బాధితులకు రూ.కోటి పరిహారం చెల్లించాలి
నాగర్‌కర్నూల్ రూరల్: కుమ్మెర ఘటన బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించడంతో పాటు నిందితులపై హత్యకేసు నమోదు చేసి అరెస్టు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సాగర్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులను ఒంటరి చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నిస్తోందన్నారు. ఇలాంటి ఎత్తుగడలను మానుకొని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు, ఆర్.శ్రీనివాసులు, పొదిలి రామయ్య, అశోక్, తారాసింగ్, అంతటి కాశన్న, మధు, వెంకటేశ్, మాలిక్, వెంకటయ్య, నాగరాజుగౌడ్ పాల్గొన్నారు.
కుమ్మెర ఘటనపై
పోలీసుల విచారణ
మహమ్మదాబాద్: కుమ్మెర ఘటనలో బిడ్డను కోల్పోయిన మౌనిక తల్లిగారి ఊరైన మహమ్మదాబాద్ మండలం సంగాయపల్లిలో గురువారం పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలు మౌనిక తల్లి బాలికిష్టమ్మతో పలు వివరాలు సేకరించారు. బాధితురాలి అసలు పేరు యాదమ్మ అని.. తమది బీసీ సామాజిక వర్గం కాగా.. నాగర్‌కర్నూల్‌కు చెందిన గణేశ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నట్లు వివరించింది. అయితే బాధితురాలి పేరు, ఊరు, మండలం, జిల్లా, కులం తదితర వివరాల సేకరణ నిమిత్తం విచారణకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
బాధితులకు రూ.కోటి పరిహారం చెల్లించాలి


