అర్జీల పరిష్కారానికి కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారానికి కృషి చేయాలి

Feb 25 2026 10:24 AM | Updated on Feb 25 2026 10:24 AM

అర్జీ

అర్జీల పరిష్కారానికి కృషి చేయాలి

వనపర్తి: ప్రజల నుంచి వచ్చిన అర్జీలు, ఫిర్యాదులకు అధికారులు సరైన సమాధానం ఇవ్వడంతో పాటు పరిష్కారం దిశగా తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారా వు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కొల్లాపూర్‌ నియోజకవర్గం పానగల్‌ మండలానికి సంబంధించి రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభితో కలిసి సమీక్ష నిర్వహించారు. పాన్‌గల్‌ మండలం తెల్లరాళ్లపల్లిలో ఓ రైతు తన భూమి పొరపాటున అటవీ భూమిగా నమోదైందంటూ దరఖాస్తు చేసుకున్నారని, నేటికీ పరిష్కారం కాకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. పది రోజుల్లో పరిష్కరించినట్లు తనకు తెలియజేయాలన్నారు. అదేవిధంగా దావాజ్‌పల్లితండా, కిష్టాపూర్‌కు చెందిన పలువురు రైతులు తమ పోడు భూమి సమస్యను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అధికారులతో ఆరా తీసిన మంత్రి వెంటనే పరిష్కరించాలని కోరారు. పానగల్‌ మండలంలోని భూములకు సంబంధించి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి పరిష్కరించాలని కలెక్టర్‌కు సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరై పనులు ప్రారంభించని వారితో సమావేశం నిర్వహించాలన్నారు. పనులు ప్రారంభించకపోవడానికి గల కారణాలు తెలుసుకొని త్వరగా ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా చొరవ చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను సహనంతో విని పరిష్కరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించాలని.. కేవలం కార్యాలయాలకు మాత్రమే పరిమితం కావద్దన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్‌, యాద య్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గోవర్ధన్‌సాగర్‌, జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ, ఇతర అధికారులు, పాన్‌ గల్‌ మండల ప్రజలు పాల్గొన్నారు.

రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

అర్జీల పరిష్కారానికి కృషి చేయాలి 1
1/1

అర్జీల పరిష్కారానికి కృషి చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement