రమణీయం.. రథోత్సవం
శ్రీఅంబా రామలింగేశ్వరస్వామి రథోత్సవంలో పాల్గొన్న భక్తులు
వెల్దండ మండలం గుండాలలో ఆదివారం తెల్లవారుజామున శ్రీఅంబా రామలింగేశ్వరస్వామి రథోత్సవం కనులపండువగా సాగింది. స్వామివారి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు
నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈ సందర్భంగా శివనామస్మరణ మార్మోగింది. రథంపై ఊరేగుతున్న స్వామివారిని భక్తులు దర్శించుకొని భక్తిపారవశ్యంతో పులకించిపొయారు. రథోత్సవం
సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. – వెల్దండ


