‘సామాజిక తెలంగాణ కోసం పోరాటం’
గద్వాల: పోరాడి సాధించుకున్న తెలంగాణలో బీఆర్‌ఎస్ పాలనలో సామాజిక న్యాయం దక్కలేదని, సామాజిక న్యాయం కోసం తాము మరోపోరాటం చేస్తామని, అది నడిగడ్డ నుంచే మొదలుపెడతామని మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం ఆమె గద్వాల జిల్లా కేంద్రంలో రైతుల సంఘర్షణ సభలో పాల్గొని మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ పాలనలో నడిగడ్డ ప్రాంతం పూర్తిగా అన్యాయానికి గురైందన్నారు. మామ, బావ, అత్త, అల్లుడు ఇలా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు పాలిస్తూ ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియదని, ఆయనకు ఏమైనా నిజాయితీ ఉంటే తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఈ అత్త, అల్లుడు రాజకీయానికి ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నామని, అది నడిగడ్డకు వజ్రాయుధంగా మారుతుందన్నారు. మార్పు ఈ ప్రాంతం నుంచే మొదలుపెడతామన్నారు. సీడుపత్తి రైతులను ఆర్గనైజర్లు, కంపెనీలు నిండా ముంచుతున్నాయని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు.
‘సామాజిక తెలంగాణ కోసం పోరాటం’


