క్రీడా పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

క్రీడా పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలి

Mar 1 2026 8:23 AM | Updated on Mar 1 2026 8:23 AM

క్రీడా పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలి

క్రీడా పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలి

కందనూలు: రాష్ట్రంలోని క్రీడా పాఠశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ సూచించారు. క్రీడా పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 4వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన పోస్టర్‌ను శనివారం కలెక్టరేట్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. 2017 సెప్టెంబర్‌ 1 నుంచి 2018 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించి.. 4వ తరగతి చదువబోతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి, అర్హులైన విద్యార్థులు http://tgss.te langana.gov.com వెబ్‌సైట్‌లో మార్చి 4వ తేదీలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. 13 నుంచి 17వ తేదీ వరకు మండల స్థాయిలో ఎంపికలు ఉంటాయన్నారు. 30న నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే విధ్యార్థులు ప్రస్తుత పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్‌, పంచాయతీ/మున్సిపాలిటీ నుంచి పుట్టిన తేదీ ధ్రువపత్రం, 3వ తరగతి పురోగతి నివేదిక కాపీ, ఆధార్‌, కుల ధ్రువపత్రం, ఐదు పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు తీసుకురావాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ సీతారాం, జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి నర్సింహారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement