రూ.కోటితో వ్యవసాయ మార్కెట్‌ అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

రూ.కోటితో వ్యవసాయ మార్కెట్‌ అభివృద్ధి

Feb 17 2026 8:43 AM | Updated on Feb 17 2026 8:43 AM

రూ.కో

రూ.కోటితో వ్యవసాయ మార్కెట్‌ అభివృద్ధి

అమ్రాబాద్‌: అమ్రాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ లో అభివృద్ధి పనులు మొదలుపెట్టి త్వరలోనే కొనుగోళ్లు చేపడుతామని మార్కెటింగ్‌ శాఖ డీఈ మునీందర్‌ తెలిపారు. అచ్చంపేట వ్యవ సాయ మార్కెట్‌ వైస్‌చైర్మన్‌ వెంకటయ్యతో కలిసి సోమవారం ఆయన ఉప వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ రై తులు పండించిన పంటల అమ్మకంలో ఇబ్బందులు లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇందుకోసం రూ.కోటి వ్యయంతో మార్కెట్‌ను అభివృద్ధి పరుస్తామన్నారు. మార్కెట్‌ పరిసరాలలో పెరిగిన పిచ్చిమొక్కలు తొలగించేందుకు అధికారులను ఆదేశించామన్నారు. ముందుగా ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఫిర్యాదులు

పరిష్కరించండి

నాగర్‌కర్నూల్‌ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషిచేయాలని ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 3 భూ తగాదా, 2 తగు న్యాయం గురించి ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ చెప్పారు.

పాఠశాలల మూసివేత ఉపసంహరించుకోవాలి

అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం రేషనలైజేషన్‌ పేరుతో పాఠశాలలు మూసివేయాలనే ఆలోచన ఉపసంహరించుకోవాలని డీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రామస్వామి అన్నారు. సోమవారం మండలంలోని హాజీపూర్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన డీటీఎఫ్‌ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం జీఓ నం.25న వెంటనే విరమించుకోవాలని కోరారు. ఈ జీఓ ద్వారా గ్రామాలు, తండాల్లో పాఠశాలలను మూసివేయడం అనేది సరికాదన్నారు. పాఠశాలల విలీనాన్ని, మూసివేయకుండా ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించి, తరగతికి ఒక ఉపాధ్యాయుని, తరగతికొక గది నిర్మాణం చేసి పేదవర్గాల బిడ్డలకు నైపుణ్యం కలిగిన గుణాత్మకమైన విద్యను అందించాలని కోరారు. ప్రభుత్వం రిటైర్మెంట్‌ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని, విద్యారంగంలో వస్తున్న మార్పులను పేద వర్గాలకు అనుకూలంగా ఉండే శాసీ్త్రయ, సమానమైన విద్యను అందించాలన్నారు. ఉపాధ్యాయులు నిబద్ధతగా పనిచేస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసుకోవాలన్నారు. అనంతరం అచ్చంపేట మండల డీటీఎఫ్‌ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా విజయ్‌కుమార్‌, ఉపాధ్యక్షులుగా గోపాలమ్మ, శంకర్‌, ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్‌కుమార్‌, కార్యదర్శులుగా రామంజలి, విజయశాంతి, ఖాదర్‌పాషా, జోత్స్న జిల్లా కౌన్సిల్‌ సభ్యులుగా నర్సింహులు, మోతీరాం, నాగేశ్వరరావు, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌గా కృష్ణవేణి, సభ్యులుగా రాజు, కృష్ణయ్య ఎన్నికయ్యారు.

రాష్ట్రస్థాయి పోలీసు క్రీడల్లో ప్రతిభ చాటాలి

వనపర్తి: రాష్ట్రస్థాయి పోలీసు క్రీడా పోటీల్లో జోగుళాంబ జోన్‌–7 క్రీడాకారులు ప్రతిభకనబరిచి సత్తా చాటాలని డీఎస్పీ వెంకటేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోలీసు క్రీడలకు వనపర్తి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలకు చెందిన 122 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సునీతారెడ్డి ఆదేశాల మేరకు డీసీఆర్‌బీ డీఎస్పీ బాలాజీ, వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు క్రీడాకారులకు ప్రేరణాత్మక సందేశం అందించి ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి క్రీడలు పోలీస్‌శాఖ ప్రతిష్టకు ప్రతీక అని అన్నారు. క్రీడల్లో ఉత్తమ ప్రతిభకనబరచి జోన్‌–7 గౌరవాన్ని నిలబెట్టాలని సూచించారు. క్రీడాస్ఫూర్తే అసలైన గుర్తింపు కావాలని.. క్రమశిక్షణ, పట్టుదలతో విజయం సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. అనంతరం రాష్ట్రస్థాయి పోలీస్‌ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల బస్సులను వారు జెండా ఊపి పంపించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ శ్రీనివాస్‌, రిజర్వు ఎస్‌ఐలు వినోద్‌, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

రూ.కోటితో వ్యవసాయ మార్కెట్‌ అభివృద్ధి 
1
1/1

రూ.కోటితో వ్యవసాయ మార్కెట్‌ అభివృద్ధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement