సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు | - | Sakshi
Sakshi News home page

సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు

Feb 26 2026 9:04 AM | Updated on Feb 26 2026 9:04 AM

సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు

సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు

తాడూరు: పంటల సాగులో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు తప్పనిసరిగా యాజమాన్య పద్ధతులు, సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కేవీకే శాస్త్రవేత్తలు ఎన్‌.నవత, భానుశ్రీ సూచించారు. బుధవారం తాడూరు మండలం తుమ్మలసూగూరు శివారులో సాగుచేసిన మొక్కజొన్న పంటను వారు పరిశీలించి.. రైతులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం పంటకు సోకే తెగుళ్లు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, నీటి నిర్వహణ పద్ధతులపై అవగాహన కల్పించారు. పంట దిగుబడి సాధించేందుకు శాసీ్త్రయ విధానం అనుసరించాలని సూచించారు.

ఆదివాసీ చెంచులకు పట్టాలు ఇవ్వాలని

హెచ్‌ఆర్‌సీ ఆదేశం

మన్ననూర్‌: ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ చెంచులు దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న భూములకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇవ్వాలని మానవ హక్కుల కమిషన్‌ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు హైకోర్టు న్యాయవాది వినోద్‌ హిందుస్తానీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022లో అర్హులైన రైతులకు ప్రభుత్వం ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు జారీ చేసిందని పేర్కొన్నారు. అయితే ఆదివాసీ చెంచులు పట్టాదారు పాస్‌పుస్తకాల కోసం కలెక్టరేట్‌లో పలుమార్లు అర్జీ పెట్టుకున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టాలు ఇవ్వలేదన్నారు. ఈ విషయంపై అమ్రాబాద్‌ మండలం నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలోని రాయిలేటి పెంటకు చెందిన 8 మంది ఆదివాసీ చెంచుల తరఫున మాజీ సర్పంచ్‌, శక్తి స్వచ్ఛంద సంస్థ కార్యకర్త నల్లపోతుల పెద్దిరాజు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. దీనిపై విచారించిన కమిషన్‌.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కేసులు నమోదు చేయడంతో పాటు ఆదివాసీ చెంచులకు నాలుగు వారాల్లో పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేయాలని ఆదేశించిందని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement