న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలి
కొల్లాపూర్: న్యాయవాదులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలని కొల్లాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతుల నాగరాజు డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం తెలంగాణ బార్ అసోసియేషన్ల సమాఖ్య చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు సంఘీభావంగా మంగళవారం కొల్లాపూర్ జూనియర్ సివిల్‌జడ్జి కోర్టు ఎదుట న్యాయవాదులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాదులపై గత కొంతకాలంగా దాడులు పెరుగుతున్నాయన్నారు. పాలక ప్రభుత్వాల అలసత్వమే ఇందుకు కారణమన్నారు. కఠిన చట్టాలు లేకపోవడంతో న్యాయవాదులకు రక్షణ లభించడం లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వాలు స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. న్యాయవాదులు శ్రీనివాసరావు, వసంతరెడ్డి, నజీరుద్దీన్, భాస్కర్‌రెడ్డి, ఉపేందర్, శ్రీహరి, శివారెడ్డి, నిరంజన్, కురుమూర్తి, మనోహర్, బాలస్వామి, రామలక్ష్మమ్మ, నళిని తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించేందుకు కృషి చేయాలని పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పీయూ పరిధిలోని కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం మార్కెట్‌కు అవసరమైన మానవ వనరులను అభివృద్ది చేసేందుకు కళాశాల స్థాయిలోనే చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. స్కిల్ మ్యాపింగ్, ఎక్స్‌పర్‌మెంటల్ లర్నింగ్, ఇంటర్న్‌షిప్, అప్రెంటిషిప్ వంటి వాటిని విద్యార్థులకు అందించేందుకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు తీసుకుంటున్న చర్యలకు సంబంధించి ప్రతినెల కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కోఆర్డినేటర్ రవికుమార్, సిద్దరామగౌడ్, సుజాత, రమేష్, జాహ్నవి తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలి


