాములు, అబ్జర్వర్ లైజింగ్ అధికారి సీతారాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. క్రీడలతోనేవిద్యార్థుల్లో క్రమశిక్షణ కందనూలు: క్రీడల ద్వారానే విద్యార్థులకు క్రమశిక్షణ అలవడుతుందని ఏఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ క్రీడా మైదానంలో 44వ జూనియర్స్ ఖోఖో కోచింగ్ క్యాంపు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చదువులో రాణించాలంటే నిత్యం ఆటలు ఆడడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవడంతోపాటు ఎలాంటి మానసికమైన ఒత్తిడినైనా ఎదుర్కొనే ధైర్యం, సాహసాలు అలవాడుతాయన్నారు. యువతీ, యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ నిత్యం క్రీడల్లో నిమగ్నమై అనుకున్న స్థాయికి చేరుకోవాలని సూచించారు. జూనియర్స్ ఖోఖో కోచింగ్ క్యాంపులో మంచి మెలకువలు నేర్చుకొని రాష్ట్రస్థాయిలో రాణించి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం ఏఎస్పీ వెంకటేశ్వర్లు క్రీడా కిట్టును బాలికలకు, బాలురకు అందజేశారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అడ్డొస్తున్నాడని.. తుదముట్టించారు -
వేలం.. ‘ఏకగ్రీవం’!
సర్పంచ్ స్థానాలకు భలే గిరాకీ ● పలు పల్లెల్లో గ్రామస్తుల మూకుమ్మడి కార్యాచరణ ● చక్రం తిప్పుతున్న పెద్దలు.. ఉమ్మడి జిల్లాలో పెరిగిన సంస్కృతి ● వేలం పాట నేరమంటున్న అధికార యంత్రాంగం ● శిక్ష తప్పదంటూ బస్వాపూర్ ఘటనను ఉదహరిస్తూ హెచ్చరికలు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పల్లెల్లో రాజకీయ సందడి నెలకొంది. గురువారం నామినేషన్ల ఘట్టం మొదలు కాగా.. తొలి రోజే పలు గ్రామాల్లో సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసే దిశగా అడుగులు పడ్డాయి. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా పలు జీపీల్లో ఆలయాల నిర్మాణాలు, శ్మశాన వాటికలకు స్థలాలు తదితర అభివృద్ధి పనుల పేరిట ‘పెద్దలు’ చక్రం తిప్పుతూ బహిరంగ వేలం పాటలకు శ్రీకారం చుట్టారు. రేటు ఫిక్స్ చేసి మరి పోటీ లేకుండా మూకుమ్మడి నిర్ణయంతో ఏకగ్రీవ ఆఫర్లు ప్రకటించగా.. ఔత్సాహికులూ అదే ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ లెక్కన గతంతో పోల్చితే వేలం పాటల సంస్కృతి ఈసారి పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేరమంటున్న అధికారులు.. పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు స్థానాలు.. ఏదైనా వేలం పాట నిర్వహించడం సరికాదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఎవరు ఎక్కువ డబ్బులు చెల్లిస్తే వారికే పదవి అంటూ వేలం వేయడం చట్ట విరుద్ధమంటున్నారు. ఎన్నికలతో పల్లెల్లో ప్రశాంత వాతావరణం చెదిరిపోకుండా ఉండడంతో పాటు ఎన్నికల నిర్వహణ వ్యయం తగ్గుతుందని ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు పారితోషికంగా రూ.10 లక్షలు ఇస్తుందని.. అలా అని డబ్బు ఉన్న పెద్దలు పదవులకు వేలం పాడితే శిక్షార్హులవుతారని వివరిస్తున్నారు. 2013 ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా బస్వాపూర్‌లో ఈ విధంగా వేలం పాట దక్కించుకున్న వారి ఎన్నిక చెల్లలేదని.. దీంతో పాటు వేలం నిర్వహించిన పెద్దలు, వేలం పాడిన వ్యక్తి జైలు పాలయ్యారని ఉదహరిస్తున్నారు. నేరారోపణ రుజువైతే ఏడాది జైలు శిక్షతో పాటు ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పాట పాడి.. వాయిదా వేసి.. గట్టు మండలం అరగిద్ద గ్రామ సర్పంచ్‌కు వేలం నిర్వహించగా.. ఓ గ్రామ నాయకుడు రూ.35 లక్షల వరకు వేలం పాడారు. చివరి నిమిషంలో మరో నాయకుడు అడ్డు తగలడంతో వేలం పాటను పెద్దలు శుక్రవారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అంతంపల్లిలో సైతం సర్పంచ్ పదవికి రూ.24 లక్షలకు వేలం పాడారు. అయితే ఆ డబ్బులు తనకు ఇవ్వాలని గ్రామ మాజీ ప్రజాప్రతినిధి అభ్యంతరం తెలిపారు. గతంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు రాలేదని వాపోయాడు. దీంతో పెద్దలు వేలాన్ని నిలిపివేసినట్లు సమాచారం. తుమ్మలపల్లి గ్రామ సర్పంచ్ స్థానానికి శుక్రవారం వేలం నిర్వహించేందుకు గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
సీపీఎం మద్దతుదారులతోనే గ్రామాల అభివృద్ధి
నాగర్‌కర్నూల్ రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను ఓడించి మతోన్మాద చర్యలను తిప్పికొడదామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సాగర్ అన్నారు. గురువారం సీపీఎం జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు శ్రీనివాస్ అధ్యక్షతన జిల్లా కార్యాలయంలో జరగగా ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే గ్రామాల్లో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి ప్రశాంతంగా ఉన్న గ్రామాలను అశాంతిలోకి నెట్టుతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు అభివృద్ధి చెందలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి దాపురించిందన్నారు. గ్రామాలు ప్రశాంతంగా అభివృద్ధి వైపు నడవాలంటే సీపీఎం బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి పర్వతాలు, కార్యదర్శి వర్గ సభ్యులు ఆంజనేయులు, దేశనాయక్, గీత, ఆంజనేయులు జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, నర్సింహ, శంకర్‌నాయక్, బాలస్వామి, అశోక్, శివవర్మ, నాగరాజు, తారాసింగ్, మధు పాల్గొన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
కందనూలు: విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కేజీబీవీల పర్యవేక్షణ అధికారి శోభారాణి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో ఊర్కొండ కేజీబీవీ విద్యార్థులు సాంకేతిక రంగాల్లో మరింత ప్రతిభను పెంపొందించేలా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం, ఉన్నత విద్యా సమాచారంతోపాటు సబ్జెక్టులలో ప్రమాణాలను పెంచుకునేలా జిల్లాలోని కేజీబీవీల విద్యార్థులకు విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ.. టీ–స్టెమ్ (తెలంగాణ– సైన్స్ టెక్నాలజీ ఇంజినీరింగ్ ఫెసిలిటీస్ మ్యాప్) కార్యక్రమంతో మరింత పరిజ్ఞానాన్ని అందించే విధంగా జిల్లాలో చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లాలోని 20 కేజీబీవీల విద్యార్థులకు వివిధ డిగ్రీ, ఇంజినీరింగ్ ప్రభుత్వ కళాశాలల్లో, ఇతర విద్యా సంస్థలలోని వృత్తి సంబంధిత ప్రయోగశాలల వసతులను మ్యాపింగ్ చేయడం, విద్యార్థులు వాటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చెయిన్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 5ఏ వంటి సాంకేతిక అంశాలపై విద్యార్థులు ఈ శిక్షణ ద్వారా లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గీతాంజలి పాల్గొన్నారు. -
పకడ్బందీగా నిర్వహించాలి
తాడూరు: ఎన్నికల నిబంధనల మేరకు నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మొదటి విడత నామినేషన్ల దాఖలు ప్రక్రియను గురువారం తాడూరులో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ సంబంధించిన 151 సర్పంచ్‌లు, 1,326 వార్డు స్థానాలకు నామినేషన్ ప్రక్రియ మొదలైనట్లు చెప్పారు. తాడూరు గ్రామ సర్పంచ్, 12 వార్డులకు సంబంధించి రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో చేపడుతున్న నామినేషన్ల ప్రక్రియపై ఆరా తీసి ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, అభ్యర్థులు ప్రతిపాదకుడి సాయం, నిర్ణీత రుసుం చెల్లించి నామినేషన్ దాఖలు చేయాలని సూచించారు. ఆదివారం పరిశీలన తర్వాత సాయంత్రం 5 గంటలకు చెల్లుబాటు అయ్యే జాబితా ప్రకటిస్తామని, నామినేషన్ల తిరస్కరణకు గురైన వారు డిసెంబర్ 1న అప్పీలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఆయన వెంట ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్లు అశోక్, హర్షవర్ధన్, తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ ఆంజనేయులు, ఎన్నికల అధికారులు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస ఆచార్య తదితరులు పాల్గొన్నారు. -
తొలిరోజు 121 నామినేషన్లు
● వార్డు స్థానాలకు 26 దాఖలు సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో గురువారం ఉదయం 10.30 గంటల నుంచి తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభమయ్యాయి. తొలి విడతలో ఆరు మండలాల పరిధిలోని 151 సర్పంచ్, 1,326 వార్డు స్థానాలకు నామినేషన్లను స్వీకరించగా.. తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 121, వార్డు స్థానాలకు 26 నామినేషన్లు వచ్చాయి. సర్పంచ్ స్థానాలకు కల్వకుర్తి మండలంలో 19, ఊర్కొండ మండలంలో 11, వెల్దండ మండలంలో 19, వంగూరులో 24, తాడూరులో 23, తెలకపల్లిలో 25 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డుస్థానాలకు కల్వకుర్తి మండలంలో 11, వెల్దండ మండలంలో 6, వంగూరు మండలంలో 2, తాడూరు మండలంలో 5, తెలకపల్లి మండలంలో 2 నామినేషన్లు రాగా.. ఊర్కొండ మండలంలో వార్డుస్థానాలకు నామినేషన్లు రాలేదు. -
నానో యూరియా, డీఏపీతో అధిక దిగుబడులు
నాగర్‌కర్నూల్: నానో యూరియా, నానో డీఏపీ వాడటం వల్ల రైతులు నష్టాలను నివారించవచ్చని, ప్రతి రైతు ఈ యాసంగిలో కనీసం ఎకరాలో వీటిని వాడాలని జిల్లా వ్యవసాయాధికారి యశ్వంత్‌రావు అన్నారు. కోరమాండల్ కంపెనీ ఆధ్వర్యంలో జిల్లాలో పనిచేస్తున్న ఏడీఏలు, ఏఓలు, ఏఈఓలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో నానో యూరియా, నానో డీఏపీ వాడకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ ఈ యూరియా, డీఏపీ వాడడం వల్ల పంటల దిగుబడి నాణ్యత పెరుగుతుందన్నారు. అంతకు ముందు కొరమాండల్ ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లాలో 2019– 20లో 29,586 టన్నుల యూరియా అమ్మకాలు ఉండగా 2024–25లో 57,224 టన్నులకు పెరిగాయన్నారు. సంప్రదాయ యూరియా అధికంగా వాడడం వల్ల భూమిలో సేంద్రియ పదార్థాలు తగ్గిపోతాయన్నారు. రసాయన ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల పంటలకు ఉపయోగపడే ఇతర పోషకాలు కూడా అందవన్నారు. ప్రతి రైతు నానో యూరియా, నానో డీఏపీని వాడి పంటలను రక్షించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కొరమాండల్ ప్రాంతీయ వ్యాపార నిర్వా హకుడు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. -
కసరత్తు జోరు!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కాకున్నా.. గ్రామాల్లో పట్టు సాధించాలనే లక్ష్యంతో పోరు సన్నాహాలు మొదలుపెట్టాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్కు చెందిన ముఖ్య నేతలు గ్రామాల వారీగా గెలుపు గుర్రాల కోసం జల్లెడ పడుతున్నారు. సర్పంచ్ ఆశావహ అభ్యర్థుల పూర్వపరాలు, బలాబలాలు, చరిష్మా, సేవలపై ఆరా తీస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక గెలుపుతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొనగా.. అదే దూకుడును కొనసాగించేలా నాయకులు ముందస్తు ప్రణాళికతో పోరు బాట పట్టారు. ఇదేక్రమంలో ‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటి పూర్వ వైభవం దిశగా నడవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్.. పంచాయతీ పోరులో విజయం సాధించడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేలా బీజేపీ ముఖ్యులు పక్కా కార్యాచరణతో ముందుకుసాగుతున్నారు. పంచాయతీ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతలు వ్యూహాలకు పదునుబెట్టారు. తాము బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రూపొందించుకున్న ప్రణాళికలు పక్కాగా అమలయ్యేలా తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ● ప్రభుత్వం అమలు సంక్షేమ పథకాలే తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. ఈ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు, గృహజ్యోతి, పేదలకు సన్న బియ్యం, చీరలు, వడ్డీ లేని రుణాలు, సన్న రకాల ధాన్యానికి బోనస్ వంటి వివిధ పథకాలను ప్రచారాస్త్రాలుగా మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. ● 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. యూరియా కొరతతోపాటు అరకొర రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలను ఉదహరిస్తూ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. దీన్ని బట్టి ప్రభుత్వ పథకాల అమలులో లోపాలు, అభివృద్ధి పనుల్లో జాప్యం వంటి తదితర అంశాలతో పాటు తమ హయాంలో చేసిన పనులను ప్రజలకు వివరించేలా వ్యూహాలను అమలు చేయనున్నట్లు స్పష్టమవుతోంది. ● కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు.. గ్రామాలకు అందుతున్న నిధుల వివరాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహంతో బీజేపీ ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అరాచకాలు తమకు కలిసి వస్తుందని.. ఈసారి సత్తా చాటుతామని ‘కమలం’ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో వేడెక్కిన రాజకీయం పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాల్లో ఆశావహులు ఎక్కువ సంఖ్యలో సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతుండడం అధికార కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఆచితూచి వ్యవహ రిస్తున్నారు. మరోవైపు జీపీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో పలు ప్రాంతాల్లో సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఇంటింటి ప్రచా రం మొదలుపెట్టారు. కాంగ్రెస్‌తోపాటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు గ్రామాల్లో విస్తృత పర్యటనలకు రంగం సిద్ధం చేసుకుంటుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎవరికి వారు వ్యూహాలు.. విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీల వ్యూహాలు గెలుపు గుర్రాల కోసం వడబోత సర్పంచ్ ఆశావహుల చరిష్మా, సేవలపై ఆరా పలు గ్రామాల్లో ముందస్తుగానే ఇంటింటి ప్రచారం గ్రామాల్లో వేడెక్కిన రాజకీయ వాతావరణం -
సర్వం సిద్ధం..
సాక్షి, నాగర్‌కర్నూల్: గ్రామపంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనుండగా.. తొలి విడత నామినేషన్లు గురువారం నుంచే ప్రారంభంకానున్నాయి. జిల్లాలోని కల్వకుర్తి, ఊర్కొండ, వెల్దండ, వంగూరు, తాడూరు, తెలకపల్లి మండలాల్లోని మొత్తం 151 సర్పంచ్, 1326 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా.. 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకోసం నాలు గు, ఐదు గ్రామపంచాయతీలను కలిపి ఒక క్లస్టర్ చొప్పున మొత్తం 46 క్లస్టర్లు ఏర్పాటుచేశారు. ఆయా క్లస్టర్ కేంద్రాల్లోనే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్పంచ్, వార్డు స్థానాల అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. చెక్‌పోస్టుల ఏర్పాటు.. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో అధికార యంత్రాంగం, పోలీసులు కోడ్ అమలుపై ప్రత్యేక దృష్టిసారించారు. జిల్లా నలుమూలల చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కల్వకుర్తి, అమ్రాబాద్, బిజినేపల్లి మండలాల్లో మూడు చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నామినేషన్లు స్వీకరించే క్లస్టర్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటుచేశారు. -
ఎన్నికల నియమావళి పక్కాగా అమలు..
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సంతోష్ నోడల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి కలెక్టర్ నోడల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, నామినేషన్ల ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. మొదటి దశ ఎన్నికల నిర్వహణకు సంబంధించి గురువారం ఉదయం 10 గంటలలోగా ఫార్మా–1 ద్వారా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలచేసి.. ఆర్ఓ కార్యాలయంతో పాటు సంబంధిత గ్రామపంచాయతీల్లో ప్రకటించాలని ఆదేశించారు. 27 నుంచి 29వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 30న పరిశీలన, డిసెంబర్ 1న అప్పీల్, 3న అభ్యర్థిత్వం ఉపసంహరణ ఉంటుందన్నారు. నామినేషన్లను క్లస్టర్ కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారి స్వీకరిస్తారన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు అభ్యర్థులు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారం నిర్వహించుకోవచ్చని తెలిపారు. మొదటి విడత ఎన్నికలు నిర్వహించే 780 పోలింగ్ కేంద్రాలను ఎంపీడీఓలు ముందుగానే పరిశీలించి.. వాటిలో కనీస మౌలిక సదుపాయాలు ఉండే విధంగా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్స్‌ల సమస్య తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత నోడల్ అధికారులదేనని అన్నారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పోలీసుశాఖ పటిష్ట చర్యలు తీసుకుంటుందన్నారు. నామినేషన్ కేంద్రం వద్ద వంద మీటర్ల లోపు ఎవరిని అనుమతించబడదని.. నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థితో పాటు మరో ఇద్దరు మాత్రమే ఆర్ఓ కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుందన్నారు. ఎన్నికల నోడల్ అధికారులు డీపీఓ శ్రీరాములు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ గోపాల్, సీపీఓ సంధ్యారాణి, డీఈఓ రమేశ్ కుమార్, లేబర్ ఆఫీసర్ రాజ్ కుమార్, డీటీఓ చిన్న బాలునాయక్, డీడబ్ల్యూఓ రాజేశ్వరి, డీవైఎస్ఓ సీతారాం నాయక్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి రాజేందర్‌సింగ్, జిల్లా సర్వేయర్ నాగేందర్, బీసీ వెల్ఫేర్ అధికారి యాదగిరి, ఎస్బీ సీఐ కనకయ్య తదితరులు ఉన్నారు. -
మీ సమస్యలన్నీ తీరుస్తా
మక్తల్: ‘ఉమ్మడి జిల్లా అల్లుడిగా వచ్చా.. ఇక్కడి ప్రజల సమస్యలన్నీ తెలుసు.. వాటిన్నింటి పరిష్కారానికి కృషి చేస్తా.’ అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం మక్తల్ మండలం అనుగొండలో రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆయన భూ నిర్వాసితులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. జూరాల ప్రాజెక్టు, సంగబండ, భూత్పూర్ రిజర్వాయర్లలో భూములు, ఇళ్లు కోల్పో యిన నిర్వాసితులను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. అనుగొండ పునరావాస కేంద్రం ఏర్పాటుకు రూ.42.70 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. సంగంబండ రిజర్వాయర్ నుంచి సాగునీటి పారుదలకు అడ్డుగా ఉన్న బండను తొలగించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కొన్నే ళ్లుగా సమస్యగా ఉన్న బండను తొలగించడంతో పా టు భూ నిర్వాసితులకు రూ.13 కోట్ల పరిహారం అందించామని గుర్తు చేశారు. భూత్పూర్, నేరడ్గం గ్రామాల్లో నిర్వహించిన ఏరియల్ సర్వేలో పలు సమ స్యలు తన దృష్టికి వచ్చాయని.. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. గత ప్రభుత్వం ముంపు గ్రామాలకు సంబంధించిన ఫైళ్లను మూలకు పడేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. ఎత్తిపోతల పథకాలు, చెక్‌డ్యాంలు, కాల్వల మరమ్మతు, నిర్మాణాలకు ప్రత్యేకంగా నిధు లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యరంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. కృష్ణా చెక్‌పోస్టు సమీపంలోని బ్రిడ్జి వద్ద చెక్‌డ్యాం నిర్మాణంతో నిరంతరాయంగా నీరు నిల్వ ఉంటుందని.. అక్కడ చెక్‌డ్యాం నిర్మించి రైతులకు సాగునీటి వసతిని మెరుగుపర్చాలని మంత్రి ఉత్తమ్‌ను కోరారు. అదేవిధంగా ముంపునకు గురైన దాదాన్పల్లి, అంకెన్‌పల్లి, భూత్పూర్, నేరగడం గ్రామాలకు ఆర్అండ్ఆర్ సెంటర్ల ఏరా్పాటుకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుండగా.. కొందరు పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నామని మంత్రి వాకిటి అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే మక్తల్ నియోజకవర్గంలో అనేక సమస్యలు పేరుకుపోయాయని వివరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్‌ను వాకిటి శ్రీహరి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, ఆత్మకూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రహిమతుల్లా తదితరులు పాల్గొన్నారు. రూ.42.70 కోట్లతో అనుగొండ పునరావాస కేంద్రం సంగంబండ వద్ద బండను తొలగించి రైతాంగానికి నీరందించినఘనత మాదే.. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిఉత్తమ్కుమార్రెడ్డి -
దివ్యాంగులు అన్నిరంగాల్లో రాణించాలి
కందనూలు: దివ్యాంగులు అన్నిరంగాల్లో రాణించాలని అదనపు కలెక్టర్ దేవసహాయం అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో మంగళవారం దివ్యాంగులకు క్రీడల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవసహాయం మాట్లాడుతూ దివ్యాంగులు క్రీడలలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి క్రీడాస్ఫూర్తిని చాటి చెప్పాలన్నారు. క్రీడా పోటీల్లో చెస్‌బోర్డు, క్యారమ్స్, జావెలింగ్ త్రో, రన్నింగ్, షాట్‌పుట్ తదితర పోటీలు నిర్వహించి విజేతలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ రాజేశ్వరి, దివ్యాంగుల సంఘాల సభ్యులు శ్రీశైలం, రాజశేఖర్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
వడ్డీలేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
కొల్లాపూర్: వడ్డీ లేని రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం కొల్లాపూర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా మహిళలకు రూ.9.57 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని వివరించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వినియోగించుకొని మహిళలు స్వశక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభు త్వం పంపిణీ చేస్తున్న చీరల పట్ల మహిళలు సంతోషంగా ఉన్నారని, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీరలు ఇస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ చిన్న ఓబులేసు, ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ భరత్‌కుమార్ పాల్గొన్నారు. మహిళా సాధికారతే లక్ష్యం.. అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తోందని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. అచ్చంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో 3,504 మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్‌లను అందజేసి మాట్లాడారు. మహిళలకు ప్రతి ఏడాది రూ.25 వేల కోట్లకు తగ్గకుండా బ్యాంకు లింకేజీ రుణాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత, విజయ డెయిరీ చైర్మన్ నర్సయ్యయాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, బల్మూరు మండలాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
పల్లెపోరుకు సై..
మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ● షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ● రేపటి నుంచే తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ● డిసెంబర్ 11న తొలి దశ పోలింగ్, ఫలితాలు వెల్లడి ● ఉమ్మడి జిల్లాలో 1,678 గ్రామాలు.. 15,077 వార్డులు గ్రామాల్లో రాజకీయ సందడి.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ సందడి మొదలైంది. ఆయా గ్రామాల్లో సర్పంచు, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన ఆశావాహులు ఉత్సాహంగా ఉన్నారు. ఒక్కో గ్రామంలో కనీసం ఇద్దరు, ముగ్గురు చొప్పున పోటీపడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే క్రమంలో రిజర్వేషన్లు తమకు వస్తాయని ఆశించి భంగపడిన వారిలో నిరాశ నెలకొంది. ఇప్పటికే పార్టీల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంతోపాటు గెలుపు గుర్రాలు ఎవరన్న దానిపై ఎవరికి వారు కసరత్తు చేస్తున్నారు. దీనికితోడు ఈసారి ఇద్దరు పిల్లల నిబంధనను ప్రభుత్వం సడలించడంతో చాలామందికి అవకాశం దక్కుతోంది. దీంతో గ్రామాల్లో పోటీచేస్తున్న ఆశావహుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, నాగర్‌కర్నూల్: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటనతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం సందడిగా మారింది. పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. తొలి విడత ఎన్నికలకు ఈ నెల 27 (గురువారం) నుంచే నామినేషన్లను స్వీకరించనుండగా.. డిసెంబర్ 11న తొలివిడత ఎన్నికలు నిర్వహించనున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు, మూడో దశ పంచాయతీ ఎన్నికలను చేపట్టనున్నారు. ఈ నెల 30 నుంచి రెండో విడత నామినేషన్లు స్వీకరించనుండగా.. డిసెంబర్ 14న ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరించి.. 17న ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటనతో గ్రామాల్లో రాజకీయ సందడి జోరందుకుంది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని వేచిచూస్తున్న ఆశావాహుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు గెలుపే లక్ష్యంగా గ్రామాల్లో తమ వ్యూహాలను అమలు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణ ఇలా.. అమలులోకి కోడ్.. పంచాయతీ ఎన్నికల పాలకవర్గం గడువు ముగిసి సుమారు ఏడాదిన్నర కాలం పూర్తయ్యింది. నెలల తరబడి ఎన్నికల నిర్వహణ కోసం ఎదురుచూస్తుండటం, ఇప్పటికే ఒకసారి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి, వాయిదా పడిన క్రమంలో ఈసారి ఎన్నికల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తిచేశారు. ఓటర్ల జాబితా, బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సామగ్రి, ఎన్నికల సిబ్బందికి శిక్షణతోపాటు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేశారు. మంగళవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా అధికార యంత్రాంగం పూర్తిస్థాయి ఏర్పాట్లలో నిమగ్నమైంది. -
సమస్యలపై నేరుగా సంప్రదించండి : ఎస్పీ
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీసుస్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలు పరిష్కారం కోసం సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జి పాటిల్ అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో పలు విభాగాలను పరిశీలించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది శాంతిభద్రల సమస్యలు తలెత్తకుండా ప్రజల రక్షణ కోసం పనిచేయాలన్నారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా సంప్రదించాలని సూచించారు. ఎస్పీ వెంట ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ సీఐ ఉపేందర్‌రావు, ఎస్బీ ఎస్ఐ పర్వతాలు తదితరులున్నారు. దరఖాస్తుల స్వీకరణ కందనూలు: జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయడానికి ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిస్టిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ పోస్టు ఒకటి ఖాళీగా ఉందని, సోషల్ సైన్స్, లైఫ్‌సైన్స్, న్యూట్రిషన్, మెడిసిస్ హెల్త్, సోషల్ వర్కర్, రూరల్ మెనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి 35 ఏళ్లలోపు (ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు) ఉండి మూడేళ్లు ఎన్జీఓ, గవర్నమెంట్లో అనుభవం కలిగిన వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు విద్యార్హత, చిరునామాతో వచ్చేనెల 2లోగా తమ కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలని సూచించారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికే ప్రజాబాట నాగర్‌కర్నూల్: విద్యుత్ సమస్యల పరిష్కారానికే ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యుత్ ఎస్ఈ నర్సింహారెడ్డి తెలిపారు. ప్రజాబాటలో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని హౌసింగ్ బోర్డులో విద్యుత్ సిబ్బంది చేస్తున్న మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు విద్యుత్ సరఫరా విషయంలో ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాని కోరారు. వారంలో మూడు రోజులపాటు మంగళవారం, గురువారం, శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ సమస్యల విషయంలో ఏవైనా ఫిర్యాదులు వస్తే సిబ్బంది వెంటనే స్పందించి వాటిని పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈ శ్రీధర్‌శెట్టి, ఎస్ఏఓ పార్థసారధి, ఏఈ మాన్యనాయక్, లైన్మెన్ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. ‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం నాగర్‌కర్నూల్ రూరల్: జిల్లాలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం ఉమ్మడి జిల్లా నాయకులు కాళ్ల నిరంజన్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేష్‌గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంపూర్ణంగా బీసీ వర్గాలను అణగదొక్కేలా ఉందని ఆరోపించారు. జిల్లాలోని 460 సర్పంచ్ స్థానాల్లో బీసీల వాటాగా 61 స్థానాలు కేటాయించడం దుర్మార్గమన్నారు. బీసీలు జనాభాలో 50 శాతం పైగా ఉన్నా సర్పంచ్ స్థానాల్లో 13 శాతం కేటాయించడం అన్యాయమని విచారం వ్యక్తం చేశారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన సర్పంచ్ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. రామన్‌పాడులో పూర్తిస్థాయి నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 442, సమాంతరం కాల్వ నుంచి 75 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతుండగా.. ఎన్టీఆర్ కాల్వకు 875, వివిధ ఎత్తిపోతలకు 218 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. -
సర్కారు బడులపై దృష్టి
● క్లీన్ అండ్ సేఫ్ 5.0 పేరుతో కార్యక్రమం ● పాఠశాలల రూపురేఖలు మార్చేలా ప్రణాళికలు ● పరిశుభ్రత, విద్యార్థుల రక్షణకు ప్రాధాన్యం ● వచ్చేనెల 5 వరకు కొనసాగింపు నాగర్‌కర్నూల్: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతోపాటు రక్షణ చర్యలు, మౌళిక వసతులు మెరుగుపరిచేందుకు క్లీన్ అండ్ సేఫ్ 5.0 పేరుతో ఓ వినూత్న కార్యక్రమానికి పూనుకుంది. పాఠశాల ఆవరణ, మూత్రశాలు పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతోపాటు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా చేపట్టే ఈ పనులను వచ్చేనెల 5లోగా పూర్తిచేయాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. జిల్లాలో కొనసాగుతున్న ఈ పనులను ఇప్పటికే రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ డిప్యూటీ డైరెక్టర్ రేవతిరెడ్డి పలు పాఠశాలల్లో పరిశీలించి సూచనలు చేశారు. ఈ మేరకు వచ్చేనెల 5 వరకు పనులు పూర్తయ్యేలా ఆయా పాఠశాలల్లో పర్యవేక్షణ కమిటీలు కృషిచేస్తున్నాయి. భద్రతకు పెద్దపీట ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు ఈ కార్యక్రమంలో భాగంగా అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, ఉన్నత పాఠశాలలు అన్నీ కలిపి 842 ఉండగా.. వీటిలో సుమారు 56 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి పాఠశాలను శుభ్రంగా ఆకర్షణీయంగా, సురక్షితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 5.0 ప్రణాళిక రూపొందించారు. దీనికోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసి పనులను కొనసాగిస్తున్నారు. ఈ కమిటీలో ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓ, ఒక అసిస్టెంట్ ఇంజినీర్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం సభ్యులుగా ఉన్నారు. మొదట శిథిలావస్థకు చేరిన, ప్రమాదకరంగా ఉన్న భవనాలను గుర్తించాలని ఎంఈఓలను ఆదేశించారు. అనంతరం తరగతి గదులు, మూత్రశాలలు, వాటర్ ట్యాంకులు తదితర వాటిని శుభ్రపరుస్తారు. పాత వస్తువులైన బేంచీలు, టేబుళ్లు, పాత కంప్యూటర్లు ఇతరత్ర వస్తువులు మొత్తం ఒకచోట వేస్తారు. సదరు వస్తువులను కమిటీ పరిశీలన చేసి వారు నిర్ధారించిన తర్వాత అమ్మకానికి సిద్ధం చేస్తారు. విద్యుత్ వైర్లు, స్విచ్‌లు తనిఖీ చేసి దెబ్బతిన్న వాటిని మార్చేస్తారు. అయితే ఈ పనులను మొదట ఈ నెల 25 వరకు పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఈ పనులు పూర్తయిన వెంటనే మరోమారు ఎక్కడైనా పాఠశాలల్లో ఇబ్బందులు ఉన్నాయో అన్న విషయాలను పరిశీలించి.. పూర్తిస్థాయిలో కార్యక్రమాన్ని వచ్చే నెల 5 వరకు ముగించాల్సి ఉంటుంది. ఎక్కడైతే చెత్తాచెదారం లేకుండా పాఠశాల ఆవరణ శుభ్రపరుస్తారో అక్కడ చెట్లు నాటే కార్యక్రమం చేపడుతారు. ఈ ప్రక్రియను పక్కాగా అమలు చేసేందుకు ప్రత్యేకంగా ప్రణాళిక సైతం రూపొందించి ఇప్పటికే అధికారులకు అందజేయగా ఆ మేరకు పనులు కొనసాగుతున్నాయి. సమస్యలు పరిష్కరిస్తాం.. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకే ప్రభుత్వం క్లీన్ అండ్ సేఫ్ 5.0 కార్యక్ర మం చేపట్టింది. విద్యార్థులకు ఎలాంటి ఇ బ్బందులు కలగకుండా సమస్యలు పరిష్కరిస్తాం. షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు కొన సాగుతున్నాయి. వచ్చే నెల 5 వరకు ఈ పనులను పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయి. – వెంకటయ్య, సెక్టోరియల్ అధికారి -
క్షయ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలి
నాగర్‌కర్నూల్ రూరల్: జిల్లాలోని ప్రతిగ్రామాన్ని క్షయ రహిత పల్లెలుగా తీర్చిదిద్దాలని డీఎంహెచ్ఓ రవికుమార్ అన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్ మండలంలోని గడ్డంపల్లి గ్రామంలో ప్రధానమంత్రి టీబీ భారత్ అభియాన్‌లో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో క్షయవ్యాధి నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన శిబిరాన్ని ఆకస్మికంగా సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ప్రతిఒక్కరు తమ ప్రాంతాన్ని క్షయ రహితంగా తయారు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. క్షయవ్యాధి అనుమానితులందరినీ గుర్తించి ఎక్సురే పరీక్షల వ్యాధిని అంతం చేయగలమన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన బాధితులు త్వరగా కోలుకోవడానికి పోషక ఆహార కిట్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని 150 మందికి ఎక్సురే పరీక్షలు నిర్వహించామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీహెచ్ ఈఓ బ్రహ్మేందర్, అంజనమ్మ, వసంత, పరిమళ, బాలమణెమ్మ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు నిర్లక్ష్య వైఖరి వీడాలి
కల్వకుర్తి/ వెల్దండ: మహిళలను కోటిశ్వరులుగా చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. తక్షణమే వారి పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో కల్వకుర్తి, వెల్దండ మండలాల మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు మహిళలు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఎంపీడీఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూ చించారు. అనంతరం కల్వకుర్తి, వెల్దండ మండలాల పరిధిలోని 1,186 సంఘాలకు రూ.1.27 కోట్ల చెక్కును పంపిణీ చేశారు. వడ్డీ లేని రుణాలు ఇవ్వడం వల్ల మహిళలకు దైర్యం వచ్చిందన్నారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందించడంలో ఐకేపీ సిబ్బంది కీలకపాత్ర పోషించాలన్నారు. అనంతరం వెల్దండ మండలంలోని చెర్కూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. గ్రామంలోని కళాకారులకు డప్పులు, మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సమక్షంలో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరగా.. వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ ఇబ్రహిం, ఎంపీడీఓ వెంకట్రాములు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు ఆనంద్, భూపతిరెడ్డి, రేవతి, మార్కెట్ డైరెక్టర్ రమాకాంత్‌రెడ్డి, నాయకులు మోతీలాల్, పర్వత్‌రెడ్డి, కృష్ణ, లక్ష్మయ్య, రషీద్, పుల్లయ్య పాల్గొన్నారు. -
దరఖాస్తు చేసుకోండి
కందనూలు: భవన నిర్మాణ సంక్షేమ బోర్డు గుర్తింపు కార్డు కోసం జిల్లాలోని కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కార్మికశాఖ అధికారి రాజ్‌కుమార్ సోమవారం ఒక ప్రకట నలో తెలిపారు. గురింపు కార్డు పొందిన కార్మికులకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయని.. భవన నిర్మాణ కార్మికులందరూ తప్ప నిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నేడు జిల్లాస్థాయి దివ్యాంగుల ఆటల పోటీలు కందనూలు: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లాస్థాయి ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారిణి రాజేశ్వరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ విభాగంలో 10–17 ఏళ్లు, సీనియర్ విభాగంలో 18–54 ఏళ్ల వయసు కలిగిన దివ్యాంగులు తమ సదరం సర్టిఫికెట్, ఆధార్‌కార్డుతో ఉదయం 9 గంటలకు పాఠశాల మైదానానికి రావాలని ఆయన సూచించారు. రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్‌గా నందిని కందనూలు: అమ్రాబా ద్ మండలం పదరకు చెందిన కబడ్డీ క్రీడాకారిణి నందిని రాష్ట్ర జట్టు కెప్టెన్‌గా ఎంపికై నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జనార్దన్‌రెడ్డి, యాదయ్యగౌడ్ తెలిపారు. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలోని సోనీపాట్లో జరిగే 35వ జాతీయస్థాయి జూనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో నందిని తెలంగాణ తరఫున పాల్గొంటుందని పేర్కొన్నారు. గత సెప్టెంబర్‌లో నిజామాబాద్ జిల్లా ముప్కాల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చాటి రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా ఎంపికై న నందినికి డీవైఎస్ఓ సీతారాం నాయక్ అభినందనలు తెలిపారు. ‘కురుమూర్తి’ హుండీ ఆదాయం రూ.84 లక్షలు చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు, జాతరను పురస్కరించుకొని హుండీల ద్వారా మొత్తం రూ.84,12,564 ఆదాయం సమకూరింది. ఈ సంవత్సరం నెలరోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగిన ఉత్సవాలకు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలతోపాటు ఇతర దేశాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు వివిధ రకాల కానుకలు స్వామివారికి సమర్పించుకున్నారు. ఈ కానుకల హుండీని ఆలయ అధికారులు నెలరోజుల వ్యవధిలో మూడుసార్లు లెక్కించారు. మొదటిసారి హుండీ ద్వారా రూ.28,70,536, రెండోసారి రూ.24,83,628 రాగా.. తాజాగా సోమవారం మూడోసారి లెక్కింగా రూ.30,58,400 వచ్చింది. దీంతో ఈ సంవత్సరం జాతర హుండీ ఆదాయం మూడు దఫాలు కలుపుకొని మొత్తం రూ.84,12,564 సమకూరినట్లు ఆలయ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, ఈఓ మదనేశ్వరెడ్డి తెలిపారు. గతేడాది జాతర ద్వారా హుండీ ఆదాయం రూ.79,68,810 రాగా.. ఈసారి రూ.4,43,754 అదనంగా వచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇతర దేశాల నుంచి భక్తులు రావడంతో యూఎస్ఏ వన్ డాలర్లు 3, 5 డాలర్ 1, టెన్ డాలర్ 2 వచ్చాయి. అలాగే సింగపూర్ టెన్ డాలర్ 1, బ్యాంకాక్ వంద యూరోస్ 1, మలేషియా టెన్ యూరోస్ 1 వచ్చాయి. ఉత్సాహంగా బాస్కెట్‌బాల్ ఎంపికలు మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో సోమవారం ఉమ్మడి జిల్లా సీనియర్ పురుష, మహిళా బాస్కెట్‌బాల్ జట్ల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఎంపికై న జట్లు సంగారెడ్డిలో ఈ నెల 28 నుంచి 30 వరకు జరిగే రాష్ట్రస్థాయి సీనియర్ బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మక్సూద్‌బిన్ అహ్మద్ జాకీర్ అడ్వకేట్, నసరుల్లా హైదర్‌తోపాటు మీర్ అర్షద్అలీ, సయ్యద్ షరీఫ్అలీ, సుభాన్‌జీ, ఎండీ ఇలియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకం
నాగర్‌కర్నూల్: ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి అత్యంత కీలకమని.. భవిష్యత్‌లో ఉన్నత విద్య, వృత్తిపరమైన జీవితానికి పునాది వంటిదని ఎంపీ డా.మల్లు రవి అన్నారు. కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ బదావత్ సంతోష్, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి పదో తరగతి విద్యార్థులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఢిల్లీకి చెందిన ఐఐఎఫ్ఎస్ఎల్ కంపెనీ వితరణ చేసిన స్టడీ మెటీరియల్‌ను నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో పదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పాఠ్యాంశాల్లోని కీలక భావనలు సులభంగా అర్థమయ్యేలా స్టడీ మెటీరియల్‌ను రూపొందించినట్లు వివరించారు. ● కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. ఎంపీ మల్లు రవి ప్రత్యేక చొరవతో సీఎస్ఆర్ ద్వారా పదో తరగతి విద్యార్థులకు డిజిటల్ స్టడీ మెటీరియల్ అందించడం సంతోషించదగ్గ విషయమన్నారు. విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా చదువుకొని రానున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభకనబరిచాలని సూచించారు. ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. డిజిటల్ స్టడీ మెటీరియల్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.అమరేందర్, డీసీసీబీ చైర్మన్ మావిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, కంపెనీ సీఎండీ జయశంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు
నాగర్‌కర్నూల్: ప్రజావాణి కార్యక్రమం ద్వారా అధికారులు ప్రజలతో నేరుగా మమేకమయ్యే అవకాశం లభిస్తుందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ అమరేందర్‌తో కలిసి ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 31 ఫిర్యాదులు అందగా.. పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించొద్దన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు. సమర్థవంతంగా అమలు.. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ అన్నారు. హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల పురోగతిని కలెక్టర్ వివరించారు. మహిళా సంఘాల్లోని సభ్యులకు ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాల మంజూరు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమష్టిగా పనిచేస్తున్నాయని తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, డీఆర్డీఓ చిన్న ఓబులేషు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మహిళా ఆర్థిక సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్థితి ని మెరుగుపర్చడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అందులో భాగంగా జిల్లాలోని మహిళా సంఘాల బలోపేతానికి ప్రత్యేకంగా రూ. 9.57కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. -
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం : ఎస్పీ
నాగర్‌కర్నూల్ క్రైం: శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా పోలీసుశాఖ పనిచేస్తోందని ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు నిర్భయంగా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మూడో వ్యక్తి ప్రమేయం, పైరవీలకు తావు లేకుండా తమ సమస్యలను చట్టప్రకారం పరిష్కరించుకోవాలన్నారు. పోలీసు సిబ్బంది ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటూ.. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. ప్రజావాణికి వివిధ సమస్యలపై 11 ఫిర్యాదులు అందగా.. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. ● జిల్లా జడ్జి రమాకాంత్‌ను ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ జిల్లా కోర్టులో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. -
మామిడి పూత దశలో సస్యరక్షణ కీలకం
కొల్లాపూర్ రూరల్: మామిడి పూత దశలో సస్యరక్షణ చర్యలు చేపట్టడం కీలకమని జిల్లా ఉద్యానశాఖ అధికారి వెంకటేశం, పాలెం కేవీకే శాస్త్రవేత్త డా.ఆదిశంకర్ అన్నారు. కొల్లాపూర్ మండలం కుడికిళ్ల రైతువేదికలో సోమవారం ఉద్యానశాఖ, పాలెం కేవీకే ఆధ్వర్యంలో మామిడి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మామిడి పూత, పిందె దశల్లో చేపట్టే యాజమాన్య, సస్యరక్షణ చర్యలతో మంచి దిగుబడిని సాధించవచ్చన్నారు. సకాలంలో మామిడి పూత రాని పక్షంలో 13.0.45 రకం రసాయనిక మందు 10 గ్రాములు, బొరాన్ 1.25 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. అదే విధంగా మామిడి తోటల్లో చీడపీడల నివారణ, నీటి యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. అనంతరం రైతులకు మామిడి పండ్ల కవర్లను పంపిణీ చేశారు. ప్రసాద్ సీడ్స్ వారి సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యానశాఖ డివిజన్ అధికారి లక్ష్మణ్, విజయభాస్కర్‌రెడ్డి, భూపేశ్, సింగిల్‌విండో డైరెక్టర్ రఘుపతిరావు పాల్గొన్నారు. -
చెంచుల అభ్యున్నతికి బీజేపీ కృషి
మన్ననూర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీ చెంచుల అభ్యున్నతికి నిరంతరం కృషిచేసే విధంగా సరి కొత్త పథకాలను అమలు చేస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు అన్నారు. బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమలలోని ఆదివాసీల ఆవాసాలను బీజేపీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకు చెంచులు ఆరాధ్య ధైవంగా కొలిచే హక్కుల వీరుడు బిర్సాముండా జయంతి ఉత్సవాలను ఆదివాసీల సమక్షంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం బీజేపీ తరపున చెంచులకు నిర్మించిన ఇళ్లను పరిశీలించి.. చెంచులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అంతకు ముందు మన్ననూర్ గ్రామంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపీ రాములు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రాష్ట్ర గిరిజన మోర్చ అధ్యక్షుడు మంగ్యానాయక్, భరత్‌కుమార్, మండలాధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు -
ముహూర్తం ఖరారు
ఆత్మకూర్: ఏళ్లనాటి కల సాకారం కాబోతోంది. రెండు ప్రాంతాల మధ్య దూరం తగ్గనుంది.. కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి ముహూర్తం ఖరారు కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.. తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి ప్రాజెక్టు అయిన ప్రియదర్శిని జూరాల దిగువన హైలెవల్ బ్రిడ్జి (వంతెన) నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆత్మకూర్ మండలం జూరాల గ్రామం వద్ద రూ.123 కోట్ల నిధులతో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిసెంబర్ 1న వస్తున్నారని రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రకటించారు. ఈ మేరకు వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి భూమిపూజకు సంబంధించి జూరాల గ్రామం పుష్కర ఘాట్ వద్ద, హెలిప్యాడ్‌కు సంబంధించి ఆత్మకూర్ జాతర మైదానం స్థలాలను పరిశీలించి నివేదిక సిద్ధం చేశారు. రవాణా సౌకర్యం మెరుగు.. ఆత్మకూర్ నుంచి జూరాల ప్రాజెక్టు మీదుగా గద్వాలకు వెళ్లేందుకు 32 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూర్ మండలం జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మిస్తే కేవలం 10 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తే సరిపోతోంది. అలాగే గద్వాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలంటే ఎర్రవల్లి చౌరస్తా మీదుగా హైవేపై ప్రయాణించాలి. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం అనంతరం గద్వాల నుంచి 10 కిలోమీటర్లకు ఆత్మకూర్ మీదుగా 14 కిలోమీటర్ల మేర కొత్తకోట హైవేకు చేరుకోవచ్చు. ఫలితంగా 40 కిలోమీటర్ల దూరం తగ్గనున్నట్లు అంచనాలు ఉన్నాయి. అలాగే ఏపీలోని ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయంతోపాటు కర్ణాటకలోని బళ్లారి ప్రాంతాలకు దూరం తగ్గే అవకాశం ఉంది. దీంతో ఆత్మకూర్ మీదుగా 24 గంటలపాటు రవాణా సౌకర్యం కలగనుండడంతో వ్యాపారపరంగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి. జూరాల, కొత్తపల్లి మధ్య కృష్ణానదిపై వంతెన నిర్మాణం కోసం రూ.123 కోట్ల నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించగా.. ఆర్అండ్బీ శాఖ టెండర్ల ప్రక్రియ పూర్తిచేసింది. పనుల ప్రారంభానికి గాను గత నెల చివరి వారంలోనే భూమిపూజ జరుగుతుందని ప్రచారం జరిగిన ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో వాయిదా పడింది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భూమిపూజకు ఆదేశాలు ఇవ్వడంతో డిసెంబర్ 1న ముహూర్తం ఖరారు చేయడంతో మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. టెండర్ల ప్రక్రియ పూర్తి.. కృష్ణానదిపై జూరాల వద్ద హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం గద్వాల– ఆత్మకూర్ మధ్య తగ్గనున్న22 కిలోమీటర్ల దూరం ఇప్పటికే రూ.123 కోట్లు కేటాయింపు.. టెండర్ ప్రక్రియ సైతం పూర్తి రెవెన్యూ డివిజన్ దిశగా ఆత్మకూర్ అడుగులు డిసెంబర్ 1న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన -
రుణపడి ఉంటాం..
గద్వాల మండలంలోని కొత్తపల్లి గ్రామం మీదుగా కృష్ణానదిపై వంతెన నిర్మిస్తారని మా చిన్నప్పటి నుంచి వింటున్నాం. కొంతమంది కుట్రల కారణంగా వంతెన విషయం మరుగున పడింది. ఎన్నో ఏళ్ల కలను ఇప్పుడు సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మా ప్రాంత ప్రజలు రుణపడి ఉంటాం. – అశోక్‌రెడ్డి, మాజీ సర్పంచ్, కొత్తపల్లి గ్రామం, గద్వాల జిల్లా పూర్వవైభవం తీసుకువస్తా.. ఇచ్చిన మాట ప్రకారం జూరాల, కొత్తపల్లి గ్రామాల మధ్య హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం భూమి పూజకు డిసెంబర్ 1న సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నారు. ఒకప్పుడు సంస్థానంగా, తాలుకా కేంద్రంగా అన్ని రకాల కార్యాలయాలతో ఆత్మకూర్ వెలుగొందింది. ఆత్మకూర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రితో సహా రెవెన్యూ మంత్రి, కలెక్టర్‌కు విన్నవించగా.. సానుకూలంగాస్పందించారు. ఆత్మకూర్‌కు పూర్వవైభవం తీసుకువస్తా. – వాకిటి శ్రీహరి, రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి ● -
ఇక సమరమే..
పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం ● తుది ఓటర్ల జాబితా ప్రకటించిన అధికార యంత్రాంగం ● రిజర్వేషన్ల ఖరారుతో గ్రామాల్లో వేడెక్కిన రాజకీయం ● ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పార్టీలు సాక్షి, నాగర్‌కర్నూల్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఓటర్ల జాబితా నుంచి బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సిబ్బంది నియామకం వరకు అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తిచేసింది. పంచాయతీ ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల అంకం పూర్తికావడంతోపాటు తుది ఓటర్ల జాబితా సిద్ధమైంది. ఇక ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల కావడమే మిగిలి ఉంది. మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రకటన విడుదల అవుతుందన్న అంచనాల నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ముగిసిన కసరత్తు.. పంచాయతీ ఎన్నికలను డిసెంబర్లోనే పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఆ దిశగా వేగంగా ఏర్పాట్లు పూర్తిచేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రిజర్వేషన్ల కసరత్తు పూర్తిచేశారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు వీలుగా ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియను ముగించింది. అలాగే ఆదివారం నాటికి తుది ఓటర్ల జాబితా సిద్ధమైంది. ఇప్పటికే పలు విడతల్లో పోలింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తయింది. పావులు కదుపుతున్న పార్టీలు.. పంచాయతీ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అత్యధిక స్థానాలను కై వసం చేసుకొని సత్తా చాటేందుకు పావులు కదుపుతున్నాయి. గ్రామాల వారీగా తేలిన రిజర్వేషన్ల లెక్కలకు అనుగుణంగా గెలుపు గుర్రాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ నాయకులు, కార్యకర్తలతో మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ.. కేడర్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈసారి ఎన్నికల్లో అత్యధిక స్థానాలు తమకే దక్కుతాయని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక బీఆర్ఎస్ ఇప్పటికే విస్తృతంగా పార్టీ సమావేశాలను నిర్వహించగా.. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వాన్ని ఎండగట్టే యోచనలో వ్యూహాలను రచిస్తోంది. బీజేపీ సైతం రాష్ట్రస్థాయిలో సమావేశాలను నిర్వహించడంతోపాటు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవడం ద్వారా రానున్న ప్రాదేశిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రెండ్రోజుల్లో నోటిఫికేషన్.. పంచాయతీ ఎన్నికలను పూర్తిచేసేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. రిజర్వేషన్లపై హైకోర్టులో తీర్పు పెండింగ్‌లో ఉండటంతో వరకు వేచిచూసే ధోరణిలో ఉంది. మంగళవారం వెలువడే తీర్పు తర్వాత రెండు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో గ్రామాల్లో ఆశావహుల సందడి పెరిగింది. ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఓటర్ల వివరాలు.. -
అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటాలి
కల్వకుర్తి రూరల్: గ్రామీణ క్రీడాకారులు అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటాలని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి డా.స్వాములు అన్నారు. ఆదివారం కల్వకుర్తిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ పోటీలు నిర్వహించగా.. జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన 150 మంది బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 2, 4, 6, 8, 10 కి.మీ. క్రాస్ కంట్రీ రన్నింగ్‌లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు స్వాములు బహుమతులను ప్రదానం చేశారు. జిల్లాస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభకనబరిచిన క్రీడాకారులు జనవరి 4న హైదరాబాద్‌లోని బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో నిర్వహించే 11వ తెలంగాణ రాష్ట్ర క్రాస్ కంట్రీ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఏకాగ్రతతో ఆడి సత్తా చాటాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో భిక్షపతి యాదవ్, ప్రసాద్, మల్లేష్, అరుణ, జాఫర్, శ్రీనివాస్, చంద్రశేఖర్, భీమయ్య తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్లు ఖరారు..
సాక్షి, నాగర్‌కర్నూల్: ఊగిసలాడుతూ.. వాయిదాలు పడుతూ వస్తున్న పంచాయతీ ఎన్నికల నిర్వహణ మరోసారి కీలక ఘట్టానికి చేరుకుంది. గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా అధికారులు ఆదివారం రిజర్వేషన్లు ఖరారు చేశారు. మొత్తం రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేశారు. కీలకమైన రిజర్వేషన్ల కేటాయింపుతో గ్రామాల్లో మళ్లీ రాజకీయ వాతావరణం ఊపందుకుంది. రిజర్వేషన్ల ఖరారు నేపథ్యంలో నేడో, రేపో గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. 50శాతం కోటా మేరకు మార్పులు.. ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ చేసిన ప్రక్రియతో ఎన్నికల నిర్వహణ నిలిచిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నెలరోజుల్లోనే ఎన్నికల నిర్వహణ చేపట్టాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఈ మేరకు రిజర్వేషన్ల ప్రక్రియను సవరించింది. మొత్తం కోటా 50 శాతానికే పరిమితం చేస్తూ.. గ్రామాలు, వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఈ మేరకు 2019 సాధారణ ఎన్నికల సమయంలో చేసిన రిజర్వేషన్లనే అనుసరిస్తూ.. రొటేషన్ ప్రాతిపదికన మార్పులు చేసింది. ఎట్టకేలకు రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం.. ఎన్నికల నిర్వహణకు మార్గం సుగుమం కావడంతో గ్రామాల్లో మళ్లీ సందడి మొదలైంది. ఎస్టీ వర్గానికి అత్యధికంగా 133 స్థానాలు.. జిల్లాలో 460 గ్రామపంచాయతీలు ఉండగా.. వీటిలో అత్యధికంగా 133 స్థానాలను ఎస్టీ వర్గానికి కేటాయించారు. ఎస్సీలకు 85, బీసీలకు 61, జనరల్‌కు 181 స్థానాలను కేటాయించారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోని స్థానాలను పూర్తిగా ఎస్టీలకే కేటాయించడంతో పాటు మిగిలిన స్థానాల్లోనూ కోటా మేరకు రిజర్వేషన్ కల్పించడంతో ఎస్టీలకు అత్యధికంగా 133 స్థానాలు రిజర్వు అయ్యాయి. ప్రత్యేక వ్యూహాలతో పార్టీలు.. ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందన్న అంచనాలతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలతో రాజకీయ వేడిని పెంచాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. ఈసారి ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సొంతం చేసుకుంటామని భావిస్తోంది. బీఆర్ఎస్ ఇప్పటికే విస్త్రృతంగా పార్టీ సమావేశాలను నిర్వహించింది. బీసీ రిజర్వేషన్ల హామీపై ప్రభుత్వాన్ని ఎండగట్టే యోచనతో వ్యూహాన్ని పన్నుతోంది. బీజేపీ సైతం ఇప్పటికే రాష్ట్రస్థాయిలో సమావేశాలను నిర్వహంచగా.. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కై వసం చేసుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఎస్సీ 85 బీసీ 61 పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను సిద్ధం చేయడంతో పాటు పోలింగ్ సామగ్రిని అందుబాటులో ఉంచింది. ఇప్పటికే విడతల వారీగా పోలింగ్ సిబ్బందికి శిక్షణ సైతం పూర్తిచేసింది. ఎప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినా విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు. అధికార యంత్రాంగం సిద్ధం.. గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రకటన నేడో, రేపో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం పల్లెల్లో మళ్లీ మొదలైన సందడి -
ఉమ్మడి జిల్లాలో 175 మందికే ఉద్యోగాలు..
మా పూర్వీకుల స్వగ్రామం అసద్‌పూర్. శ్రీశైలం బ్యాక్‌వాటర్ కారణంగా మా ఊరంతా మునిగిపోయి సర్వం కోల్పోయాం. ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 98, 68 అమలు కోసం ఎదురుచూస్తున్నాం. నిర్వాసితుల్లో చాలా మంది పేదరికంతో చనిపోయారు. వారి కుటుంబాలను ఆదుకోవాలి. – మేనుగొండ రాముయాదవ్, శ్రీశైలం నిర్వాసితుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. జటప్రోల్ సభలో నిర్వాసితుల అంశంపై నివేదిక తయారు చేయాలని మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావుకు సూచించారు. నిర్వాసితుల వివరాలు, ఉద్యోగాల ఖాళీలు వంటి అంశాలపై కలెక్టర్లతో చర్చించామన్నారు. ఈ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. – డాగోజీరావు, శ్రీశైలం నిర్వాసితుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. కొంతకాలంగా నిర్వాసితులు మమ్మల్ని కలుస్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు ఇతరులతో కూడా వారు చర్చించారు. ఉద్యోగాల కల్పనకు సంబంధించి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. 98, 68 జీఓలపై ప్రభుత్వ ఆదేశానుసారం చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ, నీటిపారుదల శాఖ శ్రీశైలం ప్రాజెక్టు పేరు చెప్పి.. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఆశచూపి.. ఇళ్లు, భూములు లాక్కున్నారు.. ఊళ్లకుఊళ్లు ఖాళీ చేయించి.. ఏటి ఒడ్డున పడేశారు.. ఏళ్లకు ఏళ్ల తరబడి ఏ ఒక్కరూ మా గోస పట్టించుకోలేదు. అధికారులకు ఇచ్చిన వినతులు బుట్టదాఖలయ్యాయి.. ప్రజాప్రతినిధులు గుప్పించిన హామీలు నీటిమూటలయ్యాయి.. కార్యాలయాల చుట్టూ తిరిగి చెప్పులరిగాయి.. వయస్సు మీదబడి అలసిపోయాం.. అయ్యా, సీఎం గారూ.. మీరైనా సొంత జిల్లావాసులపై కనికరం చూపి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలంటూ శ్రీశైలం నిర్వాసితులు వేడుకుంటున్నారు. కొల్లాపూర్: దశాబ్దాల కాలంగా శ్రీశైలం నిర్వాసితుల సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. శ్రీశైలం డ్యాం నిర్మాణంతో భూములు, నివాసాలు కోల్పోయిన నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ 98ను విడుదల చేసింది. ఈ మేరకు కర్నూలు జిల్లాలో దాదాపు 70 శాతం మంది నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వగా.. తెలంగాణలో జీఓ 98 అమలుకు నోచుకోలేదు. సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇచ్చి న్యాయం చేస్తామని నాలుగు దశాబ్దాలుగా పాలకులు ఇస్తున్న హామీలు నీటమూటలుగానే మారుతున్నాయి. జీఓ అమలు కోసం సుదీర్ఘకాలంగా ఆందోళనలు చేసిన శ్రీశైలం నిర్వాసితులు.. న్యాయపోరాటం సైతం చేస్తున్నప్పటికీ పాలకుల్లో చలనం రావడం లేదు. కృష్ణానది తీరంలో పునరావాస గ్రామం మంచాలకట్ట శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ఉమ్మడి పాలమూరు, కర్నూలు జిల్లాల్లోని పలు గ్రామాలు కృష్ణా బ్యాక్‌వాటర్‌లో మునిగిపోయాయి. 1970– 82 మధ్యకాలంలో అధికారులు నిర్వాసిత గ్రామాల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. దీంతో వారు నది తీరంలోనే కొత్తగా నివాసాలు ఏర్పాటు చేసుకోగా.. కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. నిర్వాసితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో 1986లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీఓ 98 జారీ చేసింది. ఈ జీఓ ద్వారా ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని.. చదువుకున్న వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆ జీఓ ప్రకారం కర్నూలు జిల్లాలో వేలాది మంది నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించిన గత ప్రభుత్వాలు.. పాలమూరు నిర్వాసితులను పట్టించుకోలేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 2,318 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో ఐదుగురికి 1993లో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మరో 30 మందికి, 2015లో కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో 128 మంది నాన్ లోకల్ కోటా ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన లష్కర్ ఉద్యోగాలు కల్పించారు. వీరిలో ఐదుగురి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేశారు. ఈ ఏడాది కోర్టు ఆదేశాల ప్రకారం నాగర్‌కర్నూల్ కలెక్టర్ 12 మంది నిర్వాసితులకు నీటిపారుదల శాఖలో ఉద్యోగాలు ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 175 మంది నిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం మిగిలిన వారిలో 633 మంది మరణించగా.. 410 మంది వయసు పైబడి ఉద్యోగార్హత కోల్పోయారు. ఇక మిగిలింది 1,206 మంది మాత్రమే. అయితే వీరే కాకుండా.. పలువురు నిర్వాసితులు ఉద్యోగాల అర్హుల జాబితాలో తమ పేర్లు కూడా చేర్చాలంటూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక స్థానిక నేతలు నిర్వాసితుల సమస్యను అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అర్హులైన వారికి ఉద్యోగాలకు బదులుగా నగదు ప్యాకేజీ అందించాలని భావించారు. అది కూడా ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ, ఈ ఏడాది జటప్రోల్ సభలోనూ నిర్వాసితుల అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పలుమార్లు నిర్వాసితులు మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. కానీ, సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా.. ప్రజాప్రతినిధులు మారినా తీరని గోస బుట్టదాఖలైన వినతులు.. నీటిమూటలైన హామీలు ఎన్ని పోరాటాలు చేసినా అమలుకాని 98, 68 జీఓలు సొంత జిల్లావాసులపై ముఖ్యమంత్రి కనికరం చూపాలని వేడుకోలు జీఓ 98 ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టులో మాత్రమే నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలనే నిబంధన ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం 2014లో జీఓ 68 జారీ చేసింది. దీన్ని ప్రకారం ఏ ప్రాజెక్టులోనైనా సరే నిర్వాసితులకు కనీసం గ్రూప్–4 స్థాయి ఉద్యోగాలు కల్పించే వెసులుబాటు కల్పించింది. ఇప్పటి వరకు ఈ జీఓను అమలుపర్చలేదు. 2015లో శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులు పాలమూరులో 173 రోజులపాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అప్పట్లో ప్రభుత్వ పెద్దలు నిర్వాసితులకు ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా.. నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. -
ఉత్సాహంగా వాలీబాల్ క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా జూనియర్ బాలబాలికల జట్ల ఎంపికలు నిర్వహించారు. జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఎంపికలకు 90మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీలో ఉమ్మడి జిల్లా జట్లు విజేతలు నిలవాలని ఆకాంక్షించారు. టోర్నీలో క్రీడాస్ఫూర్తిని చాటాలని కోరారు. రాజన్న సిరిసిల్లలో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు రాష్ట్రస్థాయి అంతర్జిల్లా జూనియర్ వాలీబాల్ టోర్నమెంట్ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి మహ్మద్ హనీఫ్, కార్యనిర్వాహక కార్యదర్శి చెన్న వీరయ్య, నర్సింహరాజు, వజీర్, దస్తగీర్ఖాన్, కోచ్ పర్వేజ్‌పాష తదితరులు పాల్గొన్నారు. -
చదువుతోనే మహిళా సాధికారిత సాధ్యం
వీపనగండ్ల: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యలో రాణించినప్పుడే మహిళా సాధికారిత సాధ్యమవుతుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో పాన్‌గల్, చిన్నంబావి, వీపనగండ్ల మండలాల మహిళలకు ఇందిరా మహిళాశక్తి చీరలతో పాటు కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తోందన్నారు. మహిళలు దుబారా ఖర్చులు తగ్గించి పొదుపు సూత్రాలు పాటిస్తూ ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళలకు రైస్ మిల్లులు, పెట్రోల్ బంకులను మంజూరు చేస్తూ కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో పని చేస్తున్నారని చెప్పారు. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో మహిళలు దైవ దర్శనాలు, పర్యాటక ప్రాంతాలు సందర్శించే అవకాశం లభించిందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు, పాఠశాలలను ఆశ్రయించడంతో గ్రామీణ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులుకు గురవుతున్నాయని.. ప్రభుత్వం అందిస్తున్న వైద్యసేవలు, గురుకులాలను ఉపయోగించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం చేసిన అధిక అప్పులతో కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం అందించలేకపోతున్నామని.. రాబోయే మూడేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో నెరవేరుస్తామని చెప్పారు. సాంకేతిక కారణాలతో అర్హులైన వారిని ఉచిత విద్యుత్, రాయితీ గ్యాస్ సిలిండర్ పథకాలు అందడం లేదని.. అధికారులు సమస్యను గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కీమ్యానాయక్, అడిషనల్ డీఆర్డీఓ సరోజ, మూడు మండలాల మహిళా సమాఖ్య మండల అధ్యక్షులు చిట్టెమ్మ, ఇందిర, సురేఖ, ఆయా మండలాల తహసీల్దార్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
ప్రశాంతంగా ఎన్ఎంఎంఎస్ పరీక్ష
కందనూలు: జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మూడు కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష కొనసాగింది. ఈ పరీక్షకు 747 మంది విద్యార్థులకు గాను 706 మంది హాజరయ్యారని పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్‌రావు తెలిపారు. పరీక్ష కేంద్రాలను డీఈఓ రమేశ్‌కుమార్, సూపరింటెండెంట్ నాగేంద్రం పరిశీలించారు. సత్యసాయి సేవలు స్ఫూర్తిదాయకం కందనూలు: మానవ సేవే.. మాధవ సేవని నమ్మి సత్యసాయిబాబా అందించిన సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని భగవాన్ శ్రీసత్యసాయి మందిరంలో ఆదివారం నిర్వహించిన సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సత్యసాయి సేవాసమితి, శ్రీసాయి ప్రశాంతి చారిటబుల్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు దుస్తులు, దుప్పట్లు, అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సత్యసాయి సేవాసమితి కన్వీనర్ హకీం విశ్వప్రసాద్, చారిటబుల్ సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు హకీం మురళి, ప్రధాన కార్యదర్శి ఏలిమె ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. నేడు నల్లమలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాక అచ్చంపేట: నల్లమలలోని భౌరాపూర్ చెంచుపెంటలో సోమవారం నిర్వహించే భగవాన్ బిర్సా ముండా జయంతి ఉత్సవాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హాజరవుతారని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్పారు. ఆదివారం అచ్చంపేటలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిర్సా ముండా వీరోచిత పోరాటం, విలక్షణ నాయకత్వం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన జయంతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ‘జనజాతి గౌరవ దివస్’గా దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తూ.. గిరిజనుల గౌరవాన్ని పెంచిందన్నారు. ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమం ద్వారా నల్లమలలోని ఆదివాసీలకు పర్యావరణ గృహాలు మంజూరు చేసినట్లు వివరించారు. జిల్లాలో తొలిసారిగా పర్యటిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదివాసీల నూతన గృహాలను సందర్శిస్తారని తెలిపారు. సమావేశంలో బీజేపీ నాయకులు మంగానాయక్, ఆంజనేయులు, రాములు, నాగయ్యగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, చందూలాల్, శివచంద్ర, రాకేశ్, శివ పాల్గొన్నారు. మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాత రకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి.. మైసమ్మ దేవతను దర్శించుకున్నారు. పచ్చిపులుసు అన్నంతో నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దాదాపు 12వేల మంది భక్తులు మైసమ్మను దర్శించుకున్నట్లు ఎండోమెంట్ అధికారి రామేశ్వర్ శర్మ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, వనపర్తి నుంచి ప్రత్యేక బస్సులను నడిపించారు. -
లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటం
కల్వకుర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు ప్రజా సంఘాలతో కలిసి పోరాడుతామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు అన్నారు. లేబర్ కోడ్ల అమలును వ్యతిరేకిస్తూ ఆదివారం పట్టణంలోని మహబూబ్‌నగర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక సంఘాల పోరాటంతో 8 గంటల పనిదినాలను సాధించామన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం కార్మికుల హక్కులకు భంగం కలిగేలా ఉందన్నారు. పార్లమెంట్లో సంఖ్యాబలం ఉందని ఐదేళ్ల క్రితం 29 కార్మిక చట్టాలను రద్దుచేసిన మోదీ ప్రభుత్వం.. బిహార్ ఎన్నికల అనంతరం లేబర్ కోడ్లను అమలు చేయడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యవాదులు, కార్మిక సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు బాలయ్య, శ్రీనివాసులు, బాల్‌రెడ్డి, ఆంజనేయులు, యాదయ్య, చంద్రయ్య, పెద్ద యాదవ్, అంజయ్యగౌడ్ పాల్గొన్నారు. -
బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్
నాగర్‌కర్నూల్ క్రైం: శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని, ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా సంప్రదించాలని నూతన ఎస్పీ సంగ్రామ్సింగ్జి పాటిల్ అన్నారు. శనివారం ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ వెంకటేశ్వర్లు నూతన ఎస్పీకి పూలబొ కే అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్స్టేషన్లకు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందేలా పోలీసు సిబ్బంది కృషి చేయాలన్నారు. అంతకు ముందు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ నూతన ఎస్పీకి బాధ్యతలు అప్పగించి హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా బదిలీపై వెళ్లారు. ‘పంచాయతీ’ రిజర్వేషన్లపై కసరత్తు నాగర్‌కర్నూల్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతుంది. ఇందులో భాగంగా కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ శనివారం కలెక్టరేట్లో పూర్తిచేయనున్నారు. ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగనుండగా ఆదివారం రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో ఖరారయ్యే అవకాశం ఉంది. కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్లు, జిల్లా పరిధిలోని నలుగురు ఆర్డీఓల సమక్షంలో రిజర్వేషన్లు ఎంపిక చేశారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ప్రకారం లక్కీడిప్ ద్వారా కేటాయించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల ప్రక్రియ శుక్రవారం పూర్తికాగా.. మహిళల రిజర్వేషన్ స్థానాలు ఎంపిక చేయనున్నారు. ఈ రిజర్వేషన్ల జాబితాను ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు పంపిస్తారు. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా, బీసీలకు 2024 కుల గణన సర్వే నివేదిక ప్రామాణికంగా తీసుకున్నారు. 2019 నాటి రిజర్వేషన్ స్థానాలను మార్చాల్సి ఉన్నందున్న రొటేషన్ పద్ధతిన ఈ జాబితాను పరిశీలిస్తూ తాజాగా రిజర్వేషన్లను కేటాయించనున్నారు. వీటిని సెప్టెంబర్‌లో ఖరారు చేసిన రిజర్వుడ్ స్థానాలతో పోల్చనున్నారు. ఇందులో బీసీ కేటగిరి స్థానాలను 42 శాతం నుంచి 22.3 శాతానికి తగ్గించి మిగిలిన 19.7 శాతం సీట్లను జనరల్ కేటగిరికి కేటాయించనున్నారు. డిజిటల్ లెర్నింగ్‌లో రాష్ట్రంలో 3వ స్థానం తిమ్మాజిపేట: మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థులు డిజిటల్ లెర్నింగ్‌లో రాష్ట్రస్థాయిలో 3వ స్థానంలో నిలిచారు. దీంతో విద్యాలయం ప్రత్యేకాధికారి సుజాతకు మరింత శిక్షణ ఇచ్చేందుకు ఖాన్ అకాడమీ ఢిల్లీలో జరిగే సెమినార్‌కు ఆహ్వానించింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీల్లో విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కరికులంలో భాగంగా ఖాన్ అకాడమీ స్టెమ్ (డిజిటల్ లెర్నింగ్) కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. గత ఆరు నెలల నుంచి పాఠశాల వారిగా ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను విద్యాశాఖ అధికారులు పరిశీలించారు. డిజిటల్ లెర్నింగ్‌లో తిమ్మాజిపేట కేజీబీవీ రాష్ట్రస్థాయిలో టాప్–3లో ఉండడంతో ఖాన్ అకాడమీ ఎడ్యుకేషన్ సమ్మిట్ వారు ప్రత్యేకాధికారి సుజాతను శనివారం ఢిల్లీలో జరిగే సెమినార్‌కు రావాలని ఆహ్వానం పంపడంతో ఆమె వెళ్లారు. పర్యావరణంపై అవగాహన అవసరం కందనూలు: విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన అవసరమని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఏకో బజార్ పర్యావరణం కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులలో పర్యావరణ అంశాల మీద అవగాహన కల్పించడం కోసం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ స్టాండ్ కై ్లమెట్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర జాతీయ హరితదళం, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిరుపయోగ వస్తువుల నుంచి.. ఉపయోగపడే పర్యావరణహితమైన వస్తువులపై అవగాహన కల్పించడం కోసం విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో శ్రీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మొదటి బహుమతి, ద్వితీయ బహుమతి శారద ఉన్నత పాఠశాలకు లభించింది. కార్యక్రమంలో ఎంఈఓ భాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్ నాగేందర్, రాజశేఖర్‌రావు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
మహిళల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
పెద్దకొత్తపల్లి/ పెంట్లవెల్లి: మహిళల ఆర్థిక అభివృద్ది కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం ఆయన కలెక్టర్ బదావత్ సంతోష్‌తో కలిసి పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లిలో ఇందిరమ్మ మహిళాశక్తి చీరలు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసి మాట్లాడారు. మహిళ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం, వడ్డీ లేని రుణాలు, మహిళలను యజమానులను చేయడం కోసం అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ, మహిళా సంఘాలకు పెట్రోల్ పంపులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లను అప్పగించి అనేక కార్యక్రమాల ద్వారా వారిని ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ క్యాంటీన్లు, మీసేవా కేంద్రాలు, బస్సుల కొనుగోలు కోసం రుణాలు, వరి ధాన్యం సేకరణ అప్పగించి మహిళలను ఆర్థికంగా నిలబెట్టిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ద్వారా రూ.8 వేల కోట్లు మిగిల్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే చేయూతతో మహిళలు ఆర్థికంగా రాణించాలన్నారు. కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందని, ప్రధానంగా మహిళలు వ్యాపారాల్లో రాణించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ప్రభుత్వం అందించే చీరలను మహిళలు గౌరవంగా భావించి ధరించాలన్నారు. వ్యాపార రంగాల్లో మహిళలు రాణించే విధంగా ప్రభుత్వం చేయూత అందిస్తుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్డీఓ చిన్న ఓబులేష్, కొల్లాపూర్ ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ నాగేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహ, మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్‌గౌడ్, నాయకులు వెంకటేశ్వర్రావు, వెంకటేశ్వర్‌రెడ్డి, సత్యం, విష్ణు, శ్రీనివాసులు, గోపాల్‌రావు, శివకుమార్‌రావు, చంద్రయ్య, ఎల్లయ్య, కుర్మయ్య, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
డీసీసీ అధ్యక్షుడిగా వంశీకృష్ణ
● వరుసగా మూడోసారి నియామకమైన అచ్చంపేట ఎమ్మెల్యే అచ్చంపేట: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. వంశీకృష్ణ డీసీసీ అధ్యక్షుడిగా 2019 నుంచి వరుసగా ఎన్నిక కావడం ఇది మూడోసారి. ఇప్పటికే తమిళనాడు ఏఐసీసీ పరిశీలకులుగా నియమితులయ్యారు. డీసీసీ అధ్యక్షుడిగా వంశీకృష్ణ నియామకంపై రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తనను డీసీసీ అధ్యక్షుడిగా నియమించిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ప్రియాంకగాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
అచ్చంపేటకు ఆటుపోట్లు
ఎత్తిపోతల పథకం పనుల్లో తీవ్ర జాప్యం ●పాలమూరు ఎత్తిపోతలలో భాగంగా ఏదుల రిజర్వాయర్‌తోపాటు మొలచింతలపల్లి సమీపంలోని కృష్ణానది బ్యాక్‌వాటర్ నుంచి నీటిని తరలించేలా రెండు ప్రతిపాదనలు ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఉమామహేశ్వర రిజర్వాయర్ కోసం భూ సేకరణ చేపట్టేందుకు ప్రభుత్వం జీఓ 42 విడుదల చేసింది. ఈ జీఓ ప్రకారం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసి నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించి భూ సేకరణ చేపడుతాం. – అమర్‌సింగ్, ఈఈ ఇరిగేషన్ శాఖ, అచ్చంపేట -
ఊగిసలాడుతోంది..!
మల్లేశ్వరం– సిద్దేశరం వంతెనకు లభించని మోక్షం కొల్లాపూర్– సోమశిల రహదారి వరిదేల శివారు నుంచి రహదారి పనులు మొదలు కావాల్సి ఉంది. మూడో ప్యాకేజీలో ఐకానిక్ వంతెన ఇవతల 8 కి.మీ., ఏపీ పరిధిలో సిద్దేశ్వరం గుట్టల మధ్య 5.4 కి.మీ., అప్రోచ్ రహదారి నిర్మించాలి. వంతెన నిర్మించే ప్రాంతం వరకు భూ సేకరణ చేయాల్సి ఉంది. ఇందులో అటవీ శాఖకు చెందిన భూమితోపాటు రెవెన్యూ, రైతుల పట్టా భూమలు ఉన్నాయి. ఇప్పటి అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. భూ సేకరణ ప్రక్రియ ఓ కొలిక్కి వస్తే టెండర్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. – రాజేందర్, ఈఈ జాతీయ రహదారుల శాఖ -
ముంపు బాధితులకు అండగా ప్రభుత్వం
అచ్చంపేట: నక్కలగండి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న గ్రామాలకు పునరావాసం, పునర్నిర్మాణం ప్రక్రియ వేగవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం అచ్చంపేట మండలం మర్లపాడుతండాను అదనపు కలెక్టర్ అమరేందర్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నక్కలగండితండా, మర్లపాడుతండా, కేశ్యతండా, మన్నేవారిపల్లి గ్రామాల ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ప్రజల అవసరాలు, అభిప్రాయాలు, పునరావాసంపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు తాము ఈ ప్రాంతానికి వచ్చి ముంపు ప్రభావం, పునరావాస పనులు, పంట నష్టాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ముఖ్యమని, ముఖ్యమంత్రి సూచనల ప్రకారం ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరిపి, తమ పరిధిలో చేయాల్సిన పనులను ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పూర్తిగా అమలుచేస్తానని హామీ ఇచ్చారు. పునరావాసానికి సంబంధించిన ప్రతి పని పారదర్శకంగా, వేగంగా జరిగేలా స్వయంగా పర్యవేక్షిస్తానన్నారు. ప్రజలకు అనువైన స్థలాన్ని ఎంపిక చేయడానికి ప్రభుత్వం అందుబాటులో ఉన్న భూములను పరిశీలిస్తోందని చెప్పారు. పునరావాస కాలనీల్లో కేవలం ఇళ్ల నిర్మాణం మాత్రమే కాకుండా, నీటి సౌకర్యం, విద్యుత్, అంతర్గత రహదారులు, డ్రెయినేజీలు, వీధిదీపాలు, కమ్యూనిటీ హాళ్లు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు నిర్మించేలా చూస్తామన్నారు. పునరావాసం పూర్తయ్యే వరకు ప్రభుత్వం ప్రజల వెంటే నిలుస్తుందని భరోసా ఇచ్చారు. నక్కలగండి ప్రాజెక్టు నుంచి ప్రవాహిస్తుతన్న నీరు, ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల ప్రభావాన్ని కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. పత్తి, వరి వంటి ముఖ్య పంటలు పెద్దఎత్తున తడిసి దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించి, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న నష్టాల స్థాయిని సమగ్రంగా అంచనా వేసి, రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి వివరాలతో నివేదికలు పంపామన్నారు. వ్యక్తిగత, చిన్న వ్యాపారాల వల్ల నష్టపోయిన వారు కూడా స్వయంగా వచ్చి తమ సమస్యలను వివరించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మాధవి, తహసీల్దార్ సైదులు తదితరులు పాల్గొన్నారు. -
నూతన ఎస్పీగా పాటిల్ సంగ్రామ్‌సింగ్ గణపతిరావ్
నాగర్‌కర్నూల్ క్రైం: నూతన ఎస్పీగా పాటిల్ సంగ్రామ్‌సింగ్ గణపతిరావ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాటిల్ సంగ్రామ్‌సింగ్ గణపతిరావ్ 2015 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందినవారు. ప్రస్తుతం ఈయన హైదరాబాద్ సీఐడీ నుంచి బదిలీపై నాగర్‌కర్నూల్ ఎస్పీగా వస్తున్నారు. గతంలో ములుగు ఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం ఎస్పీగా పనిచేస్తున్న గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా బదిలీపై వెళ్తున్నారు. ఉత్తీర్ణత శాతం పెంపునకు కృషిచేయాలి కొల్లాపూర్ రూరల్: రానున్న పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు సమష్టిగా కృషిచేయాలని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని కోర్టు వీధిలోని ప్రాథమిక పాఠశాల, గాంధీ ఉన్నత పాఠశాల, కస్తూరిబా గాంధీ, ఎల్లూరు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, అమరగిరి పాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా నాణ్యమైన బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. గాంధీ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న కాంప్లెక్స్ సమావేశాన్ని ఆయన పరిశీలించి.. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలను పరిశీలించి.. పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. పిల్లలు చదువుకునేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలన్నారు. పరీక్షలు సమయం సమీపిస్తున్న తరుణంలో ఉత్తీర్ణత శాతం మెరుగుపరుచుటకు ప్రత్యేక క్లాసులను నిర్వహించి విద్యార్థులలో ఏకాగ్రతను పెంచాలని కోరారు. అమరగిరిలో పాఠశాలకు కాంపౌండు నిర్మాణం చేయాలని గ్రామస్తులు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా టెస్టు బుక్ మేనేజర్ నర్సింహులు, ఎంఈఓ ఇమ్మానుయల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మద్దిమడుగు హుండీ ఆదాయం రూ.26 లక్షలు అమ్రాబాద్: పదర మండలంలోని మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి హుండీ ఆదాయాన్ని శుక్రవారం ఆలయ అధికారులు భక్తుల సమక్షంలో లెక్కించారు. మూడు నెలలకు సంబంధించి మొత్తం హుండీ ఆదాయం రూ.26,18,711తోపాటు మిశ్రమ వెండి 2.812 కిలోలు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. లెక్కించిన మొత్తాన్ని పదర గ్రామీణ వికాస్ బ్యాంకులో భద్రపరిచారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ మదన్‌కుమార్, ఈఓ రంగాచారి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రాములునాయక్, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. -
అలవి వలలను బ్యాన్ చేయిస్తాం
● ఈ అంశంపై ఏపీ అధికారులతో మాట్లాడతా ● రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కొల్లాపూర్: కృష్ణానదిలో అలవి వలలతో వేటను పూర్తిస్థాయిలో బ్యాన్ చేస్తామని, దీనిపై ఏపీకి చెందిన పోలీసు, రెవెన్యూ అధికారులతో కూడా మాట్లాడుతామని రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కొల్లాపూర్‌లో నిర్వహించిన ప్రపంచ మత్స్యకార దినోత్సవంలో మంత్రి వాకిటి శ్రీహరితోపాటు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి, కాంగ్రెస్ నేత నీలం మధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.122 కోట్లు కేటాయించిందని, వాటితో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. మంత్రి జూపల్లి లేఖ పంపిస్తే కొల్లాపూర్‌లో చేపపిల్లల ఉత్పత్తి యూనిట్, మత్స్య పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. కొల్లాపూర్ చేపలను ప్రపంచ స్థాయి మార్కెట్‌కు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ మత్స్యకారుల కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్‌తోనే బీసీల సంక్షేమం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పెద్దకొత్తపల్లి మండలంలో రూర్బన్ మిషన్ కింద మంజూరైన నిధులతో కోల్డ్ స్టోరేజీ, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. మామిడి, చేపల విక్రయాల కోసం 116 ఎకరాల్లో మార్కెట్ నిర్మాణానికి భూ సేకరణ చేస్తున్నట్లు వివరించారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం పాటుపడుతోందని చెప్పారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ అడుక్కుంటే పదవులు రావని, గుంజుకోవాలని ముదిరాజ్‌లకు సూచించారు. జనాభా దామాషా ప్రకారం రాజకీయ పదవులకు పోటీపడాలని, ఇందుకు ఐక్యంగా ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. తాను బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు మత్స్యకారుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని, ఇప్పుడు కూడా బీజేపీ ఎంపీగా కేంద్రంలో మత్స్యకారుల సంక్షేమం కోసం అవసరమైన కృషిచేస్తానన్నారు. ఎంపీ మల్లురవి మాట్లాడుతూ ముదిరాజ్‌లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషిచేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నేత నీలం మధు మాట్లాడుతూ బీసీ ఏ గ్రూపులో చేర్చే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించాలని మంత్రులను కోరారు. నాయకులు డాక్టర్ పగిడాల శ్రీనివాసులు, ఎల్లేని సుధాకర్‌రావు, కేతూరి వెంకటేష్, పెబ్బేటి కృష్ణయ్య, మల్లికార్జున్, వెంకటస్వామి, గాలెన్న, హుస్సేనయ్య, హరికృష్ణ, శివవర్మ, చెన్నరాములు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీకి సన్నద్ధం
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శనివారం నాటికి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు బీసీలకు 42 శాతం కేటాయిస్తూ ఇటీవల ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ స్థానంలో మొత్తం రిజర్వేషన్లను 50 శాతానికి కుదిస్తూ రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేయనున్నారు. ఈ మేరకు త్వరలోనే కొత్త రిజర్వేషన్ల ప్రకారం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. మొత్తం 50 శాతం మేరకు రిజర్వేషన్లను వర్తింపజేయనుండగా.. ఎస్టీ, ఎస్సీలకు కేటాయించగా మిగిలిన స్థానాలను బీసీలకు కేటాయిస్తారు. మిగతా 50 శాతం స్థానాల్లో జనరల్ ఉంటాయి. గ్రామ సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లను ఆర్డీఓ, వార్డు స్థానాలను ఎంపీడీఓలు ఖరారు చేయనున్నారు. సాక్షి, నాగర్‌కర్నూల్: గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఎన్నిక నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మొత్తం 50 శాతం రిజర్వేషన్ల పరిధి మేరకే ఎన్నికలు నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియను శనివారం పూర్తిచేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి మార్గదర్శకాలు అందగా అధికారులు రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియలో నిమగ్నమయ్యారు. శనివారం సాయంత్రానికే గ్రామాలు, వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు. డిసెంబర్ నెలలో ఎన్నికల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుండగా.. వారం రోజుల వ్యవధిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న అంచనాలు ఊపందుకున్నాయి. నివేదిక ఆధారంగా.. గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, వార్డుసభ్యుల రిజర్వేషన్ స్థానాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ఆధారంగా రిజరేషన్లను కేటాయించి, బీసీ వర్గాలకు ప్రభుత్వం 2024లో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే (ఎస్ఈఈఈపీసీ) ప్రకారం బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు కేటాయిస్తారు. ఈ పద్ధతిలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా చూస్తారు. ముందుగా ఎస్టీ స్థానాలకు, తర్వాత ఎస్సీ స్థానాలకు, చివరగా బీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. 2019 మొదటి సాధారణ ఎన్నికల్లో గ్రామాలు, వార్డు స్థానాలకు ఉన్న రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో మార్పులు చేస్తుండటంతో గ్రామాల రిజర్వేషన్లు మారనున్నాయి. ఈ పద్ధతిలో ఎస్టీ జనాభా అధికంగా ఉన్న గ్రామాల జాబితా నుంచి గతంలో కేటాయించిన గ్రామాల తర్వాత వరుస క్రమంలో ఉన్న వాటిని రిజర్వేషన్ల కోసం ఎంపిక చేస్తారు. ఇదేవిధంగా ఎస్సీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్ల స్థానాలను గుర్తిస్తారు. ఏజెన్సీ ఏరియాల్లోని ఎస్టీ స్థానాలను మినహాయించి మిగతా స్థానాల్లోనూ ఎస్టీ కోటా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ప్రమాదారిలో.. జిల్లాలో మారుమూల ప్రాంతమైన చారకొండ మండలంలోని గోకారం గ్రామానికి వెళ్లే రహదారి ఇది. జడ్చర్ల – కోదాడ ప్రధాన రహదారికి 3 కి.మీ., దూరంలో ఈ రోడ్డు ఇప్పటి వరకు బీటీకి నోచుకోకపోవడంతో.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మట్టి దారి ఇలా అడుగు మేర కోతలకు గురై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. గతంలో ఎన్నోసార్లు బీటీ మంజూరు చేయాలని గ్రామస్తులు అధికారులు, పాలకులను వేడుకున్నా పట్టించుకోకపోవడంతోమాకిదేమి గ్రహచారంఅంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. – చారకొండ 50 శాతం పరిధి మేరకు రిజర్వేషన్లపై కసరత్తు నేటి సాయంత్రంలోగా పూర్తికానున్న ప్రక్రియ రొటేషన్ పద్ధతిలో మారనున్న పలు గ్రామాలు వారం రోజుల వ్యవధిలోనే నోటిఫికేషన్ విడుదల? జిల్లాలోని అమ్రాబాద్ మండలంలోని కల్ములోనిపల్లి, కుమ్మరోనిపల్లి, వంగూరోనిపల్లి, ప్రశాంత్నగర్కాలనీ, లక్ష్మాపురం గ్రామాలు గత ఎన్నికల్లో ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. అయితే ఈ గ్రామాల్లో ఎవరూ ఎస్టీలే లేకపోవడంతో సర్పంచ్‌లుగా ఎవరూ పోటీ చేయలేకపోయారు. ఈ ఐదు గ్రామాలకు సర్పంచ్‌లు లేకుండానే ఐదేళ్ల పదవీకాలం గడిచిపోయింది. ఎస్టీ జనాభా లేని గ్రామాల్లో ఇతరులకు రిజర్వేషన్లు కేటాయిస్తారా.. లేదా.. ఈసారి కూడా సర్పంచ్‌లు లేకుండా ఉండిపోతాయా అన్నది సందిగ్ధంగా మారింది. జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. రొటేషన్ పద్ధతిలో పంచాయతీల సర్పంచ్‌లు, వార్డు స్థానాల రిజర్వేషన్లు మారుతాయి. అమ్రాబాద్ మండలంలోని గ్రామాలు ఏజెన్సీ ఏరియా కావడంతో మా పరిధిలో లేదు. దీనిపై ప్రభుత్వానికి నివేదించాం. – శ్రీరాములు, జిల్లా పంచాయతీ శాఖ అధికారి -
విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి
కందనూలు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర విద్య పరిశోధనా సంస్థ డిప్యూటీ డైరెక్టర్, జిల్లా పరిశీలకురాలు రేవతిరెడ్డి అన్నారు. పాఠశాలల పరిశుభ్రత కోసం చేపట్టిన స్పెషల్ క్యాంపెయిన్ 5.0పై గురువారం జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో ఎంఈఓలు, కాంప్లెక్స్, ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు, కేజీబీవీల ప్రత్యేకాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధనతో పాటు భద్రత కల్పించాలని ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన తరగతి గదులను తొలగించాలన్నారు. వంటగదుల శుభ్రత విషయంలోఅలసత్వం వహించొద్దన్నారు. రెండు రోజుల్లోగా పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను నివేదించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు. అనంతరం డీఈఓ రమేశ్‌కుమార్‌తో కలిసి తాడూరు, నాగర్‌కర్నూల్, బిజినేపల్లి ఉన్నత పాఠశాలలను ఆమె తనిఖీ చేశారు. పాఠశాలల్లో అమలుచేస్తున్న పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలతో పాటు మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. అధికారులు వెంకటయ్య, మురళీధర్‌రెడ్డి, నర్సింహులు పాల్గొన్నారు. -
మెడికిల్ దందా..
జిల్లాలో ఇష్టానుసారంగా మెడికల్ షాపుల నిర్వహణ ●సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో మెడికల్ దందా జోరుగా సాగుతోంది. ఔషధ నియంత్రణశాఖ నిబంధనల మేరకు మెడికల్ షాపుల్లో తప్పనిసరిగా ఫార్మసిస్టుల ద్వారా మందులను విక్రయించాల్సి ఉండగా.. అర్హత లేని వ్యక్తులతో దుకాణాలను నిర్వహిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. జిల్లాలోని మెడికల్ షాపులపై సంబంధిత అధికారుల నియంత్రణ కరువైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తనిఖీలు అంతంతే.. జిల్లావ్యాప్తంగా 353 మెడికల్ దుకాణాలు ఉండగా.. మరో మూడు ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో సుమారు 90 శాతం షాపుల్లో ఫార్మసిస్టులు లేకుండానే మందుల విక్రయాలు సాగుతున్నాయి. అనర్హులతో మెడికల్ షాపులు నిర్వహిస్తుండటంతో డాక్టర్ ఒక రకం రాస్తే.. రోగులకు మరోరకం మందులను అంటగడుతున్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో అనధికార మెడికల్ షాపులే ఎక్కువగా ఉంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఎంపీ, పీఎంపీలు మందుల దుకాణాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నా సంబంధిత అధికారుల నుంచి చర్యలు కరువయ్యాయి. బినామీల పేరుతో దందా.. జిల్లాలోని కొన్నిచోట్ల అనుమతులు లేకుండా మెడికల్ షాపులు నిర్వహిస్తున్నా అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. చాలావరకు మెడికల్ షాపుల నిర్వహణకు డీ ఫార్మసీ, బీ ఫార్మసీ చదివిన వారి నుంచి సర్టిఫికెట్లు అద్దెకు తీసుకొని అనుమతులు పొందుతున్నారు. నిబంధనల మేర కు ఫార్మసిస్టులతో మందులు ఇవ్వాల్సి ఉండగా.. మెడికల్ షాపుల్లో ఎక్కడా ఫార్మసిస్టులు కనిపించడం లేదు. మందుల కాంబినేషన్ కూడా సరిగ్గా తెలియని వ్యక్తులు రిటైల్‌గా మందులు విక్రయిస్తుండటం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. జిల్లాలోని మెడికల్ షాపుల్లో ఆకస్మిక తని ఖీలు చేపడుతున్నాం. నిబంధనలు పాటించని వాటిపై చర్యలు తీసుకుంటున్నాం. డాక్ట ర్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మెడికల్ షాపుల నిర్వాహకులు మందులు విక్రయించాలి. నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాపులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. – శ్రీకాంత్, డ్రగ్ ఇన్స్పెక్టర్ జిల్లాలో ఏ మెడికల్, కిరాణా దుకాణానికి వెళ్లినా పారాసెటమాల్ నుంచి మత్తు టాబ్లెట్ల వరకు సులువుగా లభ్యమవుతున్నాయి. పిల్లలు అడిగినా షాపుల్లో మందులు విక్రయిస్తున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వరాదన్న నిబంధన ఎక్కడా అమలుకావడం లేదు. బ్రాండెడ్ మందుల పేరుతో జనరిక్ మందులను విక్రయిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. నిబంధనల ప్రకారం ఫార్మసీ కౌన్సిల్ గుర్తింపు ధ్రువపత్రంతో పాటు లైసెన్స్డ్ ఫార్మసిస్టు ద్వారానే మందుల విక్రయాలు జరపాలి. మెడికల్ షాపు కనీసం 10 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్వహించాలి. గడువు ముగిసిన మందులు, ఫిజీషియన్ శాంపిల్స్ అమ్మడానికి వీలులేదు. కనిష్ట ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచాల్సిన మందులను రిఫ్రిజిరేటర్లలోనే ఉంచి విక్రయించాలి. మందులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాల్సి ఉండగా.. చాలావరకు షాపుల్లో అడిగినా బిల్లు ఇవ్వడం లేదు. కనిపించని ఫార్మసిస్టులు.. అర్హత లేని వారే మందుల విక్రయం ప్రజల ప్రాణాలతో చెలగాటం జిల్లావ్యాప్తంగా 353 మెడికల్ దుకాణాలు -
ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్
పాలమూరు: ఇటీవల కాలంలో ఖరీదైన కార్లు కొనుగోలు చేయడం ఒక ఎత్తు అయితే.. అంతకంటే ఎక్కువగా ఫ్యాన్సీ, లక్కీ నంబర్ తీసుకోవడానికి ఎంతైన ఖర్చు చేసే సంప్రదాయం బాగా పెరిగింది. చాలా వరకు కార్లకు, బైక్‌లకు ఫ్యాన్సీ నంబర్ పెట్టుకోవడం హోదాగా భావిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో కొన్ని ప్రత్యేక నంబర్లకు అధిక ప్రాముఖ్యత చోటుచేసుకుంటుంది. ఏడాది జనవరి నుంచి నవంబర్ 19వరకు జిల్లాలో 5,516 వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ లక్కీ నంబర్ల ద్వారా ప్రభుత్వానికి రూ.3.30 కోట్ల ఆదాయం రావడం విశేషం. ఇందులో అధికంగా 9999తో పాటు 9, 7777, 7 సిరీస్, 01తో పాటు 7, 6, 5 వంటి సిరీస్ నంబర్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రవాణా శాఖలో నూతన వాహనాల నంబర్ రిజిస్ట్రేషన్ కోసం ముందే రిజర్వేషన్ చేసుకునే ముఖ్యమైన నంబర్ల ఫీజు పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్ ఆర్టీఏ కార్యాలయంలో 9999 నంబర్ రిజర్వేషన్ చేసుకోవాలంటే సదరు వాహనదారుడు ముందుకు రూ.1.50 లక్షలు డీడీ చెల్లించి రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా వాహనదారుడు పోటీ వచ్చి వేలం పాట నిర్వహిస్తే మళ్లీ ఫీజు ధర పెరుగుతుంది. అదేవిధంగా 1, 9, 6666 నంబర్లకు ఫీజు రూ.లక్ష ఫీజు కేటాయించగా 99, 999, 3333, 4444, 5555, 7777 నంబర్లకు ఫీజు రూ.50వేలుగా నిర్ణయించారు. దీంతోపాటు 5, 6, 7, 123, 333, 369, 555, 666, 777, 1111 నంబర్లకు రూ.40వేలుగా ఫీజు కేటాయించారు. ఇకపై జాబితాలో లేని నంబర్లకు కారు నంబర్‌కు అయితే రూ.6వేలు, ద్విచక్ర వాహనం అయితే రూ.3వేల ఫీజు ఉంటుంది. అదేవిధంగా ఆరోజు అందుబాటులో ఉండి రిజర్వ్ కాని నంబర్లకు రూ.2వేల ఫీజు చెల్లించి నంబర్ తీసుకోవచ్చు. పెరిగిన నంబర్ల ఫీజు వల్ల ఆర్టీఏ శాఖకు ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్ల వివరాలిలా.. (రూ.లక్షల్లో) జిల్లా వాహనాలు వచ్చిన ఆదాయం మహబూబ్‌నగర్ 2,032 1.15 కోట్లు నాగర్‌కర్నూల్ 1,176 66.22 వనపర్తి 836 55.62 జో.గద్వాల 833 54.15 నారాయణపేట 639 31.76 ఆసక్తి చూపుతున్న వాహనదారులు ఏడాదిలోనే ఉమ్మడి జిల్లాలో 5,516 వాహనాల రిజిస్ట్రేషన్ ప్రభుత్వానికి రూ.3.30 కోట్ల ఆదాయం ఫ్యాన్సీ, లక్కీ నంబర్లతో పాటు తాత్కాలిక రిజర్వేషన్ పద్ధతిలో జరిగే రిజిస్ట్రేషన్స్ ద్వారా ఆదాయం స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం పెరిగిన ఫీజుల ధరల వల్ల రెవెన్యూ ఎలా ఉంటుంది అనే విషయం ప్రస్తుత సిరీస్ పూర్తి అయితే తెలుస్తోంది. ఫ్యాన్సీ నంబర్ తప్పక ఏర్పాటు చేసుకోవాలనే వారు కొంత మేర పెరుగుతున్నారు. – కిషన్, డీటీసీ పాలమూరు ఆర్టీఏ కార్యాలయంలో ఇటీవల జరిగిన ఓ రిజిస్ట్రేషన్‌లో వాహనదారుడు టీజీ 06బీ 0009 నంబర్ కోసం వేలం పాటలో రూ.7.75 లక్షలు పలికి నంబర్ సొంతం చేసుకున్నాడు. దీనిని బట్టి చూస్తే ఫ్యాన్సీ నంబర్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. మరో వాహనదారుడు టీజీ06బీ0999 నంబర్ కోసం వేలం పాట ద్వారా రూ.1,05,500 ఖర్చు చేసి సొంతం చేసుకున్నాడు. టీజీ 06బీ5555 నంబర్‌ను రూ.1.34 లక్షలకు దక్కించుకున్నాడు. -
తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు
కొల్లాపూర్ రూరల్: వరిధాన్యంలో తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని పర్యాటక, ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం కొల్లాపూర్ మండలంలోని కుడికిళ్ల, నార్లాపూర్ గ్రామాల్లో ఐకేపీ ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. నిబంధనల మేరకు తేమశాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి.. మిల్లులకు తరలించాలన్నారు. సేకరించిన ధాన్యానికి సంబంధించిన రైతుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు త్వరగా జమ అయ్యేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఎం అరుణ, సింగిల్‌విండో డైరెక్టర్ రఘుపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ బియ్యం పక్కదారి!
అచ్చంపేట: రేషన్ డీలర్ల తీరు మారడం లేదు. సన్నబియ్యం పంపిణీలోనూ అదే చేతివాటం.. అదే పక్కదారి కనిపిస్తోంది. అనేక చౌకధర దుకాణాల్లో ఎక్కువ శాతం బియ్యం పంపిణీ కాకుండా.. నగదు దందా బాహాటంగా కొనసాగుతోంది. కొందరు రేషన్ కార్డుదారులు ఈపాస్ యంత్రంపై బయోమెట్రిక్ (వేలిముద్ర) పెట్టి నెలవారీ బియ్యం కోటాను డీలర్లకు అప్పగించి.. నగదు పుచ్చుకోవడం పరిపాటిగా మారింది. డీలర్లు కూడా కిలోకు రూ. 20 నుంచి రూ.22 చొప్పున లెక్కగట్టి నగదు అందించడం సర్వసాధారణమైంది. నల్లబజారులో రూ.25 నుంచి రూ. 30 వరకు అమ్ముకుంటున్నారు. లబ్ధిదారులు రేషన్ బియ్యంపై అనాసక్తి కనబర్చడం డీలర్లకు కలిసివస్తోంది. జిల్లాలో 60 శాతం మంది మాత్రమే రేషన్ బియ్యం తింటున్నారు. మిగతా 40శాతం నల్లబజారుకు తరలుతోంది. ఈ దందాను కట్టడి చేయాల్సిన రెవెన్యూ, పోలీస్ శాఖలు చేతివాటం ప్రదర్శిస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సన్నబియ్యంపై కూడా.. పూట గడవని అత్యంత నిరుపేద కుటుంబాలు మినహా మిగతా కుటుంబాలు రేషన్ బియ్యం వండుకొని తినడానికి ఆసక్తి చూపడం లేదు. మొన్నటి వరకు బియ్యం దొడ్డుగా, నాసిరకం, ముక్కిపోయి ఉండటం, వండి తిన్న తర్వాత జీర్ణం కాకపోవడం లాంటి కారణాలతో పెద్దగా ఆసక్తి కనబరిచేవారు కాదు. కొన్ని కుటుంబాలు మాత్రం రేషన్ బియ్యాన్ని కేవలం ఇడ్లీ, దోశలు, ఇతర పిండి వంటలకు వినియోగించేవారు. అయితే ప్రతినెలా ఉచితంగా అందుతుండటం.. అవసరానికి మించి వస్తుండటంతో డీలర్లకు అప్పగించి వచ్చేవారు. తాజాగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం అంత మంచిగా ఉండటం లేదని లబ్ధిదారులను కొందరు డీలర్లు తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక యూనిట్ మాత్రమే.. కొందరు కార్డుదారులు తమ నెలవారీ కోటాలో ఒక యూనిట్ బియ్యం మాత్రమే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మిగతా బియ్యాన్ని డీలర్లకు అప్పగించి నగదు పొందుతున్నారు. వాస్తవంగా చౌకధర దుకాణాల్లో ఈ–పాస్ (బయోమెట్రిక్) అమలు కంటే ముందు రేషన్ డీలర్లు దుకాణాల్లో మిగిలే బియ్యం, ఇతర సరుకులను గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకునేవారు. సంస్కరణలో భాగంగా ఈ–పాస్ అమలుతో లబ్ధిదారుల బయోమెట్రిక్, ఐరీష్, ఓటి పీ తప్పనిసరి అయింది. దీంతో డీలర్లు లబ్ధిదారుల ప్రమేయంతో చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. మొత్తం రేషన్‌కార్డులు 2,72,487 అంత్యోదయ 18,701 ప్రతినెలా అందిస్తున్న బియ్యం 45,575.893 మెట్రిక్ టన్నులు లబ్ధిదారులు 8,76,394 లబ్ధిదారుల అనాసక్తిని సొమ్ము చేసుకుంటున్న రేషన్ డీలర్లు కిలోకు రూ.20 నుంచి రూ.22 చొప్పున కొనుగోలు గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలింపు పట్టని పౌరసరఫరాలశాఖ -
బాధితులకు సత్వర న్యాయం అందాలి
● ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దు ● ఎంపీ డా.మల్లు రవి నాగర్‌కర్నూల్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించి.. బాధితులకు సత్వర న్యాయం అందించాలని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డా.మల్లు రవి అన్నారు. పీసీఆర్–1955, పీఓఏ యాక్ట్–1989 అమలుపై గురువారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్, కలెక్టర్ బదావత్ సంతోష్ అధ్యక్షతన జరిగిన సమీక్షలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు డా.వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ వేగవంతంగా చేపట్టి.. బాధితులకు న్యాయంతో పాటు ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం అందేలా చూడాలన్నారు. అదే విధంగా అన్ని సంక్షేమ పథకాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. యువత స్వయం ఉపాధి పథకాలను వినియోగించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ఎక్కడైనా ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగితే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. పరిహారంగా బాధితులకు రూ. 25వేలు చెల్లించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంబంధిత ఆధికారులను ఆయన ఆదేశించారు. చార్జీషీట్ దాఖలయ్యాక 50 శాతం, కేసు పూర్తయ్యాక మిగతా మొత్తం చెల్లించేలా చూడాలన్నారు. ● ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి అధికారులు కృషి చేయాలన్నారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎస్సీ, ఎస్టీ కేసుల వివరాలు, భూతగాదాలు, బాధితులకు అందించిన నష్టపరిహారం తదితర వివరాలను తెలుసుకున్నారు. కమిటీకి పలు సూచనలు చేశారు. ● ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలో భూ తగాదాలను కమిటీ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలపై పోలీసు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. ● కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 234 ఎస్సీ, ఎస్టీ ఫిర్యాదులు అందగా, 219 కేసులను అట్రాసిటీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వివరించారు. వాటిలో 170 కేసులకు చార్జీషీటు దాఖలు చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 219 కేసులకు పరిహారం అందించామని.. 19 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మిగతా అన్ని కేసులకు త్వరగా చార్జీషీటు వేసే విధంగా చూడాలని పోలీసుశాఖకు సూచించారు. అదే విధంగా గ్రామాల్లో పౌర హక్కులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అందుకు సంబంధించిన నివేదికను జిల్లా ఎస్సీ సంక్షేమశాఖకు అందజేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు, సభ్యులు ఎల్లపోగు వెంకటస్వామి, చిన్నగల్ల పరశురాం, గుమ్మకొండ రాములు, వెల్టూరి రేణయ్య, కె.చందర్, రెడ్యా తదితరులు ఉన్నారు. -
మహిళల అభ్యున్నతే ధ్యేయం
● ప్రభుత్వ పథకాలతో ప్రగతి పథాన పయనించాలి ● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్‌కర్నూల్: మహిళల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంపై సమీక్షించగా.. స్థానిక కలెక్టరేట్ నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ బదావత్ సంతోష్, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి హాజరయ్యారు. వీసీ అనంతరం మహిళా సంఘాల ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులను సుస్థిర ఆర్థిక వ్యాపారస్తులుగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రగతి పథాన ముందుకుసాగాలని సూచించారు. కష్టపడి కూడబెట్టిన డబ్బును అనవసరంగా ఖర్చు చేయొద్దన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులతో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన కొనసాగుతుందని.. గ్రామీణ మహిళలను చైతన్యపరిచి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా చూడాలని సూచించారు. ● ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు అనేక పథకాలు అందించడంతో పాటు ఉచితంగా చేనేత చీరలను పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. ముఖ్యంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు బస్సులకు ఓనర్లను కూడా చేస్తుందని తెలిపారు. ● కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ.. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లో 1,68,104 మంది సభ్యులుగా ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు పక్కా ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ సూచించారు. మహిళా సంఘంలోని ప్రతి సభ్యురాలికి ఇందిరా మహిళాశక్తి చీరలు అందాలన్నారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించి.. ప్రజాప్రతినిధుల సమక్షంలో చీరల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, డీఆర్డీఓ చిన్న ఓబులేషు, డీపీఓ శ్రీరాములు తదితరులు ఉన్నారు. -
మాకు న్యాయం జరిగేలా చూడాలి..
తన బిడ్డ పేరుతో కంపెనీ మొదలు పెట్టానని.. ఎలాంటి మోసానికి అవకాశం లేదని ఆయుర్వేద నిలయం యజమాని తెలిపాడు. ఆయుర్వేద ఉత్పత్తులకు కావాల్సి మెటీరియల్‌ను చెంచులు తక్కువ ధరతో ఇస్తారని.. పెట్టుబడి రూ.3 వేలు అయితే తమకు రూ.30 వేలు వస్తాయని నమ్మబలికాడు. దీంతో ఇంట్లో ఆడవాళ్ల మీద ఉన్న బంగారు పుస్తెల తాడు, నెక్లెస్ అన్నీ బ్యాంక్‌లో కుదవ పెట్టి, ప్లాటు అమ్మి రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేసి మోసపోయా. నాతో పాటు పలు కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మాకు అన్యాయం జరగకుండా చూడాలి. – జానంపేట ఆంజనేయులు, చిన్నగుమ్మడం, పెబ్బేరు, వనపర్తి -
ఫ్లెక్సీల తొలగింపు
కందనూలు: hÌêÏ MóS…{§ýl…ÌZ° {糫§é¯]l Æý‡çßæ-§é-Æý‡$-ÌSOò³ {sêíœMŠSMýS$ A…™èl-Æ>Ķæ$… MýSÍ-W…-^ólÌê òœÏMîSÞË$ HÆ>µr$ ^ólĶæ$yýl…Oò³ Gïܵ OVðSM>ÓyŠæ OÐðl¿ýæÐŒæ Æý‡çœ¬-¯é£Šl B{VýSçßæ… Ð]lÅMýS¢…^ól-Ô>Æý‡$. °º…-«§ýl-¯]l-ÌSMýS$ ÑÆý‡$-§ýl®…V> HÆ>µ-r$^ól-íܯ]l òœÏMîSÞÌS ™öÌS-W…-ç³#¯]lMýS$ º$«§ýl-ÐéÆý‡… ´ùÎ-çÜ$Ë$ òܵçÙÌŒæ {OyðlÐŒæ️ ^ólç³sêtÆý‡$. Æý‡çßæ-§é-Æý‡$ÌS Ððl…r {ç³Ð]l*-§ýl-MýS-Æý‡…V> E¯]l² òœÏMîSÞ Ë$, »êů]l-Æý‡Ï¯]l$ ™öÌS-W…-^éÆý‡$. Ð]l¬°Þ-´ë-Ísîæ A ¯]l$-Ð]l$-™èl$Ë$ ÌôæMýS$…yé Ayýlz-Vø-Ë$V> òœÏMîSÞÌS¯]l$ HÆ>µr$ ^ólĶæ$-yýl…™ø {ç³Ð]l*§éË$ ^ør$ ^ólçÜ$-MýS$…-r$-¯é²Æ‡$$. ©…™ø ´ùÎçÜ$ íܺ¾…§ól òœÏMîSÞÌS ™öÌS-W…ç³# ^ólç³sêtÆý‡$. ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు కందనూలు: పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా ర్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఆంగ్ల ఉపాధ్యాయుడు వపన్ జైన్‌ను సస్పెన్షన్ చేస్తూ బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ఉపాధ్యాయుడు కొన్ని రోజులుగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు మంగళవారం పాఠశాలకు చేరుకొని దేహశుద్ధి చేసిన విషయం తెలిసిందే. దీనిపై పెద్దకొత్తపల్లి ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి విచారణ చేపట్టి డీఈఓకు నివేదిక సమర్పించారు. విచారణ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు అతడిపై సస్పెన్షన్ వేటు వేశారు. కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం నాగర్‌కర్నూల్ రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు కార్మికులు సిద్ధం కావాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పార్వతమ్మ పిలుపునిచ్చారు. బుధ వారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాల యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మా ట్లాడారు. నూతన జాతీయ విద్యావిధానం, అంగన్వాడీలకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పెన్షన్ తదితర సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాల్సిన అవసరముందన్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో ఆదిలాబాద్‌లో నిర్వహించే యూనియన్ రాష్ట్ర మహాసభల్లో కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. మహాసభలకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రామయ్య, మాసమ్మ, అలివేల, చిట్టెమ్మ, లక్ష్మి, కృష్ణవేణి, భాగ్యమ్మ తదితరులు ఉన్నారు. వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి కందనూలు: స్వతంత్ర రాజ్యస్థాపన కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించిన వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి అని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ శివశంకర్‌గౌడ్ కొనియాడారు. ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకొని బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సీ్త్రశక్తి దివాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి ప్రముఖ పాత్ర పోషించారన్నారు. నేటి యువత ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు పద్మజ, సుధాకర్, ఏబీవీపీ నాయకులు బంగారు బాబు, ప్రసాద్‌కుమార్, శివ, విష్ణు, జీవన్, శివ, దేవిక, కీర్తన, డానియల్, శివ తదితరులు పాల్గొన్నారు. -
చరిత్ర తిరగరాసే కుట్రలు చేస్తున్న మోదీ
అచ్చంపేట: దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఇందిరాగాంధీ కుటుంబంపై ప్రధాని నరేంద్ర మోదీ కుట్రలు చేస్తూ.. చరిత్ర తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. బుధవారం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అచ్చంపేట ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో టీపీసీసీ చీఫ్ మాట్లాడారు. ప్రపంచంలో ఉక్కు మనిషి అనే పేరు కొందరికే ఉంటుందని.. వారిలో దివంగత ఇందిరాగాంధీ ఒకరు అని అన్నారు. ఆనాడు దేశ ప్రజల కోసం గరీబీ హటావో నినాదంతో సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి.. భూస్వాముల చెరలోని వేలాది ఎకరాలను పేదలకు పంపిణీ చేయడం, బ్యాంకులను జాతీయకరణ చేయడం జరిగిందన్నారు. పాకిస్థాన్‌పై యుద్ధంచేసి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించిన ఘనత ఇందిరాగాంధీకే దక్కిందని కొనియాడారు. బీజేపీ శాఽశ్వత అధికారం కోసం ఈడీ, సీబీఐ, ఎలక్షన్ కమిషన్‌ను తన చెప్పు చేతల్లో పెట్టుకోవడంతో పాటు కుల, మతం పేరుతో దేశాన్ని విచ్ఛినం చేయాలని చూస్తోందన్నారు. ఓటు చోరీకి పాల్పడుతూ వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తోందన్నారు. బిహార్‌లో ప్రజలు ఆకాంక్షించిన ప్రభుత్వం రాలేదన్నారు. నెహ్రూ కుటుంబం తమ ఆస్తులు, పదవులు, ప్రాణాలను సైతం త్యాగం చేశారని.. అలాంటి నాయకత్వం ఏ పార్టీలోనైనా ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే ఆలోచనలు, సూచనల మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పాలన కొనసాగుతోందన్నారు. రెండేళ్ల కాలంలోనే ఎంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేసి చూపిందన్నారు. గత ప్రభుత్వంలో కేవలం 50వేల ఉద్యోగాలు ఇస్తే.. అనతి కాలంలోనే 70వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికి దక్కిందన్నారు. రానున్న మూడేళ్లలో మరో 1.30 లక్షల ఉద్యోగాలను అందించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ● ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనేసామాజిక న్యాయం సాధ్యమన్నారు. భారత రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తూ, బడుగు బలహీన వర్గాలకు పదవులు, అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం కేంద్రపై ఒత్తిడి తీసుకొస్తుందన్నారు. అచ్చంపేట అభివృద్ధిపై డిసెంబర్ 7న నివేదిక అందిస్తామన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి.రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత మల్లేష్, ఉమామహేశ్వర ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ.గోపాల్‌రెడ్డి, అనంతరెడ్డి, మల్రెడ్డి వెంకట్‌రెడ్డి, రామనాథం, రఫీ, నర్సయ్యయాదవ్ ఉన్నారు. నెహ్రూ కుటుంబం చేసిన త్యాగాలు ఎవరూ చేయలే.. కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారిన సీబీఐ, ఈడీ, ఎన్నికల కమిషన్ టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ -
పత్తి రైతు చిత్తు..
సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద తప్పని కొర్రీలు ● తేమశాతం, కపాస్ నిబంధనలతో కొనుగోలుకు తిరస్కరిస్తున్న అధికారులు ● మిల్లుల వద్ద పత్తి లోడ్‌తో వాహనాల బారులు ● కఠిన నియమాలతో ప్రైవేటు దారిపడుతున్న వైనం ●సాక్షి, నాగర్‌కర్నూల్: పత్తి కొనుగోళ్ల కోసం తెచ్చిన కపాస్ యాప్.. తేమశాతం పేరుతో అధికారుల కొర్రీలతో పత్తి రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జిన్నింగ్ మిల్లుల నిర్వాహకులు ఆందోళనకు దిగడంతో రెండు రోజులపాటు పత్తి కొనుగోళ్లు స్తంభించాయి. బుధవారం నుంచి సీసీఐ కేంద్రాల్లో కొనుగోళ్లు తిరిగి ప్రారంభమైనా.. అధిక శాతం పత్తిని అధికారులు తిరస్కరిస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ప్రైవేటును ఆశ్రయిస్తున్నారు. పత్తిలో 12 శాతానికి మించి తేమ ఉన్న పత్తి లోడ్ ఉన్న వాహనాలను వెనక్కి పంపుతున్నారు. దూర ప్రాంతం నుంచి రవాణా ఖర్చులు వెచ్చించి వస్తున్న రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. తేమ పేరుతో కొర్రీలు.. పత్తి లోడ్‌తో సీసీఐ కొనుగోలు కేంద్రాలకు వస్తున్న రైతులకు సంబంధిత అధికారుల నుంచి కొర్రీలు ఎదురవుతున్నాయి. తేమశాతం 12 కన్నా ఎక్కువగా ఉందని.. పత్తి నల్లగా ఉందని తిరస్కరిస్తున్నారు. మిల్లులకు వస్తున్న పత్తిలో అధికభాగం ఇలా కొనుగోళ్లకు తిరస్కరణకు గురవుతోంది. 12 శాతం కన్నా తక్కువ తేమశాతం ఉన్నా ఎవరికీ కనీస మద్ధతు ధర రూ. 8,100 దక్కడం లేదు. తేమశాతం 8 ఉంటేనే మద్ధతు ధర వస్తుందని అధికారులు చెబుతున్నారు. దీంతో చాలా మందికి క్వింటాకు రూ. 7వేల నుంచి రూ. 7,600 వరకే ధర పలుకుతోంది. మిగిలిన వారికి తేమశాతం లేదంటూ తిరస్కరిస్తుంటడంతో ఆందోళన చెందుతున్నారు. రైతులు పత్తిని ఆరబెట్టి నిర్ణీత తేమశాతం ఉండేలా చూసుకోవాలి. 12 శాతం కన్నా తక్కువగా ఉంటేనే కొనుగోళ్లు చేపట్టాల్సి ఉంటుంది. కపాస్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటేనే కొనుగోళ్లకు వీలవుతుంది. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – స్వరణ్‌సింగ్, జిల్లా మార్కెటింగ్ అధికారి సీసీఐ పత్తి కొనుగోళ్లను కఠినతరం చేయడం, కపాస్ యాప్ ఇబ్బందుల నేపథ్యంలో రైతులు సీసీఐ కేంద్రాల్లో మద్ధతు ధరకు పత్తి విక్రయించడం కష్టసాధ్యంగా మారింది. ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారులు, దళారులు రంగప్రవేశం చేసి అందినకాడికి దండుకుంటున్నారు. సీసీఐ తిరస్కరిస్తున్న పత్తిని క్వింటాకు రూ. 5,500 నుంచి రూ. 6వేలకే కొనుగోలు చేస్తున్నారు. పత్తి రేటు నుంచి తూకం దాకా తమదైన శైలిలో దోపిడీకి తెరలేపుతున్నారు. -
రిజర్వాయర్ నిర్మాణానికి భూములివ్వం
● భూసేకరణ నిలిపివేయాలనినిర్వాసిత రైతుల ఆందోళన ● నిరసన ర్యాలీతో తహసీల్దార్‌కు వినతి బల్మూర్: ప్రాణత్యాగలకై నా వెనకాడం.. తమ భూములను రిజర్వాయర్ నిర్మాణానికి ఇచ్చేదిలేదని నిర్వాసిత రైతులు ఆందోళనకు దిగారు. మండల కేంద్రానికి సమీపంలో నిర్మంచతలపెట్టిన ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణానికి ఇరిగేషన్ అధికారులు బుధవారం భూసేకరణ కార్యక్రమం చేపట్టడంతో విషయం తెలుసుకున్న బల్మూర్, అనంతవరం, అంబగిరి రైతులు నిరసన ర్యాలీ చేపట్టి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. అధికారులు తమకు ఎలాంటి నోటీసులు అందజేయకుండానే కేవలం ఫోన్ల ద్వారా కొంతమంది రైతులకు సమాచారం ఇచ్చి భూసేకరణకు పూనుకోవడం సరైందికాదని ప్రశ్నించారు. రిజర్వాయర్ నిర్మాణానికి ఈ ప్రాంతం అనువైనది కాకున్నా.. కేవలం కాట్రాక్టర్లు, పాలకుల కమీషన్ల కకక్కురర్తి కోసమే నిర్మించ తలపెట్టారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతమైన ఇక్కడ రిజర్వాయర్ నిరర్మించాలంటే పీసా చట్టం ప్రకారం అధికారులు నడుచుకోవాల్సి ఉనన్నా.. నిబంధనలు ఉల్లంగించి రైతుల భూములను లాక్కొనే ప్రయతత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఈ రిజర్వాయర్ నిర్మాణ అనుమతులను రద్దు చేయాలని, లేకుంటే తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. భూనిర్వాసిత పోరాట కమిటీ సభ్యులు అనంత సీతారాంరెడ్డి, తిరుపతయ్య, నాగయ్య, కృష్ణయ్య, ఇంద్రసేనారెడ్డి, గణేశ్, రైతులు పాల్గొన్నారు. -
ఎఫ్ఐఆర్ కాపీకూడా ఇవ్వడం లేదు..
ఆయుర్వేద నిలయంలో రూ.లక్ష పెడితే ఓ ఐడీ కార్డు ఇచ్చేవారు. ఇలా ఆ డాక్టర్ తన బినామీలకూ ఇచ్చాడు. భారీగా దండుకున్న తర్వాత తన బినామీతోనే వనస్థలిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేయించుకున్నాడు. కేసు పెట్టించుకుని చర్లపల్లి జైలుకెళ్లాడు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలై కనిపించకుండా పోయాడు. మేము ఎక్కడికెళ్లినా పోలీసులు పట్టించుకోవడం లేదు. కనీసం ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తలేరు. మా గోసను అర్థం చేసుకుని.. న్యాయం చేయాలి. – బొల్లెద్దుల నాగరాజు, గోపాల్పేట, వనపర్తి -
ప్రకృతి వ్యవసాయం.. లాభదాయకం
బిజినేపల్లి: ప్రకృతి వ్యవసాయంపై ప్రతి రైతుకు అవగాహన కల్పించాల్సిన అవసరముందని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఎల్.కృష్ణ అన్నారు. బుధవారం పాలెం కేవీకేలో 21వ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్నిధి విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఆర్ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయంతో ప్రజారోగ్య సంరక్షణతో పాటు రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఆర్థిక చేయుత అందించేందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నాయని.. వాటిని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పీఎం కిసాన్ ద్వారా వచ్చే డబ్బులతో రైతులు వ్యవసాయ పనిముట్లను సమకూర్చుకోవాలన్నారు. పంటల సాగుతో పాటు పెరటి తోటలు, పండ్ల మొక్కలు, కోళ్ల పెంపకం వంటి వాటిపై దృష్టిసారించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో పాలెం కేవీకే కోఆర్డినేటర్ డా.శ్రీదేవి, డీఏఓ యశ్వంత్‌రావు పాల్గొన్నారు. -
ఎదురుచూపులు
కష్టమైనా.. నష్టమైనా వ్యవసాయ పనుల్లోనే తలమునకలవుతున్నారు రైతన్నలు. ఈ క్రమంలోనే వానాకాలం చివరలో మోంథా తుపాను తీవ్ర నష్టం మిగిల్చినా.. యాసంగి పంటలకు సమాయత్తమవుతున్నారు. అయితే ఇప్పటికే తుపాను ప్రభావంతో చేతికొచ్చిన పంటలు కోల్పోయి.. ఆర్థికంగా నష్టపోయిన అన్నదాతలు.. ప్రస్తుత రబీ సీజన్ పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి దాపురించింది. ప్రభుత్వం అందించే రైతుభరోసాపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చి పంటల సాగుకు వెచ్చిస్తున్నారు. నాగర్‌కర్నూల్: పెట్టుబడి సాయం అందించి రైతులు సాగు ఖర్చులకు అప్పులు చేయకుండా ఆదుకునేందుకు 2018లో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే రైతులు పంటలు సాగు చేసే ముందు నిధులను ఖాతాల్లో జమచేస్తే సాగుకు వాడుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి చెందగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు రైతుబంధు ఇస్తుండగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎకరాకు రూ.15 ఇస్తామని హామీ ఇచ్చింది. గత సీజన్లో రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయగా ఇటీవల వానాకాలం సీజన్లో మాత్రం ఎకరాకు రూ.6 వేల చొప్పున జమ చేసింది. అయితే ప్రస్తుతం యాసంగి పనులకు సిద్ధమవుతుండగా.. ప్రభుత్వం రైతుభరోసాపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో.. రైతులు పెట్టుబడికి డబ్బులు లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే పరిస్థితి నెలకొంది. సాగు అంచనా ఇలా.. జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 4,59,616 ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి 1,82,480 ఎకరాలు, వేరుశనగ 1,32,087 ఎకరాలు, మొక్కజొన్న 1,07,695 ఎకరాలు, మినుములు 20,856 ఎకరాలు, జొన్నలు 2,568 ఎకరాలు, ఇతర పంటలు 13,930 ఎకరాల్లో సాగు అవుతాయని భావిస్తున్నారు. అయితే పంటల సాగుకు సంబంధించి ఖర్చులు రోజురోజుకూ భారీగా పెరుగుతుండడంతో రైతుభరోసానైనా ఖాతాల్లో జమ చేస్తే రైతులకు కొంత ఊరట కలగనుంది. కానీ, ఇప్పటి వరకు వ్యవసాయ అధికారులు కూడా ఎలాంటి కసరత్తు చేపట్టకపోవడంతో ఇప్పట్లో రైతుభరోసా నిధులు వచ్చే అవకాశం లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 20 వేల ఎకరాల్లో.. వానాకాలంలో పంటలు సాగు చేసిన రైతులకు చివరలో మోంథా తుపాను తీవ్రనష్టం మిగిల్చింది. పత్తి, వరి పంటలు చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలు కురవడంతో జిల్లాలో చాలాచోట్ల నీట ముగిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనిపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టానికి సంబంధించిన వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాలో సుమారు 20 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ యాసంగిలో రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందిస్తే రైతులకు కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది. రైతుభరోసాపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం ఇప్పటికే యాసంగి పనులు మొదలుపెట్టిన రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న వైనం చివరలో నిండా ముంచిన మోంథా తుపాను ప్రస్తుత సీజన్లో 4.10 లక్షల ఎకరాల్లో సాగు అంచనా -
చదువుతోపాటు కళల్లోనూ రాణించాలి
కందనూలు: విద్యార్థులు, యువతీ, యువకులు చదువుతోపాటు వివిధ కళల్లోనూ రాణించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి యువజనోత్సవాలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక రంగంలో ప్రతిభ దాగి ఉంటుందని, దానిని వెలికితీసి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే భవిష్యత్ మరింత బంగారుమయం అవుతుందన్నారు. చదువుతోపాటు క్రీడలు, కళలు, నైపుణ్యాలు సమానంగా పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లాస్థాయిలోనే కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించేలా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. గతేడాది జాతీయ స్థాయి పోటీలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన కళాకారులను అభినందించారు. ఈసారి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. విద్యార్థులు తమ కలలను నిజం చేసుకొని బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ నర్సింగ్ కళాశాల, పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సైన్స్ ప్రదర్శనలను పరిశీలించారు. జానపద నృత్యాలను తిలకించి అభినందించారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ సీతారాంనాయక్, డీఈఓ రమేష్‌కుమార్, డీఎంహెచ్ఓ రవినాయక్, జిల్లా సైన్స్ రాజశేఖర్‌రావు, తహసీల్దార్ తబితారాణి, విద్యార్థులు, యువతీ, యువకులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న సైన్స్ ప్రదర్శన యువజనోత్సవాల్లో వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన జానపద నృత్యాలు, సైన్స్ ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. జిల్లాకేంద్రంలోని నర్సింగ్ కళాశాల విద్యార్థులు మంచి అలవాట్లు అనే అంశంపై ప్రదర్శన ఆకట్టుకుంది. అలాగే పల్లెటూరి పల్లకిలో పాటకు విద్యార్థులు చేసిన నృత్యం, చిత్రలేఖనం వంటి అంశాలను ప్రదర్శించి అబ్బురపరిచారు. -
త్వరగా అందించాలి..
యాసంగి సీజన్ ప్రారంభమై 20 రోజులు అయితుంది. ఇప్పటికీ రెండు ఎకరాల్లో మొక్కజొన్న విత్తనాలు వేసుకున్నాను. మరో మూడెకరాల్లో వేరుశనగ వేసేందుకు ప్రయత్నిస్తున్నా ఇటీవల కురిసిన వర్షాలకు పంట అంతా నాశనమైంది. చేతిలో చిల్ల గవ్వ కూడా లేదు. ప్రభుత్వం తక్షణమే పెట్టుబడి సాయం అందిస్తే వడ్డీ వ్యాపారులతో అప్పు తీసుకునే ముప్పు తప్పుతుంది. – సుధాకర్, రైతు, గట్టురాయిపాకుల, తెలకపల్లి మండలం పంట నష్టపోయినం నాకున్న ఎకరా పొలంలో వరి పంట వేశాను. ఇటీవల కురిసిన వర్షాలకు వరి పంట పూర్తిగా నీట మునిగింది. పంట కోతకు వచ్చినా కోసుకునే పరిస్థితి లేకుండాపోయింది. ఇప్పటి వరకు అధికారులు ఎవరూ పంటను పరిశీలించలేదు. ఇకనైనా అధికారులు స్పందించి ఆదుకోవాలి. అలాగే యాసంగి పంటకు పెట్టుబడి సాయం అందించాలి. – శ్రీశైలం, రైతు, ఆవంచ, తిమ్మాజిపేట మండలం ఆదేశాలు రాలేదు.. రైతులకు పెట్టుబడి సాయానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. రైతులు, వారి ఖాతాలకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్దే ఉంటాయి. దానిని బట్టి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది. కొత్తగా పాస్‌పుస్తకాలు పొందిన రైతులకు ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. – యశ్వంత్‌రావు, జిల్లా వ్యవసాయాధికారి ● -
భూ భారతిని పకడ్బందీగా అమలు చేయాలి
ఊర్కొండ: భూ భారతిని పకడ్బందీగా అమ లు చేయాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. మంగళవారం ఆయన స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి తగు సూచనలు చేశారు. అనంతరం ఆయన అధికారులతో సమావేశమై మాట్లాడారు. భూ భారతి సదస్సులో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని, ఏ దశలో ఉన్నాయో బాధితులకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పీఓటీ కేసులు, భూ సమస్యలు, సాదాబైనామాల ఫిర్యాదులను రెండు రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వాటిని పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు కాకుండా జాగ్రత్త పడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ యూసుఫ్‌అలీ, నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదు కల్వకుర్తి రూరల్: రాష్ట్రంలో పత్తి రైతులకు అన్యాయం చేస్తే సహించే ప్రసక్తే లేదని మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. ప్రభుత్వం విధించిన ఆంక్షలు తొలగించి పత్తి కొనుగోలు చేపట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు తర్నికల్ సమీపంలోని మిల్లులో రైతులకు మద్దతుగా నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన పత్తిని భేషరతుగా కొనుగోలు చేయాలన్నారు. రైతులకు అన్యాయం చేస్తే రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం, శ్రీశైలం, గోవర్ధన్, విజయ్‌గౌడ్, సూర్యప్రకాష్‌రావు, మనోహర్‌రెడ్డి, బాలయ్య, జంగయ్య, రవి, దశరథనాయక్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లోబీజేపీ సత్తాచాటుదాం అచ్చంపేట: రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలో బీజేపీ సత్తాచాటుదామని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం రాత్రి అచ్చంపేటలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో ప్రజలు తేలుస్తారన్నారు. ప్రజలను గందరగోళానికి గురి చేసేందుకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని మభ్యపెడుతుందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సమానమని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను చూసి మురిసిపోతున్న కాంగ్రెస్ పార్టీ ఆపసోపాలు పడుతూ ఒక సీటు గెలిచినందుకే ఏదో సాధించామని భుజాలు ఎగరవేస్తోందని విమర్శించారు. బిహార్ ఎన్నికల గురించి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. -
బీసీ సర్పంచ్ స్థానాలు 704..
● కాంగ్రెస్ శ్రేణులతోపాటు వెనుకబడిన వర్గాల్లో జోష్ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడం.. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో సీట్లు కేటాయించనున్నట్లు స్పష్టం చేయడంతో రాజకీయ పరంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధానంగా బీసీలకు కేటాయించే సర్పంచ్ స్థానాలపై ఆ పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా సాగింది. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో మొత్తం 1,678 గ్రామపంచాయతీలు ఉండగా.. 15,068 వార్డులు ఉన్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తే.. 704 జీపీల్లో ఆ వర్గానికి చెందిన వారికి సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఎవరికి వారు లెక్కలు వేస్తూ ఊహాగానాల్లో మునిగిపోయారు. మరోవైపు వచ్చే నెల రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్, ఆ తర్వాత నోటిఫికేషన్, మూడో వారం చివర లేదంటే నాలుగో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా.. పలువురు ఆశావహులు పోరు సన్నాహాలకు శ్రీకారం చుట్టారు. గ్రామాల వారీగా ముఖ్య నేతల వద్దకు క్యూ కడుతుండడంతో ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాలు, పార్టీ ఆఫీసుల్లో సందడి నెలకొంది. ఇదిలా ఉండగా.. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అధికార యంత్రాంగం ఇదివరకే ఏర్పాట్లు పూర్తి చేసింది. బ్యాలెట్ పేపర్లు ముద్రించి భద్రపరిచింది. వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్లతో పాటు ఓటరు జాబితాలను ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించగా.. మళ్లీ అన్నీ సిద్ధం చేస్తున్నారు. చట్టబద్ధమైన రిజర్వేషన్లతోనే మేలు: బీసీ సంఘాలు ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు పార్టీపరంగా 42 శాతం సీట్లు కేటాయించడాన్ని బీసీ సంఘాల నేతలు ఆహ్వానిస్తున్నా.. పెద్దగా ఒరిగేదేమీ లేదని అంటున్నారు. ఇందుకు గత సర్పంచ్ ఎన్నికలను ఉదహరిస్తున్నారు. 2019లో బీసీలకు 22 శాతం రిజర్వేషన్ ఉందని.. ఉమ్మడి పాలమూరులో ఈ మేరకు కేటాయించిన వాటితో పాటు జనరల్ స్థానాల్లోనూ వారు గెలిచారని.. మొత్తంగా 38 శాతం మంది బీసీలు సర్పంచ్‌గా ఎన్నికయ్యారని చెబుతున్నారు. ప్రస్తుతం 42 శాతం అమలు చేస్తే 60 నుంచి 70 సీట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ అమలైతే బీసీ వర్గాలకు కొంత మేర ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. జనాభా దామాషా ప్రకారం చట్టబద్ధమైన బీసీ రిజర్వేషన్లతోనే వెనుకబడిన వర్గాలకు మేలు జరుగుతుందని.. ఈ మేరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిస్తున్నారు. -
ఇక పంచాయితీనే..!
పాత రిజర్వేషన్లతోనే సం‘గ్రామం’ ● మంత్రివర్గం నిర్ణయంతో ఆశావహుల పోరు సన్నాహాలు ● బీసీలకు పార్టీపరంగా 42% రిజర్వేషన్‌తో ‘హస్తం’ ముందుకు.. ● అదే బాటలోనే కారు, కమలం నడిచే అవకాశం ● ఈ లెక్కన జనరల్ స్థానాల్లో ఎక్కువ శాతం బీసీలకే చాన్స్ ● చట్టపరంగా కాకపోవడంతో చిక్కులు తప్పవని నేతల బెంబేలు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందుగా సం‘గ్రామానికి’ అడుగులు పడ్డాయి. డిసెంబర్‌లోపు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీం కోర్టు సూచనల మేరకు రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇచ్చిన హామీ మేరకు బీసీలకు కాంగ్రెస్ పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లతో సీట్లు కేటాయిస్తామని స్పష్టం చేసింది. దీంతో జనరల్/అన్ రిజర్వ్డ్ స్థానాల్లో ఎక్కువ శాతం మేర బీసీలు బరిలో నిలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చట్టపరంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. పార్టీ పరంగా అయితే పలు గ్రామాలకు సంబంధించి చిక్కులు, చికాకులు తప్పవని సీనియర్ రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అక్టోబర్‌లో జీఓ 9 జారీ చేసింది. ఆ తర్వాత ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి, నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ జరగగా.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజే ప్రక్రియ నిలిచిపోయింది. ఆ సమయంలో బీసీ రిజర్వేషన్లను ఎవరూ వ్యతిరేకిస్తలేరని, తామూ సిద్ధమని.. అయితే చట్టబద్ధత అవసరమని ప్రధాన ప్రతిపక్షాల నేతలు చెప్పారు. ప్రస్తుతం జీపీ ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేయగా.. బీఆర్ఎస్, బీజేపీ సైతం అదే దారిలో నడిచే అవకాశాలు కన్పిస్తున్నాయి. ‘హస్తం’ దారిలోనే ప్రతిపక్షాలు.. -
ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ
● ట్రాన్స్ఫార్మర్ మంజూరుకురూ.50 వేలు డిమాండ్ ● రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం గోపాల్పేట: ఓ రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏఈ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలోని ఏదుల గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకునేందుకు డీడీలు కట్టాడు. అయితే ట్రాన్స్ఫార్మర్ త్వరగా ఇవ్వాలని కోరగా విద్యుత్ శాఖ ఏఈ హర్షవర్ధన్‌రెడ్డి రూ.50 వేలు డిమాండ్ చయగా.. రూ.40 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ముందుగా రూ.20 వేలు ఇవ్వాలని ట్రాన్స్ఫార్మర్ ఇచ్చిన తర్వాత మిగతా రూ.20 వేలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలోనే బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. వారి సూచన మేరకు మంగళవారం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో రైతు రూ.20 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. ఈ మేరకు ఏఈని అదుపులోకి తీసుకున్నామని, బుధవారం నాంపల్లిలోని స్పెషల్ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. దాడుల్లో ఇద్దరు సీఐలు, పది మంది సిబ్బంది పాల్గొన్నారు. కాగా..ఏఈ హర్షవర్ధన్‌రెడ్డి స్వగ్రామం అమరచింత మండలం కొంకన్వానిపల్లిలోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. విలువైన డ్యాకుమెంట్లతో పాటు నగదును సేకరించినట్లు అధికారులు తెలిపారు. -
‘తెల్ల’బోతున్నారు..!
ప్రకృతి వైపరీత్యాలతో ముంచెత్తిన భారీ వర్షాలు.. సోకిన తెగుళ్లతో పత్తి పంటను కాపాడుకునేందుకు రైతులు దాదాపు రెట్టింపు ఖర్చులు పెట్టారు. పెట్టుబడి అయినా వస్తదనే ఆశతో అష్టకష్టాలు పడ్డారు. చివరకు అంతంత మాత్రంగానే చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు సైతం వారు నానాతంటాలు పడుతున్నారు. తొలుత ‘కపాస్’ కష్టాలు, తేమ.. ఆ తర్వాత ఎకరాకు 7 క్వింటాళ్లే కొంటామనే సీసీఐ కొర్రీలు.. తాజాగా జిన్నింగ్ వ్యాపారుల పిలుపు మేరకు నిలిచిన కొనుగోళ్లతో నరకయాతన అనుభవిస్తున్నారు. విధిలేక ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తూ.. దక్కని మద్దతు ధరతో రైతుల విలవిల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ సీసీఐ సెంటర్లలో కొన్నది 12,75,810.50క్వింటాళ్లే.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ ఏడాది వానాకాలం సీజన్లో 7,35,909 ఎకరాల్లో పత్తి సాగైంది. 69,52,022 క్వింటాళ్ల మేర దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో 30 సీసీఐ సెంటర్లు ఏర్పాటు చేయగా.. ఇప్పటివరకు 12,75,810.50 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. నారాయణపేట జిల్లాలో పత్తి దిగుబడి అంచనా 14,67,738 క్వింటాళ్లు కాగా.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీసీఐ కేంద్రాల్లో ఇప్పటివరకు 90,511 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. అదే ప్రైవేట్ వ్యాపారులు 1.50 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు అంచనా. ఇదే పరిస్థితి ఉమ్మడి పాలమూరులోని జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉంది. వనపర్తి జిల్లాలో కొనుగోలు కేంద్రం లేకపోవడంతో పత్తి రైతులు పక్క జిల్లాలకు తీసుకెళ్లారు. కొర్రీలపై కొర్రీలు.. ఈ ఏడాది వానాకాలం పత్తి కొనుగోళ్లలో తొలి నుంచి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వ్యవహరిస్తున్న తీరు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ సీజన్లోనే అందుబాటులోకి తెచ్చిన కపాస్ యాప్ కష్టాలను తెచ్చింది. యాప్‌లో రైతులు, పంట నమోదు చేసుకుంటేనే కొనుగోళ్లకు అవకాశం ఉండడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఎకరాకు 12 క్వింటాళ్లకు బదులు ఏడు క్వింటాళ్లే కొనుగోలు చేసేలా కొత్త నిబంధన పెట్టి.. యాప్‌లో మార్పు చేయడం తంటాలు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల, మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని అప్పాయిపల్లి.. నారాయణపేట జిల్లాలోని లింగంపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీఐ సెంటర్ల వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. మరోవైపు తేమ ఎనిమిది నుంచి 12 శాతం ఉంటేనే మద్దతు ధరతో కొనుగోలు చేస్తామనే కొర్రీ వెంటాడుతోంది. దీంతో రైతులు పత్తిని ఆరబెడుతూ కొనుగోళ్లకు పడిగాపులు కాయక తప్పడం లేదు. ‘ప్రైవేట్శ్రీలో నిలువు దోపిడీ.. ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో కొర్రీల నేపథ్యంలో రైతులు విధిలేక దళారులను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వ్యాపారులు ధర భారీగా తగ్గించారు. సీసీఐ సెంటర్లలో ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.8,110 మద్దతుతో కొనుగోలు చేస్తుండగా.. ప్రైవేట్ వ్యాపారులు రూ.5,500 నుంచి రూ.7 వేల వరకు మాత్రమే పెడుతూ నిలువు దోపిడీ చేస్తున్నారు. చేసేదేమీ లేక రైతులు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. సీసీఐ కొర్రీలు.. కొనుగోళ్ల బంద్‌తో చిక్కులు తొలుత కపాస్ కష్టాలు.. తేమ ఇక్కట్లు ఆ తర్వాత ఎకరాకు 7 క్వింటాళ్లే కొంటామని మెలిక తాజాగా జిన్నింగ్ మిల్లుల అల్టిమేటంతో నిలిచిన క్రయవిక్రయాలు నారాయణపేట, గద్వాల జిల్లాల్లో రైతుల ఆందోళన విధిలేని పరిస్థితుల్లో ‘ప్రైవేట్’లో అమ్మకాలు దక్కని మద్దతు ధరతో విలవిల నిలిచిన కొనుగోళ్లు.. పలు చోట్ల ఆందోళనలు జిన్నింగ్ వ్యాపారుల బంద్‌తో సోమవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని సీసీఐ సెంటర్లలో కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో పలు చోట్ల రైతులు ఆందోళనకు దిగారు. మరోవైపు జిన్నింగ్ మిల్లుల వద్ద పత్తి వాహనాలు భారీగా క్యూ కడుతుండడంతో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్ గేట్ వద్ద ఎన్‌హెచ్–167పై రైతులు ధర్నాకు దిగారు. దీంతో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ నాయకుడు, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితోపాటు పలువురు రాజకీయ నేతలు సంఘీభావం తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి శివారులోని సీసీఐ కేంద్రం వద్ద రైతులు మధ్యాహ్యం సమయంలో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే విజయుడు సాయంత్రం సెంటర్ వద్దకు చేరుకుని అధికారులతో కలిసి కొనుగోలు చేసేలా మిల్లు యజమానిని ఒప్పించారు. దీంతో రాత్రి వరకు ఆన్లైన్ ప్రక్రియ కొనసాగగా.. రైతులు అర్ధరాత్రి వరకు పడిగాపులు కాశారు. -
సమసమాజ నిర్మాణమే సీపీఐ లక్ష్యం
నాగర్‌కర్నూల్ రూరల్/ తిమ్మాజిపేట/ బిజినేపల్లి/ తెలకపల్లి/ అచ్చంపేట రూరల్: దేశంలో ఆర్థిక అసమానతలు లేని సమసమాజ నిర్మాణమే సీపీఐ లక్ష్యం అని పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని చేపట్టిన సీపీఐ ప్రచార జాతా సోమవారం తిమ్మాజిపేట, బిజినేపల్లి మీదుగా నాగర్‌కర్నూల్ చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. వందేళ్లుగా ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ఏకై క పార్టీ సీపీఐ అన్నారు. సీపీఐ పార్టీ వందేళ్ల త్యాగాల చరిత్రను నేటి సమాజానికి తెలియజేయడానికి ప్రచార జాతా నిర్వహించడం జరుగుతుందన్నారు. వచ్చే నెల 26న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు తిమ్మాజిపేట, బిజినేపల్లి, తెలకపల్లిలో చేపట్టిన ప్రచార జాతాలో పార్టీ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.బాల్‌నర్సింహ, జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ తదితరులు మాట్లాడారు. రాత్రికి అచ్చంపేట పట్టణానికి చేరుకుంది. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడు ఆనంద్జీ, రాష్ట్ర సమితి సభ్యుడు కేశవ్‌గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు నర్సింహ, చంద్రమౌళి, విజయుడు, జిల్లా సమితి సభ్యులు శ్రీనివాస్, శ్రీను, లక్ష్మీపతి, శివశంకర్, మధుగౌడ్, ఆంజనేయులు, మల్లయ్య, వెంకటమ్మ, కిరణ్‌కుమార్, శివుడు తదితరులు పాల్గొన్నారు. జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి -
నల్లమలలో ఆలయాల అభివృద్ధికి కృషి
అచ్చంపేట రూరల్: నల్లమల ప్రాంతంలో వెలసిన ప్రసిద్ధ ఆలయాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషిచేస్తున్నామని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. సోమవారం శ్రీశైల ఉత్తర ముఖ ద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాపనాశిని గుండం వద్ద పుణ్యస్నానమాచరించి గణపతి పూజ, శివుడికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. అనంతరం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించడంతోపాటు పలుచోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తులు జయప్రదం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బ్రహ్మోత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, విద్యుత్ మొదలైన వాటిపైన అధికారులు ఇప్పటి నుంచే దృష్టిపెట్టాలన్నారు. దేవాలయ ఆవరణలో త్వరలోనే సెల్ టవర్ ఏర్పాటు చేస్తామన్నారు. అంతకు ముందు పట్టణంలోని రాజీవ్– ఎన్టీఆర్ మినీ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఉమామహేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, ఈఓ శ్రీనివాసరావు, పబ్బతి ఆంజనేయస్వామి ఆలయ కమిటీ చైర్మన్ రాములునాయక్, పాలకమండలి సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నేడు యువజనోత్సవాలు కందనూలు: యువజన సర్వీసు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాకేంద్రంలోని సాయి గార్డెన్లో జిల్లాస్థాయి యువజనోత్సవాల్లో భాగంగా వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని జిల్లా యువజన, క్రీడల అధికారి సీతారాం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జానపద నృత్యం, కథా రచన, పెయింటింగ్, వకృత్వ, కవిత్వం, ఇన్నోవేషన్ ట్రాక్ తదితర అంశాలలో పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో జిల్లాకు చెందిన 15 – 29 ఏళ్లలోపు యువతీ, యువకులు పాల్గొనాలని సూచించారు. -
అక్రమాలకు కళ్లెం పడేనా?
తెలంగాణ స్టోన్ క్రషర్ నియమావళి–2025 అమలు ● మ్యానువల్ విధానానికి స్వస్తి.. ఆన్లైన్లోనే అనుమతులు ● ఇక నుంచి ఖనిజ వినియోగంపై ప్రత్యేక దృష్టి ● క్వారీల్లో సీసీ కెమెరాలు.. ఏడీ కార్యాలయానికి అనుసంధానం ● నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలకు ఆదేశం ఇప్పటి వరకు నామమాత్రంగానే.. జిల్లాలో నడుస్తున్న క్రషర్ పరిశ్రమలు ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా కంకర తయారు చేసి సొమ్ము చేసుకుటున్నాయి. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకపోగా, పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నారు. హెవీ బోల్డర్ క్రషర్లు గంటకు 150 టన్నుల వరకు ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగినవి జిల్లాలో ఉన్నాయి. ఇది 20 ట్రిప్పర్ల లోడ్లకు సమానం. ఇప్పటి వరకు నిర్వాహకులు మ్యానువల్ పద్ధతిలో రాయి వినియోగం వివరాలు ప్రభుత్వానికి సమర్పించేవారు. దీంతో నామమాత్రంగా చూపుతూ సీనరేజ్ చార్జీలు చెల్లింపు పరంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పెట్టేవారు. సర్కారు తాజాగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం ఇప్పుడు అక్కడే వేబ్రిడ్జి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రాయి తూకంతోపాటు విద్యుత్ వినియోగం ఆధారంగా లెక్కలు ఇక ఆన్లైన్లో తేటతెల్లం కానున్నాయి. అచ్చంపేట: స్టోన్ క్రషర్ యూనిట్లలో విద్యుత్ వినియోగం ఆధారంగా ఇక ఖనిజ వినియోగ నిష్పత్తి అంచనా వేస్తారు. ప్రతి టన్ను ముడి ఖనిజం ఉత్పత్తికి 4 కేవీఏహెచ్ విద్యుత్ వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యుత్ వినియోగ సమాచారం టీఎస్పీడీసీఎల్/ ఎన్పీడీసీఎల్ విద్యుత్ పోర్టల్‌తో లింక్ అవుతుంది. డీజిల్ జనరేటర్ ద్వారా విద్యుదుత్పత్తి జరిగితే దానికి కూడా మీటర్ ఏర్పాటు చేయాలి. ఈ లెక్కల ఆధారంగా సదరు క్వారీలో వినియోగించిన యూనిట్లను లెక్కగడుతారు. ఈ నిబంధనలను పాటించని క్రషర్లకు విద్యుత్ కనెక్షన్ నిలిపివేస్తారు. అలాగే సొంత వే బ్రిడ్జిని తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. క్రషర్ చేయబోయే రాయి తూకం ఆటోమేటిక్‌గా కంప్యూటర్ సిస్టంలో రికార్డు అయ్యేలా చేయాలి. ఈ రెండు అంశాల ఆధారంగా యూనిట్లో ఎంత ఖనిజం వినియోగం జరుగుతుంది.. క్రషర్ ద్వారా ఎంత ప్రొడక్షన్ వచ్చింది.. అనే లెక్కలపై స్పష్టత ఉంటుంది. ఇప్పటి వరకు క్రషర్ యూనిట్ల వద్ద ఎంత ఖనిజం వినియోగంపై యజమాని చెప్పిందే వేదంగా ఉండేది. విద్యుత్ వినియోగాన్ని అసలు పరిగణలోకే తీసుకునేవారు కాదు. అన్ని అంశాలకు సంబంధించి పూర్తిగా మ్యానువల్ పద్ధతిలోనే సాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే అక్రమాలకు కళ్లె వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టోన్ క్రషర్ నియమావళి–2025ని అమలులోకి తీసుకొస్తూ ఈ నెల 1న జీఓ 26 జారీ చేసింది. ఈ విధానం పూర్తిగా ఆన్లైన్లోనే కొనసాగనుంది. మూడేళ్లపాటు నిషేధం.. జిల్లాలో 24 కంకర క్రషర్ పరిశ్రమలు నడుస్తున్నాయి. ప్రతి నెలా 10లోగా ఫాం–ఏ (విద్యుత్), ఫాం–బీ (ముడిసరుకు) వినియోగానికి సంబంధించి రిటర్న్‌లు ప్రభుత్వానికి సమర్పించాలి. వరుసగా రెండు నెలలు రిటర్న్స్ సమర్పించకపోతే క్రషర్ రిజిస్ట్రేషన్ రద్దు చేసేలా నియమావళి రూపొందించారు. అలాగే పర్యావరణ నియమావళి తప్పనిసరి పాటించాలి. వాటి గడువు ముగిసిన పక్షంలో మళ్లీ రెన్యువల్ చేసుకోవాలి. ప్రభుత్వానికి బకాయిలు ఉండరాదు. ఒకసారి యూనిట్ రద్దు అయితే మళ్లీ రిజిస్ట్రేషన్ చేయడానికి మూడేళ్లపాటు నిషేధం విధించారు. అవగాహన కల్పిస్తున్నాం.. స్టోన్ క్రషర్ యూనిట్ల పర్యవేక్షణకు ప్రభుత్వం కొత్త నియమావళిని రూపొంచించింది. దీనిపై జిల్లావ్యాప్తంగా ఆయా యజమానులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆయా మార్పులను యూనిట్ల వద్ద చేపట్టాలి. బయటి నుంచి గ్రానైట్ తరలించకూడదు. పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. – వెంకట్రాములు, గనుల శాఖ ఏడీ -
వైభవోపేతంగా కోటి దీపోత్సవం
అచ్చంపేట: అచ్చంపేట శ్రీచక్ర సహిత శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆయలంలో సోమవారం రాత్రి అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీభ్రమరాంబ, మల్లిఖార్జున శివపార్వతుల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. కన్యకా పరమేశ్వరిదేవి ఆలయ ఉత్తర ద్వారమైన పార్కింగ్ స్థలంలో జ్యోతి ప్రజ్వలన, అనంతరం కనుల పండువగా కోటి దీపోత్సవం నిర్వహించారు. ఇందులో వేయి మంది భక్తులు పాల్గొని దీపాలు వెలగించారు. వాసవీ చారిటబుల్ ట్రస్ట్ దీపోత్సవంలో పాల్గొనే మహిళలకు ప్రమిదలు, ఒత్తులు, నూనె, కుంకుమ, పసుపు వస్తువులను అందజేశారు. సాయంత్రం వేదపఠనం, ఆధ్యాత్మిక గాయకులు ప్రేమ్రాజ్చే సంగీత కచేరి ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి బాలరాజు, కోశాధికారి శ్రీనివాసులు, చంద్రకుమార్, కర్ణస్వామి, వినోద్, నరేష్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
డబుల్ బెడ్రూం ఇళ్ల పనులు పూర్తిచేయాలి
నాగర్‌కర్నూల్: జిల్లాలో డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించిన అసంపూర్తి పనులన్నింటినీ త్వరితగతిన పూర్తిచేసి, డిసెంబర్‌లోగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ పట్టణంలోని ఆర్టీసీ డిపోకు సమీపంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పనుల పెండింగ్ వివరాల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న డిసెంబర్‌లోగా గృహాల ప్రారంభోత్సవం చేపట్టనున్నందున మిగిలి ఉన్న పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన, నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించేలా అధికారులు జాబితా సిద్ధం చేయాలన్నారు. ఆర్టీసీ డిపో వద్ద నిర్మితమైన 195 ఇళ్లలో విద్యుత్ సౌకర్యం, ప్లంబింగ్, ఫ్లోరింగ్, పెయింటింగ్ పనులు మిగిలి ఉన్నందున, వాటిని ఆలస్యం చేయకుండా వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. ప్రధాన రహదారి నుంచి ఇళ్ల వరకు చేరుకునేలా రహదారి పనులు చేపట్టాలని, ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా వాతావరణం కల్పించాలని పంచాయతీ రాజ్ అధికారులను కోరారు. ఇళ్ల పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి, పచ్చదనాన్ని పెంపొందించాలని, అక్కడ నివసించే ప్రజలకు ఆరోగ్యకరమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, గృహ నిర్మాణ శాఖాధికారి సంగప్ప, పంచాయతీరాజ్ ఈఈ విజయ్‌కుమార్, మున్సిపల్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణికి 48 అర్జీలు నాగర్‌కర్నూల్: రాష్ట్ర, జిల్లాస్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 48 మంది బాధితులతో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయంతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులందరూ తమ పరిధిలో ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరిగా చేయాలని, పరిశీలన అనంతరం ఆన్లైన్ ప్రజావాణి పోర్టల్ ద్వారా దరఖాస్తుదారులకు స్పష్టమైన, పారదర్శకమైన సమాధానం ఇవ్వాలన్నారు. పోలీస్ గ్రీవెన్స్‌కు 5 ఫిర్యాదులు నాగర్‌కర్నూల్ క్రైం: పోలీసు ప్రజవాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషిచేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 5 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాలని సూచించారు. ప్రజలు మూడో వ్యక్తి ప్రమేయం, పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవలు వినియోగించుకుంటూ వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకోవాలని కోరారు. -
గుట్టలను తవ్వేస్తున్నారు..
పాలమూరు ప్రాజెక్టులోని ఏదుల రిజర్వాయర్ సమీపంలో బావాయిపల్లి, దేవల్ తిర్మలాపూర్ గ్రామాల మధ్యనున్న గుట్టలను తవ్వి కొందరు వ్యక్తులు మట్టిని అక్రమంగా తవ్వి అమ్ముకుంటున్నారు. వట్టెం రిజర్వాయర్ సమీపంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పెంట్లవెల్లి ఊరచెరువు సమీపంలో ఓ గుట్టలో ఎక్కువ భాగం తవ్వేశారు. మైనింగ్ అధికారుల అనుమతులు లేకుండానే జిల్లాలో ఇష్టానుసారంగా చెరువులు, రిజర్వాయర్ల సమీపంలో గుట్టలను తవ్వేస్తున్నారు.పాలమూరు, ఎంజీకేఎల్ఐ పంప్‌హౌజ్‌ల సమీపంలో చదును చేస్తున్న తువ్వగట్టు ప్రాంతం -
క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
వనపర్తి రూరల్: విద్యార్థులు క్రీడారంగంలో తమకంటూ ప్రత్యేకతను చాటుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జిల్లెల చిన్నారెడ్డి కోరారు. ఆదివారం మండలంలోని చిట్యాల ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో ఉమ్మడి జిల్లా అండర్–17 క్రీడల ప్రారంభోత్సవానికి ఆయనతో పాటు ఆర్సీఓ శ్రీనివాస్‌గౌడ్, డీసీఓ శ్రీవేణి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ముందుగా చిన్నారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఒలింపిక్ జ్యోతిని వెలిగించి క్రీడాకారుల వందన సమర్పణను స్వీకరించారు. అనంతరం కబడ్డీ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. దేశ నిర్మాణంలో క్రీడాకారులు తమవంతు పాత్ర పోషించాలన్నారు. ప్రతిభగల క్రీడాకారులను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడలు శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతతను పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. ప్రిన్సిపాల్ ప్రశాంతి మాట్లాడుతూ.. క్రీడా పోటీల్లో ఉమ్మడి జిల్లాలోని 14 ఎంజేపీ బీసీ బాలుర గురుకులాల నుంచి 450 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. క్రీడాకారులకు పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించామని, క్రీడల్లో చరుగ్గా పాల్గొని జయాపజయాలకు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి -
కనులపండువగా కల్యాణ మహోత్సవం
అచ్చంపేట రూరల్: అచ్చంపేటలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం సామూహిక వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కౌన్సిలర్ గోపిశెట్టి శివ (అప్ప శివ) – గాయత్రి దంపతుల చేతులమీదుగా నిర్వహించిన వివాహ వేడుకల్లో 61 జంటలు ఒక్కటయ్యాయి. ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ – అనురాధ దంపతులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. నూతన వధూవరులకు అప్ప శివ అందించిన పట్టువస్త్రాలు, బంగారు తాళి, మెట్టెలను అందజేశారు. అచ్చంపేటలో మొదటిసారిగా నిర్వహించిన సామూహిక వివాహ వేడుకలను చూసేందుకు నియోజకవర్గ నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చారు. కల్యాణం అనంతరం కొత్త దంపతులకు బీరువా, మంచం, ఇతర వంటసామగ్రి అందజేసి.. భారీ ఊరేగింపు మధ్య స్వగ్రామాలకు పంపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ... అచ్చంపేటలో ఎన్నడూ లేని విధంగా అప్ప శివ – గాయత్రి దంపతులు సామూహిక వివాహాలు చేయడం గొప్ప విష యమన్నారు. ఆయన్ను అభినందించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఒకే వేదికపై ఒక్కటైన 61 జంటలు -
పొంచి ఉన్న ముప్పు!
సింగోటం రిజర్వాయర్ సమీపంలో మైనింగ్ తవ్వకాలు పంప్‌హౌజ్‌ల సమీపంలోనూ.. కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు సమీపంలోనే ఎంజీకేఎల్ఐ, పాలమూరు ప్రాజెక్టులు, వాటి పంప్‌హౌజ్‌లు ఉన్నాయి. ఇటీవల వీటికి అతి సమీపంలోని తువ్వగట్టుపై ఉన్న చెట్లను నరికేసి, భూమి చదును చేసే పనులు చేపట్టారు. దీనిపై ఇప్పటికే రాజకీయ పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి. 300 అడుగులకు పైగా ఎత్తులో ఉన్న తువ్వగట్టును చదును చేయడం వల్ల భూమి పొరల్లో మార్పులు రావొచ్చని.. ఇవి ప్రాజెక్టులకు భవిష్యత్‌లో ప్రమాదకరం అయ్యే అవకాశం ఉంటుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అడవిలో ఉన్న తువ్వగట్టును చదును చేస్తుంటే.. అటవీ, రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడంపై అనేక అనుమా నా లు తలెత్తుతున్నాయి. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వీడి ప్రాజెక్టుల పరిరక్షణపై దృష్టిసారించాలని రైతులు కోరుతున్నారు. కొల్లాపూర్: ఉమ్మడి జిల్లా వరప్రదాయిని ఎంజీకేఎల్ఐ, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు భవిష్యత్‌లో ప్రమాదం ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం సమన్వయ లోపం కారణంగా ప్రాజెక్టుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. వాటి సమీపంలో ఇష్టానుసారంగా చెట్ల నరికివేత, మైనింగ్, మట్టి తవ్వకాలు చేపడుతుండటంతో ప్రాజెక్టులపై ప్రభావం చూపనున్నాయి. సింగోటం రిజర్వాయర్ వద్ద.. ఎంజీకేఎల్ఐ ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన సింగోటం రిజర్వాయర్ సమీపంలో వైట్‌క్వార్జ్ నిక్షేపాల వెలికితీత పనులు సాగుతున్నాయి. రత్నగిరి కొండను హద్దుగా ఏర్పాటుచేసి.. సింగోటం రిజర్వాయర్ నిర్మించారు. ఈ కొండపైనే మైనింగ్ తవ్వకాలు దశాబ్ద కాలంగా కొనసాగుతున్నాయి. తవ్వకాలు ప్రారంభించిన తొలినాళ్లలో సింగోటం గ్రామస్తులు న్యాయపోరాటం చేసి పనులను అడ్డుకున్నారు. తర్వాతి కాలంలో మళ్లీ అనుమతులు తెచ్చుకున్న గుత్తేదారులు.. తిరిగి తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఖనిజ నిక్షేపాల వెలికితీత కోసం బ్లాస్టింగ్లు చేస్తున్నారు. కొండకు చివరి భాగంలో మొదటి విడతలో అనుమతులు ఇచ్చిన మైనింగ్ అధికారులు.. కొంతకాలం క్రితమే కొండ మధ్య భాగంలో కూడా క్వార్జ్ నిక్షేపాల వెలికితీతకు రెండో విడత అనుమతులు ఇచ్చారు. దీంతో ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన ఈ కొండ ఉనికి కోల్పోయే ప్రమాదం నెలకొంది. కొండ ప్రాంతం దెబ్బతింటే.. సింగోటం రిజర్వాయర్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ‘ఏదుల’ వద్ద గుట్టలను తోడేస్తున్న అక్రమార్కులు ప్రమాదంలో ఎంజీకేఎల్ఐ, పాలమూరు ప్రాజెక్టులు పట్టించుకోని అధికార యంత్రాంగం గుట్టలను పరిశీలిస్తాం.. పాలమూరు, కేఎల్ఐ పంప్‌హౌజ్‌ల సమీపంలో చదును చేస్తున్న తువ్వగట్టు ప్రాంతాన్ని పరిశీలిస్తాం. చెట్లను తొలగిస్తే ఇబ్బంది ఏమీ లేదు. మట్టి తవ్వకాలు ఎంత లోతుకు జరుగుతున్నాయో తెలుసుకుంటాం. సింగోటం రిజర్వాయర్ సమీపంలోని రత్నగిరి కొండపై మైనింగ్ తవ్వకాలకు ఎంత మేరకు మైనింగ్‌శాఖ అనుమతులు ఇచ్చిందనే విషయాలపై ఆరా తీస్తాం. రిజర్వాయర్‌కు ప్రమాదకరమా.. లేదా అనేది చూసి, నిబంధనలు అతిక్రమిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరెడ్డి, ఈఈ, నీటిపారుదలశాఖ -
సహజ సిద్ధంగా..
ఇవీ మిషన్ విశేషాలు.. ●రైతులు ముందుకు రావాలి.. ఆహార అవసరాల డిమాండ్ పెరగడంతో అధిక దిగుబడులు పొందేందుకు వ్యవసాయ సేద్యంలో ఉపయోగిస్తున్న ప్రమాదకర ఎరువులు, పురుగు మందులు, రకరకాల సాగు విధానాలు పర్యావరణంతోపాటు మానవ ఆరోగ్యాలకు హాని కలిగిస్తున్నాయి. వ్యవసాయాన్ని సహజ పద్ధతులతో చేయడం వల్ల ఆరోగ్యకర దిగుబడులు లభించడమే కాక పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. దీనిపై రైతులకు అవగాహన లేకపోవడంతో ముందుకు రావడం లేదు. ఈ పథకం దేశం మొత్తంలో యుద్ధప్రాతిపదికన అమలు చేయాల్సిన అవసరం ఉంది. అపోహలు వీడి రైతులు ముందుకు రావాలి. – వార్ల మల్లేశం, సేవ్ నేచర్ ప్రతినిధి, కోస్గి కార్యాచరణ సిద్ధం.. ప్రకృతిలో దొరికే వనరులను వినియోగించడంతోపాటు రసాయనాలు, పురుగు మందుల వాడకం తగ్గించి సహజ పద్ధతిలో వ్యవసాయం చేసేలా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేస్తున్నాం. ప్రస్తుతం రైతుల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే ఎంపిక చేసిన రైతులకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించనున్నాం. – వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, మహబూబ్‌నగర్ జిల్లా క్లస్టర్లు రైతులు మహబూబ్‌నగర్ 20 2,500 నాగర్‌కర్నూల్ 15 1,875 నారాయణపేట 10 1,250 జోగుళాంబ గద్వాల 20 2,500 వనపర్తి 10 1,250 మహబూబ్‌నగర్ (వ్యవసాయం): అధిక దిగుబడుల కోసం విచ్చలవిడిగా వాడుతున్న రసాయనాలు అటు పర్యావరణానికి.. ఇటు ప్రజల ఆరోగ్యాలకు పెనుముప్పుగా మారుతున్నాయి. ఈ క్రమంలో సంప్రదాయ పద్ధతులతో కూడిన ప్రకృతి వ్యవసాయానికి రైతులను సమాయత్తం చేసేలా కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ అండ్ నేచురల్ ఫార్మింగ్ పథకానికి పచ్చజెండా ఊపింది. సేంద్రియ పద్ధతులతో విభిన్న పంటలు పండించడానికి రైతులకు కావాల్సిన ప్రోత్సాహకాలు అందించనుంది. ఆరోగ్యకర దిగుబడులతోపాటు పర్యావరణ హితంగా పంటలు పండిస్తూ.. భూమి, సహజ వనరులను కాపాడుతూ.. రైతులు తక్కువ ఖర్చులతో కూడిన సుస్థిర వ్యవసాయ విధానం వైపు అడుగులు వేసేందుకు ఈ పథకం తోడ్పడనుంది. సంప్రదాయ వ్యవసాయాన్ని సహజ రీతిలో ప్రకృతి వ్యవసాయంగా మార్చాలనే దృక్పథాన్ని పునరుద్ధరించేలా కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఖర్చు చేయనున్నాయి. 2025– 26 సంవత్సరంలో 60 వేల ఎకరాల్లో ఈ పథకం కింద సాగు చేపట్టనున్నారు. సురక్షితమైన పోషకాహారాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సహజ సాగు పద్ధతులను ప్రోత్సహిస్తుంది. 2025– 26లో ఈ పథకం కోసం వెచ్చించే రూ.2,481 కోట్ల మూలధనంతో కేంద్ర ప్రభుత్వం రూ.1,584 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.897 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఇప్పటికే సాగులో సేంద్రియ పద్ధతులు పాటిస్తున్న రైతులు, పీఏసీఎస్‌లు, ఎఫ్పీఓలు, ఎస్‌హెచ్‌జీలు లాంటి వాటికి ఈ పథకంలో ప్రాధాన్యమిస్తారు. సేంద్రియ వ్యవసాయానికి అవసరమయ్యే సహజ ఉత్పత్తులను రైతులకు సులభంగా అందుబాటులో ఉంచేందుకు అవసరాన్ని బట్టి జీవాధార వనరుల కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, రైతుల పొలాల్లో 2 వేల వరకు నమూనా సహజ వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పుతారు. ఆసక్తి గల రైతులకు నిపుణులైన శిక్షకులు సహజ వ్యవసాయ పద్ధతులు, జీవ ఎరువుల తయారీ వంటి వాటిలో శిక్షణ ఇస్తారు. జిల్లాలో ఎంపిక చేసిన వ్యవసాయ క్లస్టర్లలో ఈ పథకంపై అవగాహన కల్పించేందుకు, స్థానిక రైతుల మధ్య సహకారం పెంచేందుకు ‘కృషి సఖులు’ సాగు సహాయకులను ఉపయోగించనున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలో ఇలా.. చేకూరే ప్రయోజనాలు ప్రకృతి వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా మూస ధోరణికి స్వస్తిపలికి.. విభిన్న పంటలకు ప్రోత్సాహం ప్రతిరైతు సేంద్రియ పద్ధతిని అవలంభించేలా చర్యలు తద్వారా సురక్షితమైన పోషకాహారం తీసుకొచ్చేందుకు కృషి ఉమ్మడి జిల్లాలో 9,375 మంది రైతుల ఎంపిక ప్రతీ మండలంలో.. సహజ వ్యవసాయ పథకం అమలులో భాగంగా ప్రతి మండలంలో ఒక క్లస్టర్ గ్రామాన్ని ఎంపిక చేశారు. గుర్తించిన గ్రామం లేదా గ్రామ సముదాయంలో 125 మంది చొప్పున జిల్లాలో 20 క్లస్టర్ల నుంచి మొత్తం 2,500 మంది ఔత్సాహిక రైతులను గుర్తించారు. వారి వ్యవసాయ కమతంలో మొదట ఒక విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతి ఆచరించేలా ప్రోత్సహిస్తారు. మొదటి సంవత్సరం రైతులు శిక్షణలో భాగంగా క్షేత్ర సందర్శన, ఇంటి పెరట్లో అవసరాలకు సరిపడా కూరగాయల సాగుతో ప్రకృతి వ్యవసాయం ప్రారంభిస్తారు. రెండు, మూడేళ్లలో ఆవుపేడ, గోమూత్రం సేకరణ, జీవామృత లాంటి బయో ఉత్పత్తుల తయారీ, మల్చింగ్, అంతర పంటల సాగు పద్ధతులు అవలంభించనున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన, నమ్మకం ఏర్పడి రైతు తన క్షేత్రంలో కొంత విస్తీర్ణంలో ఆచరణ మొదలుపెట్టాలి. 4–5 ఏళ్లలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతు తన వ్యవసాయ క్షేత్రంలో ఆచరించాలి. ఇలా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 75 క్లస్టర్లలో 9,375 రైతులను ఎంపిక చేశారు. వీరందరికి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. సేంద్రియ ఎరువులు, జీవసంబంధం పద్ధతుల వాడకం వల్ల నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి, భూసారం మెరుగుపడుతుంది. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గడం వల్ల వాతావరణంలో కర్బన ఉద్ఘారాలు తగ్గుతాయి. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్, ధర ఉండటం వల్ల రైతులకు ఆదాయం పెరుగుతుంది. సేంద్రియ ఉత్పత్తులు మానవ ఆరోగ్యానికి సురక్షితమైనవి. పోషక విలువలను అధికంగా కలిగి ఉంటాయి. సహజ వ్యవసాయం పర్యావరణ అనుకూలమైన, స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. స్థానిక వనరుల వినియోగం ద్వారా గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుంది. -
సాంకేతిక పరిజ్ఞానం అవసరం
కందనూలు: ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్ అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి విద్యార్థి ప్రాథమిక దశలోనే కంప్యూటర్‌పై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే డిజిటల్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రంథాలయాలను సైతం సాంకేతికపరంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. అందులో భాగంగా స్మార్ట్ లైబ్రేరీలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి శ్యాంసుందర్, పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
సీసీఐ కొనుగోలు కేంద్రాల నిలిపివేత
కందనూలు: జిల్లావ్యాప్తంగా సీసీఐ ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను సోమవారం నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి స్వర్ణసింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీసీఐ కాటన్ జిన్నింగ్ మిల్లుల విషయంలో విధించిన నిబంధనలను సడలించే వరకు రాష్ట్రవ్యాప్తంగా సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు, ప్రైవేటులో కొనుగోలు పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సీసీఐ కొనుగోలు కేంద్రాలు, కాటన్ జిన్నింగ్ మిల్లులకు పత్తిని తీసుకురావొద్దని రైతులకు ఆయన సూచించారు. హాస్టళ్ల విద్యార్థులకు వనభోజనాలు కందనూలు: షెడ్యూల్డ్ కులాల సంక్షేమశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని హాస్టళ్ల విద్యార్థులకు స్థానిక బాలికల జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం వనభోజనాలను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్, ఆటల పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు వన భోజనాలు చేశారు. కార్యక్రమంలో వార్డెన్లు విజయకుమార్, రవితేజ, సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి కల్వకుర్తి రూరల్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ జేఏసీ కన్వీనర్ శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ సాధనలో భాగంగా ఆదివారం కల్వకుర్తిలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనాభాకు అనుగుణంగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. జిల్లా పరిషత్ మాజీ వైస్‌చైర్మన్ బాలాజీసింగ్ మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమాలతో బీసీ రిజర్వేషన్లు సాధిస్తామన్నారు. కార్యక్రమంలో మణికంఠ, సదానందంగౌడ్, రాజేందర్, జంగయ్య, భాస్కర్, గణేశ్, అనిల్ పాల్గొన్నారు. మైసమ్మ జాతరలో తగ్గిన భక్తుల రద్దీ పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరలో ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. ప్రస్తుతం వానాకాలం పంటకోతలు, ధాన్యం విక్రయాలు సాగుతుండటంతో పాటు యాసంగి సాగు పనులు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో వ్యవసాయ పనుల్లో రైతులు, కూలీలు నిమగ్నం కావడంతో మైసమ్మ జాతరలో భక్తుల రద్దీ అంతంతమాత్రంగా కనిపించింది. సుమారు 8వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నట్లు దేవాదాయశాఖ అధికారి రామ్ శర్మ తెలిపారు. -
రాజీమార్గంలో కేసుల పరిష్కారం
నాగర్‌కర్నూల్ క్రైం: రాజీమార్గం ద్వారా లోక్ అదాలత్‌లో శాంతియుత వాతావరణంలో కక్షిదారులు తమ కేసులు రాజీ చేసుకోవచ్చని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. శనివారం జిల్లా కోర్టులో స్పెషల్ లోక్ అదాలత్‌తోపాటు విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ జిల్లాలోని కోర్టులలో నిర్వహించిన స్పెషల్ లోక్‌అదాలత్‌లో 200 కేసులు రాజీ అయ్యాయయని చెప్పారు. స్పెషల్ లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోదగిన అన్ని క్రిమినల్, చెక్‌బౌన్స్, కుటుంబ, మోటారు వాహన యాక్సిడెంట్, భూ వివాదం, బ్యాంకు కేసులు పరిష్కరించుకున్నారని తెలిపారు. పోక్సో కోర్టు స్పెషల్ సెషన్స్ జడ్జి నసీం సుల్తానా మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా ఇరువర్గాలకు సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శృతిదూత, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిధి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి, ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీనివాస్, ఆర్టీసీ మేనేజర్ యాదయ్య, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా చేపట్టాలి
కల్వకుర్తి టౌన్: రైతులను ఇబ్బంది పెట్టకుండా కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని పూర్తి పారదర్శకంగా కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మెప్మా నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలను అందించి వారిని ఆర్థికంగా ఎదిగేలా చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే వరి సన్నాలకు మద్దతు ధర కంటే అదనంగా రూ.500 బోనస్ ప్రకటించిందన్నారు. రైతులు ఎక్కడా దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రంలోనే ధాన్యం అమ్మాలన్నారు. కేంద్రాన్ని నిర్వహించే వారు సైతం ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, తూకాలను సరిగా వేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్, పీసీబీ మెంబర్ బాలాజీసింగ్ తదితరులు పాల్గొన్నారు. కల్వకుర్తిలోని బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థిని గెస్ట్ ఫ్యాకల్టీ కొట్టిన నేపథ్యంలో ఎమ్మెల్యే అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా అధికారులు, తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ ఉషారాణితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి, మరోమారు విద్యార్థుల పట్ల ఎవరైనా కఠినంగా ప్రవర్తించినా, మరేమైనా ఫిర్యాదులు వచ్చినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలిసింది. -
నేడు అచ్చంపేటలో ఉచిత సామూహిక వివాహాలు
అచ్చంపేట రూరల్: నల్లమల ప్రాంతంలోని అచ్చంపేట పట్టణానికి చెందిన కౌన్సిలర్ గోపిశెట్టి శివ (అప్ప శివ) ఆయన తల్లిదండ్రుల జ్ఞాపకార్థకం ఉచిత సామూహిక వివాహాలు చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే కల్యాణ మండపం సిద్ధమైంది. ఈ మేరకు ఆదివారం ఉదయం 10.30 గంటలకు 63 జంటలు ఒక్కటి కానున్నాయి. ఇప్పటి వరకు అచ్చంపేటలో ఉచిత సామూహిక వివాహాలు చేసిన దాఖలాలు లేవు. కౌన్సిలర్ శివ, గాయతి దంపతులు ముందుకు రావడంతో పేద జంటలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉచిత సామూహిక వివాహాల ఏర్పాట్లు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. పట్టణం నలు మూలలా స్వాగత తోరణాలు, విద్యుత్ లైట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ, అనురాధ దంపతుల సమక్షంలో జరగనున్న ఉచిత సామూహిక వివాహాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, సినీ యాక్టర్లు హాజరు కానున్నారని తెలిసింది. -
మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలి
నాగర్‌కర్నూల్: దేశ ఐక్యతను ప్రతిబింబించేలా కృషి చేసిన మహనీయుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలకు అనుగుణంగా యువతరం ముందుకు సాగాలని ఎంపీ డాక్టర్ పార్మాత్ జయంత్సింగ్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని ఐక్యత మార్చ్ ఘనంగా నిర్వహించారు. కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ, మేరా యువ భారత్, జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి యూనిటీ మార్చ్ పాదయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుజరాత్ ఎంపీ డాక్టర్ పార్మాత్ జయంత్సింగ్, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వళన చేసి.. పటేల్, బిర్సా ముండా చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ముఖ్య అతిథులు జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించగా.. అంబేడ్కర్ విగ్రహం గుండా గాంధీ పార్క్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఎంపీ పార్మాత్ జయంత్సింగ్ మాట్లాడుతూ నేడు త్రివేణి సంగమం లాంటి పటేల్, బిర్సా ముండా జయంతి, వందేమాతర గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న రచన కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం యువతలో దేశభక్తి పెంపొందించేందుకు ఏక్ భారత్– ఆత్మనిర్బర్ భారత్శ్రీలో భాగంగా ఐక్యత మార్చ్ నిర్వహించామన్నారు. దేశ సమైక్యత వెనుక ఉన్న మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారత పౌరుని బాధ్యత అన్నారు. కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం విలీనంలో పటేల్ పాత్ర అమూల్యం అన్నారు. యువత ఆయన స్ఫూర్తిని ఆచరణలో పెట్టి దేశ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి మాట్లాడుతూ పటేల్ దేశ సమైక్యతకు అనేక రకాల పోరాటాలు చేశారని, అలాంటి మహనీయునికి గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఏక్తా విగ్రహాన్ని ఇటీవలే తాను సందర్శించానన్నారు. అద్భుతమైన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీకి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థులు, యువతతో దేశ ఐక్యత సమగ్రత, భద్రతను కాపాడటానికి కృషి చేస్తానని రాష్ట్రీయ ఏక్తా దివాస్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా యూత్ అధికారి కోటనాయక్, జిల్లా యువజన సర్వీసుల అధికారి సీతారాంనాయక్, డీఈఓ రమేష్‌కుమార్, డీఐఈఓ వెంకటరమణ, డీఎంహెచ్ఓ రవినాయక్, పశుసంవర్ధక శాఖ అధికారి జ్ఞానశేఖర్ పాల్గొన్నారు. -
గుట్టకాయ స్వాహా..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా మట్టి మాఫియా రెచ్చిపోతుంది. అధికార నేతల అండదండలతో పగలు, రాత్రనక సహజ సంపదను కొల్లగొడుతోంది. ఎర్రమట్టి, మొరం కోసం గుట్టలను కేరాఫ్‌గా చేసుకుని అడ్డగోలుగా తవ్వకాలు చేస్తోంది. రాయల్టీ చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ.. భారీ వాహనాల్లో యథేచ్ఛగా తరలిస్తోంది. అవినీతికి అలవాటు పడిన పలు శాఖలు పట్టించుకోకపోవడంతో పాలమూరు క్రమక్రమంగా తన ఆనవాళ్లను కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఫోకస్.. రాత్రిళ్లు దందా.. షరా‘మామూలు’ నిబంధనల ప్రకారం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే తవ్వకాలు చేపట్టాలి. అక్రమార్కులు పర్మిషన్లు తీసుకోకుండా.. అది కూడా చాలా చోట్ల రాత్రివేళ సైతం మట్టి దందా కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల అర్ధరాత్రి దాటిన తర్వాతే తవ్వకాలు చేపట్టి భారీ వాహనాల్లో తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాజకీయ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకుల ఆధ్వర్యంలో ఈ దందా కొనసాగుతోంది. ఇందులో ప్రధానంగా అధికార పార్టీకి చెందినవారే. వీరికి అధికార నేతలు అండగా నిలవడంతో ప్రభుత్వ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీస్, రవాణా, మైనింగ్ శాఖకు వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోజు, నెల వారీగా మామూళ్లు అందు తుండడంతోనే వారు పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆనవాళ్లు కోల్పోతున్నపాలమూరు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రెచ్చిపోతున్న మాఫియా ఎర్రమట్టి, మొరం కోసం అడ్డగోలు తవ్వకాలు రాజకీయ నేతల అండతో యథేచ్ఛగా దందా రాయల్టీ ఎగవేతతో సర్కారు ఆదాయానికి గండి మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖపై విమర్శలు -
విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం
● కానరాని నివారణ చర్యలు ● గుట్టుచప్పుడు కాకుండా వాడుతున్న వ్యాపారులు ● పట్టించుకోని అధికారులు లైసెన్సులు రద్దుచేస్తాం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు దుకాణాదారులు నడుం బిగించాలి. వినియోగదారులు వస్తువులు కొనేందుకు వచ్చేటప్పుడే జూట్ బ్యాగులు వెంట తీసుకొని రావాలని సూచించాలి. సరుకులు ప్లాస్టిక్ కవర్లలో వేసి ఇస్తే వ్యాపారుల ట్రేడ్ లైసన్సులు రద్దుచేస్తాం. మరోమారు ప్లాస్టిక్ వినయోగం చేస్తే భారీ జరిమానాలు విధిస్తాం. దీనిపై క్షేత్రస్థాయిలో కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. చెత్తను డ్రెయినేజీల్లో వేయకుండా చూడాలి. – మహమూద్ షేక్, మున్సిపల్ కమిషనర్, కల్వకుర్తి మున్సిపాలిటీ పోగయ్యే చెత్త ప్లాస్టిక్ కల్వకుర్తి 12–15 3–3.5 కొల్లాపూర్ 9–11 1.5–2.5 అచ్చంపేట 11–13 2.2–3 నాగర్‌కర్నూల్ 12–15 3–3.5కల్వకుర్తి టౌన్: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతుంది. 2013లో 40 మైక్రాన్లు లోపు పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్‌ను వాడటాన్ని నిషేధించారు. 2022 జూలై 1 నుంచి 75 మైక్రాన్లలోపు ఉండే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీటిలో ప్రధానం ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాస్లు, స్ట్రా వంటి 19 వంటి వస్తువులను చేర్చారు. కానీ ఇది కేవలం చెప్పుకోవడానికి తప్పా, ఆచరణ సాధ్యం కావటం లేదు. నియంత్రించాల్సిన అధికారులు, వినియోగానికి దూరంగా ఉండాల్సిన ప్రజలు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ అధికారులు నామమాత్రంగా జరిమానాలు విధిస్తూ మమ అనిపిస్తున్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కలిపి ప్రతిరోజు దాదాపు 45 నుంచి 50 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను మున్సిపాలిటీ సిబ్బంది సేకరిస్తే వాటిలో 12 నుంచి 15 మెట్రిక్ టన్నుల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటున్నాయి. అన్నింటికీ ప్లాస్టికే.. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో నిత్యవసర సరుకులతో పాటుగా అన్ని రకాల వస్తువులు తీసుకెళ్లేందుకు ప్లాస్టిక్ కవర్లనే వాడుతున్నారు. జిల్లాలోని ప్రతిరోజు ఇళ్లు, హోటళ్లు, ఇతర వ్యాపార సముదాయాల వద్ద 12 నుంచి 15 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్‌తో పాటుగా, ప్లాస్టిక్ సంబంధమైన వ్యర్థాలను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారంటే వినియోగం రోజుకు ఎంత మోతాదులో ఉందో అర్థం చేసుకోవచ్చు. కనిపించని చైతన్యం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ వినియోగంపై ప్రజల్లో పెద్దగా చైతన్యం కనిపించటం లేదు. ఇంటి నుంచి మార్కెట్‌కు వెళ్లే సమయంలో జూట్ సంచులు తీసుకెళ్లాలనే ఆలోచననే రావడం లేదు. జిల్లాలోని అన్ని మున్సిపాటీల్లో డ్రెయినేజీల్లో దాదాపు 20 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయని అధికారులు గుర్తించారు. పారిశుద్ధ్య సిబ్బంది మురుగు తీస్తుంటే వాటిలో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్‌కు సంబంధించిన చాలా వస్తువులు ఉంటున్నాయి. తూతూమంత్రంగా అవగాహన ప్లాస్టిక్ నివారణపై మున్సిపల్ ఉన్నతాధికారులు ఏవైనా ఆదేశాలు ఇస్తేనే తప్ప అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని రోజులు హడావిడి చేసే అధికారులు దుకాణ సముదాయాల్లో తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహించి, కొన్ని రోజులకు మళ్లీ వాటి జోలికే పోరనే అపవాదు ఉంది. ప్లాస్టిక్ నివారణలో అధికారులే కాకుండా అందరూ భాగస్వాములు అయితేనే ఆశించిన ఫలితం ఉంటుంది. రోజువారీగా వ్యర్థాలు (టన్నుల్లో..) -
బిర్సా ముండా జయంతిని ఘనంగా నిర్వహించాలి
నాగర్‌కర్నూల్: ఆదివాసీల ఆరాధ్యదైవం, మహానాయకుడు బిర్సా ముండా జయంతిని నవంబర్ 15న ఘనంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలు అవసరమైన ఏర్పాట్లు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారిని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. భారత గిరిజన సమాజానికి స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తినిచ్చిన బిర్సా ముండా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపిన గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడని కొనియాడారు. ముండా తెగకు చెందిన ఆయన, గిరిజన హక్కుల కోసం చేసిన పోరాటంతో భారత చరిత్రలో అపూర్వ స్థానాన్ని సంపాదించారన్నారు. భారత గిరిజన మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు నవంబర్ 15 శనివారం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ ప్రధాన సమావేశం మందిరంలో నిర్వహించే జయంతి కార్యక్రమానికి గిరిజనులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కలెక్టర్ శుక్రవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. భూ నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి వెల్దండ: డిండి–నార్లాపూర్ ప్రాజెక్టులో ఇళ్లు కోల్పోతున్న ఎర్రవల్లి గ్రామస్తులు భూ నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని కల్వకుర్తి ఆర్డీఓ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వెల్దండ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎర్రవల్లి రెవెన్యూ శివారులోని భూ నిర్వాసితుల పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకెజీ కింద ప్రజలకు నివాసం కల్పించే విధంగా భూసర్వే చేసి స్థలం ఎంపిక చేయాలని సూచించారు. గతంలో భూములు కోల్పోయిన బాధితులందరికీ నష్టపరిహరం అందించాలన్నారు. సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించి, సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూ భారతిలో వచ్చిన దరఖాస్తులు ఎన్ని, ఇప్పటి వరకు ఎన్నింటిని పరిష్కరించారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నూతనంగా బాధ్యతలను స్వీకరించిన జీపీఓలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కార్తీక్‌కుమార్, డిప్యూటీ తహసీల్దార్ కిరణ్‌కుమార్, ఆర్ఐ శంకర్, జీపీఓలు తదితరులు ఉన్నారు. ‘యూనిటీ మార్చ్’ను జయప్రదం చేయండి నాగర్‌కర్నూల్ క్రైం: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని నిర్వహించే యూనిటీ మార్చ్‌ను జయప్రదం చేయాలని మేర యువ భారత్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా యూత్ అధికారి కోటా నాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 15న జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనిటీ మార్చ్‌ను నిర్వహిస్తున్నామని, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుజరాత్ రాజ్యసభ సభ్యుడు డా.పార్మా జశ్వంత్‌సింగ్, కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్‌రఘునాథ్ హాజరవుతారని తెలిపారు. యూనిటీ మార్చ్ ఉదయం 9 గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నుంచి ప్రారంభమై కొల్లాపూర్ క్రాస్ రోడ్డు వరకు కొనసాగుతుందని, విద్యార్దులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, యువత పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. సమావేశంలో యూనిటీ మార్చ్ కన్వీనర్ నాగేంద్రంగౌడ్, కో కన్వీనర్ నర్సింహ, విజయేందర్ ఉన్నారు. ఉత్సాహంగా అస్మిత లీగ్ అథ్లెటిక్స్ వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలోని బాలకిష్టయ్య క్రీడా మైదానంలో శుక్రవారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ), అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) సంయుక్తంగా అస్మిత లీగ్ అథ్లెటిక్స్ జిల్లా మీట్ 2025–26 నిర్వహించినట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం చైర్మన్ వాకిటి శ్రీధర్, కార్యదర్శి నందిమళ్ల శ్రీకాంత్ తెలిపారు. క్రీడల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథులుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ మాజీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, డీవైఎస్ఓ సుధీర్‌కుమార్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ, కాంగ్రెస్ నాయకుడు లక్కాకుల సతీష్ హాజరయ్యారని చెప్పారు. సాయంత్రం ముగింపు సమావేశానికి లక్కాకుల సతీష్ పాల్గొని విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేసినట్లు వివరించారు. -
‘వీ–హబ్’తో మహిళలకు ప్రోత్సాహం
నాగర్‌కర్నూల్: జిల్లాలోని మహిళా పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న వీ–హబ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని మహిళలు ఆర్థికంగా రాణించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, తెలంగాణ వీ–హబ్ ఆధ్వర్యంలో జిల్లాలోని మహిళా పారిశ్రామికవేత్తలకు మార్కెటింగ్, వ్యాపారాభివృద్ధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మహిళలు నిర్వహిస్తున్న చిరు వ్యాపారాలను స్టార్టప్‌లుగా అభివృద్ధి చేయడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యమన్నారు. వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న మహిళలు తమ వ్యాపార ఆలోచనలు, మార్కెటింగ్ తదితర అంశాలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, వీ–హబ్ మహిళా నైపుణ్య అభివృద్ధి సంస్థ డైరెక్టర్ ఊహ, డీఆర్డీఏ పీడీ చిన్న ఓబులేసు, డిప్యూటీ కలెక్టర్లు హర్షవర్ధన్, అశోక్ పాల్గొన్నారు. -
ఎస్పీ పరదేశినాయుడు స్ఫూర్తితో పనిచేయాలి
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలోని పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో భాగంగా ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించేందుకు తమ ప్రాణాలు సైతం లెక్కచేయరని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. 32 ఏళ్ల క్రితం సోమశిలలో నక్సల్స్ పేల్చిన మందుపాతరకు బలైన ఉమ్మడి జిల్లా ఎస్పీ పరదేశినాయుడితో పాటు పోలీసు సిబ్బందికి ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం నివాళులఅర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మట్లాడుతూ ఉమ్మడి జిల్లా ఎస్పీ పరదేశినాయుడి త్యాగాలను స్మరించుకుంటూ నేటితరం పోలీసులు ప్రజల రక్షణ కోసం ఆత్మస్థైర్యం, ధైర్యసాహసాలతో పనిచేయాలని సూచించారు. సోమశిల ఘటనలో నాటి ఎస్పీ పరదేశినాయుడితో పాటు ఇద్దరు ఎస్ఐలు, ఒక హెడ్‌కానిస్టేబుల్, ఐదుగురు కానిస్టేబుళ్లు మృతిచెందడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు, సీఐలు ఉపేందర్‌రావు, కనకయ్య, శంకర్, సీసీ బాలరాజు, ఆర్ఎస్ఐ గౌస్‌పాష ఉన్నారు. -
మధుమేహంతో అనేక దుష్ప్రభావాలు
నాగర్‌కర్నూల్ క్రైం: మధుమేహాన్ని అదుపులో ఉంచుకోకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.వెంకటదాసు అన్నారు. ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మండలంలోని పెద్దముద్దునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు, వైద్య సిబ్బందికి మధుమేహంతో కలిగే దుష్ప్రభావాలు, పరిష్కార మార్గాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ మధుమేహం కారణంగా గుండె జబ్బులు, పక్షవాతం, మానని పండ్లు, వేళ్లు, పాదాలు, కాళ్లు తొలగించడం, కంటిచూపు పోవడం, కిడ్నీలు దెబ్బతినడం వంటి తీవ్ర ప్రభావాలు ఉండడంతో పాటు ప్రాణానికి ముప్పు పెరుగుతుందన్నారు. 30 ఏళ్లు పైబడిన వారందరూ సంవత్సరానికి ఒకసారి మధుమేహ వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని, ఒకవేళ మధుమేహం నిర్ధారణ అయితే క్రమం తప్పకుండా మందులు వేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కాంబినేషన్ డ్రగ్స్, ఇన్సులిన్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ కృష్ణ్ణమోహన్, వైద్యాధికారి డాక్టర్ వాణి, డాక్టర్ సుప్రియ, జిల్లా ఉప మాస్ మీడియా అధికారి రాజగోపాల చారి, ఎన్సీడీ కోఆర్డినేటర్స్ విజయ్, మల్లేష్ పాల్గొన్నారు. -
పని చేసేందుకు వచ్చి.. ప్రాణాలు కోల్పోయారు!
● మహబూబ్‌నగర్‌లో కూలిన పాత భవనం ● శిథిలాల కింద చిక్కుకొని ఇద్దరు కూలీలు మృతి మహబూబ్‌నగర్ క్రైం: పాత భవనం రేనోవేషన్ పనులు చేయడానికి వెళ్లిన ఇద్దరు దినసరి కూలీలు.. ఆ భవనం కూలి శిథిలాల కింద చిక్కుకొని మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని పాత తోట ప్రాంతంలో సంపు లక్ష్మణ్‌కు చెందిన ఒక పాత భవనం శిథిలావస్థకు చేరింది. ఈ భవనంలో మనోహర్ కిరాణం దుకాణానికి సంబంధించిన సరుకులు నిల్వ చేసేందుకు గోదాంలా ఉపయోగించుకుంటున్నాడు. అయితే గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో సంపు లక్ష్మణ్ దగ్గర పని చేసే గుమస్తా రాజు పాత బస్టాండ్ దగ్గర అడ్డాపై ఉన్న ఇద్దరు కూలీలు నవాబ్‌పేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన గద్వాల కృష్ణయ్య(45), భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌కు చెందిన కుమ్మరి శాంతయ్య(60) పని కోసం తీసుకువచ్చాడు. అయితే ఒకవైపు ఇద్దరు కూలీలు పాత ఇంటికి అనుకొని ఉన్న రావిచెట్టును తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. మరో యువకుడు గోడలకు డ్రీల్ చేసే పనిలో ఉండగా.. అకస్మాత్తుగా గొడలు కూలడంతో గమనించిన ఆ యువకుడితో పాటు గుమస్తా రాజు అక్కడి నుంచి బయటకు వచ్చారు. అదే సమయంలో కొట్టేసిన చెట్టె లాగుతూ ఇద్దరు కూలీలు అటువైపు రాగా.. స్లాబ్ కూలి ఇద్దరిపై పడింది. దీంతో వారు శిథిలాల కింద చిక్కుకొని అక్కడిక్కడే మృతి చెందారు. జేసీబీ సహాయంతో దాదాపు ఆరు గంటల పాటు శ్రమించి సాయంత్రం 4.48 గంటల ప్రాంతంలో మొదటి మృతదేహం బయటకు తీశారు. సాయంత్రం 5.20 ప్రాంతంలో రెండో మృతదేహం వెలికితీశారు. సహాయ చర్య పనులను కలెక్టర్ విజయేందిర బోయి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం పరిశీలించారు. -
నూతన ఆవిష్కరణలపై దృష్టిసారించాలి
కల్వకుర్తి టౌన్: మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన ఆవిష్కరణలు రూపొందించేలా విద్యార్థుల ఆలోచనలు ఉండాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి అన్నారు. గురువారం కల్వకుర్తి ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలు, బోధనా పద్ధతులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కళాశాల స్థాయిలోనే సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. అందుకు అనుగుణంగా విద్య అందించేందుకు ప్రతి అధ్యాపకుడు కృషిచేయాలని సూచించారు. విద్యార్థులకు ప్రతి అంశాన్ని ప్రయోగాత్మకంగా వివరించాలన్నారు. ప్రభుత్వం సైతం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులను కల్పిస్తుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాల దిశగా ముందుకు సాగాలన్నారు. భవిష్యత్‌లో ప్రభుత్వ విద్యను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తామన్నారు. అంతకుముందు ఆయన కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. వసతిగృహంలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను తెలుసుకున్నారు. అనంతరం కళాశాల సిబ్బంది చైర్మన్‌ను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా.శ్రీపాద శార్వాణి పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం : ఎస్పీ
ఉప్పునుంతల: పోలీసు సిబ్బంది ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ.. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సూచించారు. గురువారం ఉప్పునుంతల పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. పోలీసు సిబ్బందితో మాట్లాడి మండలంలో శాంతిభద్రతలపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులపై కేసుల నమోదులో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. అదే విధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. ముందుగా ఎస్పీకి ఎస్ఐ వెంకట్‌రెడ్డి పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. ఎస్పీ వెంట అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాసులు, సీఐ నాగరాజు ఉన్నారు. -
ఏటేటా పేరుకుపోతున్న బకాయిలు
● పన్నుల వసూళ్లకు పరుగులు పెడుతున్న అధికారులు, సిబ్బంది ● జనరల్ ఫండ్తోనేసిబ్బంది జీతాల చెల్లింపులు ● అభివృద్ధి పనులు అంతంత మాత్రమే.. వనరులను వినియోగించుకోని వైనం నిధులు లేక నీరసించిపోతున్న మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి స్టాంప్స్ డ్యూటీ, ఆస్తిమార్పిడి రుసుము బకాయి నిధులను ఈఏడాది జనవరిలో విడుదల చేసింది. 2019 నుంచి స్టాంప్స్ డ్యూటీ, 2022 నుంచి ఆస్తి మార్పిడి రుసుముకు సంబంధించి నాగర్‌కర్నూల్‌కు రూ. 5.13కోట్లు, అచ్చంపేటకు రూ. 2.12కోట్లు, కల్వకుర్తికి రూ. 6.17కోట్లు, కొల్లాపూర్‌కు రూ. 1.22కోట్లు వచ్చాయి. ఈ నిధులను ప్రత్యేక ఖాతాల్లో జమచేస్తూ.. మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు, కరెంటు బిల్లుల చెల్లింపులకు మాత్రమే వాడుకోవాలని మార్గదర్శకాలను జారీ చేసింది. సీసీరోడ్లు, వీది లైట్లు, డ్రెయినేజీల నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించవద్దని స్పష్టంచేసింది. అయితే అచ్చంపేటతో పాటు జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఈ నిధులను వినియోగించకుండా జనరల్ ఫండ్ ద్వారానే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు, కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారు. ఆ నిధులు మున్సిపల్ ఖాతాల్లో మూలుగుతున్నాయి. అచ్చంపేట: మున్సిపాలిటీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. పట్టణ ప్రజల నుంచి పన్నులు వసూళ్లు గాక ఏటేటా బకాయిలు పేరుకుపోతున్నాయి. స్థానికంగా వస్తున్న ఇంటి పన్నులు ఉద్యోగులు, సిబ్బంది జీతభత్యాలకే సరిపోవడం లేదు. ఏ చిన్న అభివృద్ధి పని చేపట్టాలన్నా.. మున్సిపాలిటీల్లో నిధులు ఉండని పరిస్థితి నెలకొంది. పన్నుల వసూలు కోసం అధికారులు, సిబ్బంది ఇంటింటికీ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే కాలనీల్లో కనీసం డ్రెయినేజీ, సీసీరోడ్లు నిర్మించని మున్సిపాలిటీలకు పన్నులు ఎందుకు చెల్లించాలనే సమాధానం ప్రజలు నుంచి ఎదురవుతోంది. ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులపైనే ఆధారపడాల్సి వస్తోంది. అవీ వస్తేనే వార్డుల వారీగా కేటాయింపులు చేసి.. సీసీరోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్ దీపాల ఏర్పాటు తదితర పనులు చేపడుతున్నారు. ఇలా అయితే మరో 20 ఏళ్లయినా పట్టణాలు అభివృద్ధికి నోచుకోవడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతా ఇష్టారాజ్యం.. అచ్చంపేట మన్సిపాలిటీలో పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఇష్టం వచ్చినట్లు తీసివేయడం.. తీసుకోవడం పరిపాటిగా మారింది. జనాభా ప్రాతిపదికన పారిశుద్ధ్య కార్మికులు, తాత్కాలిక సిబ్బంది ఉండాలి. అచ్చంపేటలో మాత్రం ఎమ్మెల్యే చెప్పారని కొందరిని.. కౌన్సిలర్లు చెప్పారని మరికొందరిని నియమిస్తుండటంతో ఖజానాకు గండి పడుతోంది. 2011 జనాభా ప్రకారం పట్టణంలో 28,163 జనాభా ఉంది. పెరిగిన జనాభా ప్రకారం 35వేలు ఉంటుందని అంచనా. ఈ లెక్కల ప్రకారం ఇక్కడ 60 నుంచి 70 మంది కార్మికులు, సిబ్బంది సరిపోతారు. కానీ 113 మంది పనిచేస్తున్నారు. అదనంగా ఉన్న కార్మికులకు ప్రతినెలా రూ. 6లక్షల నుంచి రూ. 8లక్షల వరకు జీతభత్యాలు చెల్లిస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది జీతాలు ఇవ్వడమే గగనంగా మారిన పరిస్థితుల్లో కాలనీల్లో అభివృద్ధి పనులు ఎలా చేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు వాపోతున్నారు. అచ్చంపేట మున్సిపాలిటీవార్డు అఫీసర్లు, అసిస్టెంట్ బిల్లు కలెక్టర్లు ఇలా.. జిల్లాలోని నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో 24 మంది వార్డు ఆఫీసర్లకు గాను 15 మంది రెగ్యులర్, 9మంది ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. అసిస్టెంట్ బిల్లు కలెక్టర్లు 16 మంది ఔట్ సోర్సింగ్‌పై కొనసాగుతున్నారు. అచ్చంపేట మున్సిపాలిటీల్లో 20 వార్డులకు గాను 6మంది వార్డు ఆఫీసర్లు రెగ్యులర్, 6మంది అసిస్టెంట్ బిల్లు కలెక్టర్లు ఔట్ సోర్సింగ్‌పై పనిచేస్తున్నారు. ఏబీసీలు మినహా వార్డు ఆఫీసర్లు వార్డులకు వెళ్లడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వారు కార్యాలయానికి మాత్రమే పరిమితమయ్యారు. కొల్లాపూర్‌లో 6మంది రెగ్యులర్ వార్డు అఫీసర్లు, ఒకరు ఔట్ సోర్సింగ్ ఏబీసీ పనిచేస్తున్నారు. ఏడుగురితో పట్టణంలో బిల్లులు వసూళ్లు చేస్తున్నారు. కల్వకుర్తిలో 22 వార్డులకు గాను 10 మంది రెగ్యులర్, ఏసీబీలు రెగ్యులర్ ఒకరు, ఔట్సోర్సింగ్ విధానంలో ఐదుగురు పనిచేస్తున్నారు. సకాలంలో ఆస్తిపన్ను చెల్లించాలి.. పట్టణ ప్రజలు సకాలంలో ఆస్తిపన్ను చెల్లించి అభివృద్ధికి తోడ్పాటునందించాలి. సకాలంలో చెల్లించపోతే అదనపు రుసుం పడుతుంది. పెద్దమొత్తంలో బకాయిలు ఉన్న వారికి నోటీసులు ఇస్తున్నాం. ప్రభుత్వ భవనాల నుంచి ఎక్కువ పన్నులు రావాల్సి ఉంది. ఈఏడాది భువన్ యాప్, అసెస్మెంట్స్ పెరగడం వల్ల మున్సిపాలిటీకి ఆదాయ వనరులు పెరిగాయి. స్టాంప్స్ డ్యూటీ నిధులు వాడుకోవాలంటే జీతాలు చేసి పంపించిన 15 రోజుల తర్వాత జీతాలు రావడం వంటి కారణాల వల్ల సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాల్సి ఉండటంతో జనరల్ ఫండ్ వినియోగిస్తున్నాం. – మురళి, మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కల్వకుర్తిరూరల్: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని జీడిపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు కృషిచేస్తానని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధరకు విక్రయించాలని సూచించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందిస్తుండటంతో ఈ ప్రాంతంలో రైతులు పెద్ద మొత్తంలో వరిసాగు చేశారని.. ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ బాలాజీ సింగ్, సంజీవ్‌యాదవ్, అశోక్‌రెడ్డి, ఆనంద్‌కుమార్, హరీశ్‌రెడ్డి, రమాకాంత్‌రెడ్డి, కొండల్, భీ మ్లానాయక్, విజయభాస్కర్, జయపాల్‌రెడ్డి, వెంకటేశ్, సీఈఓ వెంకట్‌రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
భూ సేకరణ పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
● అధికారులు సమన్వయంతో పనిచేయాలి ● కలెక్టర్ బదావత్ సంతోష్ పత్తి కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం తెలకపల్లి: పత్తి కొనుగోళ్లలో జాప్యం చేయడంపై కలెక్టర్ సంతోష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలకపల్లి మండలం చిన్నముద్దునూరు సమీపంలోని వినాయక కాటన్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పత్తి కొనుగోలు ప్రక్రియ, ఆన్లైన్లో రైతుల వివరాల నమోదు తదితర వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. సకాలంలో పత్తిని కొనుగోలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. కేంద్రానికి పత్తిని తీసుకొచ్చిన రోజే కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. పత్తి కొనుగోలులో ఆలస్యం చేస్తూ.. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అవసరమైతే ల్యాబ్ టాప్‌లను ఉపయోగించి కొనుగోలు ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ జాకీర్ అలీ, సీసీఐ అధికారి దీపక్, పవన్ ఉన్నారు. నాగర్‌కర్నూల్: జిల్లాలో చేపడుతున్న 167కే జాతీయ రహదారితో పాటు డిండి ఎత్తిపోతల పథకం, పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో అదనపు కలెక్టర్ పి.అమరేందర్‌తో కలిసి భూ సేకరణ ప్రక్రియపై ఆర్డీఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ కోసం రెవెన్యూ, సాగునీటి ప్రాజెక్టుల, జాతీయ రహదారి శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భూ సేకరణలో ఎలాంటి సమస్యలు లేకుండా వేగవంతంగా పూర్తిచేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓలు సురేశ్, జనార్దన్‌రెడ్డి, భన్సీలాల్, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్ నారాయణ, కార్తీక్ ఉన్నారు. ● అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కొండారెడ్డిపల్లికి నూతనంగా మంజూరైన అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియ, పనుల ప్రారంభం, ఇప్పటికే చేపట్టిన పనుల పూర్తి తదితర అంశాలపై కలెక్టరేట్లో గ్రామ ప్రత్యేకాధికారి, అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా టెండర్ల ప్రక్రియ పురోగతిని తెలుసుకున్నారు. కొండారెడ్డిపల్లిలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే చేపట్టిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ.. నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. -
ప్రతి గింజ కొనుగోలు చేస్తాం
పెంట్లవెల్లి: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని.. ఎవరై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం పెంట్లవెల్లి మండలంలోని జటప్రోల్, గోప్లాపురం, సింగవరం, కొండూరు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కష్టించి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. రైతులకు మద్దతు ధరతో పాటు సన్నాలకు బోనస్ అందించనున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు మంత్రి సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదుచేసి.. రైతులకు సకాలంలో డబ్బులు అందేలా చూడాలన్నారు. కాగా, జటప్రోల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహ యాదవ్, రామన్‌గౌడ్, గోవింద్‌గౌడ్, కబీర్, ధర్మతేజ, గోపాల్, శ్రీను పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు
ఉప్పునుంతల: దుందుభీ, ఇతర వాగుల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ అమరేందర్ హెచ్చరించారు. ఉప్పునుంతల మండలం దాసర్లపల్లి సమీపంలోని వ్యవసాయ పొలాల నుంచి దుందుభీ వాగు వరకు దారిని ఏర్పాటుచేసి.. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఇటీవల కొందరు గ్రామస్తులు కలెక్టర్, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన వాగును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం పొలాల నుంచి వాగు వరకు ఏర్పాటుచేసిన దారిని చూశారు. టిప్పర్లలో ఇసుక తరలింపుతో రోడ్డు దెబ్బతినడంతో పాటు రాకపోకలు సాగించలేకపోతున్నామని గ్రామస్తులు అదనపు కలెక్టర్‌కు వివరించారు. ఇకపై ఇసుకను అక్రమంగా తరలించే వారిపై కఠినంగా వ్యవహరించాలని స్థానిక తహసీల్దార్ సునీత ను ఆయన ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంట ఆర్ఐ రామకృష్ణ, జీపీఓ రాము ఉన్నారు. పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి పెద్దకొత్తపల్లి: చలికాలంలో పశువులకు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని.. వాటి ఆరోగ్యంపై పెంపకందారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డా.జ్ఞానశేఖర్ అన్నారు. గురువారం మండలంలోని చంద్రకల్లో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నామన్నారు. ప్రతి పశువుకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. అదే విధంగా గొర్రెలు, మేకలు, పశువులు, గేదెలకు బీమా చేయించాలన్నారు. పాలిచ్చే పశువులకు బలమైన ఆహారం అందించాలన్నారు. పశువైద్యఽశాలల్లో గడ్డి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని.. కావాల్సిన రైతులకు 75శాతం సబ్సిడీతో అందించనున్నట్లు తెలిపారు మండల పశువైద్యాధికారి డా.అశోక్, సిబ్బంది సనా, నిరంజన్, రాజు, వేమారెడ్డి, శివ, కర్ణాకర్‌రెడ్డి పాల్గొన్నారు. తువ్వగట్టు భూములపై విచారణ జరపాలి కొల్లాపూర్: మండలంలోని ఎల్లూరు సమీపంలో ఉన్న తువ్వగట్టు భూముల అన్యాక్రాంతంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.బాల్‌నర్సింహ డిమాండ్ చేశారు. సీలింగ్ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం కొల్లాపూర్‌లో సీపీఐ నాయకులు ప్రదర్శన ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్‌నర్సింహతో పాటు సీపీఐ జిల్లా కార్యదర్శి ఫయా జ్ మాట్లాడుతూ.. ఎల్లూరు సమీపంలోని సర్వేనంబర్ 359, 360, 364, 365లో ఉన్న ప్రభుత్వ సీలింగ్ భూమిని 2008లో సురభి రాజవంశస్థుల పేరిట పట్టా భూమిగా రికార్డుల్లో మార్చారన్నారు. అడవిని రాజ కుటుంబీకులకు పట్టా చేయడంలో ఎవరి హస్తం ఉందో వెల్లడించాలన్నారు. వారు గ్రీన్ ట్రిబ్యునల్, వాల్టా, ఫారెస్టు యాక్టులను అతిక్రమించి అడవిని నరికేసినా జిల్లా అధికార యంత్రాంగం ఏమీ పట్టనట్లు వ్యవహరించడం సరైంది కాదన్నారు. పేద రైతులు రెండు ఎకరాల పోడు సాగు చేసుకుంటే వందలాది ఫారెస్టు, పోలీసు అధికారులు వచ్చి భయబ్రాంతులకు గురిచే స్తున్నారని.. 50 ఎకరాల మేరకు అడవిని నరికేసిన వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేద ని ప్రశ్నించారు. తువ్వగట్టు భూముల అన్యాక్రాంతంపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించాలని వారు కోరారు. సీలింగ్ భూములను కార్పొరేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని సీపీఐ పార్టీ వ్యతిరేకిస్తోందన్నారు. అనంతరం తహసీల్దార్ భరత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పెబ్బేటి విజ యుడు, తుమ్మల శివుడు, కురుమయ్య, మల్ల య్య, యూసూఫ్, రామకృష్ణ, శేఖర్, జంగం శివుడు, చందు, రవి, పవన్ పాల్గొన్నారు. -
గల్లీ గల్లీలో గంజాయి
● పట్టణాల నుంచి పల్లెలకు విస్తరిస్తున్న మహమ్మారి ● బానిసలుగా మారుతున్న యువకులు, విద్యార్థులు ● మెడికల్, ఇతర కళాశాలల వద్ద గంజాయి అడ్డాలు ● ఇతర రాష్ట్రాల నుంచి భారీగా సరఫరా ● నవంబర్ 10వ తేదీ.. కోయిలకొండ మండలం గార్లపాడ్ వద్ద 260 గ్రాములు, జడ్చర్ల మండలం బండమీదిపల్లి శివారులో 305 గ్రామలు ఎండు గంజాయిని పట్టుకొని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ● నవంబర్ 2వ తేదీ... నారాయణపేట జిల్లా కృష్ణా పోలీసుస్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీల్లో 12.4 కేజీల గంజాయి పట్టుకోవడంతో పాటు నారాయణపేటతో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ● నవంబర్ 6వ తేదీన జడ్చర్ల మండలం శంకరాయపల్లి తండా గేట్ వద్ద ఓ వ్యక్తిని అరెస్టు చేసి 116 గ్రాములు, నవంబర్ 1వ తేదీన జడ్చర్ల పట్టణంలో నలుగురు యువకులను అరెస్టు చేసి 240 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో గల్లీగల్లీలో గంజాయి గుప్పుమంటుంది. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన గంజాయి మహమ్మారి ఇప్పుడు పల్లెలోకి ప్రవేశించింది. వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసుకొని క్రయవిక్రయాలు చేపట్టేస్థాయికి చేరుకుంది. గంజాయికి బానిసలుగా మారిన యువతే విక్రేతలుగా అవతారం ఎత్తుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎకై ్సజ్ టాస్క్ ఫోర్స్ బృందాలు, పోలీసులు జరుపుతున్న దాడుల్లో 16–30 ఏళ్ల వయసు వారే అత్యధికంగా పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. కొందరు టీనేజర్లు చెడు స్నేహాలతో పక్కదారి పడుతున్నారు. చదువులతో పాటు జీవితాలనూ నాశనం చేసుకుంటున్నారు. ప్రధానంగా మెడికల్, ఫార్మసీ, నర్సింగ్, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంటర్ వంటి కళాశాల దగ్గర ముఠాలు అడ్డాలు ఏర్పాటు చేసుకుని మత్తు పదార్థాల విక్రయాలకు తెగబడుతున్నారు. మహబూబ్‌నగర్‌తో పాటు జడ్చర్ల, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, గద్వాల, నారాయణపేట కేంద్రాల్లో సరఫరా అధికంగా ఉంటోంది. హైదరాబాద్, సరిహద్దు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో పాటు మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్, ఒడిశా, యూపీ నుంచి కూడా కొందరు గంజాయి తెప్పించి విక్రయిస్తున్నారు. ఉమ్మడి పాలమూరులో జిల్లాలో ఈ ఏడాది ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో 41 కేసులు నమోదయ్యాయి. అందులో అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 17, వనపర్తిలో 8, గద్వాలలో 4, నాగర్‌కర్నూల్‌లో 6, నారాయణపేటలో 6 కేసులున్నాయి. ఇదే స్థాయిలో పోలీసుశాఖ ఆధ్వర్యంలోనూ గంజాయిను పట్టుకొని కేసులు నమోదు చేశారు. 19 ఇంటెలిజెన్స్ బృందాల ఏర్పాటు ఉమ్మడి జిల్లాలో 14 ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో నాలుగు డీటీఎఫ్ బృందాలు, 19 ఇంటెలిజెన్స్ బృందాలు ఏర్పాటు చేశాం. ఈ బృందాలు నిత్యం ఆయా స్టేషన్ పరిధిలో గంజాయి సరఫరా, కొనుగోలు విక్రయాలు ఎక్కడ జరుగుతున్నాయి అనే సమాచారం తెలుసుకుని తనిఖీలు చేసి సీజ్ చేయాల్సి ఉంటుంది. ఒడిశా, బిహార్, యూపీ కూలీలపై ప్రత్యేక నిఘా పెట్టాం. విద్యార్థుల్లో 2 నుంచి 3శాతం మంది గంజాయి వాడుతున్నట్లు నిర్ధారణ అయింది. వీరు మిగిలిన విద్యార్థులకు అలవాటు చేస్తున్నారు. దీనిని కట్టడి చేసేందుకు అవగాహన కార్యక్రమాలతో పాటు గంజాయి వాడే విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. – విజయ్‌భాస్కర్‌రెడ్డి, డీసీ ఎకై ్సజ్ శాఖ ఈ నెలలో నమోదైన గంజాయి కేసులు నవంబర్ 11వ తేదీ... మహబూబ్‌నగర్ ఎకై ్సజ్ సీఐ వీరారెడ్డి, ఎస్ఐ సుష్మ ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున అప్పన్నపల్లి సమీపంలో వాహనాలు తనిఖీలు చేస్తుంటే బ్రిజేష్‌కుమార్, శ్రీరాజ్ అనే ఇద్దరూ యువకులు ద్విచక్ర వాహనంలో 150 గ్రాముల ఎండు గంజాయి తరలిస్తుంటే పట్టుకున్నారు. బిహార్‌కు చెందిన బ్రిజేష్‌కుమార్ కొన్నిరోజుల నుంచి జడ్చర్ల మండలం ముదిరెడ్డిపల్లి సమీపంలో ఉన్న ఓ బీరువాల తయారీ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇటీవల బిహార్‌కు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో తీసుకొచ్చిన గంజాయిని మహబూబ్‌నగర్‌లోని శ్రీనివాసకాలనీకి చెందిన శ్రీరాజ్‌కు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. వీరి నుంచి 150 గ్రాముల గంజాయి, ఒక బైక్, ఒక ఫోన్ సీజ్ చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదే రోజు నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూరులో 100 గ్రామలు గంజాయిని సీజ్ చేసి, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ● నవంబర్ 7వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి సమీపంలోని ఓ వెంచర్లో గంజాయి సేవిస్తున్న ఐదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని 138 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాగా.. నిందితుల్లో ఒక బాలుడు కూడా ఉన్నాడు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు మహబూబ్‌నగర్ ఎకై ్సజ్ పోలీసులు చేసిన విచారణలో పీజీ మెడిసిన్ చదువుతున్న ముగ్గు రు వైద్యులు ఎండు గంజాయి వాడుతున్నట్లు నిర్ధారణ అయింది. వారితో పాటు ఎంబీబీఎస్, నర్సింగ్, పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులు వీటిని అధికంగా వాడుతున్నట్లు తేలింది. మహబూబ్‌నగర్‌లో ఒకరిద్దరూ ప్రాక్టీస్‌లో ఉన్న వైద్యులు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా ఆటో డ్రైవర్లు, పెయింటర్స్, చదువు వదిలేసి తిరుగుతున్న టీనేజర్లు గ్రూప్‌లుగా ఏర్పడి గంజాయి విక్రయించడంతో పాటు వాడకం మొదలుపెట్టారు. ఐదు గ్రాముల ఎండు గంజాయి పాకెట్‌ను రూ.500లకు విక్రయిస్తుంటే.. కేజీ ఎండు గంజాయి రూ.1 లక్షకు విక్రయిస్తున్నారు. ఎండు గంజాయిని ఒక లిక్విడ్‌లో బాగా ఉడికించిన తర్వాత చాక్లెట్స్ మాదిరిగా తయా రు చేయడంతో పాటు యాషెష్ అయిల్‌గా తయారు చేసి అందులో వచ్చే లిక్విడ్ సీరంను సిగరెట్లలో చుక్కలు చుక్కలుగా వేసుకొని పీలుస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ గ్యాంగ్ రాత్రివేళ గంజాయి మత్తులో బీభత్సం సృష్టించారు. దీంతో 13 మంది యువకులను అరెస్టు చేయడంతో పాటు మరో 25 మందిని బైండోవర్ చేశారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం గోకుల్‌నగర్‌లో గంజాయి మత్తులో ఓ యువకుడు కన్నతల్లిని పారతో నరికి చంపేసిన ఘటన చోటు చేసుకుంది. అలాగే నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దపూర్ వద్ద ఓ ఆర్టీసీ డ్రైవర్‌పై గంజాయి మత్తు లో ఇద్దరు యువకులు దాడి చేశారు. -
మళ్లీ పోడు రగడ..
ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని వైనం.. జిల్లాలో అటవీ అధికారులు, రైతులకు మధ్య తరచుగా వివాదం తలెత్తుతోంది. సాగుకోసం రైతులు సమాయత్తమవుతుండగా.. అటవీ అధికారులు అడ్డుకుంటుండటంతో ఘర్షణ వాతావరణం తలెత్తి ఉద్రిక్తతకు దారితీస్తోంది. గతంలోనూ కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండంలో గిరిజన రైతులు పోడు చేసుకుంటున్న భూముల్లో విత్తనాలు వేసేందుకు వెళ్లగా.. అటవీ అధికారులు అడ్డుకున్నారు. అధికారులు, రైతులకు మధ్య ఘర్షణ నేపథ్యంలో ఓ గిరిజన మహిళారైతు అందరి ఎదుటే పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొల్లాపూర్ మండలంలోని ముక్కిడిగుండం, మొలచింతలపల్లి, నార్లాపూర్, కుడికిళ్ల, గెమ్యానాయక్ తండా, రామాపురం, సోమశిల, అమరగిరి గ్రామాల్లోనూ పోడు భూములపై వివాదాలున్నాయి. ఏళ్లుగా ఈ భూముల్లో వివాదం కొనసాగుతున్నా పరిష్కారానికి మాత్రం నోచుకోవడం లేదు. నార్లాపూర్ శివారులో అటవీశాఖ సిబ్బందిపై గిరిజనుల దాడి సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో అటవీ అధికారులు, గిరిజనులకు మధ్య మళ్లీ పోడు వివాదం రాజుకుంది. కొల్లాపూర్ మండలం నార్లాపూర్ శివారులోని వట్టిమాకుల కుంట అటవీ ప్రాంతంలో మంగళవారం పోడు సాగు చేసేందుకు సిద్ధమైన గిరిజనులను అటవీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన గిరిజనులు ఫారెస్ట్ సెక్షన్ అధికారి జయరాజు, సిబ్బందిపై దాడికి దిగారు. అటవీ అధికారులపై ఏకంగా కర్రలతో దాడికి దిగడంతో అధికారులు, గిరిజన రైతులకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ఏళ్లుగా పోడు భూముల సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. చాలావరకు పోడు దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటం.. అటవీ, రెవెన్యూ భూములకు హద్దులు నిర్ణయించకపోవడం తరచుగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. 15 ఎకరాల విస్తీర్ణంలో సాగు కోసం.. కొల్లాపూర్ మండలం నార్లాపూర్ శివారులోని వట్టిమాకుల కుంట అటవీ ప్రాంతంలో గ్రామానికి చెందిన కొందరు గిరిజనులు పోడు భూమిని సాగు చేసుకుంటున్నారు. ఈక్రమంలో చెట్లను తొలగిస్తూ.. సాగుకు సన్నద్ధమవుతున్న క్రమంలో సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. అటవీ భూముల్లో చెట్లను తొలగించవద్దని అధికారులు చెప్పగా.. గిరిజన రైతులు వాగ్వాదానికి దిగారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆగ్రహానికి గురైన రైతులు.. కర్రలతో ఫారెస్ట్ అధికారులపై దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు మహిళలతో సహా మొత్తం 11 మందిని గుర్తించిన అధికారులు.. వారిపై కేసు నమోదు చేశారు. అటవీ ప్రాంతాన్ని చదును చేస్తుండగా తలెత్తిన ఘర్షణ గతంలోనూ పలుమార్లు చెలరేగిన వివాదం అటవీ హద్దులు, ఫెన్సింగ్ లేకపోవడంతో సమస్యలు -
‘పీఎం ధన్–ధాన్య కృషి యోజన’కు ప్రణాళికలు
● వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పాదకత పెంచడమే లక్ష్యం ● కలెక్టర్ బదావత్ సంతోష్ నాగర్‌కర్నూల్: జిల్లాలో రానున్న 6 సంవత్సరాల్లో పంటల ఉత్పాదకత పెంచడం, పంటమార్పిడి, సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహించే విధంగా ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన పథకం అమలుకు వార్షిక ప్రణాళికలను పకడ్బందీగా రూపొందించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ దేవసహాయంతో కలిసి ఆయన పీఎం ధన్–ధాన్య కృషి యోజన కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, ఉద్యాన శాఖల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పథకాల అమలు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో భూసారం మేరకు రైతులు విభిన్న పంటలు సాగుచేసేలా ప్రోత్సహించడం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పాదకత పెంచడం, అధిక దిగుబడులు సాధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. వ్యవసాయ శాఖతోపాటు మత్స్య, పశుసంవర్ధక, ఉద్యాన, నీటిపారుదల, బ్యాంకింగ్ తదితర 11 శాఖల సమన్వయంతో ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లేలా అధికారులు సమగ్ర కార్యాచరణ రూపొందించి.. అమలుచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ పథకం ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, గోదాముల నిర్మాణానికి సైతం అవకాశం ఉందన్నారు. గోదాముల నిర్మాణానికి నాబార్డు 50శాతం సబ్సిడీతో రుణాలు అందిస్తున్నందున.. గ్రామ, మండలస్థాయిలో కూడా ఔత్సాహికులు గోదాములు నిర్మించుకునేలా సంబంధిత అధికారులు ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాలోని రైతులకు వ్యవసాయ రుణాలు అందించడంలో బ్యాంకర్లు ముందుండాలన్నారు. వ్యవసాయ రంగంలో జిల్లా ప్రగతి సాధించేందుకు దోహదపడాలని కోరారు. రైతులు ఒకే పంటపై దృష్టిసారించకుండా విభిన్న పంటల సాగు చేపడితేనే ఉత్పాదకత పెరిగి ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉందన్నారు. అందుకు అనుగుణంగానే ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో డీఏఓ యశ్వంత్‌రావు, జిల్లా మత్స్యశాఖ అధికారిణి రజిని, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జ్ఞానశేఖర్, జిల్లా డెయిరీ డీడీ సత్యనారాయణరెడ్డి, జిల్లా నీటిపారుదలశాఖ అధికారి మురళి ఉన్నారు. -
సిరసనగండ్ల ఆలయాన్ని తీర్చిదిద్దుతాం
చారకొండ: అపర భద్రాద్రిగా పేరొందిన సిరసనగండ్ల సీతారామచంద్రస్వామి క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పర్యాటకశాఖ డీఈ పర్శవేదిగౌడ్ అన్నారు. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర పర్యాటకశాఖ రూ. 2కోట్లు మంజూరు చేస్తూ జీఓ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆలయం వద్ద చేపట్టాల్సిన అభివృద్ధి పనులను టూరిజంశాఖ ఏఈ నాగార్జున, ఆర్కిటెక్చర్లు రమణారావు, మహేశ్‌లతో కలిసి ఆయన పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలోని సంతోషి భవనంలో 18 గదుల నిర్మాణం, కొండ దిగువన 12 దుకాణాలతో కాంప్లెక్స్ భవనం, కోనేరు పునరుద్ధరణకు నివేదికలు సమర్పించనున్నట్లు తెలిపారు. అనంతరం సీతారామచంద్రస్వామిని వారు దర్శించుకొని ప్రత్యేక పూ జలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ డేరం రామశర్మ, ఈఓ ఆంజనేయులు, మేనేజర్ నిరంజన్, అర్చకులు లక్ష్మణ్ శర్మ, మురళీధర్ శర్మ, నందు శర్మ, కోదండరామ శర్మ పాల్గొన్నారు. -
ఉత్సాహంగా క్రీడా పోటీలు
వనపర్తి రూరల్: వనపర్తి మండలం చిట్యాల మహా త్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల మైదానంలో మంగళవారం ఉమ్మడి జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఆర్సీఓ శ్రీనివా స్‌గౌడ్, డీసీఓ శ్రీవేణిలతో కలిసి అదనపు కలెక్టర్ యాదయ్య జ్యోతిప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించగా.. ఉమ్మడి జిల్లాలోని 14 ఎంజేపీ బీసీ బాలుర గురుకుల పాఠశాలలు, 4 కళాశాలల నుంచి 450 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొ న్నారు. అండర్–14, 17, 19 విభాగాల్లో క్రీడాకారులకు పలు పోటీలు నిర్వహించినట్లు ఆర్సీఓ తెలిపారు. ఉమ్మడి జిల్లా బీసీ గురుకులాల విద్యార్థులు ఐదేళ్లుగా స్టేట్ మీట్లో పాల్గొని సత్తా చాటుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఐ జలంధర్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ గురువయ్యగౌ డ్, ప్రశాంతి, పాఠశాల చైర్మన్ రాజు పాల్గొన్నారు. వాలీబాల్ ఆడుతున్న క్రీడాకారులు -
ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
తిమ్మాజీపేట: ఆర్టీసీ ప్రాంగణాల్లో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మహబూబ్‌నగర్ రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్ అన్నారు. తిమ్మాజీపేట ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన సిమెంటు కుర్చీలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బస్టాండ్‌లో కల్పించాల్సిన సౌకర్యాలపై ఆరా తీశారు. దాతల సహకారంతో బస్టాండ్‌ను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ డిపో మేనేజర్ యాదయ్య, ఇతర ఉద్యోగులపాల్గొన్నారు. కార్మికులను శ్రమదోపిడీకి గురిచేస్తున్న ప్రభుత్వం వెల్దండ: ప్రభుత్వం కార్మికుల శ్రమకు తగిన వేతనం ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మాసమ్మ ఆరోపించారు. మంగళవారం మండలకేంద్రంలో కార్మికులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ, ఆశావర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం, గ్రామపంచాయతీ తదితర కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ఈ నెల 30న నిర్వహించే సీఐటీయూ జిల్లా మహాసభలకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మండల కమిటీని ఏర్పాటుచేశారు. సమావేశంలో మండల కన్వీనర్ మాసమ్మ, సభ్యులు స్వప్న, యాదమ్మ, జాహెదా, స్వరూప, వినోద్, యాదయ్య, చంద్రశేఖర్, రామచంద్రయ్య, భీమరాజు తదితరులు ఉన్నారు. భక్తిశ్రద్ధలతో కార్తీక దీపారాధన కందనూలు: జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీ శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం కార్తీక దీపోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో పరమశివుడికి అభిషేకాలు, అర్చనలు చేసిన అనంతరం మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా రోజు ఉదయం ప్రదోష కాలంలో అభిషేకాలు, సాయంత్రం సామూహిక కార్తీక దీపారాధన, ఆకాశ దీపోత్సవం, విష్ణు సహస్రనామ పారాయణ పఠనం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు కందాడై వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు. కురుమూర్తిస్వామికి రూ.24.83లక్షల ఆదాయం చిన్నచింతకుంట: అమ్మాపురం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తులు కానుకలుగా సమర్పించిన రెండో హుండీని మంగళవారం ఆలయ సిబ్బంది లెక్కించారు. రూ.24,83,628 ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, ఈఓ మధనేశ్వరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ పరిశీలకులు శ్రీనివాస్, ఆలయ పాలక మండలి సభ్యులు భారతమ్మ, బాదం వెంకటేశ్వర్లు, గౌని రాము, నాగరాజు, కమలాకర్, ప్రభాకర్‌రెడ్డి, ఉంధ్యాల శేఖర్, ఆలయ పూజా రులు వెంకటయ్య, సత్యనారాయణ, విజయ్‌లక్ష్మి నరసింహచార్యులు, పాల్గొన్నారు. -
పకడ్బందీగా పత్తి, ధాన్యం కొనుగోళ్లు
నాగర్‌కర్నూల్: జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేపడుతామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి ప్రధాన పంటల కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. వీసీకి జిల్లా నుంచి కలెక్టర్ బదావత్ సంతోష్‌తోపాటు అదనపు కలెక్టర్ అమరేందర్ హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వరి కొనుగోళ్లకు 236 కొనుగోలు కేంద్రాలు, మొక్కజొన్నకు 15 కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 13 వేల మె.ట., మొక్కజొన్న కొనుగోలు చేశామన్నారు. అలాగే పత్తి సేకరణకు ఇప్పటి వరకు 12 కొనుగోలు కేంద్రాల ద్వారా 27,377 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసి రూ.21 కోట్లు 1,295 మంది రైతులకు చెల్లించినట్లు వివరించారు. క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాల వివరాలను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఈవీఎం గోడౌన్లో పటిష్ట భద్రత ఈవీఎం గోడౌన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. నెల్లికొండ చౌరస్తాలో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను సాధారణ పరిశీలనలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన నిర్వహించారు. ఈవీఎం గోడౌన్ వద్ద వేసిన సీల్స్, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి.. బందోబస్తుపై పలు సూచనలు చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రతినెలా ఈవీఎం గోడౌన్‌ను తప్పనిసరిగా తనిఖీ చేస్తున్నామన్నారు. జిల్లా యువజన సర్వీసు శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18న నిర్వహించే యువజనోత్సవాల వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువజనోత్సవాల్లో పాల్గొనే అభ్యర్థులు జానపద నృత్యం, జానపద పాట, స్టోరీ రైటింగ్, పెయింటింగ్, కవితల పోటీ, సైన్స్ మేళా ఎగ్జిబిషన్ వంటి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందన్నారు. పోటీల్లో పాల్గొనే యువతి, యువకుల వయస్సు పోటీలు నిర్వహించే నాటికి 15–29 ఏళ్లలోపు జిల్లాకు చెందిన వారై ఉండాలన్నారు. -
ఎప్పటికి పూర్తయ్యేనో..?!
● అచ్చంపేటలో పూర్తికాని అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, కల్వర్టు నిర్మాణాలు ● గడిచిన 10 నెలలుగా సా..గుతున్న పనులు ● అధికారుల నిర్లక్ష్యం.. ప్రయాణికులకు శాపం అచ్చంపేట: అచ్చంపేట మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు మూడు అడుగులు ముందుకు.. ఆరడగులు వెనక్కి అన్న చందంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో పట్టణంలో రెండు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, కల్వర్టుల నిర్మాణాలకు ఆర్అండ్బీ అధికారులు శ్రీకారం చుట్టగా.. ఇప్పటి వరకు అవి పూర్తి కాకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాలకులు కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. అచ్చంపేట– ఉప్పునుంతల ప్రధాన రహదారి బీఎస్ఎన్ఎల్ టవర్, పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు ఇన్ గేటు వద్ద రూ.1.20 కోట్ల వ్యయంతో పనులు మొదలు పెట్టారు. అయితే ఆర్అండ్బీ నుంచి కంట్రాక్టర్ డబ్బులు చెల్లించలేదని పనులు పెండింగ్‌లో పెట్టారు. ఉప్పునుంతల రోడ్డులో కల్వర్టు నిర్మాణం పూర్తయినా అప్రోచ్ రోడ్డు పనులు చేయకపోవడంతో ద్విచక్రవాహనాలు కూడా వెళ్లేలేని పరిస్థితి దాపురించింది. బస్టాండు వద్ద నాలుగు వరుసల రహదారిలో రెండు వైపులకు గాను ఒకవైపు మాత్రమే కల్వర్టు పనులు చేపట్టి వదిలేశారు. దీని అప్రోచ్ రోడ్డు పనులు చేపట్టకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలగుగుతున్నాయి. ద్విచక్రవాహనదారులు ఈ రోడ్డుపై ప్రయాణించి ప్రమాదాలకు గురువుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 20 మందికిపైగా ఈ కల్వర్టు వద్ద కిందపడి గాయాలపాలయ్యారు. భారీ వర్షాలకు మునక.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కార్టీసీ బస్టాండు ముందు చెరువును తలపించింది. ప్రధాన రహదారిపై వరద నీరు పారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడగా.. దుకాణాలు నీట మునిగి సామగ్రి దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారు. వరద నీటితోపాటు మురుగు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ పూర్తికాకపోవడమే ఇందుకు కారణం. ఏప్రిల్ మాసంలోనే ఒకవైపు కల్వర్టు పనులు పూర్తయ్యింది. దీనిపైనే రాకపోకలు కొనసాతుండగా.. మరోవైపు ఇంత వరకు పనులు మొదలు పెట్టకపోవడంతో ఎప్పుడు ప్రారంభిస్తారని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే బస్టాండు ప్రాంతంలో రోజుకు వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలు వస్తుంటాయి. అచ్చంపేట పట్టణంలో ఉప్పునుంతల రోడ్డు కల్వర్టు పనులు పూర్తయ్యాయి. బీటీ వేయాల్సి ఉంది. త్వరలోనే పనులు పూర్తి చేయిస్తాం. బస్టాండు ముందు ఒకవైపు కల్వర్టు పనులు పూర్తి కాగా బీటీతోపాటు మరోవైపు కల్వర్టు చేయాల్సి ఉంది. కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెచ్చి పూర్తి చేయించేందుకు కృషిచేస్తాం. – జలేందర్, ఆర్అండ్బీ డీఈ, అచ్చంపేట -
గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలి
లింగాల: జిల్లాలో పశువులు, గేదులు, ఇతర మూగజీవాలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేసే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుందని జిల్లా పశువైద్యాధికారి జ్ఞానేశ్వర్ అన్నారు. మండలంలోని దత్తారంలో సోమవారం నిర్వహించిన గాలికుంట వ్యాధి నివారణ టీకాల పంపిణీ శిబిరాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో ఈ నెల 14 వరకు వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని, ఆయా గ్రామాల్లో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శిబిరాలకు మూగజీవాలను తీసుకువచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. జిల్లాకు 2.52 లక్షల డోసుల వ్యాక్సిన్ రాగా ఇప్పటి వరకు 1.80 లక్షల డోసులను పంపిణీ చేశామని, మరో 30 శాతం వ్యాక్సిన్ వేయాల్సి ఉందన్నారు. ప్రతిఏటా రెండు పర్యాయాలు గాలికుంట వ్యాధి నివారణ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని చెప్పారు. వచ్చే నెలలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేస్తామని, ఈ అవకాశాన్ని కాపరులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి ప్రియాంక, సిబ్బంది సమ్రీన్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని పశువుల ఆస్పత్రుల్లో అందుబాటులో గడ్డి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని జ్ఞానేశ్వర్ చెప్పారు. ఒక్కో రైతుకు 70 శాతం సబ్సిడీపై 5 నుంచి 20 కిలోల వరకు విత్తనాలను అందజేస్తామన్నారు. విత్తనాలు కావాల్సిన రైతులు ఆధార్, భూమి పట్టాదార్ పాసు పుస్తకం జిరాక్స్ తీసుకువచ్చి విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు. -
ప్రజావాణికి 51 ఫిర్యాదులు
నాగర్‌కర్నూల్: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయంతో కలిసి వివిధ సమస్యలపై దరఖాస్తుదారుల నుంచి 51 అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతో ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాలకోర్చి వస్తుంటారని, ఈ విషయంలో అధికారులు సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు హర్షవర్ధన్, అశోక్, ఏఓ చంద్రశేఖర్, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్‌కు 15.. నాగర్‌కర్నూల్ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీసు గ్రీవెన్స్‌కు 15 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఇందులో 10 భూ తగాదా, 4 తగు న్యాయం గురించి, ఒకటి భార్యాభర్తల గొడవ ఫిర్యాదు వచ్చాయని చెప్పారు. దరఖాస్తుల స్వీకరణ కందనూలు: దివ్యాంగుల సాధికారత రాష్ట్ర పురస్కారాల కోసం వ్యక్తిగత, సంస్థాగత కేటగిరీల వారీగా దివ్యాంగుల కోసం సేవలందిస్తున్న అర్హులైన వ్యక్తులు, సంస్థల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలు అందిస్తున్నామన్నారు. దరఖాస్తు ఫారాలను www.wdsc.telanga na.gov.in వెబ్సైట్లో పొందుపరిచి పూర్తి చేసిన ఫారాలను నవంబర్ 20 వరకు మహిళాశిశు, దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. వైభవంగా సీతారాముల మాస కల్యాణం చారకొండ: పునర్వసు నక్షత్రం సందర్భంగా సోమవారం సిర్సనగండ్లలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో స్వామివారి మాస కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్లను అలంకరించి, అచ్చకులు మంత్రోచ్ఛరణాల మధ్య మాస కల్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. జనరిక్ దుకాణాల్లోఆకస్మిక తనిఖీలు పాలమూరు: జిల్లా ఔషధశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల మెడికల్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ఔషధశాఖ ఏడీ దినేష్‌కుమార్ ఆధ్వర్యంలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు రఫీ, విశ్వంత్‌రెడ్డి, వినయ్ వేర్వేరుగా జడ్చర్ల, నాగర్‌కర్నూల్, నారాయణపేటలో జనరిక్ మెడికల్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. 10 దుకాణాల్లో రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, కొనుగోలు, విక్రయాల స్టాక్ పరిశీలించారు. లైసెన్స్ నిబంధనల ప్రకారం దుకాణాల నిర్వహిస్తున్నారా? లేదా అనే విషయంపై ఆరా తీశారు. జనరిక్ మందులు జీవనధార, ప్రధానమంత్రి జన ఔషధి స్టోర్స్‌లతో పాటు రిటైల్ దుకాణాల్లో జనరిక్ మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. రోగులు ప్రిస్కిప్షన్ ఆధారంగా జనరిక్ మందులు అడిగి తీసుకోవచ్చునని ఏడీ దినేష్‌కుమార్ తెలిపారు. జనరిక్ మందుల నాణ్యత, ప్రభావం బ్రాండెడ్ మందులతో సమానంగా ఉంటుందన్నారు. -
విచారణ చేపట్టాలి..
ఏ ప్రభుత్వ సంస్థల్లో చేపట్టని విధంగా పీయూలో నియామకాలు చేపడుతున్నారు. యూనివర్సిటీలో నేరుగా భర్తీ చేపట్టిన ఏజెన్సీలను రద్దు చేయాలి. మధ్యవర్తులుగా వ్యవహరించి డబ్బులు తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి. నియామకాలపై కమిటీతో విచారణ చేపట్టాలి. – రాము, ఏఐఎస్ఎఫ్ నాయకులు అవసరాల మేరకు కొల్లాపూర్, గద్వాలతో పాటు పలువురు సిబ్బందిని ఔట్సోర్సింగ్ విధానంలో తీసుకున్నాం. గురుకులాలు ఇతర సంస్థలలో నియామకాలు ఎలా చేపడుతున్నారో తెలియదు కానీ యూనివర్సిటీల్లో మాత్రం ఔట్సోర్సింగ్ సిబ్బందిని ఏజెన్సీలే భర్తీ చేస్తాయి. అందుకు యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం ఉండదు. ఒకవేళ అర్హత లేని వారిని తీసుకుంటే తొలగిస్తాం. – రమేష్‌బాబు, రిజిస్ట్రార్, పీయూ -
పల్లెల్లో ఎన్సీడీ పరీక్షలు
–8లో uఅచ్చంపేట రూరల్: జీవన శైలి జబ్బులైన బీపీ, షుగర్లు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. ఇంతకు ముందు పట్టణాల్లోనే ఎక్కువగా కనిపించిన ఈ జబ్బులు ఇప్పుడు పల్లెల్లోనూ వ్యాపిస్తున్నాయి. ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ, 30 ఏళ్లు నిండిన ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ ఉందంటే పరిస్థితి తీవ్రతను అంచనా వేయవచ్చు. గ్రామాల్లో 26 శాతం మంది, పట్టణాల్లో 30 శాతం మంది బీపీ బాధితులు, పల్లెల్లో 19 శాతం మంది, పట్టణాల్లో 24 శాతం షుగర్ బాధితులున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ స్థాయిలో బీపీ, షుగర్ బాధితులుండటం అత్యంత ఆందోళన కలిగించే అంశమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవగాహన లేక కొందరు, నిర్లక్ష్యంతో మరికొందరు ఈ రెండు ప్రమాదకర జబ్బులను నియంత్రణలో ఉంచుకోలేక గుండెజబ్బులకు గురవుతున్నారు. గతంలో ఎన్సీడీ వ్యాధులను గుర్తించేందుకు అప్పుడప్పుడు మాత్రమే సర్వే చేపట్టేవారు. ఆయా వ్యాధుల బారినపడిన వారికి వైద్యశాఖ ఆధ్వర్యంలో ఔషధాలు అందజేసేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రోగాల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఇక నుంచి నిరంతరం ఎన్సీడీ పరీక్షలను గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. ప్రత్యేక కార్యాచరణ.. జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా అసంక్రమిత వ్యాధులను అరికట్టేందుదుకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తుంది. 30 ఏళ్లు దాటిన వారికి వైద్య పరీక్షలు జరుపుతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహంతోపాటు వివిధ రకాల క్యాన్సర్ రోగాలను నిర్ధారించేందుకు పరీక్షలు చేపడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలకు వచ్చే వారికి ఎన్సీడీ పరీక్షలు చేయనున్నారు. క్షేత్రస్థాయిలో కూడా ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటికే రక్తపోటు 79,715, మధుమేహం 39,879 మంది ఉన్నట్లు జిల్లా అధికారులు గుర్తించారు. చేపడుతున్న చర్యలు.. జీవనశైలి జబ్బులు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. వారానికోసారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎన్సీడీ (జీవనశైలి జబ్బులు) స్క్రీనింగ్ నిర్వహిస్తోంది. స్క్రీనింగ్ నిర్వహించడంతోపాటు ఉచితంగా మందులు ఇస్తున్నారు. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా స్క్రీనింగ్ చేస్తున్నారు. జీవనశైలిలో మార్పులతో ఆరోగ్యపర సమస్యలు గ్రామాల్లో 26 శాతం, పట్టణాల్లో 30 శాతం మంది రోగులు అసంక్రమిత వ్యాధులను అరికట్టేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యాచరణ జిల్లాలో నాలుగు ప్రత్యేక క్లినిక్‌లు, 28 పీహెచ్‌సీల్లో కార్నర్ల ఏర్పాటు -
నియామకాలు!
అడ్డగోలుగా పాలమూరు యూనివర్సిటీలో పైరవీలకు పెద్దపీట మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో అధికారులు అడ్డగోలుగా సిబ్బంది నియామకం చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి నోటిఫికేషన్, పత్రికా ప్రకటన, రోస్టర్ విధానం వంటి ప్రక్రియలు చేపట్టకుండా నేరుగా సిబ్బందిని పైరవీల ద్వారా తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా గద్వాల పీజీ సెంటర్, కొల్లాపూర్ పీజీ సెంటర్, పీయూతో పాటు సుమారు 35 నుంచి 36 మంది వరకు సిబ్బందిని వివిధ ఏజెన్సీల ద్వారా నియమించినట్లు సమాచారం. ఇందులో కుక్, హెల్పర్, కేర్ టేకర్, వాచ్మెన్ వంటి పోస్టులు ఉన్నాయి. నేరుగా ఏజెన్సీల ద్వారా వీరిని నియమించడంతో ఏజెన్సీలకు పలువురు మధ్యవర్తులుగా ఉండి తమకు కావాల్సిన వారిని చేర్పించారు. ఈ క్రమంలో పలు పోస్టులకు సిబ్బంది నుంచి డబ్బులు సైతం వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ద్వారా వేతనాలు చెల్లిస్తూ.. ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి వసతులు కల్పిస్తూ నియమించే ఉద్యోగాలకు బయటి వ్యక్తులు, ఏజెన్సీలు నియమించుకోవడం ఏమిటని విమర్శలు వస్తున్నాయి. సిబ్బందిని నియమించిన తర్వాత ఆర్డర్లు సైతం ఇవ్వకుండా అధికారుల వద్దే పెట్టుకొని.. నేరుగా వేతనాలు ఇస్తున్నారు. ఇటీవల గద్వాల పీజీ సెంటర్లో 14, కొల్లాపూర్ పీజీ సెంటర్లో 11 మంది నియామకం యూనివర్సిటీలోనూ 9 మంది వరకు అవకాశం.. ఎలాంటి ప్రకటనలు, రోస్టర్ విధానం లేకుండా చేపట్టడంపై విమర్శలు మధ్యవర్తులు చెప్పిన వారికే ఉద్యోగాలు? -
క్రమం తప్పకుండా..
గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉంటూ క్రమం తప్పకుండా ఇంటింటికి తిరుగుతున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్సీడీ పరీక్షలు చేస్తూ మందులు అందిస్తున్నాం. అవసరం ఉన్న వారిని ఎన్సీడీ కార్నర్, క్లినిక్‌లకు పంపిస్తున్నాం. వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. – రమేష్‌గౌడ్, హెల్త్ అసిస్టెంట్, కాంసానిపల్లి, ఉప్పునుంతల ప్రజల జీవన విధానంలో మార్పుల కారణంగా ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిని ఎప్పటికప్పుడు వైద్యశాఖ ఆధ్వర్యంలో గుర్తించి సరైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 4 ఎన్సీడీ క్లినిక్‌లు ఉండగా.. 28 పీహెచ్సీలలో ఎన్సీడీ కార్నర్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ వాటి డాటాను ఉన్నతాధికారులకు పంపిస్తున్నాం. అవసరం ఉన్నవారికి మందులు పంపిణీ చేస్తున్నాం. – రవికుమార్, ఇన్చార్జి డీఎంహెచ్ఓ ● -
వలంటీర్లను తీసుకుంటాం..
ఈసారి పులులు, ఇతర జంతువుల గణన పకడ్బందీగా కొనసాగుతుంది. గతంలో అరకొర సిబ్బందితో చేపట్టగా.. ఇప్పుడు పూర్తిస్థాయిలో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు అటవీ సిబ్బంది 150 మందితోపాటు సమర్థవంతంగా పనిచేసే 50 మంది వాచర్లు ఉన్నారు. అలాగే వలంటీర్ల కోసం ఆన్లైన్లో 700 వరకు దరఖాస్తులు వచ్చాయి. అటవీ, పులులపై అవగాహన కలిగిన అర్హులు, పనితీరు మెరుగ్గా ఉన్న యువతను వలంటీర్లుగా తీసుకుంటాం. – రోహిత్ గోపిడి, డీఎఫ్ఓ, నాగర్‌కర్నూల్ ● -
అడవిని నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి
కొల్లాపూర్: మండలంలోని ఎల్లూరు సమీపంలో అడవిని నరికి గుట్టలను చదును చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.బాల్‌నర్సింహ్మ డిమాండ్ చేశారు. ఎల్లూరు శివారులోని సర్వేనంబర్ 359, 360, 364, 365లో గల 45 ఎకరాల భూమిని సురభి రాజవంశ వారసుడు ఆదిత్య లక్ష్మారావు, ఆయన సోదరి హైదరాబాద్‌కు చెందిన వారికి కొన్ని నెలల క్రితం విక్రయించారు. ఈ భూమి స్వాతంత్య్రం రాక పూర్వం నుంచి కూడా అడవిగానే ఉండేది. ఈ భూమిని ఇటీవలే కొందరు కొనుగోలు చేసి చెట్లన్నీ నరికేశారు. గుట్టలను చదునుచేసి.. లోయలను పూడ్చివేస్తున్నారు. దీనిపై స్థానిక రైతులు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో సీపీఐ బృందం ఆ భూమిని పరిశీలించింది. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బాల్‌నర్సింహతో పాటు జిల్లా కార్యదర్శి ఫయాజ్ విలేకర్లతో మాట్లాడారు. 1995 వరకు సర్కారీ ఇనాంగా రికార్డుల్లో నమోదైన భూమి.. ఆ తర్వాతి కాలంలో సురభి రాజవంశస్థుల పేరిట పట్టా భూమిగా ఎలా మారిందో అధికారులు చెప్పాలన్నారు. ఫారెస్టు, వాల్టా చట్టాలను తుంగలో తొక్కుతూ అడవిని నరికేస్తున్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదన్నారు. సామాన్యులు ఎక్కడైనా కొన్ని చెట్లు నరికితే కేసులు పెట్టే అటవీ అధికారులు.. కొల్లాపూర్‌కు అతి సమీపంలోని అడవిని నరికేస్తే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించాలని వారు కోరారు. రాజ కుటుంబీకులకు సీలింగ్ యాక్టును వర్తింపజేయాలన్నారు. సదరు భూమిని తిరిగి ఫారెస్టుకు అప్పగించాలని.. లేదంటే పేదలకు పంచాలని వారు కోరారు. సమావేశంలో సీపీఐ నాయకులు ఏసయ్య, ఇందిరమ్మ, తుమ్మల శివుడు, వెంకటయ్య, ఆనంద్, ప్రకాశ్, కురుమయ్య ఉన్నారు. -
అదిగో.. పులి
అమ్రాబాద్ టైగర్ రిజర్వులో జంతుగణన–2026కు సిద్ధం అచ్చంపేట: రాష్ట్రంలో పులుల సంఖ్య తెల్చేందుకు అటవీశాఖ సిద్ధమైంది. జాతీయ పులుల సంరక్షణ యాజమాన్యం (ఎన్టీసీఏ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నాలుగేళ్లకోసారి.. రాష్ట్రస్థాయిలో అటవీశాఖ ప్రతి ఏటా జంతుగణన చేపడుతోంది. ఇందులో భాగంగా నల్లమలలో పులుల లెక్కింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఈసారి పులుల గణన–2026లో పాల్గొనేందుకు ఆసక్తి గల స్వచ్ఛంద సంస్థల వలంటీర్లు, జంతు ప్రేమికులు, ఔత్సాహిక యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 18– 60 ఏళ్ల వయసు కలిగి.. రోజూ అడవి మార్గంలో 10– 15 కి.మీ., వరకు నడిచే సామర్థ్యం కలిగి ఉండాలి. ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమం కావడంతో ఎలాంటి పారితోషికం ఇవ్వరు. అవసరమైన వసతి, రవాణా సౌకర్యం అటవీశాఖ కల్పిస్తుంది. వచ్చే జనవరి 17 నుంచి 23వ తేదీ వరకు అమ్రాబాద్ (నల్లమల) అభయారణ్యంలోని 220 అటవీ బీట్లలో పులుల గణన చేపట్టనున్నారు. ఈసారి డెహ్రాడూన్ వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) వన్యప్రాణుల గణనను సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. పులులతోపాటు ఇతర శాఖాహార, మాంసాహార జంతువుల లెక్కింపు చేపట్టనున్నారు. జనవరి 17 నుంచి 23 వరకు కొనసాగనున్న ప్రక్రియ ఈసారి లెక్కింపులో ఔత్సాహిక యువకులకు అవకాశం స్వచ్ఛంద సంస్థల వలంటీర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం ఈ నెల 22తోముగియనున్న స్వీకరణ గడువు -
సమాజాన్ని ఏకం చేయడమే లక్ష్యం
కందనూలు: సమాజాన్ని ఏకం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ముఖ్యవక్త, రిటైర్డ్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలో పథ సంచలన్ కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన ఉత్సవాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సామాజిక చైతన్యాన్ని ప్రజల్లో కలిగించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత సమాజంలో ధర్మపరిరక్షణ కోసం హిందువుగా జీవించాల్సిన అవసరం ఉందన్నారు. కుల ప్రస్తావన లేకుండా సామాజిక సమరసతతో సమాజం ఏకం కావాలన్నారు. హిందూ సమాజం గొప్పదనం చాటడంతో పాటు వసుదైక కుటుంబ వ్యవస్థ, సనాతన ధర్మాన్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ఆకట్టుకున్న పథ సంచలన్.. స్వయం సేవకులు జిల్లా కేంద్రంలో చేపట్టిన పథ సంచలన్ ఆకట్టుకుంది. స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీలోని వేంకటేశ్వర ఆలయం నుంచి ఒక గ్రూపు, పాత బజారులోని ఈదమ్మ గుడి నుంచి రెండో గ్రూపు పట్టణంలోని పురవీధుల గుండా బయలుదేరి.. నల్లవెల్లి రోడ్డులో కలుసుకున్నారు. అక్కడి నుంచి అంబేడ్కర్ చౌరస్తా, ప్రధాన రహదారి మీదుగా బాలుర ఉన్నత పాఠశాల మైదానానికి చేరుకున్నారు. పథ సంచలన్లో పాల్గొన్న స్వయం సేవకులపై స్థానికులు పూలవర్షం కురిపించారు. కార్యక్రమంలో విభాగ్ సంఘచాలక్ వేమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా సంఘచాలక్ నారాయణ, విభాగ్ కార్యవాహ పత్తికొండ రాము, జిల్లా సహ కార్యనిర్వవాహ నాగయ్య, నగర కార్యవాహ వేముల సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రణాళికాబద్ధంగా తరగతులు నిర్వహించండి
కందనూలు: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్ స్కూళ్లలో పదో తరగతి, ఇంటర్మీడియట్ తరగతులను ప్రణాళికాబద్ధంగా కొనసాగించాలని రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కొనసాగుతున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయా కేంద్రాల్లో విద్యార్థుల నమోదు, హాజరు వివరాలను పరిశీలించారు. రెండో శనివారం, ఆదివారం నిర్వహించే తరగతులకు విద్యార్థులు వందశాతం హాజరయ్యేలా కృషి చేయాలని ఓపెన్ స్కూల్ సెంటర్ కోఆర్డినేటర్లకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం దూరవిద్య విధానంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ విద్యాపీఠం జారీ చేసే సర్టిఫికెట్లతో ఉన్నత చదువులు, ఉద్యోగాలు పొందేందుకు అర్హత ఉంటుందన్నారు. జిల్లాలో 18 ఓపెన్ స్కూల్ సెంటర్లు కొనసాగుతున్నాయని.. 2025–26 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతిలో 403 మంది, ఇంటర్మీడియట్లో 996 మంది అడ్మిషన్లు పొందినట్లు వెల్లడించారు. విద్యార్థులు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్షలు రాసే అవకాశం ఉందన్నారు. మధ్యలో చదువు ఆపేసిన వారికి ఇదొక సువర్ణావకాశమని.. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శివప్రసాద్, నిర్వాహకులు రవిప్రకాశ్, తిరుపతయ్య, అహ్మద్, యాదగిరి, బాలరాజు ఉన్నారు. -
క్రీడల్లో సత్తా చాటాలి : డీవైఎస్ఓ
కల్వకుర్తి రూరల్: ప్రభుత్వం క్రీడాకారులకు అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తోందని.. తమకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకొని రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటాలని డీవైఎస్ఓ సీతారాం నాయక్ అన్నారు. ఆదివారం కల్వకుర్తి మండలం మార్చాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో కబడ్డీ జిల్లా జూనియర్, సీనియర్ జట్ల ఎంపిక పోటీలను ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీవైఎస్ఓ మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడల్లో రాణించే వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. ప్రతి విద్యార్థి ఆసక్తిగల క్రీడలో ప్రావీణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. కబడ్డీ జిల్లా జూనియర్, సీనియర్ జట్ల ఎంపిక పోటీల్లో ప్రతిభకనబరిచిన క్రీడాకారులను డిసెంబర్ 5 నుంచి 8వ తేదీ వరకు మహబూబ్‌నగర్, కరీంనగర్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యాదయ్య, రమేశ్, భాస్కర్, జంగయ్యగౌడ్, శ్రీనివాసులు, మోహన్, డాక్య, రామన్‌గౌడ్ పాల్గొన్నారు. -
కొండెక్కిన కూరగాయలు
● ఏది కొనాలన్నా.. కిలో రూ.80 పైగా ధర ● అదే దారిలో ఆకుకూరలు ● వారంలోనే అమాంతం పెరుగుదల ●ధరలు బాగా పెరిగాయి.. వారం రోజుల వ్యవధిలోనే కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. గతవారం వరకు రూ. 300 తీసుకొని మార్కెట్‌కు వెళ్తే వారానికి సరిపడా కూరగాయల వచ్చేవి. ఆ డబ్బులతో ప్రస్తుతం రెండు, మూడు కిలోలు కూడా రావడం లేదు. గతంలో కిలోకు తగ్గకుండా కొనేదాన్ని. ప్రస్తుతం పావుకిలో, అర్ధకిలోతో సరిపెట్టుకుంటున్నాం. – అరుణ, గృహిణి, ఈశ్వర్‌కాలనీ, నాగర్‌కర్నూల్ పెద్దగా గిరాకీ లేదు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దిగుబడి తగ్గింది. దాని వల్ల కూరగాయల ధరలు పెరిగాయి. గతంలో రోజుకు రూ. 2వేల వరకు అమ్మేవాడిని. ప్రస్తుం రూ.వెయ్యి కూడా రావడం లేదు. ప్రజలు పావుకిలో, అర్ధకిలో తీసుకెళ్తున్నారు. ధరలు పెరగడం వల్ల పెద్దగా గిరాకీలు లేవు. – రాములు, కూరగాయల వ్యాపారి, నాగర్‌కర్నూల్ కూరగాయలు సెప్టెంబర్ నవంబర్ టమాటా 20 30–40 పచ్చిమిర్చి 70 80 బెండకాయ 60 100 కాకరకాయ 70 100 బీన్స్ 80 120 క్యారెట్ 60 120 బీట్రూట్ 50 100 క్యాబేజీ 60 100 క్యాప్సికం 70 120 గోకరికాయ 60 100 వంకాయ 50 100 దొండకాయ 60 100 కందనూలు: కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలు వినియోగదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి, దిగుబడి లేకపోవడం.. అధిక వర్షాల ప్రభావంతో వారం, పది రోజుల వ్యవధిలోనే ధరలు అధికమయ్యాయి. మార్కెట్లో ఏది కొనాలన్నా కిలో రూ. 80 పైగా ధర పలుకుతోంది. ధరలు అమాంతం పెరగడంతో పావుకిలో, అర్ధకిలోతో సరిపెట్టుకుంటున్నారు. వారం రోజుల క్రితం రూ. 300కు వచ్చిన సరుకులు.. ఇప్పుడు రూ. 600 పట్టుకెళ్లినా సంచి నిండటం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మార్కెట్లలో కూరగాయల ధరలు చూసి జనం బేజారవుతున్నారు. దిగుమతి చేసుకోవాల్సిందే.. జిల్లాలో చాలా వరకు కూరగాయలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేస్తుంటారు. అందులో టమాటా, కాకరకాయ, బీరకాయ, చిక్కుడు, దోసకాయ, క్యారెట్, క్యాబేజీ, ఆలుగడ్డ, బీన్స్ ఇతర ప్రాంతాల నుంచి రావాల్సిందే. టమాటా ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె, కర్నూలు నుంచి ఎక్కువగా దిగుమతి చేస్తున్నారు. క్యాప్సికం, బీన్స్, బెంగళూరు నుంచి వస్తుంటాయి, కాలీప్లవర్, క్యాబేజీ, బీట్రూట్, కీరా హైదరాబాద్, షాద్‌నగర్, శంషాబాద్ మార్కెట్ల నుంచి తెస్తుంటారు. ఆకుకూరలు సైతం.. కూరగాయల ధరలు అధికమని భావిస్తున్న తరుణంలో ఆకుకూరల ధరలు కూడా అమాంతం పెరిగాయి. పాలకూర, మెంతంకూర, గోంగూర, తోటకూర, చుక్కకూరల రేట్లు భారీగా పెరగడంతో కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. దిగుబడి లేక.. జిల్లాలో కూరగాయల సాగు నామమాత్రంగానే ఉంటుంది. మరోవైపు ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. ఫలితంగా దిగుబడి తగ్గిపోయింది. దీంతో ప్రజల అవసరాలకు సరిపోవడం లేదు. దీనికి తోడు ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకోవడం వల్ల రవాణా ఖర్చులు అధికమై ధరల పెరుగుతున్నాయని అమ్మకందారులు చెబుతున్నారు. -
కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమం
తెలకపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ప్రతి కార్మికుడు ఉద్యమబాట పట్టాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఆదివారం తెలకపల్లిలో నిర్వహించిన సీఐటీయూ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. కార్మికుల పని గంటలు, ఉద్యోగ భద్రత కోసం పోరాడేందుకు సిద్ధం కావాలన్నారు. ఈ నెల 30న సీఐటీయూ జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహాసభల్లో కార్మిక ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని.. కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు జిల్లా ఉపాధ్యక్షుడు వర్దం పర్వతాలు, పొదిలి రామయ్య, శంకర్ నాయక్, శివవర్మ, పసియొద్దీన్, దశరథం, పార్వతమ్మ ఉన్నారు. సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలి కందనూలు: సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు బంగారుబాబు డిమాండ్ చేశారు. ఆదివారం ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చాలా హాస్టళ్లలో విద్యార్థులకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలల తలుపులు కూడా ధ్వంసమయ్యాయని తెలిపారు. సంబంధిత అధికారులు హాస్టళ్లను పరిశీలించి.. సమస్యలను పరిష్కరించాలని కోరారు. అదే విధంగా విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి ప్రసాద్, రమేశ్, శివ, బాబు, శ్రీకాంత్, మల్లేష్, జీవన్ పాల్గొన్నారు. నేడు అప్రెంటీస్‌షిప్ మేళా వనపర్తి రూరల్: మండలంలోని రాజపేట శివారులో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సోమ వారం అప్రెంటీస్‌షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రమేష్‌బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు మేళాను సద్వినియోగం చేసుకోవాలని.. నిజ ధ్రువపత్రాలతో హాజరుకావాలని పేర్కొన్నారు. సర్వీస్ ఉపాధ్యాయులకు ‘టెట్’ పెట్టొద్దు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా చూస్తామని టీపీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీపీఆర్టీయూ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టెట్ అనేది కేవలం ఉపాధ్యాయులకు ఒక అర్హత పరీక్ష అని, కేంద్ర ప్రభుత్వం చెప్పిందని వెంటనే టెట్ అర్హత సాధించాలని రాష్ట్రం కూడా చెప్పడంతో ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉందన్నారు. పరీక్ష అవసరం లేకుండా ఉండాలంటే ఆర్టీఈ చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని, అందుకోసం కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించేందుకు త్వరలో ఢిల్లీకి వెళ్తున్నామన్నారు. అధికారంలోనికి వచ్చిన వెంటనే పీఆర్సీ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం రెండేళ్లు గడిచినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం దీనిపై ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలన్నారు. జీఓ 317లో భాగంగా వేరే జిల్లాలకు వెళ్లిన స్కూల్ అసిస్టెంట్లు సొంత జిల్లాలకు వచ్చేలా ప్రయత్నిస్తామని చెప్పారు. గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల సమస్యను పరిష్కరించి.. 40 వేల పోస్టులకు అవకాశం ఇవ్వడం గొప్ప విషయం అని, పండిట్, పీఈటీలను కూడా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రమాకాంత్, నాయకులు శ్యాంబాబు, భూపతిసింగ్ పాల్గొన్నారు. -
చారిత్రక వైభవం..
నాటి చరిత్రకు సాక్ష్యంగా నేటికీ నిలిచిన కట్టడాలు అందరికీ అందుబాటులోకి తెస్తేనే.. గ్రామాల్లో పర్యటించి పరిశోధన ద్వారా తెలుసుకున్న చరిత్రకు భావితరాలకు అందించేందుకు పుస్తకాలు, రచనలు, డాక్యుమెంట్ల రూపంలో వెలుగులోకి తేవాల్సి ఉంది. అయితే రెండేళ్ల క్రితం ఈ కార్యక్రమాన్ని చేపట్టినా ప్రభుత్వం ఇందుకు అవసరమైన నిధులను కేటాయించలేదు. ఇది పూర్తిగా ప్రొఫెసర్లు, డిగ్రీ విద్యార్థులు, ఔత్సాహిక పరిశోధకులు స్వచ్ఛందంగా చేపట్టాల్సి రావడంతో చాలావరకు గ్రామాల పర్యటన, చరిత్ర పరిశోధన ఆశించినంత సాగడం లేదు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి, భావితరాలకు అందించేలా చర్యలు చేపట్టాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బిజినేపల్లి మండలం వట్టెంలోని గడి మన ఊరు – మన చరిత్ర కార్యక్రమంలో భాగంగా చాలా వరకు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి అధ్యయనం చేపట్టాం. పలుగ్రామాల చరిత్ర పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మారుమూల గ్రామాల్లో మనకు తెలియని కొత్త చరిత్ర బహిర్గతమవుతోంది. ఆనాటి సామాజిక పరిస్థితులు, వివక్ష తదితర అంశాలు తెలుస్తున్నాయి. – పెబ్బేటి మల్లికార్జున్, ప్రాజెక్ట్ జిల్లా కోఆర్డినేటర్) చాలా కొత్త విషయాలు తెలిశాయి.. -
ముగిసిన జోనల్‌స్థాయి క్రీడా పోటీలు
గోపాల్పేట: మండలంలోని బుద్దారం గురుకుల పాఠశాలలో గురువారం ప్రారంభమైన 11వ జోనల్‌స్థాయి క్రీడా పోటీలు శనివారం అట్టహాసంగా ముగిశాయి. క్రీడపోటీల్లో నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు చెందిన సుమారు 700 మంది క్రీడాకారులు పాల్గొని సత్తా చాటారు. గతేడాది నాలుగు రోజుల పాటు కొనసాగిన జోనల్‌స్థాయి క్రీడాపోటీలు ఈ ఏడాది మూడు రోజుల్లోనే ముగించారు. క్యారమ్స్‌లో గోపాల్పేట మొదటిస్థానంలో నిలువగా మన్ననూరు రెండోస్థానంలో నిలిచింది. చెస్‌లో కొత్తకోట మొదటి స్థానం, గోపాల్పేట రెండోస్ధానం.. వందమీటర్ల పరుగుపందెంలో పెద్దమందడి మొదటిస్థానంలో నిలువగా పెద్దమందడికి చెందిన విద్యార్థిని రెండోస్థానంలో నిలిచింది. 200 మీటర్ల పరుగు పందెంలో మొదటిస్థానం, రెండోస్థానంలో పెద్దమందడికి చెందిన విద్యార్థులే నిలవడం గమనార్హం. 400, 800, 1500, మూడు వేల మీటర్ల పరుగుపందెంలో నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండకు చెందిన విద్యార్థినులు మొదటి స్థానంలో నిలిచారు. డిస్కస్‌త్రో, షాట్‌పుట్, లాంగ్‌జంప్ పోటీల్లో పెద్దమందడి విద్యార్థినులు మొదటిస్థానంలో నిలిచారు. హైజంప్‌లో వంగూర్, వ్యక్తిగత చాంపియన్‌షిప్‌లో వెల్దండకు చెందిన కీర్తన ప్రతిభ కనబర్చారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో ఓవరాల్‌గా పెద్దమందడి 80 పాయింట్లు సాధించింది. శనివారం జరిగిన బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథులుగా డీసీఓ ప్రమోద, ఎంఈఓ చంద్రశేఖర్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడాపోటీల నిర్వహణకు సహకరించిన వారికి ప్రిన్సిపాల్ ఆరోగ్యం ధన్యవాదాలు తెలిపారు. -
వైభవంగా పల్లకీసేవ
బిజినేపల్లి: కార్తీక మాసం రెండో శనివారాన్ని పురస్కరించుకొని వట్టెం అలివేలుమంగ, గోదాదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామికి పల్లకీసేవ నిర్వహించారు. ఆలయ అర్చక బృందం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. ప్రత్యేక అలంకార సేవల అనంతరం అర్చకులు స్వామివారి మాడవీధుల్లో పల్లకీసేవ చేపట్టారు. కార్తీక పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి, అన్నదానం చేశారు. శనేశ్వరుడికి ప్రత్యేక పూజలు బిజినేపల్లి: మండలంలోని శనేశ్వరుడి ఆలయానికి శనిదోష నివారణ కోసం భక్తులు శనివారం తెల్లవారుజాము నుంచే చేరుకుని భక్తిశ్రద్ధలతో స్వామివారికి తిలతైలాభిషేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి భక్తుల చేత గోత్రనామార్చనలు, దోష నివారణ మంత్రోచ్ఛరణ చేయించారు. అనంతరం శివుడిని దర్శించుకున్న భక్తులకు ఆలయ కమిటీ తీర్థప్రసాదాలు అందజేసింది. ఆలయ చైర్మన్ గోపాల్‌రావు, కమిటీ సభ్యులు రాజేష్, ప్రభాకరచారి, పుల్లయ్య, వీరశేఖర్, అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. రైతులను గాలికొదిలేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ బిజినేపల్లి: అతివృష్టి కారణంగా పత్తి, మొక్కజొన్న, వరి తదితర పంటలను రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక మత్తులో మునిగిపోయి.. రైతులను గాలికొదిలేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. శనివారం మండలంలోని వెల్గొండ గ్రామంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత వారం రోజులుగా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో సీపీఐ బృందం పర్యటించి పంట నష్టం తీవ్రతను ప్రభుత్వానికి వివరించామన్నారు. ఎకరాకు రూ.30 వేలు తక్షణ సాయం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండు చేశారు. అధికార, ప్రతిపక్షాలు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా రైతులను గాలికి వదిలేశారని, ఎన్నికలపై పెట్టిన దృష్టి రైతులపై కూడా ఉంచాలని హితవు పలికారు. అలాగే సీపీఐ శతాబ్ది ఉత్సవాలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని, జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున వేడుకలు జరిపించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ అన్నారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యు లు చంద్రమౌళి, మండల కార్యదర్శి కృష్ణాజీ, నాయకులు భూపేష్బాబు, మధుగౌడు, గంగాధర్, శ్రీనివాస్, పురుషోత్తం పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి యోగాసన పోటీల్లో ప్రతిభ చాటాలి మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి యోగా సన పోటీల్లో క్రీడాకారులు ప్రతిభచాటాలని ఉ మ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి కురుమూర్తిగౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌లోని ఎస్ఎంపీ స్కూల్లో శనివారం ప్రారంభమైన రాష్ట్రస్థాయి సబ్, జూనియర్ యోగాసన పోటీలకు క్రీడాకారులు తరలివెళ్లారు. -
‘సర్’కు సన్నద్ధం
● ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కోసం ఏర్పాట్లు ● నాలుగు కేటగిరీలుగా విభజించి తయారీ ● 2002 ఓటరు లిస్టు ప్రామాణికంగా కసరత్తు ● బోగస్ ఓట్లకు చెక్పడే అవకాశం అచ్చంపేట: నకిలీ ఓట్ల తొలగింపు, తప్పుల సవరణే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) చేపట్టగా.. దీనికోసం జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. త్వరలో అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటరు జాబితాను పరిశీలించనున్నారు. దీంతో బోగస్ ఓట్లకు చెక్పడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం రెండు దశాబ్దాలకు ఒకసారి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే నిర్వహిస్తుంది. గతంలో 2002లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ జరగగా.. 23 ఏళ్ల తర్వాత మళ్లీ నిర్వహించబోతున్నారు. అప్పటి జాబితాలను పరిగణలోకి తీసుకుని సవరణ చేయనున్నారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి పలు దఫాలుగా కలెక్టర్, ఎన్నికల అధికారులతో వీసీ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఓట్లు గల్లంతు.. ఏటా ఓటర్ల జాబితా సవరించే కార్యక్రమం నడుస్తోంది. అయితే చాలాచోట్ల బోగస్ ఓట్లు ఉన్నాయని, అలాగే ఓట్లు గల్లంతయ్యాయనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఓటు వేయడానికి వెళ్లిన ప్రజలు తమ ఓట్లు గల్లంతయ్యాయంటూ ఆందోళనలనకు దిగుతుండడం సర్వసాధారమైపోయింది. మరికొందరికి పట్టణాల్లో రెండు, మూడు వార్డుల్లో ఓట్లు ఉండటం, అలాగే పట్టణాల్లో ఓట్లు ఉన్నవారికి పల్లెల్లోనూ ఓట్లు ఉండటం వంటివి చూస్తుంటాం. మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినప్పుడు పట్టణాల్లో ఓటు వేయడం, పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు పల్లెల్లో ఓటు వేయడం ద్వారా పలువురు ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారి ఓట్లు కొందరు రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం పట్టణాల్లో నమోదు చేయిస్తుంటారు. పట్టణాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు వారంతా వచ్చి ఓట్లు వేయడం ద్వారా గెలుపోటములను శాసిస్తుంటారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ద్వారా బోగస్ ఓటర్లు బయటపడే అవకాశాలు ఉంటాయి. వాటిని తొలగించడం ద్వారా బోగస్ ఓట్లకు చెక్పడే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. ఏ, బీ, సీ, డీ కేటగిరీలు.. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కోసం 2002 ఓటర్ల జాబితాతోపాటు 2025 ఓటర్ల జాబితాల్లో నమోదైన వారి వివరాలను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించి సవరణ చేస్తారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా సవరణ ప్రక్రియ మొదలైంది. బూత్ లెవల్ అధికారులు(బీఎల్ఓ)లు ఈ పనిలో నిమగ్నమయ్యారు. 39 ఏళ్ల పైబడి ఉండి, 2002 ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదైన వారు ఏ కేటగిరిలో, 39 ఏళ్ల పైబడి 2002 ఓటర్ల జాబితాలో పేరు లేని వారి వివరాలను బీ కేటగిరిలో ఉంటారు. 21– 38 ఏళ్లలోపు వారు 1987 నుంచి 2004 మధ్యకాలంలో జన్మించిన వారిని సీ కేటగిరిలో, 18–20 ఏళ్లలోపు అంటే 2004 తర్వాత జన్మించిన వారి జాబితాను డీ కేటగిరీలో చేరుస్తారు. -
పక్కాగా భూముల లెక్క
నాగర్‌కర్నూల్: భూ భారతి చట్టాన్ని అమలులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా భూముల లెక్క తేల్చేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే జిల్లాలోని ఏ మండలంలో.. ఏ గ్రామంలో.. రీ సర్వే నిర్వహిస్తున్నారనే విషయంలో గజిట్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. 15 రోజుల తర్వాత రెండోసారి నోటిఫికేషన్ జారీ చేసి సర్వే పనులను మొదలు పెట్టనున్నారు. అయితే జిల్లాలో రీ సర్వేకు సంబంధించి 4 గ్రామాలను గుర్తించారు. అదేవిధంగా రైతుల భూ సర్వే చేసేందుకు 70 గ్రామాలను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన గ్రామాల్లో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకుని సర్వే చేసి మ్యాప్‌లతో సహా కొత్త రికార్డులను రూపొందించనున్నారు. ఏయే గ్రామాల్లో అంటే.. జిల్లా పరిధిలో రీ సర్వే కోసం 4 గ్రామాలను ఎంపిక చేశారు. బిజినేపల్లి మండలంలోని ఖానాపూర్, తిమ్మాజిపేట మండలంలోని మరికల్, లింగాల మండలంలోని అంబట్పల్లి, కొల్లాపూర్ మండలంలోని మొలచింతపల్లి గ్రామంలో సర్వే చేపట్టనున్నారు. దీనికి సంబంధించి గ్రామ పరిధిలో ప్రభుత్వ భూములు, పట్టా భూములు, ఇతరత్రా భూములను సర్వే చేసి సమగ్ర నివేదికను తయారు చేయనున్నారు. ఇక దీంతోపాటు జిల్లా పరిధిలోని 70 గ్రామాల్లో ఎంజాయ్ సర్వే చేయనున్నారు. ఈ సర్వే రైతులకు సంబంధించి భూమి ఎవరి ఆధీనంలో ఉంది.. సర్వే నంబర్.. డివిజన్ నంబర్ సరైనదేనా.. కాదా.. వాటి హద్దులు అన్ని కూడా సర్వే చేసి అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తారు. తద్వారా భూమి హక్కుల నిర్ధారణ పూర్తిచేసి రైతుల వివవరాల ఆధారంగా భూధార్ కార్డును అందజేస్తారు. ప్రతి కమతానికి యూనిక్ ఐడీ నంబర్ ఇవ్వాలని ఇప్పటికే కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని భూధార్ కార్డులను ఇచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సర్వే రికార్డులో ఉన్న వివరాలు, ఆర్ఓఆర్లో ఉన్న వివరాలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తొలుత తాత్కాలిక భూ ధార్ కార్డులు ఇచ్చి రీ సర్వే పూర్తి చేసిన తర్వాత శాశ్వత కార్డులు ఇవ్వనున్నారు. అత్యంత కచ్చితత్వంతో.. ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ఆధునిక టెక్నాలజీని వినియోగించనున్నారు. డీజీపీఎస్ (డిఫరెన్షియల్ గ్లోబల్ పొజీషన్ సిస్టం) ద్వారా ఈ సర్వే చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ రికార్డుల ప్రకారం హద్దులను నిర్ణయిస్తారు. ఒక్కో సర్వే నంబర్లో డిజిటల్ సర్వే నిర్వహిస్తారు. ఆ తర్వాత సర్వే నంబర్లలో రైతుల వారిగా విస్తీర్ణం ప్రకారం హద్దులు నిర్ణయిస్తారు. అక్షాంశాలు, రేఖాంశాల వారిగా జియో ఇన్ఫర్మేషన్ సిస్టంకు అనుసంధానం చేస్తారు. డీజీపీఎస్ ద్వారా నిర్వహించే ఈ సర్వేలో కచ్చితత్వం ఎక్కువగా ఉంటుంది. భూ సర్వే నిర్వహించే సమయంలో, హద్దులను నిర్ధారించే సమయంలో రైతులకు నోటీసులు జారీ చేయనున్నారు. భూములకు సంబంధించిన పట్టాదారులు, రిజిస్ట్రేషన్‌దారులు సర్వే సమయంలో హాజరు కావాల్సి ఉంటుంది. సర్వే పూర్తయిన తర్వాత ఆయా గ్రామాల్లో రైతుల నుంచి ఆక్షేపణలను స్వీకరిస్తారు. రైతులకు ఎ లాంటి అభ్యంతరం లేకపోతేనే మ్యాపులతో సహా కొత్త రికార్డులు రూపొందించనున్నారు. జిల్లాలోని నాలుగు గ్రామాల్లో రీ సర్వేకు సన్నాహాలు భూధార్ కోసం మరో 70 పల్లెల్లో ఎంజాయిమెంట్ సర్వే మరో 15 రోజుల తర్వాత రెండోసారి నోటిఫికేషన్ మ్యాపులతో సహా రికార్డుల రూపకల్పనకు చర్యలు త్వరలోనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అన్నింటినీ సరిచేసేందుకే.. భూముల సర్వే జరిగి చాలా సంవత్సరాలు కావొస్తుండడంతో క్షేత్రస్థాయిలో భూమికి, రికార్డుల్లో భూమికి చాలా వ్యత్యాసం ఉంటుంది. వీటన్నింటిని సరి చేసేందుకే ప్రభుత్వం రీ సర్వే చేపట్టింది. మరో 15 రోజుల్లో రెండోసారి నోటిఫికేషన్ పూర్తి చేసి సర్వే ప్రారంభిస్తాం. ఆధునిక పరికరాలతో ఈ సర్వే చేపడుతున్నందున భూముల లెక్కలు పక్కాగా ఉంటాయి. నాగేందర్, జిల్లా సర్వే, ల్యాండ్ ఏడీ -
అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలి
వంగూరు: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని డీఈఓ రమేశ్‌కుమార్ అన్నారు. గురువారం మండలంలోని కొండారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీ లు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు తరగతి గదుల్లో విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి అభ్యసన సా మర్థ్యాలను తెలుసుకున్నారు. ఉపాధ్యాయు లు సమయపాలన పాటిస్తూ.. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయాలని సూచించారు. మామిడి రైతులు జాగ్రత్తలు పాటించాలి కొల్లాపూర్: మామిడి పూతలు నిలిచేందుకు రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఉద్యానశాఖ అధికారి లక్ష్మణ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెలలోనే మామిడి పూత వస్తుందని.. ఈ సమయంలో తేనెమంచు పురుగు, పిండినల్లి, పొలుసు పురుగు తోటల్లో ఎక్కువగా కనిపిస్తుందన్నారు. వీటి నివారణకు ఒక లీటర్ నీటిలో ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ., వేపనూనె 2.5 మి.లీ., కార్బండిజమ్ 1 గ్రాము చొప్పున కలిపి చెట్లకు పిచికారీ చేయాలని సూ చించారు. పిండినల్లి పురుగులు చెట్టుపైకి పాక కుండా.. పాదులు చేసిన చెట్టు మొదలు చుట్టూ పాలిథిన్ పేపర్‌ను ఒక అడుగు వరకు చుట్టి జి గురు పూయాలన్నారు. సస్యరక్షణ చర్యలు చేపడితే పూతలు నిలుస్తాయని ఆయన తెలిపారు. -
‘ఉపాధి’ పనులనుపర్యవేక్షించాలి
తిమ్మాజిపేట: ఉపాధి హామీ పథకం పనులను నిరంతరం పర్యవేక్షించాలని డీఆర్డీఓ చిన్న ఓబులేషు మండల అధికారులకు సూచించారు. గురువారం తిమ్మాజిపేటలోని ఉపాధిహామీ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు 2024–25 సంవత్సరం ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనుల వివరాలను తెలుసుకున్నారు. అదే విధంగా ఉపాధిహామీ పనుల సామాజిక తనిఖీపై ఆరా తీశారు. డీఆర్డీఓ వెంట ఎంపీడీఓ లక్ష్మీదేవి, ఏపీఓ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. విద్యారంగాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం అచ్చంపేట రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఆరోపించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ముందుగా కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ప్రవీణ్, శివ, తరుణ్, విజయ్ పాల్గొన్నారు. పశువులకు టీకాలు తప్పనిసరి తిమ్మాజిపేట: పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి జ్ఞానశేఖర్ సూచించారు. గురువారం మండలంలోని గుమ్మకొండ, పుల్లగిరి గ్రామాల్లో ఏర్పాటుచేసిన పశువైద్య శిబిరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పశువుల పెంపకందారులకు పలు సూచనలు చేశారు. పశువులకు సీజనల్‌గా ప్రబలే గాలికుంటు వ్యాధి నివారణ కోసం పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. పశువుల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పశువైద్యులు ఉదయ్‌కుమార్‌రెడ్డి, శ్రావణి, జేవీఓ విజయ లలిత, వీఏ ఖాదర్, ఓఎస్‌లు శాంతయ్య, రవి పాల్గొన్నారు. 18న జిల్లాస్థాయి యువజనోత్సవాలు కందనూలు: ఈ నెల 18న జిల్లాస్థాయి యువజనోత్సవాలు నిర్వహించనున్నట్లు డీవైఎస్ఓ సీతారాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని యువతీ యువకులకు జానపద నృత్యం, పాటలు, కథా రచన, పేయింటింగ్, వ్రకృత్వ, కవిత్వం, ఇన్నోవేషన్ ట్రాక్ తదితర అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని సాయి గార్డెన్లో పోటీలు ఉంటాయని.. యువజనోత్సవాల్లో పాల్గొనే వారు 15 నుంచి 29 ఏళ్ల వయసు కలిగి ఉండాలని సూచించారు. పూర్తి వివరాలకు 90591 74909, 83416 61832 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. -
క్రీడారంగానికి అధిక ప్రాధాన్యం
● రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి ● ప్రారంభమైన జోనల్‌స్థాయి క్రీడాపోటీలు గోపాల్పేట: క్రీడలతో మానసికోల్లాసం పెంపొందడమేగాక ఏకాగ్రత పెరుగుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బుద్దారం గురుకుల పాఠశాలలో 11వ జోనల్‌స్థాయి క్రీడా పోటీలను కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి జాతీయ పతాక ఆవిష్కరణ, క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వనపర్తి వనాలపర్తి కాదని, క్రీడాపర్తిగా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ప్రస్తుత ఆధునిక కాలంలో బాలికలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని.. చదువుతో పాటు క్రీడల్లోనూ అత్యంత ప్రతిభ కనబర్చి ఉన్నతస్థాయికి చేరుకోవాలని సూచించారు. ఇటీవల మహిళా క్రికెటర్లు వరల్డ్‌కప్ సాధించారని గుర్తుచేసి.. అంతటి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా క్రీడలపై ఆసక్తి ఉన్నవారని, ఆయనకు ఫుట్‌బాల్‌పై పట్టుందని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. క్రీడాకారులు ఓటమిని పాఠంగా తీసుకొని మళ్లీ సాధన చేసి విజయాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం వెల్దండ – తెల్కపల్లి జట్ల కబడ్డీ పోటీని ప్రారంభించారు. పోటీల్లో వనపర్తి జిల్లా నుంచి గోపాల్పేట, పెద్దమందడి, కొత్తకోట.. నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి కొల్లాపూర్, తెల్కపల్లి, వెల్దండ, మన్ననూరు పాఠశాలల క్రీడాకారులు 680 మంది పాల్గొన్నారు. అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల్లో కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్యారమ్స్, చెస్, టెన్నికాయిట్, అథ్లెటిక్స్ తదితర పది విభాగాల్లో క్రీడా పోటీలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆయా క్రీడల్లో ప్రతిభ కనబర్చిన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ మాజీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, అచ్చుతరామారావు పాల్గొన్నారు. -
రాజీ మార్గంతో సత్వర న్యాయం
నాగర్‌కర్నూల్ క్రైం: రాజీ మార్గంతో సత్వర న్యాయం లభిస్తుందని.. ఈ నెల 15న జిల్లాలోని న్యాయస్థానాల్లో నిర్వహించే ప్రత్యేక లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా సూచించారు. గురువారం జిల్లా కోర్టులో ప్రత్యేక లోక్‌అదాలత్ నిర్వహణపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులు, చెక్‌బౌన్స్, కుటుంబ తగాదాలు, రోడ్డు ప్రమాదాలు, భూ వివాదాలు, బ్యాంకు కేసులు తదితర వాటిని లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఈ నెల 15న నిర్వహించే ప్రత్యేక లోక్‌అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ అయ్యే విధంగా కృషి చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. రాజీ మార్గం ద్వారా ఽశాంతియుత వాతావరణంలో కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోవాలని.. తద్వారా అప్పీలు లేని తీర్పును పొంది సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చని తెలిపారు. సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి శ్రుతిదూత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్‌జడ్జి ఎన్.శ్రీనిధి, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ అశోక్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
విద్యుత్ సమస్యల పరిష్కారానికే ప్రజాబాట
వెల్దండ: గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకే ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ వెంకటనర్సింహారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కాలనీల్లో ఆయన పర్యటించి.. విద్యుత్ వినియోగదారుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యలను పూర్తిగా పరిష్కరించి, నాణ్యమైన కరెంటు సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఎక్కడా లో ఓల్టేజీ సమస్య లేకుండా చూస్తామన్నారు. అనంతరం విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా పాటించాల్సిన జాగ్రత్తలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్ఏఓ పార్థసారధి, లైన్మన్లు లక్ష్మణ్‌నాయక్, లస్కర్, సింగల్‌విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్యగౌడ్, మదన్, భరత్, రవి, ముత్యాలు, లక్ష్మయ్య, శ్రీశైలం, సమీర్ పాల్గొన్నారు. -
వేరుశనగ విత్తనాల కోసం రోడ్డెక్కిన రైతులు
పాన్‌గల్: రాయితీ వేరుశనగ విత్తనాలు పంపిణీ చే యాలంటూ గురువారం పాన్‌గల్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. వీరికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సుబ్బయ్యయాదవ్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్యానాయక్ మద్దతు తెలిపి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వంద శాతం రాయితీపై అందిస్తున్న వేరుశనగ విత్తనాలు చాలా గ్రామాల రైతులకు అందలేదన్నారు. అధికారులు కొందరు నాయకులకే పెద్ద మొత్తంలో అందించి. అర్హులైన రైతులను విస్మరించారని ఆరోపించారు. విత్తనాల పంపిణీపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు రాస్తారోకో విరమించేది లేదని బైఠాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఏఓ మణిచందర్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ఇప్పటి వరకు మండలానికి వచ్చిన వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశామని.. ఇంకా విత్తనాలు అందని రైతుల విషయాన్ని జిల్లా అధికారులకు నివేదిస్తామని, మంజూరైతే పంపిణీ చేస్తామని చెప్పడంతో ధర్నాను విరమించారు. -
ఆశలకు గండి..
తరచుగా కోతకు గురవుతున్న కేఎల్ఐ కాల్వలు సాక్షి, నాగర్‌కర్నూల్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన సాగునీటి కాల్వల నిర్వహణ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 20 ఏళ్ల క్రితం కాల్వల నిర్మాణం చేపట్టగా.. ఇప్పటివరకు కాంక్రీట్ లైనింగ్‌కు నోచుకోలేదు. ఫలితంగా నీటి ప్రవాహానికి తరచుగా కాల్వలు తెగుతున్నాయి. దీంతో సమీపంలోని రైతుల పంటపొలాలను వరద ముంచెత్తి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కాల్వలు చెంతనే ఉన్నాయన్న ఆశతో పంటలు వేసుకుంటున్న రైతులకు కన్నీరే మిగులుతోంది. పంటలు చేతికొచ్చే సమయంలో కాల్వలకు గండ్లు పడి పంటంతా నీటిపాలవుతోంది. ఏటా ఇదే తంతు కొనసాగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, కల్వకుర్తి, వెల్దండ, పాన్‌గల్ మండలాల్లో తరచుగా కాల్వలు తెగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అడుగడుగునా గండ్లతో నష్టం.. కేఎల్ఐ కాల్వకు ఒకే చోట ఆరుసార్లు గండి పడినా అధికారులు మాత్రం తాత్కాలిక చర్యలకే పరిమితమవుతున్నారు. ఇందుకోసం రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. అయితే నానాటికీ బలహీనమైన కాల్వ కట్టలకు తరచుగా గండ్లు పడి రైతులు నష్టపోవాల్సి వస్తోంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి మండలం తోటపల్లి, వెంకటాపూర్, తిమ్మరాసిపల్లి, నెల్లికట్ట, వెల్దండ సమీపంలోని కేఎల్ఐ కాల్వ అధ్వానంగా తయారైంది. వనపర్తి జిల్లాలోని పాన్‌గల్, రేవల్లి మండలాల్లోని కేఎల్ఐ కాల్వలతో పాటు బీమా కాల్వకు పలు చోట్ల గండి పడటంతో రైతులు పెద్దసంఖ్యలో నష్టపోతున్నారు. పాన్‌గల్ మండలంలోని దావాజీపల్లి, బండపల్లి, శాగాపూర్, జమ్మాపూర్, మందాపూర్, బుసిరెడ్డిపల్లి గ్రామాల సమీపంలో కాల్వ తెగి రైతుల పొలాలు తరచుగా నీటమునుగుతున్నాయి. నిధులు లేక నిర్వహణ గాలికి.. కేఎల్ఐ కాల్వల నిర్మాణం 2005లో చేపట్టగా.. అప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం మరమ్మతులు, నిర్వహణకు నోచుకోవడం లేదు. సుమారు పదేళ్లుగా కాల్వలను అధికారులు గాలికి వదిలేశారు. ప్రతిసారి వేసవిలో కాల్వలకు మరమ్మతు చేపట్టి.. కాల్వ కట్టలను పటిష్టం చేయాల్సి ఉండగా, గడిచిన పదేళ్లలో ఒక్కసారి కూడా మరమ్మతులు చేపట్టలేదు. కేఎల్ఐ కింద కేవలం చెరువులు, కుంటలు నింపడం.. ఉన్న కొద్దిపాటి కాల్వలకు సాగునీరందించేందుకే అధికారులు పరిమితమవుతున్నారు. పంపుహౌస్‌ల్లో మోటార్లకు సైతం మరమ్మతు చేయకపోవడంతో.. సరైన స్థాయిలో పంపింగ్ చేపట్టక చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదు. భారీ వర్షాలకు ఉధృతంగా నీటి ప్రవాహం ఏటా ఏదో ఒక చోట తెగుతున్న కాల్వలు సమీపంలోని పంటలు దెబ్బతిని రైతులకు భారీ నష్టం పదేళ్లుగా ఇదే తీరు.. నిర్వహణ పట్టని అధికారులు -
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త
బిజినేపల్లి: సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు. గురువారం మండలంలోని వెలగొండలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 60మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 47 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 4 కార్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు, గంజాయికి యువత దూరంగా ఉండాలన్నారు. ఎవరైనా డ్రగ్స్, గంజాయి వినియోగించినా, రవాణా చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చోరీల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ అశోక్‌రెడ్డి, ఎస్ఐ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రతి గింజనూ కొంటాం’
అచ్చంపేట రూరల్: రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. గురువారం అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తోందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పిస్తామన్నారు. అనంతరం లింగాల రోడ్డులో సీసీ పనులను ప్రారంభించారు. ● నల్లమలలోని పేదల ఆరోగ్యం కాపాడటానికే ప్రత్యేక హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. సీబీఎం ట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో మల్టీ స్పెషాలిటీ మెగా హెల్త్ క్యాంప్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అచ్చంపేట ఏరియా ఆస్పత్రిలో తాను స్వయంగా నిర్వహించిన సర్జికల్ క్యాంపులో 1,467 మందికి ఆపరేషన్లు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న క్యాంపులో ఇప్పటికే 1,500 మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నారని.. వారందికీ ప్రత్యేక వైద్య నిపుణులు పరీక్షిస్తారన్నారు. క్యాంపులో పాల్గొనే ప్రతి ఒక్కరికీ భోజన వసతి కల్పించామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అంతటి రజిత మల్లేశ్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, పీఏసీఎస్ చైర్మన్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వ్యాక్సిన్ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో వ్యాధినిరోధక టీకాల సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఇన్చార్జి డీఎంహెచ్ఓ డా.రవికుమార్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో వ్యాక్సిన్ స్టోర్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ నిల్వలు, శీతల గొలుసు నిర్వహణ, స్టాక్ రిజిస్టర్లు, ఇండెంట్లను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు సమయానుసారం వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలని, వ్యాక్సిన్ మేనేజ్మెంట్లో ఎలాంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా కొనసాగాలని సిబ్బందికి సూచించారు. వ్యాక్సిన్ భద్రత, నిల్వ విధానం, సరైన ఉష్ణోగ్రత నిర్వహణపై అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చిన్నారులు, గర్భిణుల వ్యాక్సినేషన్ శాతాన్ని పెంపొందించేందుకు వైద్యసిబ్బంది కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో చైల్డ్ హెల్త్ ఇమ్యునైజేషన్ టీం పీటర్, డేవిడ్, బద్రి, శ్రీనాథ్, డీపీఓ రేణయ్య, జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్, దివ్య, సాయి పాల్గొన్నారు. -
ప్రజలకు అందుబాటులో ఉండాలి
నాగర్‌కర్నూల్ రూరల్: ప్రజలకు అందుబాటులో ఉండి నాణ్యమైన సేవలు అందించాలని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డితో కలిసి పుర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాలకు పట్టణంలో వర్షపు నీరు ఏయే కాలనీల్లో నిలిచిందో గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టాలని, త్వరితగతిన సేవలు అందించేందుకు నిమగ్నం కావాలని సూచించారు. అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. పుర ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సగరుల సమస్యల పరిష్కారానికి కృషి.. సగరుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి అన్నారు. మండలంలోని తూడుకుర్తిలో నిర్మించిన సగరుల కమ్యూనిటీ హాల్‌ను ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణరంగ కార్మికులుగా జీవనం సాగిస్తున్న సగరుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. సగరులు రాజకీయంగా ఎదగడానికి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. రాజకీయంగా ఎదగాలంటే సగరులను బీసీ–డి నుండి ఏ కేటగిరికి మార్చాలని పలువురు సగరులు కోరారు. కార్యక్రమంలో నాయకులు తిరుపతయ్య, శ్రీనివాసులు, ముత్యాలు, హరికృష్ణ, గౌరక్క, సత్యం, ఆంజనేయులు ఎంపీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ నిర్మల, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చేపలు పెరగడం లేదు..
చేపల వృత్తినే నమ్ముకు ని బతుకుతున్న మాకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయడం సంతోషదాయకం. కానీ, జూన్‌లో వదలాల్సిన చేపపిల్లలను అక్టోబర్, నవంబర్‌లో వేస్తున్నారు. దీంతో సీజ న్ ప్రకారం తదుపరి వచ్చే మే నెల వరకు చేప లు అంతగా పెరగడం లేదు. ప్రతిసారి ఇలాగే చేస్తుండటంతో మేలు జరగకపోవడంతోపాటు సర్కారు లక్ష్యం నెరవేరడం లేదు. వర్షాకాలం ప్రారంభంలోనే చేపపిల్లలు చెరువుల్లో వదలితే నే ప్రయోజనం ఉంటుంది. – ఇప్పలి జనార్దన్, మత్స్యకారుడు, కొనగట్టుపల్లి, హన్వాడ మండలం, మహబూబ్‌నగర్ -
శాంతిభద్రతల పరిరక్షణకే కార్డెన్‌సెర్చ్
అచ్చంపేట రూరల్: శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత కోసమే కార్డెన్‌సెర్చ్ నిర్వహిస్తున్నామని డీఎస్పీ పల్లె శ్రీనివాసులు అన్నారు. బుధవారం పట్టణంలోని శివసాయినగర్కాలనీలో కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఎస్పీ ఆదేశాల మేరకు కార్డెన్ సెర్చ్ నిర్వహించామని, 58 వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు కనీస జాగ్రత్తలు పాటించాలన్నారు. సైబర్ మోసాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని.. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణ అందరి బాధ్యతని తెలిపారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, ప్రతి వాహనానికి నంబర్ ప్లేట్ ఉండేలా చూసుకోవాలని సూచించారు. రహదారి నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో సీఐ నాగరాజు, ఎస్ఐలు సద్దాం హుస్సేన్, వెంకట్‌రెడ్డి ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
కార్తీక దీపం.. నయనానందం
సోమశిల సోమేశ్వరాలయంలో కోటి దీపారాదనలో పాల్గొన్న భక్తులు శివ పార్వతులకు పరమ పవిత్రమైన కార్తీకమాసంలో ప్రతి ఇంటా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. బుధవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శివాలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించగా.. రాత్రి కార్తీక దీపాలు వెలిగించి ఆరాధించారు. జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు పాతాళగంగ వద్ద కార్తీక స్నానాలు ఆచరించి మల్లికార్జునస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. ఉమామహేశ్వర ఆలయంలో ఉదయం నుంచే భక్తుల రద్దీ కనిపించింది. ఆలయం ఎదుట ధ్వజస్తంభం వద్ద మహిళళలు మట్టి ప్రమిదలు, ఉసిరి కాయలతో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ● కొల్లాపూర్ మండలంలోని సోమశిలలో భక్తుల రద్దీ కనిపించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కృష్ణానదిలో స్నానాలు ఆచరించి దీపాలు వదిలారు. అలాగే ప్రధాన ఆలయాను దర్శించుకొని ఆవరణలో దీపాలు వెలిగించారు. శ్రీ లలితాంబిక సోమేశ్వరాలయంలో కొల్లాపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కోటి దీపారాదన కార్యక్రమం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం సభ్యులతో పాటు వివిధ ప్రాంతాల మహిళ భక్తులు పెద్దఎత్తున పాల్గొని దీపాలు వెలిగించారు. అలాగే జిల్లాలోని పలు ఆలయాల్లో సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించగా భక్తులు భారీగా పాల్గొన్నారు. – సాక్షి నెట్వర్క్ -
ఇంటర్ కళాశాలల్లో తనిఖీలు
నాగర్‌కర్నూల్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలను తీర్చిదిద్ది ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సంబంధిత అధికారులు కళాశాలలను తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటరమణ ఈ నెల 15 వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలను తనిఖీ చేయనున్నారు. ఆయా కళాశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలు, వార్షిక పరీక్షలు దగ్గరపడుతుండటంతో విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్ధమవుతున్నారనే వివరాలను విద్యార్థులతో మాట్లాడి తెలుసుకుంటున్నారు. తనిఖీ పూర్తయిన వెంటనే సదరు నివేదికను ఇంటర్ బోర్డులకు అందజేస్తున్నారు. హాజరు, సిలబస్‌పై ప్రత్యేక దృష్టి.. తనిఖీల్లో ప్రధానంగా విద్యార్థుల వివరాల నమోదు సరిగా ఉందా, విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయా, విద్యార్థుల హాజరు, సిలబస్ ఎంత వరకు పూర్తయింది అనే అంశాలను పరిశీలిస్తున్నారు. వార్షిక పరీక్షల సమయం సమీపిస్తున్నందున ప్రణాళిక రూపొందించి సిలబస్ పూర్తి చేస్తున్నారా అనే అంశాలతో పాటు పరీక్ష కేంద్రాలుగా ఉన్న కళాశాలల్లో సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా అనే వివరాలు చూస్తున్నారు. దీంతో పరీక్ష సమయం వరకు విద్యార్థులకు అవసరమైన ప్రణాళికలను రూపొందించి ఉత్తమ ఫలితాలు సాధించేలా సన్నద్ధం చేసే అవకాశం ఉంటుంది. ప్రత్యేక ట్యాబ్‌లో.. జిల్లాలో ప్రైవేటు, ప్రభుత్వ, కేజీవీబీ, బీసీ సంక్షేమ కళాశాలలు అన్నీ కలిపి 87 ఉన్నాయి. ఈ నెల 15 వరకు అన్ని కళాశాలల తనిఖీ పూర్తి చేయనున్నారు. సంబంధించి అధికారులు రోజువారీ తనిఖీల నివేదికను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లో కళాశాల వద్దే నమోదు చేసి ఇంటర్ బోర్డుకు పంపిస్తున్నారు. పరిశీలన సమయంలో విద్యార్థులతో మాట్లాడి ఏమైనా సమస్యలుంటే వాటిని సైతం తెలుసుకొని నివేదికల రూపంలో పంపనున్నారు. ఇటీవల ప్రభుత్వ కళాశాలలకు నిధులు మంజూరు కావడంతో వాటిని ఎలా ఖర్చు చేశారు, ఎలాంటి సౌకర్యాల కోసం వినియోగించారు అనే విషయాలను సైతం ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. నిధులను సరైన రీతిలో ఖర్చు చేశారా లేదా అనే విషయాలను సైతం విచారణ చేయనున్నారు. ఉత్తమ ఫలితాల సాధనకే.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూనియర్ కళాశాలలను తనిఖీ చేస్తున్నాం. తనిఖీల సమయంలో పరిశీలించిన అంశాలను ఆన్లైన్లో ఇంటర్‌బోర్డు అధికారులకు నివేదిస్తున్నాం. విద్యార్థుల హాజరు, సిలబస్ ఎంత వరకు పూర్తయిందనే విషయాలను పరిశీలిస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. – వెంకటరమణ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ప్రభుత్వ, ప్రైవేట్లలో ఈ నెల 15 వరకు కొనసాగింపు విద్యార్థుల హాజరు, సిలబస్ పూర్తిపై ప్రత్యేక దృష్టి బోర్డుకు ఎప్పటికప్పుడు తనిఖీల నివేదిక జిల్లాలో 87 జూనియర్ కాలేజీలు -
చెరువుకు చేరినా.. చేప ఎదిగేనా..?!
లక్ష్యం.. ‘నీళ్ల’పాలు గతేడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 8.81 కోట్ల చేప పిల్లలను చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో వదలాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఒక్క జోగుళాంబ గద్వాల జిల్లాలోనే పూర్తిస్థాయిలో లక్ష్యం చేరుకోగా.. మిగతా నాలుగు జిల్లాల్లో సగం కూడా చేరుకోలేకపోయారు. మొత్తంగా 4,56,68,000 చేపపిల్లలను మాత్రమే నీటిలో వదలగా.. అది కూడా అదును దాటిన తర్వాత అక్టోబర్ చివరలో మొదలుపెట్టి నవంబర్ చివరలో పూర్తి చేశారు. పలు జిల్లాల్లో అదును దాటిన నేపథ్యంలో 35–40 ఎంఎం సైజు చేపలు వేయలేదు. 80–100 ఎంఎం సైజు గల చేప పిల్లలనే వదిలినా సరిగా ఎదగలేదని మత్స్యకారులు పేర్కొంటున్నారు. ఇందుకు అదును దాటిన తర్వాత చేప పిల్లలు వదలడమే కారణమని చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మత్స్యకారుల ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వందశాతం సబ్సిడీతో చేపపిల్లలను పంపిణీ చేస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి సుమారు మూడు నెలల క్రితమే ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా.. వివిధ రకాల కారణాలతో జాప్యం చోటుచేసుకుంది. ఎట్టకేలకు గత నెల 17న పంపిణీకి శ్రీకారం చుట్టినప్పటికీ.. నిర్దేశిత లక్ష్యం చేరుకోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు అదునుదాటిన తర్వాత చేప విత్తనాలు సరఫరా చేయడం.. నిర్దేశిత లక్ష్యంలో కోత పెట్టి తూతూమంత్రంగా ముగించడం ప్రతిఏటా ఆనవాయితీగా వస్తోంది. ఇది చాలదన్నట్లు కాంట్రాక్టర్లు మేలు రకాలకు తిలోదకాలు ఇస్తుండడంతో సర్కారు లక్ష్యం నెరవేరడం లేదు. అదును దాటిన తర్వాతే చేప పిల్లల పంపిణీ చివరికి నిర్దేశిత టార్గెట్లోనూ సగం మేర కుదింపు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రతిఏటా ఇదే తంతు కాంట్రాక్టర్ల చేతిలోనే మత్స్యకారుల భవిష్యత్ ‘అధికార’ యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారిస్తేనే ఫలితం -
ఆరోగ్య రక్షణలోవ్యాక్సినేషన్ కీలకం
తిమ్మాజిపేట/బిజినేపల్లి: ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషిస్తుందని.. అందుకు తగ్గట్లుగా వైద్యసిబ్బంది కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి డా. రవికుమార్ నాయక్ సూచించారు. బుధవారం తిమ్మాజీపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బిజినేపల్లి, పాలెం పీహెచ్‌సీలు, వట్టెం సబ్ సెంటర్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఓపీ రికార్డులు, సిబ్బంది హాజరు పట్టిక, వ్యాక్సిన్ లాగిన్ బుక్స్ తదితర వాటిని పరిశీలించారు. ఆయా ఆస్పత్రుల్లోని వైద్యసిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎన్సీడీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న వైద్యసేవలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. వేసిన ప్రతి టీకా వివరాలను సక్రమంగా నమోదు చేయడం అత్యవసరమన్నారు. ఆయన వెంట సీహెచ్ఓ శ్రీనివాసులు, వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్, ఫార్మసీ అధికారి బాలరాజు, వైద్య సిబ్బంది ఉన్నారు. అదనపు కలెక్టర్ ప్రత్యేక పూజలు వెల్దండ: దక్షిణ కాశీగా పేరొందిన మండలంలోని గుండాలలో బుధవారం అడిషనల్ కలెక్టర్ అమరేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం పౌర్ణమి కావడంతో శైవ క్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజల అనంతరం వేదాశీర్వచనం చేశారు. ఆయన వెంట తహసీల్దార్ కార్తీక్ కుమార్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. 17న ‘చలో ఢిల్లీ’ మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ నెల 17న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టామని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్ అన్నారు. ఈ మేరకు బుధవారం పీయూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, సంక్షేమ హాస్టళ్లను సంబంధించి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతిఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కమలాకర్, నాయకులు సుధాకర్, నాగేంద్రకుమార్, రమేష్, పండు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘గుడ్‌విల్’తో గాలం
● వైన్స్‌లను దక్కించుకునేందుకు రంగంలోకి లిక్కర్ వ్యాపారులు ● రూ.లక్షల్లో మొదలైన బేరసారాలు అచ్చంపేట: మద్యం దుకాణాల కేటాయింపు పూర్తికావడంతో.. వాప్యారుల బేరసారాలు మొదలయ్యాయి. నజరానా ఇస్తాం.. దుకాణం ఇస్తారా.. అంటూ లక్కీడ్రాలో మద్యం దుకాణం దక్కిన వారిని వ్యాపారులు ప్రలోభపెడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో డిమాండ్‌ను బట్టి నజరానా ఇచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు. అయితే లక్కీ డ్రాలో దుకాణం దక్కించుకున్న వారంతా మగళవారం ఆయా దుకాణాలకు రెంటల్ రేటు ఆధారంగా 1/6వ వంతు డబ్బులు చెల్లించారు. దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. టెండర్ల ప్రక్రియ ముగియడంతో డిసెంబరు 1 నుంచి మద్యం దుకాణాలు తెరిచేందుకు వ్యాపారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో సిండికేట్ వ్యాపారులకు దక్కని మద్యం దుకాణాలపై కన్నేశారు. పట్టణాలతోపాటు మండల కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న దుకాణాలను తమ గుప్పిట్లో ఉంచుకోవాలని బడా, పాత లిక్కర్ వ్యాపారుల యోచిస్తున్నారు. గుడ్‌విల్ ద్వారా ఆ దుకాణాలను చేజిక్కించుకుని మద్యం వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. సిండికేట్ కోసం.. మద్యం దుకాణాలకు టెండర్లు ముగిశాయి. లక్కీడ్రాలో జిల్లాలోని 67 దుకాణాల ఎంపిక పూర్తయింది. ఇప్పుడు ఉన్న అన్ని దుకాణాల యజమానులు ఒక్కటైతేనే సిండికేట్‌గా మార్గం సులువవుతుంది. తద్వారా చీఫ్ లిక్కర్ విక్రయాలు, బెల్టుషాపులకు అధిక ధరలకు విక్రయించుకునే అవకాశాలను జోరుగా నడిపేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ వ్యాపారంలో తలపండిన వారికి సిండికేట్, బెల్టు షాపులకు లిక్కర్ సరఫరా వంటివి సులువుగా చేసేస్తారు. తమకు దక్కిన దుకాణాలతోపాటు ఇతర వాటిని పొందడం ద్వారా లిక్కర్ వ్యాపారాన్ని తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు మంతనాలు జరుపుతున్నారు. నిబంధనల ప్రకారం ఉంటేనే.. ప్రస్తుత మద్యం పాలసీ నవంబర్ 30న ముగియనుండగా 2025–27కు సంబంధించి కొత్త మద్యం దుకాణాలు డిసెంబర్ 1 నుంచి ప్రారంభవుతాయి. అయితే మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు ఎక్కడ దుకాణం ఏర్పాటు చేస్తారు.. ఏ పేరిట దుకాణం పెడతారు.. తదితర వివరాలను ఎకై ్సజ్ శాఖ అధికారులకు సమర్పించాలి. దుకాణం గుడి, బడి, ఆస్పత్రికి 100 మీటర్ల దూరంలో ఉందా.. లేదా.. నిబంధనల ప్రకారం ఏర్పాటు చేస్తున్నారా.. అనే విషయాలను అధికారులు పరిశీలించిన తర్వాత అన్నీ సవ్యంగా ఉంటేనే మద్యం దుకాణం ఏర్పాటుకు లైసెన్స్ జారీ చేస్తారు. -
ఉపాధ్యాయుల్లో ‘టెట్’ టెన్షన్
అచ్చంపేట: ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాలకు టీచర్స్ ఎలిజెబిలిటీ టెస్ట్ (టెట్) అర్హత తప్పనిసరి. ఈ తీర్పు ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తుందా అనే సందేహాలు జిల్లావ్యాప్తంగా ఆందోళనలకు కారణమవుతున్నాయి. అంగవైకల్యంతోపాటు ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు బోధించే టీచర్లూ టెట్ రాయాల్సిందేనని హైకోర్టు అక్టోబరు 31న తేల్చి చెప్పింది. గతేడాది ఫిబ్రవరి 28న రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన జీఓ 4ను సవాల్ చేస్తూ స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ విభాగంలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలవగా.. న్యాయమూర్తులు పైవిధంగా తీర్పు వెల్లడించారు. గతంలో టెట్ అర్హత లేకుండా నియమితులైన ఉపాధ్యాయులకు తప్పనిసరి చేస్తూ తాజాగా సుప్రీంకోర్టు సైతం తీర్పు ఇచ్చింది. కనీసం ఐదేళ్ల సర్వీసు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొనసాగడానికి, పదోన్నతులకు టెట్ అర్హత తప్పనిసరి అని స్పష్టం చేసింది. కనీసం ఐదేళ్ల సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత సాధించాలని, లేనిపక్షంలో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది. అయితే పదవీ విరమణకు ఐదేళ్లలోపు సమయం ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చినప్పటికీ వారు పదోన్నతుల అర్హత కోసం టెట్ పాస్ కావాల్సి ఉంటుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ఆర్టీఈ–2010 నిబంధనల ప్రకారం టెట్ తప్పనిసరి చేయగా.. ఉమ్మడి రాష్ట్రంలో 2012 డీఎస్పీ పరీక్షల్లోనూ ఈ నిబంధన అమలైంది. ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లు.. ప్రస్తుత ఉపాధ్యాయుల సేవలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాలు రూపొందించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. టెట్ అర్హతపై సడలింపు లేదా ప్రత్యామ్నాయ పరిష్కారాలు అవసరమని డిమాండ్ చేస్తున్నారు. సర్వీస్ టీచర్ల ఆందోళన ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసిన వారితోనే టెట్ రాసేందుకు సర్వీస్‌లో ఉన్న టీచర్లు ససేమిరా అంటున్నారు. సర్వీసు టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో టెట్ సమగ్ర నోటిఫికేషన్ విడుదలకు జాప్యం జరుగుతోంది. సర్వీస్ టీచర్లు టెట్ రాసేందుకు అవసరమైన మార్గదర్శకాలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ ప్రక్రియ పై విద్యాశాఖ ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రత్యేక టెట్ పెట్టకపోతే ఎప్పుడో బీఎడ్, టీటీసీ చేసిన వారు ఇప్పుడు టెట్ రాస్తే పాసయ్యే అవకాశం తక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్పెషల్ టీచర్లకు తప్పనిసరి అనితేల్చి చెప్పిన హైకోర్టు అర్హత ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు పదోన్నతులకు అదే వర్తింపు సీనియర్లలో ఒత్తిడి.. స్వాగతిస్తున్న యువతరం -
అక్రమ నిర్మాణాలపై చర్యలేవి?
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాను భారీ వర్షం మరోసారి ముంచేసింది. మంగళవారం జిల్లాకేంద్రంలో మధ్యాహ్నం కుండపోత వాన కురిసింది. తెలకపల్లి మండలంలో అత్యధికంగా 69.3 మి.మీ., వర్షపాతం నమోదు కాగా, నాగర్‌కర్నూల్‌లో 57.3 మి.మీ వర్షం కురిసింది. కేవలం రెండు గంటల వ్యవధిలో 50 మి.మీ., మించి వర్షం దంచికొట్టడంతో జిల్లాకేంద్రం జలమయమైంది. జిల్లాకేంద్రంలోని ప్రధాన రహదారితోపాటు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరద నీరంతా ప్రధాన రహదారిపైకి చేరడంతో వాహనాలు నీటిలో మునిగిపోయాయి. సుమారు రెండున్నర గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారిపై బీఎస్ఎన్ఎల్ కార్యాలయం నుంచి ఉయ్యాలవాడ వరకు ఇరువైపులా బస్సులు, వాహనాలు నిలిచిపోయాయి. వరద ప్రవాహంలో.. జిల్లాకేంద్రంలో కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. ప్రధాన రహదారి పొడవునా నీటితో నిండిపోగా సాయంత్రం వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బీఎస్ఎన్ఎల్ కార్యాలయం, ఓంనగర్ కాలనీ, ఈశ్వర్‌కాలనీ, హౌసింగ్‌బోర్డు, బస్టాండ్, అంబేడ్కర్ చౌరస్తా, నల్లవెల్లి రోడ్ ప్రాంతాలు వరద ప్రవాహంలో చిక్కుకున్నాయి. ప్రధాన రహదారిపై నాలాలు ఉప్పొంగి ప్రవహించడంతో బైక్‌లు, ఆటోలు, కార్లు నీటిలో మునిగిపోయాయి. సుమారు 2 కి.మీ., దూరం వరకు ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం వరకు నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. జిల్లాకేంద్రంలోని రాంనగర్‌కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద వరదలో ఇబ్బందులు పడుతున్న ప్రజలు, వాహనదారులు నాలాలపైనే నిర్మాణాలు.. జిల్లాకేంద్రం నలుమూలల నుంచి వరద ప్రవాహం వెళ్లేందుకు ఉన్న నాలాలు నీటిని కేసరి సముద్రం చెరువు వైపు తీసుకెళ్తాయి. కీలకమైన ఈ నాలాలు అక్రమ నిర్మాణాలతో ఇప్పటికే కుంచించుకుపోయాయి. ఓంనగర్కాలనీ, 9 జంక్షన్, బీఎస్ఎన్ఎల్ కార్యాలయం, ఈశ్వర్‌కాలనీ సమీపంలో ఉన్న నాలాలపై ఎక్కడబడితే అక్కడ భవన నిర్మాణాలతోపాటు షాపులు వెలిశాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహానికి ఈ నిర్మాణాలు అడ్డుగా ఉండటంతో నాలాల నుంచి నీటి ప్రవాహం ఉప్పొంగి రోడ్డుపైకి చేరుతోంది. చినుకు పడితే చాలు ఈ ప్రాంతమంతా నీరు చేరి ప్రధాన రహదారి తరచుగా జలమయంగా మారుతోంది. మంగళవారం నాటి కుండపోత వర్షానికి వరద ప్రవాహం పెరిగి, నాలాల ద్వారా బయటకు వెళ్లే మార్గం లేక ప్రధాన రహదారి చెరువును తలపించగా.. వాహనాలు అందులో మునిగిపోయాయి. జిల్లాకేంద్రంలో ఎక్కడబడితే అక్కడ అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ప్రధాన రహదారి, నాలాలు, డ్రెయినేజీ, వాననీటి మార్గాలు తేడా లేకుండా మట్టితో నింపి నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో వర్షం పడినప్పుడు నీరు బయటకు వెళ్లే దారి లేక రోడ్డుపైనే చేరుతోంది. జిల్లాకేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మించినా అందులోని నీటిని బయటకు తరలించేందుకు పంపింగ్ స్టేషన్ నిర్మాణం, అక్కడి వరకు పైప్‌లైన్ ఏర్పాటు చేయలేదు. దీంతో డ్రెయినేజీల్లో నీరు నిండగానే మురుగు రోడ్లపైనే చేరుతోంది. నాలాలపై ఉన్న నిర్మాణాలను తొలగించి వరద నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని పట్టణవాసులు కోరుతున్నారు. -
11 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ
పాలమూరు/ కల్వకుర్తి రూరల్: ఉమ్మడి జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ల బృందం మంగళవారం కల్వకుర్తి డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో మెడికల్ దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. డిప్యూటీ డైరెక్టర్ అంజుమన్ అబీద ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా ఔషధ నియంత్రణ శాఖ ఏడీ దినేష్‌కుమార్ ఆధ్వర్యంలో కల్వకుర్తి, ఊర్కొండ, చారకొండ, వంగూరు, వెల్దండ మండల కేంద్రాల్లోని 11 మెడికల్ దుకాణాల్లో తనిఖీలు చేసి నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. లైసెన్స్ నిబంధనలు, ఔషధాల నిల్వ, విక్రయాల విషయంలో నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీ హెచ్చరించారు. తనిఖీల్లో నాగర్‌కర్నూల్ డ్రగ్ఇన్స్పెక్టర్ విశ్వంత్‌రెడ్డి, ఇతర జిల్లాల డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు రఫీ, అన్వేష్, శ్వేత బిందు, వినయ్ తదితరులు పాల్గొన్నారు. అన్నవరం యాత్రకు ఆర్టీసీ బస్సు కొల్లాపూర్: అన్నవరం, పంచారామాల యాత్రకు శుక్రవారం కొల్లాపూర్ నుంచి సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ఉమాశంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం రాత్రి 6 గంటలకు బస్సు కొల్లాపూర్ బస్టాండ్ నుంచి బయలుదేరి శనివారం అన్నవరం చేరుకుంటుందన్నారు. సత్యనారాయణస్వామి దర్శనం అనంతరం సామర్లకోట ద్రాక్షారామం దర్శనం చేసుకొని రాత్రికి పాలకొల్లులో బస ఏర్పాటు చేస్తామన్నారు. ఆదివారం పాలకొల్లు, భీమవరం, అమరావతి, మంగళగిరి దర్శనం అనంతరం విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం ఉంటుందన్నారు. సోమవారం కొల్లాపూర్‌కు బస్సు తిరిగి చేరుకుంటుందని తెలిపారు. ఈ యాత్రకు ఒక్కొక్కరికీ టికెట్ ధర రూ.3,200గా నిర్ణయించామన్నారు. యాత్రకు వచ్చేవారు సెల్ నం.90100 39788, 94407 21154, 83090 29951లను సంప్రదించాలని సూచించారు. జీవాలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా నాగర్‌కర్నూల్: జీవాల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం చేపట్టిన టీకా కార్యక్రమాన్ని పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని పశు వ్యాధుల నిర్ధారణ కేంద్ర అధికారి డాక్టర్ కరుణశ్రీ అన్నారు. మంగళవారం తెలకపల్లి మండలంలోని చిన్నముద్దునూర్ గ్రామంలో కొనసాగుతున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె పశువుల రక్త నామూనాలు సేకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గాలికుంటు వైరస్ ద్వారా సోకే ప్రమాదకరమైన వ్యాధి అని, దీనిని నిర్మూలించడానికి విధిగా టీకా ఇప్పించాలన్నారు. జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాధి వల్ల జీవాలు మృతిచెంది పోషకులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, ఈ వ్యాధికి నివారణకు టీకాలే మేలైన మార్గమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి వెంకటేశ్వర్లు, డాక్టర్ మధు, సిబ్బంది అస్లాం, అరుణ్‌కుమార్, సల్మా తదితరులు పాల్గొన్నారు. పులుల సంరక్షణ అందరి బాధ్యత మన్ననూర్: తెలంగాణలో ఏఐటీఈ–2026 పెద్ద పులుల అంచనా కోసం 18 నుంచి 60 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారు మంగళవారం నుంచి ఈ నెల 22 వరకు చేపట్టే పులుల గుర్తింపులో భాగస్వాములు అయ్యేందుకు పేర్లు నమోదు చేసుకోవాలని అమ్రాబాద్ ఎఫ్డీఓ రామ్మూర్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్ద పులులు, అభయారణ్యాల సంరక్షణ మన అందరి బాధ్యతగా భావించాలన్నారు. పులుల సంరక్షణ ప్రాంత మాతృ ప్రకృతితోపాటు వన్యప్రాణులను ట్రాక్ చేయడంలో అటవీ శాఖకు సహాయం చేసేందుకు కృషి చేయాలన్నారు. పులుల గణన కోసం జట్టులో చేరండి.. కొత్త నైపుణ్యాలను నేర్చుకునేందుకు ముందుకురావాలని కోరారు. -
మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడి
కొల్లాపూర్: పట్టణంలోని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంపు కార్యాలయాన్ని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ముట్టడించారు. మంగళవారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నుంచి విద్యార్థులు ర్యాలీగా మంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల ప్రధాన కార్యదర్శులు ఆది, తారాసింగ్, డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివవర్మ మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలలో జాప్యం కారణంగా పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన మాట ప్రకారం పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. అనంతరం వినతిపత్రాన్ని క్యాంపు కార్యాలయ సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో నాయకులు వీరన్ననాయక్, కార్తీక్, శివప్రసాద్ పాల్గొన్నారు. -
తుర్కలపల్లి.. జలదిగ్బంధం
●ఇంత వరద చూడలేదు.. జిల్లాకేంద్రంలో ఇప్పటి వరకు ఇంత పెద్ద వరద చూడటం ఇదే మొదటిసారి. ప్రధాన రహదారి పూర్తిగా జలమయం కావడంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. బీఎస్ఎన్ఎల్ కార్యాలయం నుంచి ఉయ్యాలవాడ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. నాలాల మీదుగా షాపులు, భవనాల నిర్మాణంతోనే ఈ పరిస్థితి వచ్చింది. – నాగన్నగౌడ్, నాగర్‌కర్నూల్ ఇబ్బందులు తొలగిస్తాం.. జిల్లాకేంద్రంలోని డ్రెయినేజీలు, నాలాల నిర్వహణ సక్రమంగా చేపడుతున్నాం. ఎక్కడైనా నీటి ప్రవాహానికి ఆటంకాలు ఉంటే వెంటనే సరిచేస్తాం. నాలాలపై కల్వర్టుల దగ్గర అడ్డుగా ఉన్నవాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. – నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్, నాగర్‌కర్నూల్ జిల్లాలో మంగళవారం నమోదైన వర్షపాతం ఇలా (మి.మీ.,) తాడూరు49.5 వెల్దండ 51.8 నాగర్‌కర్నూల్ 57.3 తెలకపల్లి 69.3 కల్వకుర్తి 40 తిమ్మాజిపేట 38.3 ఊర్కొండ 33.3 ఉప్పునుంతల 29.5 -
ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీని అరికట్టాలి
నాగర్‌కర్నూల్ రూరల్: జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్‌నర్సింహ మాట్లాడుతూ.. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే పేదలను టెస్టుల పేరుతో నిలువుదోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ప్రజలు జ్వరం, ఇతర వ్యాధులకు గురై ఆస్పత్రికి వెళ్తే ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసిబ్బంది, మందుల కొరతతో పేదలు అవస్థలు పడాల్సి వస్తోందన్నారు. మరోవైపు టెస్టులు, స్కానింగ్ కోసం ప్రైవేటు ల్యాబ్‌లకు పంపిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత తీర్చడంతో పాటు అన్ని రకాల పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఓ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్, నాయకులు కేశవులుగౌడ్, నర్సింహ, విజయుడు, ఏసయ్య, కృష్ణాజీ, శివుడు, లక్ష్మీపతి, శివశంకర్, మల్లయ్య, కిరణ్‌కుమార్, ప్రేమ్‌కుమార్, చెన్నయ్య, శివకృష్ణ పాల్గొన్నారు. -
లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలోని పలు లాడ్జీలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ధనార్జనే ధ్యేయంగా కొందరు లాడ్జీలను పేకాట క్లబ్‌లుగా, వ్యభిచార కూపాలుగా మార్చి యువతను పెడదోవ పట్టిస్తున్నారు. వారం రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న చైతన్య లాడ్జీలో 25 ఏళ్లలోపు యువకులు గంజాయితో పట్టుబడటమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. జిల్లా కేంద్రంతో పాటు అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ ప్రాంతాల్లోని లాడ్జీల్లో అక్రమ వ్యవహారాలు సర్వసాధారణంగా మారడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లాడ్జీల నిర్వాహకులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ.. గదులను అద్దెకు ఇచ్చే వారి వివరాలను కూడా నమోదు చేసుకోవడం లేదని తెలుస్తోంది. అనుమానాస్పద వ్యక్తులతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని ఆయా లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి.. కట్టడి చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మైనర్లకు సైతం గదులు.. పట్టణ కేంద్రాలతో పాటు ప్రధాన రహదారులను అనుసరించి ఉన్న లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. చాలా వరకు వ్యభిచార కూపాలుగా మార్చి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని కొన్ని లాడ్జీల్లో మైనర్లకు సైతం గదులను అద్దెకు ఇస్తున్నారని.. లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు సాధారంగా మారాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం వేళ జిల్లా కేంద్రంలోని కొన్ని లాడ్జీల ముందు నుంచి వెళ్లాలంటేనే భయాపడాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వారితో పాటు రాజకీయ పార్టీల నాయకులు ఆయా లాడ్జీలను నడిపిస్తుండటంతో.. అక్కడ జరిగే అసాంఘిక కార్యకలాపాలను చూసీ చూడనట్టు వదిలేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఓ లాడ్జీలో గంజాయితో పట్టుబడిన యువకులు గదులు అద్దెకు తీసుకునే వారి వివరాలు సైతం నమోదు చేసుకోని నిర్వాహకులు జిల్లాలోని పేకాట నిర్వాహకులు లాడ్జీలను అడ్డాలుగా మార్చుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కేంద్రంతో పాటు అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని పలు లాడ్జీల్లో పేకాట ఆడిస్తుండగా.. మరికొందరు లాడ్జీల్లోని గదులను అద్దెకు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారని తెలుస్తోంది. గతంలో పోలీసులు పలు లాడ్జీలపై దాడులు నిర్వహించి.. పేకాటరాయుళ్లపై కేసులు నమోదు చేసిన ఘటనలు ఉన్నాయి. జిల్లాలోని ఆయా లాడ్జీల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని లాడ్జీలో గంజాయి పట్టుబడిన ఘటనపై విచారణ కొనసాగుతుంది. ఎక్కడైనా లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. లాడ్జీల్లో వ్యభిచారంతో పాటు పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు లాడ్జీ నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తాం. – బుర్రి శ్రీనివాసులు, డీఎస్పీ, నాగర్‌కర్నూల్ -
విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు
కందనూలు: విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఈ నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని విద్యుత్‌శాఖ కార్యాలయంలో వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ సమస్యలపై వినియోగదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఎస్ఈ మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా విద్యుత్ సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యుత్ సిబ్బంది దృష్టికి వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. వినియోగదారుల దినోత్సవంలో వివిధ సమస్యలపై 8 దరఖాస్తులు అందాయని.. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఈ శ్రీధర్‌శెట్టి, పార్థసారధి, ఏడీఈ శ్రీనివాసులు, ఏఏఓ సూరంపల్లి సాయిబాబు పాల్గొన్నారు. ఉపకార వేతనాలు విడుదల చేయాలి కందనూలు: విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తారాసింగ్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేద విద్యార్థులకు కనీసం స్కాలర్షిప్లు అందించలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం ఆరేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను అందించకపోవడంతో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణమే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయం సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిండుకుండలా రామన్‌పాడు జలాశయం మదనాపురం: మండల పరిధిలోని రామన్‌పాడు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా మారింది. సోమవారం నాటికి సముద్రమట్టానికి పైన పూర్తిస్థాయి నీటిమట్టం1,021 అడుగులకు వచ్చి చేరింది. జూరాల ఎడమ కాల్వ ద్వారా 920 క్యూసెక్కులు, సమాంతరంగా 195 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వ ద్వారా 15 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ఏఈ వరప్రాసాద్ తెలిపారు. -
కొనుగోలు పరిమితి పెంచాలని రోడ్డెక్కిన రైతులు
కొల్లాపూర్: మొక్కజొన్న కొనుగోలు పరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. సోమవారం కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్‌యార్డు ఎదుట ఉన్న ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. కొల్లాపూర్ మండలంలోని రైతులు మొక్కజొన్న ధాన్యాన్ని విక్రయించేందుకు మార్కెట్‌యార్డుకు తీసుకొచ్చారు. నెల రోజులుగా అక్కడే ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. తీరా కొనుగోలు సమయంలో ఒక్కో ఎకరాకు కేవలం 18 క్వింటాళ్ల ధాన్యాన్ని మాత్రమే కొంటామని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ రోడ్డెక్కారు. ఎకరాకు 22 నుంచి 30 క్వింటాళ్ల వరకు ఽమొక్కజొన్న దిగుబడి వస్తుందని.. అధికారులు 18 క్వింటాళ్లు మాత్రమే కొంటామని చెప్పడం దారుణమన్నారు. కొనుగోలు పరిమితి పెంచే వరకు తాము ఆందోళన విరమించమని భీష్మించారు. సమాచారం అందుకున్న ఏఓ చిన్నహుస్సేన్ యాదవ్ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. రెండు రోజుల్లో కొనుగోలు పరిమితిని ఎత్తివేస్తామని.. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు కూడా తెలియజేశామని ఆయన వివరించారు. అయినప్పటికీ రైతులు ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళన విరమించకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. మరోసారి ఏఓ రైతులతో మాట్లాడి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.


