దరఖాస్తుల ఆహ్వానం
కందనూలు: ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరం 4వ తరగతిలో ప్రవేశానికి సంబంధించి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి సీతారాం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2017 సెప్టెంబర్ 1 నుంచి 2018 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించి.. 2026–27 విద్యా సంవత్సరం 4వ తరగతి చదవబోతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హులైన విద్యార్థులు మార్చి 4వ తేదీలోగా htt p://tfrr.telangana.gov.in వెబ్‌సైట్‌లో దర ఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
కంటిచూపుపై నిర్లక్ష్యం వహించొద్దు
నాగర్‌కర్నూల్ క్రైం: కంటిచూపుపై ఎవరూ నిర్లక్ష్యం వహించకూడదని ఆప్తాలమిక్ ఆఫీసర్ కొట్ర బాలాజీ అన్నారు. స్థానిక పాత కలెక్టరేట్ భవనంలో బుధవారం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి శిబిరానికి వచ్చిన 78 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 34 మందికి కంటిశుక్లం శస్త్రచికిత్స అవసరమని గుర్తించి.. ఏనుగొండ లయన్ రాంరెడ్డి కంటి ఆస్పత్రికి పంపించినట్లు ఆయన తెలిపారు. కంటిచూపు సమస్యతో బాధపడే వారు జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
విద్యార్థులు
సేవాభావంతో మెలగాలి
కందనూలు: విద్యార్థులు సేవాభావంతో మెలగాలని జిల్లా రవాణాశాఖ అధికారి చిన్నబాలు సూచించారు. నాగర్‌కర్నూల్ మండలం గగ్గలపల్లిలో స్థానిక ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు చేపట్టిన శిబిరం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువులో రాణించడంతో పాటు సేవాదృక్పథం కలిగి ఉండాలన్నారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనడం బాధ్యతగా భావించాలని.. ఇలాంటి శిబిరాలు వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మదన్మోహన్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.
రేపు మెగా ఉద్యోగ మేళా
గద్వాలన్యూటౌన్: మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల 27న మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.మీనాక్షీ, సీపీడీసీ మెంబర్ సాయిశ్యామ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం కళాశాలలో ఉద్యోగ మేళా బ్రోచర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మేళాలో జస్ట్ డయల్, క్యాలిబర్, మెడ్ ప్లస్, టాషియన్, ముత్తూట్ ఫైనాన్స్ తదితర కంపెనీలు పాల్గొంటాయన్నారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న, పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఉద్యోగానికి ఎంపికై న వారికి అదే రోజు అపాయిమెంట్ లెటర్ అందిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీప్రసాద్, కేరీర్ గైడెన్స్ సెల్ కన్వీనర్ సమత, అధ్యాపకులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం


