అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
వెల్దండ: నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. వెల్దండలో నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను గురువారం అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ముఖ్యమంత్రి సోదరుడు, కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదల సొంతింటి కల సాకారమవుతుందన్నారు. 10ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనలో డబుల్‌బెడ్రూం ఇళ్ల పేరుతో పేదలను మోసం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇళ్ల పథకంతో ప్రతి గ్రామంలో విడతల వారీగా అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తిచేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యపాల్‌రెడ్డి, తహసీల్దార్ కార్తీక్‌కుమార్, సర్పంచ్ యాదమ్మ, ఉపసర్పంచ్ శ్రీనివాస్, వెంకటయ్యగౌడ్, భూపతిరెడ్డి, రామకృష్ణ, సంజీవ్‌కుమార్, పర్వత్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, హమీద్, పుల్లయ్య, పురుషోత్తంచారి, జంగయ్య యాదవ్, రాజు, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


