చట్టాలపై అవగాహన తప్పనిసరి
కొల్లాపూర్ రూరల్: ప్రతి ఒక్కరికీ చట్టాలపై తప్పనిసరిగా అవగాహన ఉండాలని కొల్లాపూర్ కోర్డు న్యాయమూర్తులు ఉపనిషధ్వాని, డి.లక్ష్మణ్ అన్నారు. శనివారం కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండంలో న్యాయ విజ్ఞాన సదుస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు చట్టాలకు లోబడి నడుచుకోవాలని సూచించారు. బాల్యవివాహాలు చేయడం నేరమన్నారు. అదే విధంగా ఎవరైనా బాలలను పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అటవీ చట్టాలు, రోడ్డు భద్రత నియమాలు, మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ భూమిని, న్యాయవాదులు మోహన్‌లాల్, బాలస్వామి, నిరంజన్ పాల్గొన్నారు.


