అనుమానాస్పద స్థితిలో 3 నెలల పసికందు మృతి
అప్పుల బాధతో కౌలు రైతు బలవన్మరణం
ఆర్టీసీ ఉద్యోగులకుపురస్కారాలు
కొల్లాపూర్: స్థానిక ఆర్టీసీ డిపోలో శనివారం ఉత్తమ ఉద్యోగుల అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభకనబర్చిన ఆర్టీసీ డ్రైవర్లు, కండెక్టర్లు, మెకానిక్‌లకు డీఎం ఉమాశంకర్ పురస్కారాలను అందజేశారు. గత జనవరిలో అత్యధిక ఈపీకే, అత్యధిక ఇన్సెంటివ్, ఇంధన పొదుపు చేసిన డ్రైవర్లు, కండెక్టర్లను నగదు పురస్కారాలతో సత్కరించినట్లు ఆయన తెలిపారు. ఆర్టీసీ అభివృద్ధికి ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఉద్యోగులు రత్నమ్మ, వెంకటేశ్వర్లు, నజీర్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షకు
5,763 మంది హాజరు
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా కొనసాగాయి. జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. 5,921 మంది విద్యార్థులకు గాను 5,763 మంది హాజరయ్యారు. జనరల్‌లో 4,537 మందికి గాను 4,431 మంది, ఒకేషనల్ విభాగంలో 1,384 మందికి గాను 1,332 మంది హాజరై పరీక్ష రాశారు. జనరల్‌లో 107 మంది, ఒకేషనల్ విభాగంలో 52 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు.
శనేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు
బిజినేపల్లి: నందివడ్డెమాన్ జైష్ట్యాదేవి సమేత శనేశ్వరాలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. తమ ఏలినాటి శనిదోష నివారణ కోసం శనేశ్వరుడికి తిల తైలాభిషేకాలు నిర్వహించి.. గోత్ర నామార్చనలు చేశారు. అనంతరం బ్రహ్మసూత్ర శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి పాల్గొన్నారు.
‘సప్తశేష వాహనం’పై
రంగనాథస్వామి
వనపర్తి రూరల్: శ్రీరంగాపురం రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అర్చకులు స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఉదయం మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ శ్రీవారి మూలమంత్ర హవనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం సర్వాలంకరణ శోభితుడు, సమస్త లోకాధిపతి అయిన రంగనాథస్వామి ఉభయ నాంచారీ సమేతుడై సప్త శేషవాహనంపై తిరువీధుల్లో విహరించారు. దివ్యతేజ స్వరూపుడైన స్వామివారిని భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు. అర్చకులు విష్ణునారాయణ, కిట్టుస్వామి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
గెస్టు లెక్చరర్స్‌కు ఇంటర్వ్యూలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ లా కళాశాలలో ఖాళీలను గెస్టు లెక్చరర్లచే భర్తీ చేసేందుకు గాను శనివారం అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. గత వారం అధికారులు నోటిఫికేషన్ ఇవ్వగా.. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్‌బాబు ఇంటర్వ్యూ సరళిని పరిశీలించారు. కార్యక్రమంలో ఆడిట్‌సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్ తదితరులు పాల్గొన్నారు.
వివరాలు –IIలో u
అనుమానాస్పద స్థితిలో 3 నెలల పసికందు మృతి
అనుమానాస్పద స్థితిలో 3 నెలల పసికందు మృతి


